Rs 500
-
రాష్ట్రమంతా నకిలీ రూ.500 నోట్లు.. పోలీసుల అలర్ట్
రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఐజీ (స్పెషల్ బ్రాంచ్) డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, రైల్వే ఎస్పీలందరికీ లేఖ రాశారు.నకిలీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్‌లో తప్పు ఉందని, స్మగ్లర్లు విడుదల చేసిన 500 రూపాయల నోటుపై ఇంగ్లిష్‌లో ‘Reserve Bank of India’ అని కాకుండా ‘Resarve Bank of India’ అని రాసి ఉంటుందని ఐజీ లేఖలో వివరించారు.ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించడంతోపాటు ప్రత్యేక పాలనాపరమైన నిఘాను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేఖతో పాటు నకిలీ 500 రూపాయల నోటు చిత్రాన్ని కూడా జత చేశారు.నకిలీ నోటును ఎలా గుర్తించాలి?అసలైన నోట్లు విలక్షణమైన ఆకృతిని, స్పర్శను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లు అలా ఉండవు.అసలైన నోట్లు మంచి రంగు, ప్రింటింగ్ నాణ్యతను కలిగి ఉంటాయి. కానీ నకిలీ నోట్లుపై రంగుల్లో తేడాను, అస్పష్టమైన ముద్రణను గమనించవచ్చు.అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది నోటు చిరిగిపోయినప్పుడు కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ థ్రెడ్ ఉండదు.అసలు నోట్లు వాటర్‌మార్క్‌ని కలిగి ఉంటాయి. నోట్‌ను నీటిలో ముంచినప్పుడు అది కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వాటర్‌మార్క్ ఉండదు.బ్యాంకులు, ఇతర వ్యాపారాల వద్ద నకిలీ నోట్లను గుర్తించగల నోట్-చెకింగ్ పరికరాలు ఉంటాయి.అసలైన నోట్లు యూవీ-కాంతి ఉద్గార మూలకాలను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లలో అవి ఉండవు.ఇక నకిలీ నోట్లను గుర్తించే అనేక మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.మీకు వద్ద ఉన్నది నకిలీ నోటని అనుమానం వస్తే బ్యాంక్‌కు వెళ్లి తనిఖీ చేయించుకోవచ్చు.అసలు నోటు లక్షణాలుఅసలు 500 రూపాయల నోటు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ముద్రించి ఉంటుంది. దేవనాగరిలో 500 అని రాసి ఉంటుంది.అసలు 500 రూపాయల నోటులో కలర్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వాలుగా చూస్తే ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారినట్లు కనిపిస్తుంది.అసలు 500 రూపాయల నోటుపై ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ ఉంటుంది. ఈ నోటుకు కుడి వైపున అశోక స్తంభం గుర్తును కూడా చూడొచ్చు.ఈ నోట్లో మహాత్మా గాంధీ, అశోక చిహ్నం చిత్రాలను చేత్తో తాకితే తగిలేలా ముద్రించి ఉంటారు. దృష్టి లోపం ఉన్నవారి కోసం ఈ ఏర్పాటు చేశారు. -
రూ.500 నోటు రద్దు, మళ్లీ చలామణిలోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే మధ్యలో ₹2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంహరణ తర్వాత రూ.500 నోటు కూడా త్వరలోనే రద్దు చేస్తారని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు ఆర్బీఐ సమావేశం జరిగిన ఈ తరహా నోట్టు రద్దుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా వీటిపై స్పష్టతనిచ్చింది. రూ.500 నోట్ల రద్దు.. కేంద్రం రిప్లై ఇదే ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సెషన్లో, రూ.500 నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థలో రూ.1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టడంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ బదులిచ్చింది. వీటికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను (అంటే ₹500 నోట్లు) రద్దుని కొట్టి పారేశారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా,‘ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆర్థిక లావాదేవీల్లో అంతరాయాన్ని నివారించడానికే కరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరం అవసరానికి అనుగుణంగా ₹2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రజల అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఇతర డినామినేషన్ల నోట్లు (రూ.500) సరిపడా ఉందని తెలిపారు. ఈ సమాచారంతో, ఆర్థిక వ్యవస్థలో ₹1,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఉపసంహరించుకున్న రూ.2000 నోట్లను సెప్టెంబరు 30లోగా మార్చుకోవాలని, ఆ తేదీని పొడిగించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్, అదనపు బెనిఫిట్స్ కూడా -
ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం
సాక్షి, నేషనల్ డెస్క్: అది 2016. నవంబర్ 8. రాత్రి 8 గంటల సమయం. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న వేళ. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్టుండి టీవీ తెరల మీద ప్రత్యక్షమయ్యారు. జాతినుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్న వాళ్లందరికీ షాకిస్తూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) నల్లధనాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రూ.1,000, రూ.500 నోట్లను తక్షణం రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ నోట్ల బెడద పోవడమే గాక నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ నిర్ణయంతో ఊపొస్తుందని చెప్పుకొచ్చారు. ఫలితంగా 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి! కానీ అనంతర పరిణామాలను, ముఖ్యంగా నోట్ల మార్పిడి ప్రక్రియను సజావుగా డీల్ చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దాంతో కొద్ది నెలల పాటు దేశమంతా అక్షరాలా అల్లకల్లోలమైపోయింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఏ బ్యాంకు ముందు చూసినా కొండవీటి చాంతాటిని తలదన్నే లైన్లే. ఆ లైన్లలోనే కుప్పకూలిన ప్రాణాలు. నగదు మీదే ఆధారపడి నడిచే వ్యాపారాలు పడకేసి ఆర్థికంగా చితికిపోయిన సగటు బతుకులు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీటి కథలే! మనసుల్ని మెలిపెట్టే గాథలే. వ్యవసాయం మొదలుకుని ఆటోమొబైల్, నిర్మాణ తదితర కీలక రంగాలు నగదు కటకటతో కొన్నాళ్ల పాటు పూర్తిగా పడకేశాయి. మొత్తంగా దేశ ఆర్థిక రంగమే అతలాకుతలమైపోయింది. ఇంతా చేస్తే నోట్ల రద్దు వల్ల నల్లధనం ఏ మాత్రమూ కట్టడి కాలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు నిరూపణ కావడం మరో విషాదం. అప్పట్లో ప్రవేశపెట్టిన రూ.2,000 కరెన్సీని ఆర్బీఐ తాజాగా రద్దు చేసిన నేపథ్యంలో నాటి చేదు జ్ఞాపకాలను జనం మరోసారి భయంభయంగా గుర్తు చేసుకుంటున్నారు... నోట్ల రద్దు–కొన్ని వాస్తవాలు ♦ పలు అంచనాల ప్రకారం మన దేశ జీడీపీలో 20 నుంచి 25 శాతం దాకా నల్లధనమే. అంటే రూ.30 లక్షల కోట్ల పై చిలుకు! ♦ నల్లధనం లేని బంగారు భవిష్యత్తు కోసం తాత్కాలికంగా కాస్త బాధను ఓర్చుకోక తప్పదని నోట్ల రద్దు వేళ ప్రధాని చెప్పుకొచ్చారు. జనం కూడా అందుకు సిద్ధపడ్డారు. ♦ నోట్ల రద్దుతో తమకు కలిగిన నష్టాలను, వ్యయప్రయాలను పళ్ల బిగువున భరించారు. ♦ నోట్ల రద్దు వల్ల కనీసం బ్యాంకింగ్ వ్యవస్థకు ఆవల ఉన్న రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన నల్లధనం చెత్త కాగితం కింద మారుతుందని కేంద్రం ఆశించింది. ♦ కానీ వాస్తవంలో జరిగింది అందుకు పూర్తిగా విరుద్ధమని గణాంకాలు తేల్చాయి. ♦ నోట్ల రద్దు నిర్ణయం నాటికి దేశం చలామణిలతో ఉన్న నగదులో ఏకంగా 86 శాతం (రూ.16.24 లక్షల కోట్లు) రూ.1,000, రూ.500 నోట్లే. ఇందులో రూ1,000 నోట్ల వాటా 38 శాతం కాగా రూ.500 నోట్లది 47 శాతం. అదంతా రాత్రికి రాత్రి పనికిరాకుండా పోయింది. ♦ ఈ మొత్తంలో ఏకంగా 99 శాతానికి పైగా కరెన్సీ క్రమంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చిందని అనంతరం రిజర్వు బ్యాంకే అధికారికంగా ప్రకటించింది. నల్లధనం కట్టడి లక్ష్యం ఇసుమంతైనా నెరవేరలేదని తద్వారా స్పష్టమైంది. ♦ నగదు కార్యకలాపాలను తగ్గించాలన్న ఉద్దేశమూ నెరవేరలేదు. 2016 నవంబర్‌లో దేశ ప్రజల దగ్గర రూ.17.7 కోట్ల విలువైన నగదుంటే 2022 అక్టోబర్ నాటికి ఆ మొత్తం ఏకంగా రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ♦ నకిలీ నోట్ల చలామణి కూడా పెద్దగా తగ్గలేదని తర్వాతి కాలంలో గణాంకాలతో పాటు రుజువైంది. నకిలీ నోట్లలో అత్యధికం వంద రూపాయల నోట్లే కావడం ఇందుకు కారణమని తేలింది. ♦ కాకపోతే నోట్ల రద్దు వల్ల ఇటు ప్రజలకు, అటు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అపారం. ♦ నగదు కార్యకలాపాల మీదే ఆధారపడే 48 కోట్ల మందికి పైగా భారతీయులను పెద్ద నోట్ల రద్దు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ♦ దేశ జీడీపీలో 45 నుంచి 60 శాతం దాకా వాటా ఉండే పలు రంగాలు కొన్నాళ్ల పాటు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్థికవేత్తల విస్మయం పలువురు ఆర్థికవేత్తలు కూడా నోట్ల రద్దు నిర్ణయంలో ఔచిత్యమేమిటో అంతుబట్టడం లేదంటూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ‘‘నల్లధనంలో మహా అయితే ఓ 5 శాతం మాత్రం నగదు రూపంలో ఉంటుందేమో. మిగతాదంతా భూములు, బంగారం వంటి ఆస్తుల రూపేణా మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అలాంటప్పుడు కేవలం పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మాయమైపోతుందని ఆర్బీఐ అనుకున్నారో!’’ అన్నారు. ♦ 2016 సెప్టెంబర్ దాకా ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన రఘురాం రాజన్ నోట్ల రద్దు ప్రతిపాదనను తాను సమర్థించలేదని కుండబద్దలు కొట్టారు. ♦ నోట్ల రద్దు నిర్ణయాన్ని చట్టబద్ధమేనని గత జనవరిలో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కూడా, ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని స్పష్టంగా పేర్కొంది. చదవండి👉 ఇక దూకుడే దూకుడు.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘కర్ణాటక’ కిక్! -
500 నోటు పడేసి రూ.1.50 లక్షలు దోచేశారు
మైసూరు: రూ.500 నోటు కింద పడేసిన దుండగులు ఓ వ్యక్తిని ఏమార్చి రూ.1.50 లక్షలు దోచుకొని ఉడాయించారు. ఈ ఘటన మైసూరు జిల్లా, కే.ఆర్. నగర్లో చోటుచేసుకుంది. హుణసూరులోని కల్కుణికె గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కేఆర్ నగర్లోఉన్న నగర అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. తర్వాత సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పని ముగించుకున్నాడు. సీ.ఎ. రోడ్డులోని శ్రీహోటల్లో టీ తాగుతుండగా అతన్ని వెంటాడిన దుండగులు అక్కడకు వచ్చారు. కింద రూ.500 నోటు పడేశారు. ఆ నోటు మీదేనా? అని గణేష్‌ను అడిగారు. నోటు తీసుకుంటుండగా దుండగులు గణేష్ చేతిలోని నగదు సంచి లాక్కొని బైక్‌పై ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేఆర్‌నగర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
‘సాంఘిక సంక్షేమం’లో పాకెట్ మనీ..
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం పాకెట్ మనీ అందించనుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులు వివిధ అవసరాల నిమిత్తం చేతిలో నగదు లేక.. ఇంటి వద్ద నుంచి పాకెట్ మనీ ఇచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా రూ.500 అందజేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 11 ఎస్సీ కళాశాల హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో మొత్తం 1864 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ లబ్ధి జరగనుంది. హాస్టళ్ల నిర్వహణ వ్యయం పెంపు.. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్స్ నిర్వహణ వ్యయం కూడా పెంచాలని నిర్ణయించింది. గతంలో ఒక విద్యార్థికి రూ.4వేలు వెచ్చిస్తుండగా.. ప్రస్తుతం రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న బాలికలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పగలు, రాత్రి వేళల్లో వాచ్మన్లను నియమించనున్నారు. గతంలో ఒక వాచ్‌మన్ మాత్రమే పగటిపూట కాపలా ఉండేవాడని, ప్రసుత్తం 24 గంటలు హాస్టళ్ల వద్ద కాపాలా ఉండేందుకు వాచ్మన్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు సైతం నిధులను ప్రతి సంవత్సరం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కళాశాల హాస్టళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వార్షిక వేడుకలకు నిధులు.. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ విద్యార్థులు ప్రతీ సంవత్సరం వార్షిక వేడుకలను నిర్వహించుకునేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇక నుంచి ప్రతి ఏటా రూ.20వేలను మంజూరు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులటు కూడా జారీ చేసి ఆయా జిల్లా అధికారులకు జీవోలను జారీ చేసింది. ఈ నెల నుంచి వ్యక్తిగత ఖర్చుల కింద రూ.500 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలుసుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకే.. షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదువుపై ఏకాగ్రత పెంచేందుకు వారి ఖర్చులకు అవసరమైన పాకెట్ మనీ ఏర్పాటు చేసింది. డైరెక్టర్ కరుణాకర్ ఆదేశాల మేరకు వసతిగృహాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం. పాకెట్ మనీ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తాం. ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున అందిస్తాం. – కస్తాల సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారి -
క్షయ రోగికి ప్రతి నెలా రూ. 500
కర్నూలు (హాస్పిటల్): 2025 నాటికి ఎండ్ టీబీ స్టాటజీ ప్రోగ్రామ్‌లో భాగంగా మందులతో పాటు ప్రతి క్షయ రోగికి రూ.500 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా క్షయ నివారణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 2003 నుంచి ఇప్పటి వరకు 91,154 మంది టీబీ రోగులకు చికిత్స అందించామన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీతోపాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ న్యాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ మిషన్‌తో ఇతర వైద్యపరీక్షల్లో బయటపడని టీబీ జబ్బు కూడా బయటపడుతుందన్నారు. ఇదే యంత్రం ద్వారా యూనివర్శల్ డ్రగ్ సెన్సిటివిటి టెస్ట్ కూడా చేస్తున్నామన్నారు. టీబీ రోగులకు ఏ మందులు పడతాయో, ఏవీ పడవో గుర్తించి చికిత్స చేసేందుకు ఈ పరీక్ష ద్వారా సులభమవుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. -
ఆ నోట్ల డిపాజిట్‌కు అవకాశమివ్వం
సాక్షి, న్యూఢిల్లీ : రద్దు అయిన పెద్ద నోట్లు రూ.500, రూ.1000 డిపాజిట్‌కు మరో కొత్త విండో తెరిచే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ఈ నోట్ల డిపాజిట్‌కు అసలు అవకాశమివ్వబోమని తేల్చి చెప్పింది. ఆర్బీఐ తాజాగా రద్దయిన పెద్ద నోట్ల గణాంకాలు విడుదల చేయడంతో, తిరిగి రాని నోట్ల కోసం మరోసారి ఓ విండో తెరవాలంటూ కొంతమంది కోరుతున్నారు. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసింది. అనంతరం పలు గడువులు విధించిన ప్రభుత్వం, వీటిని తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకుంది. బుధవారం వెల్లడించిన ఆర్బీఐ వార్షిక రిపోర్టులో రద్దయిన పెద్ద నోట్లు దాదాపు అన్ని తమ వద్దకు వచ్చినట్టు తెలిపింది. 99 శాతం కరెన్సీ నోట్లు ఆర్బీఐ వద్ద జమయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొంతమంది పాత రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్ కోసం ఓ కొత్త విండో తెరవాలని కోరుతున్నారు. అయితే ఈ సమయంలో ఎట్టిపరిస్థితులోనూ పాత నోట్ల డిపాజిట్‌కు కొత్త విండో తెరవడం కుదరదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి గర్గ్ చెప్పారు. ఇదే విషయాన్ని అంతకముందు ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. సహేతుక కారణాలు చూపించే వారికోసం పాత నోట్ల డిపాజిట్‌కు ఓ విండో తెరవాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ ఇప్పుడు విండో తెరిస్తే, అది దుర్వినియోగం పాలయ్యే అవకాశముందని, అంతేకాక డీమానిటైజేషన్ ఉద్దేశ్యమే మారిపోతుందని ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆర్బీఐ ప్రకటన అనంతరం రద్దయిన నోట్లన్నీ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చాయని భావిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అంచనావేసినంత తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చిందని తాను భావిస్తున్నట్టు గర్గ్ చెప్పారు. ఎంతమంది ఎన్ని అంచనాలు విడుదల చేస్తున్నప్పటికీ, వెనక్కి రాని కరెన్సీ అంచనాల గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదన్నారు. -
జియో ఫైబర్ సేవలు దీపావళి నుంచే!
అన్ లిమిటెడ్ అంటూ వాయిస్, డేటా సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు సంబంధించి ఫైబర్ సేవల్లో ప్రవేశించి టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు పుట్టించనుంది. జియో పై సేవలపై ఇప్పటికే పలు అంచనాలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టెలికాం పరిశ్రమలో పలు టారిఫ్ సమీక్షలకు నాందిపలికిన జియో బ్రాడ్‌బ్యాండ్ విభాగం జియో ఫైబర్‌పై భారీ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఆఫర్‌తో ఈ దీపావళినాటికి జియో తన తన కొత్త 'జియోఫైబర్' అందజేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రూ.500 బేసిక్ ప్లాన్‌లో 100 జీబీ డేటాను అందించనుంది. ఆన్లైన్ రిపోర్టు ప్రకారం దీపావళి సీజన్ నాటికి వాణిజ్య సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందట. మీడియా నివేదికల ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో జియో మీడియా షేర్ డివైస్, స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, రౌటర్లు ఇతర పవర్ లైన్ కమ్యూనికేషన్ డివైస్లతో తన సేవలను ప్రారంభించనుంది. రూ.500 ప్లాన్‌లో 600జీబీ డేటా సేవలు ప్రారంభంకానున్నాయి. 100ఎంబీపీఎస్ వేగంతో 1000జీబీ డేటాను అందించ నుంది. దీనికిగాను చందాదారులు ఒక నెలకి 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నివేదించింది. మరోవైపు జియో ఎఫెక్ట్ తో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో వున్న టెలికాం మేజర్లు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలను అప్డేట్ చేస్తున్నాయి. కాగా ముంబయి, ఢిల్లీ-ఎన్‌సిఆర్, అహ్మదాబాద్, జామ్‌నగర్, సూరత్, వడోదరలోత మ బ్రాడ్‌బ్యాడ్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఇటీవల జియోఫైబర్ అధికారికంగా ప్రకటించింది. 'జియోఫైబర్' ఆఫర్ ద్వారా వినియోగదారులు మూడు నెలల అధిక-వేగవంతమైన ఇంటర్నెట్ను అందించనున్నామని తెలిపింది. అలాగే ల్యాండ్ లైన్ సర్వీసులను త్వరలోనే ప్రారంభించనుంది. అయితే ఈ వార్తలపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది. -
రద్దయిన నోట్లు మిగిలిపోయాయా? అయితే..
ముంబై: రద్దయిన పాత నోట్లు ఇంకా మిగిలిపోయాయా? రూ. 500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయడం మర్చిపోయారా..అయితే అలాంటి వారికి నిజంగా లడ్డూ లాంటి వార్తే. రద్దయిన ఈ పెద్దనోట్లను మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట. రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా గురువారం రిపోర్ట్ చేసింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసినట్టు పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది. ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి చేసేందుకు కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది. మరోవైపు పాత నోట్ల డిపాజిట్లకు గడువు 2016 డిసెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీలో ఇక పాత నోట్లు చెల్లవు
-
‘నోట్ల’ కష్టాలకు నెల..
రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు. ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు. ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. నవంబర్ 8 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్‌డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు. నవంబర్ 9 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన. నవంబర్ 10 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత. నవంబర్ 11 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం. నవంబర్ 12 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నవంబర్ 13 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్‌డ్రా పరిమితి రూ.24,000కు పెంపు. కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి. నవంబర్ 14 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు. పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం. నవంబర్ 15 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటన. నవంబర్ 17 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు నవంబర్ 18 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు. నవంబర్ 22 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత. డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు. నవంబర్ 25 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి నవంబర్ 28 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు. నవంబర్ 30 జన్‌ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్‌డ్రా పరిమితి విధించిన ఆర్బీఐ. డిసెంబర్ 1 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు). డిసెంబర్ 6 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 7 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 8 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన -
నోట్ల రద్దుకు ప్రజామోదం..
ఈ నిర్ణయం జనశక్తి ప్రాముఖ్యతను తెలియజేసింది ప్రతిపక్షాలకు చర్చలో పాల్గొనే ఉద్దేశం లేదు పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దుకు ప్రజలంతా మద్దతిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ‘జనశక్తి’ ప్రాముఖ్యతను తెలియజెప్పిందని అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెం ట్లో నోట్ల రద్దుపై చర్చ జరగాలని విపక్షాలు భావించడం లేదని, రాజ్యసభలో ఈ విషయం స్పష్టమవుతోందని ఆరోపించారు. తాను రెండుసార్లు రాజ్యసభకు హాజరైనా చర్చకు వారు అంగీకరించలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాలు ఘర్షణలకు, ఉద్రిక్తతలకు దారి తీశాయని, అయినా వాటిపై పార్లమెంట్లో చర్చ నడిచిం దన్నారు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయంపై చర్చకు మాత్రం ప్రతిపక్షాలు అంగీకరించడం లేదని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలి పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ ఎకానమీలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారని చెప్పారు. ఓట్ల నమోదు, ఈవీఎంల వినియోగంపై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తామో అదే విధంగా దీనిపై వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారన్నారు. పార్టీలకతీతంగా అందరు ఎంపీలు ఇందులో భాగస్వాములు కావాలని మోదీ కోరారని అనంత్‌కుమార్ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలు నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ‘రాజ్యశక్తి’ కంటే ‘జనశక్తి’కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం తమ ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను తెలియజెప్పిందన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు నోట్ల రద్దుపై చర్చ జరగాలనే ఉద్దేశం లేదని, అందువల్ల దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పార్టీ సభ్యులు నడుచు కోవాలని సూచించారని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏ పార్టీ డిమాండ్ చేయలేదని, అందువల్ల విపక్షాలు చర్చలో పాల్గొని విలువైన సలహాలు అందజేయాలని మోదీ సూచించారన్నారు. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
నల్లగొండ : భారత ప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో నోట్ల రద్దు వల్ల ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలు నోట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు తగ్గించి ఆన్లైన్, స్మార్ట్‌ఫోన్, స్వైప్ మిషన్‌స ద్వారా జరిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్ అక్షరాస్యతను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార సంఘాలు, మార్కెట్‌యార్డులు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలు, మెడికల్‌షాపులు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ డీలర్లు వంటి ప్రజా వినియోగ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో కాకుండా డెబిట్‌కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 204 ఏటీఎంల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సుమారు వంద కోట్లు అవసరముంటుందన్నారు. ప్రస్తుతం 128 ఏటీఎంలలో రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలను జరిపేందుకు పెద్ద వ్యాపార సంఘాలు, పెట్రోల్ బంకు యజమానుల నుంచి స్వైప్మిషన్ల కోసం 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదే విధంగా నూతన ఖాతాలు తెరిచేందుకు 861 అప్లికేషన్లను వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.రామకృష్ణారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ సూర్యం, డీఆర్వో అంజయ్య, అటవీశాఖాధికారి శాంతారామ్, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు. -
వేలూరు, తిరువణ్ణామలైలో డీఎంకే ధర్నా
వేలూరు: పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట డీఎంకే ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద నోట్లు చెల్లవని రాత్రికి రాత్రి ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం చెన్నైలో నిర్వహించిన ధర్నాలో ముకా స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అన్నారోడ్డులో అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని నినాదాలు చేశారు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ రాస్తారోకోను విరమించక పోవడంతో పోలీసులు చేసేది లేక రాస్తారోకోలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అదే విధంగా తిరుపత్తూరు,రాణిపేట, గుడియాత్తం వంటి ప్రాంతాల్లో రాస్తారోకో చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలైలో... తిరువణ్ణామలై జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డీఎంకే జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి ఏవా వేలు అద్యక్షతన ధర్నా నిర్వహించారు. పెద్ద నోట్లు చెల్లవని ఈ నెల 8వ తేదిన ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పిచ్చాండి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చేతికొచ్చేనా..?
సాక్షి, నల్లగొండ : ఒకటో తేదీకి ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల వేతనాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకింగ్ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావడంతో వేతనాలు పొందేందుకు ఎలాంటి సమస్యా లేకపోయినా, పొందిన వేతనాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే వేతనాల కోసం 10 రోజుల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని ఉండే ఉద్యోగులు వేతనాలు వచ్చిన 10 రోజుల్లోనే తమ అవసరాల కోసం ఆ వేతనాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ క్రమంలో ప్రస్తుతమున్న నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, పింఛన్‌దారులు కలిసి కనీసం లక్ష మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల పరిస్థితి ఒకటో తేదీ తర్వాతేంటనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కానీ స్పష్టత నివ్వకపోవడం మరింత గందరగోళానికి దారి తీస్తోంది. రోజుకు రూ. 2వేలేనా? జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తర గతి ఉద్యోగుల నుంచి శాఖాధిపతుల వరకు 35 వేల వరకు ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆరువేల మందికి పైగా టీచర్లు కూడా ఉన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎఫ్‌సీఐ, ఎల్ఐసీ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 వేల వరకు ఉంటారు. లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు, పింఛన్‌దారులు కలిపి మొత్తం లక్ష మంది వరకు ఉంటారు. వీరే కాకుండా వివిధ ప్రైవేటు సంస్థలు, అన్ని రకాల దుకాణాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వీరంతా ప్రతి నెల ఒకటి నుంచి పదో తేదీ లోపు వేతనాలను తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులక యితే ఠంచన్‌గా ఒకటో తేదీన జీతం వస్తుంది. అయితే, జీతం పొందే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అనుమానం లేకపోయినా, పొందిన వేతనాన్ని తమ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే సమస్యగా మారింది. బ్యాంకుల్లో గంటల తరబడి ఉన్నా.. ఏటీఎంల వద్ద క్యూలలో పడిగాపులు కాసినా రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేకపోవడంతో నెలసరి ఖర్చులెలా అన్నది ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంటి కిరాయిలు, పాలు, కిరాణా దుకాణం ఖర్చులు, చిట్టీలు, పిల్లల ఖర్చులు... ఇలా అన్ని రకాల అవసరాల కోసం 5-10 తేదీల్లోపే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, రోజుకు రూ.2 వేల చొప్పున ఇస్తే వీటికి ఎప్పటికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజల్లాగా గంటల తరబడి ఏటీఎంల వద్ద ఉండే అవకాశం కూడా తమకు లేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించకపోతే సాధారణ జీవనానికి ఇబ్బందులు తప్పవనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ వెసులు బాట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం, ఒకటో తేదీ సమీపిస్తుండడం మరింత సమస్యగా మారుతోంది. బ్యాంకుల్లోనే? వాస్తవానికి, ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగేంత వరకు తమ నగదు రూపంలో వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే పరిమితులతో పాటు, ఉద్యోగుల వేతనాల నుంచి కొన్ని రకాల మినహాయింపులు చేసుకుని మిగిలిన జీతం చెల్లించాల్సి ఉండడం, నగదు రూపంలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి దగ్గరా సంతకాలు తీసుకోవాల్సి రావడం సమస్యగా మారింది. దీనికి తోడు బ్యాంకర్లు కూడా అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎప్పటిలాగే బ్యాంకుల్లోనే నవంబర్ నెల వేతనాలు జమవుతాయని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. అయితే, నవంబర్ నెల వేతనంలో రూ.10 వేలను ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్‌గా ఇస్తారని, లేదంటే సగం జీతం నగదు రూపంలో ఇస్తారని మొదట్లో చర్చ జరిగినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయిన వేతనాలను తమకు ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా తమ వేతనాల ఉపసంహరణ కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా కనిపిస్తోంది. దీంతో పాటు బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే పరిమితిని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. బ్యాంకర్లు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిందే. నగదు ఇస్తేనే బాగుంటుంది.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం నల్ల ధనాన్ని అరికట్టే విషయంలో మంచిదే అనుకున్నా.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఉద్యోగుల పరిస్థితి సామాన్య ప్రజల కంటే భిన్నమైనది. ఉద్యోగులకు ఈనెల వేతనాలు నగదు ఇస్తేనే బాగుంటుంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. మంగళ, బుధ వారాల్లో స్పష్టత వస్తుంది. - పందిరి వెంకటేశ్వరమూర్తి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు. జిల్లాలో 6 వేలకు మందికి పైగా టీచర్లున్నారు. వీరికి నెలసరి వేతనాలే జీవనాధారం. ఈ పరిస్థితుల్లో వేతనాలు డ్రా చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు బ్యాంకుల్లో జమ చేస్తే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఉపసంహరణ పరిమితిని పెంచాలి. మాతో పాటు సామాన్య ప్రజలకు కూడా కౌంటర్లు పెంచాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. - పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, -
అప్పుతో ఆపరేషన్లు..!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పుతో శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి బళ్లారిలోని అరుణోదయ ఆస్పత్రి ముందుకు వచ్చింది. అప్పుతో శస్త్ర చికిత్సలు, మోకాలి చిప్పలను మార్పిడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అరుణోదయ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ కందుల పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరంలోని రాయల్ ఫోర్ట్‌లో విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అత్యవసరంగా చికిత్సలు చేయించుకునేందుకు పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ పరిధిలో చేసే ఆర్థోపెడిక్ సంబంధిత శస్త్రచికిత్సలు మూడు నెలల పాటు రోగులకు అప్పుగా చేస్తున్నట్లు చెప్పారు. రోగికి అత్యవసరంగా మోకాలి చిప్పల మార్పిడి లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలను కూడా అప్పుతో చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం రోగులు ఆధార్ కార్డు అందజేస్తే చాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా అప్పుగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. - సాక్షి, బళ్లారి -
అక్కడ ఫెడ్ భయం... ఇక్కడ నోట్ల రద్దు నీరసం!
ముంబై/న్యూయార్క్: సమీప కాలంలో పసిడి అడుగులు తడబాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు భయాలు ఒకవైపు... దేశీయంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం పసిడి బలహీనతకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి . డిసెంబర్ 13-14 తేదీల్లో వాషింగ్టన్లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినబడుతున్నాయి ఈ పరిణామం పసిడి గమనానికి ఒక దిశా నిర్దేశం చేస్తుందన్న వాదనలు ఉన్నాయిఇక దేశీయంగా చూస్తే... పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా డిమాండ్ ఉన్నప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయిపలు ఆంక్షలు, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వారంలో అసలు ఢిల్లీ, ముంబైలలో బంగారం షాపులు అసలు తెరవకపోవడం గమనార్హం. ధరల జారుడు...: శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధరలు భారీగా పడిపోయాయిఅంతర్జాతీయంగా ఔన్స (31.1గ్రా) ధర దాదాపు 17 డాలర్లు పడిపోకయి 1,207 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి. ముంబై స్పాట్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.1,205 తగ్గి రూ.29,310కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిపడిపోయి.29,160 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.3,655 పడిపోయి.41,765 వద్దకు చేరింది. -
ఆర్దిక ప్రణాళికను మార్చండి
పొదుపు, మదుపునకు అవకాశం భవిష్యత్తులో ఈక్విటీల్లోకి అధిక నిధులు నల్లధనంపై చర్యలతో బంగారం, రియల్టీలో తగ్గనున్న డిమాండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో క్లిష్ట సమయాలను ఎదుర్కోవడం ఈజీ ఊహించని సందర్భాలు జీవితంలో ఎదురవుతుండడం సర్వ సాధారణం. ప్రస్తుత నోట్ల రద్దు కూడా ఇటువంటిదే. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే సందర్భం ఎలాంటిది అయినా నిర్భయంగా, ధైర్యంగా... తొణకకుండా, బెణకకుండా ఉండవచ్చు. అంతేకాదు... మదుపరి తన ఆలోచనకు పదును పెడితే ఇలాంటి సందర్భాలను ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువుగా మలుచుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలన్నది చూద్దాం... పొదుపు దిశగా.... ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ అవి చెల్లుబాటు కావని, బ్యాంకుల్లో మార్చుకోవాలని లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు. ఏటీఎంలు పనిచేయలేదు. ఆ తర్వాత కూడా ఎక్కువ శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులోకి రాలేదు. దీంతో చేతిలో డబ్బుల్లేక, ఉన్న డబ్బులకు విలువ లేక ప్రతి ఒక్కరూ తమ ఖర్చులకు చెక్ పెట్టేశారు. ప్రతి రూపాయి ఖర్చుకూ లెక్కలేయడం ప్రారంభించారు. ఖర్చులను ఎలా తగ్గించుకోవచ్చో తాజా సందర్భం ప్రతీ ఒక్కరికీ నేర్పించింది. దీన్నే నిత్య జీవితంలో ఆచరణగా మార్చుకుంటే... పొదుపరులుగా మారిపోతారు. ఆ పొదుపును మంచి రాబడులను ఇచ్చే పథకాల్లోకి మళ్లించినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. కంటింజెన్సీ ప్లాన్ అత్యవసరమైతే గట్టెక్కేందుకు సరిపడా నగదు ప్రతి ఒక్కరి వద్దా అందుబాటులో ఉండాలి. అనుకోని అవాంతరం వచ్చి నగదు ప్రవాహం ఆగిపోతే... అత్యవసరంగా నగదుతో అవసరం ఏర్పడితే... గట్టెక్కేందుకు సిద్ధంగా ఓ ఫండ్ ఉండాలి. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని తక్షణమే నగదుగా మార్చుకునే సాధనాల్లో పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణుల సలహా. ఇందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స అందించే లిక్విడ్ ఫండ్స అనువుగా ఉంటాయని వారు సూచిస్తున్నారు. మిక్స్‌డ్‌గా ఉండాలి ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియో ఫిజికల్, ఫైనాన్స అసెట్స్ కలబోతగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఊహించని సందర్భాల్లో రాబడులను కోల్పోకుండా సరైన ఆసరాగా ఉంటుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడులను అవసరమైతే వెంటనే నగదుగా మార్చుకోవాలంటే దాదాపుగా అసాధ్యం. భూమిని నమ్మకున్నవారు ఎప్పు డూ నష్టపోరు అన్న సూత్రంతో తమ పొదుపునంతా రియల్టీ మార్కెట్‌పైనే పెట్టిన వారు అత్యవసర సమయాల్లో వాటిని ఎంతో కొంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులు ఎప్పుడూ కలబోతగా ఉండేలా చూసుకోవాలి. డీమోనిటైజేషన్ అంటే..? డీమోనిటైజేషన్ అంటే చెలామణిలో ఉన్న నగదుకు చట్టబద్ధ చెల్లుబాటును రద్దు చేయడం. పాత నోట్లను అదే విలువ గల కొత్త కరెన్సీ నోట్లతో మార్పిడి చేయడం ఈ ప్రక్రియలో భాగం. స్వాతంత్య్రానంతరం 1978లోనూ ఓసారి డీమోనటైజేషన్ జరిగింది. నల్లధనం కట్టడికి అప్పట్లో చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు. పన్నుకు ప్లాన్ చేసుకోండి... నిజానికి పన్ను తప్పించుకునే వారి కంటే పన్ను చెల్లించే వారే తమ పెట్టుబడుల విషయంలో స్వేచ్ఛగా ఉండగలరు. చెల్లించాల్సినంత పన్ను చెల్లించేస్తే సంపాదనలో మిగులును ఆర్జన పరులు తమ రిస్క్‌కు తగిన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. దీని కంటే ముందు పన్ను కట్టాల్సిన ఆదాయం ఉంటే పన్ను చెల్లించడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేయవద్దు. పెట్టుబడులపై రాబడుల్లో మార్పులు ఇప్పటి వరకూ ఎక్కువ మంది లెక్కల్లో చూపని పన్ను ఆదాయాన్ని బంగారం, స్థలాలు, ఇళ్లు వంటి వాటిపై పెట్టుబడిగా పెట్టడం తెలిసిందే. నిధుల రాక ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాధనాల్లో రాబడులు మంచిగానే ఉండేవి. కానీ, పన్ను ఎగ్గొట్టే అవకాశాలకు కేంద్రం కత్తెర వేస్తోంది. దీంతో భవిష్యత్తులో మరింత మంది ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్సలో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు 5 శాతం పడిపోయాయిమిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స విలువలు 7-8 శాతం వరకు, లార్జ్ క్యాప్ ఫండ్స 5 శాతం వరకు తగ్గాయిముఖ్యంగా రియల్ ఎస్టేట్ సూచీ 20 శాతం వరకు నష్టపోయి. మంచి స్టాక్స్‌లో, ఫండ్స పథకాల్లో పెట్టుబడులకు ఇదొక అవకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆరోగ్య బీమా ఎప్పుడు, ఏ సమయంలో ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమయాల్లో వైద్య ఖర్చులు ఎంత అవుతాయో కూడా ఊహించడం కష్టమే. అందుకే ప్రతి ఒక్కరూ తమకు, తమ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా ఉండేట్టు చూసుకోవాలి. దీంతో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య సాయం పొందవచ్చు. ధన సాయం కోసం ఇతరుల వద్ద చేయిచాల్సిన పని పడదు. అత్యవసర నిధిని కూడా కదిలించే అవసరం కూడా రాకుండా ఉంటుంది. సొంతిల్లుకు సరైన తరుణం నోట్ల రద్దుతో రియల్టీ మార్కెట్లో లావాదేవీలు భారీగా పడిపోయాయిధనం రాక ఆగిపోవడంతో డిమాండ్ వాస్తవిక స్థాయికి చేరడం వల్ల ధరలు దిగివస్తాయన్నది పరిశీలకుల అంచనా. సొంతిల్లు సమకూర్చుకోవాలని అనుకునే వారు ప్రస్తుత తరుణంలో తక్కువ ధరకు డీల్ అందుబాటులో ఉంటే రుణంపై కొనుగోలు చేయడం సరైన నిర్ణయమే అవుతుంది. దాని వల్ల ఒకవైపు పన్ను ప్రయోజనం, మరోవైపు తక్కువ ధరకు సొంతిల్లు రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చు. పైగా బ్యాంకుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న నిధులతో సమీప కాలంలో రుణాలపై రేట్లు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయిపన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే రుణంపై వడ్డీ కూడా సున్నాగా మారిపోతుంది. బంగారం బాండ్లు బెటరు పసిడిపై పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. నల్లధనం కట్టడి చేయడం వల్ల దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గనుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే సమీప కాలంలో బంగారం ధర 10 గ్రాములు రూ.26 వేలకు పడిపోతుందని ఒక అంచనా. అయితేదే సమయంలో డాలర్‌తో రూపాయిరకం విలువ క్షీణించకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా బంగారం కంటే ప్రభుత్వ బంగారం బాండ్లను కొనుగోలు చేయడం వల్ల 2.5-2.75 వరకు వడ్డీ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే... డీమోనిటైజేషన్ వల్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుల ఆదాయం సైతం పెరుగుతుందంటున్నారు. అయితే నగదు కొరత కారణంగా ప్రజలు కనీస అవసరాలపైనే వినియోగం చేస్తారని, దాంతో నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల స్వల్ప కాలంలో వడ్డీ రేట్ల కోత అనుకున్న మేర ఉండకపోవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో తక్కువ రిస్క్ కోరుకునే వారు లిక్విడ్, స్వల్ప కాలిక డెట్ ఫండ్సలో, రిస్క్ భరించే వారు దీర్ఘకాల ఫండ్స లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, దీర్ఘకాల బ్యాంకు డిపాజిట్లు, పన్ను రహిత బాండ్లు, కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి -
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ
నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల ర్యాలీ న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు బుధవారం ర్యాలీ నిర్వహించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నేతృత్వంలో విపక్షాలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఈ ర్యాలీ చేపట్టాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఈ అంశంపై చర్చించనున్నాయి. కాగా ఈ భారీ ర్యాలీలో శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. మరోవైపు విపక్షాల ర్యాలీని బీజేపీ తప్పుబట్టింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమం, చారిత్రతాత్మకమని అభివర్ణించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. -
పెద్దనోట్ల రద్దు ఎక్కడికి దారితీస్తుందో
దేశంలో 'మాంద్యం' తప్పదా? (ఇంటర్నెట్ ప్రత్యేక కథనం) హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశంలో ఆర్థికమాంద్యానికి దారితీస్తుందా? నోట్ల రద్దు తర్వాత అవసరమైనంత కరెన్సీని అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇప్పటికే పలు వ్యాపారాలు కుదేలయ్యాయి. బ్యాంకుల నుండి సరిపడినంత డబ్బు తీసుకునే వెసులుబాటు లేక చిన్నవ్యాపారులు చితికిపోతున్నారు. మార్కెట్లో వారు సైతం డబ్బుతోనే సరుకులు కొనుగోలు చేయవలసి రావడం చేత క్రమేపి వారి వ్యాపారాలు మందగిస్తున్నాయి. చాలా దుకాణాల్లో సరుకులు సన్నగిలిపోయాయి. స్థిరాస్తి లావాదేవీలు స్తంభించాయి. వ్యవసాయక కొనుగోళ్లు, అమ్మకాల్లో మున్నెన్నడూ ఎరుగని స్తబ్ధత ఏర్పడింది. ఈ ఏడాది కురిసిన మంచి వర్షాల వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని కూడా ఈ చర్య వల్ల చేజేతులారా దెబ్బతీసుకున్నట్లైంది. రబీ సీజన్-లో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల దగ్గరి నుంచి వ్యవసాయ కూలీలకు చెల్లింపుల వరకు అంతా అయోమయం నెలకొంది. పండిన పంటలకు కూడా గిట్టుబాటయ్యే ధరలు లేని దుస్థితి. వ్యవసాయ రంగం అంతా ప్రధానంగా నగదు చెల్లింపులపైనే నడుస్తుండడం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వ్యతిరేక ఫలితాలనే ఇవ్వనుందని ప్రముఖ గణాంకవేత్త ప్రొఫెసర్ ప్రణబ్ కే సేన్ అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సారి వార్షిక వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగానే నమోదు కావచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్య చలామణి మందగించడంతో పాటు లెక్కల్లోకి రాని డబ్బు యావత్తు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశం లేకపోవడం మూలాన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 1.1 మేరకు తగ్గవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) కి చెందిన ప్రొఫెసర్ ఎన్ ఆర్ భానుమూర్తి హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు తగ్గితే దానిని రెసిషన్ గా వ్యవహరిస్తారు. ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు కాస్త తగ్గి 7.1 శాతంగా నమోదైంది. నిరుడు ఇదే త్రైమాసికంలో ఇది 7.5 శాతంగా ఉండింది. మంచి వర్షాల వల్ల 2016 -17లో 8 శాతం వార్షిక వృద్ధిరేటు ఉండగలదని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ స్థాయి వృద్ధిరేటును సాధించడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు అంటున్నారు. 1978లో వెయ్యి నోటు రద్దు జరిగినప్పుడు కూడా 25 శాతం డబ్బు బ్యాంకుల్లోకి రాలేదు. ఈసారి కూడా 25 శాతం నల్లధనం బ్యాంకుల్లో జమకాకపోవచ్చునని SBI రూపొందించిన ఒక నివేదిక అంచనా వేసింది. దేశంలో ఈ పర్యాయం 45 లక్షల కోట్ల రూపాయల నల్లధనంలో కనీసం 20 శాతం- అంటే రూ. 9 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కాకపోవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. నిజానికి ఇది 20 లక్షల కోట్ల యినా కావచ్చు. అంతకు మించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే దేశంలో నల్లధనం ఎంతన్నది ఎవరికీ అంతుచిక్కనిది. దానిమీద అంచనాలు కట్టడం అన్నివేళలా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వానికి చిక్కని ప్రత్యామ్నాయమార్గాల ద్వారా నల్లధనం మార్పిడికి కూడా కొన్ని అవకాశాలు ఉండనే ఉన్నాయి. రోజూ వారి లావాదేవీల్లో నోట్ల వినియోగంపై ఆర్బీఐ చెబుతున్న గణాంకాలు మురిగిపోయిన అప్పులు! ఇక దేశంలో ప్రభుత్వరంగబ్యాంకుల నిరర్థక ఆస్తుల (NPA) విలువ కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం అవి 7.6 శాతం చేరుకున్నాయి. అవి 2017 మార్చి నాటికి 8.5 శాతానికి చేరవచ్చునని అంచనా. 2015-16 త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఏకంగా 5.8 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గోడకు కొట్టిన సున్నం లాంటి తిరిగిరాని మురి(ని)గిపోయిన అప్పులు! విజయ మాల్యా వంటివాళ్ల చేతుల్లోకి అవి చేరిపోయాయి. ఈ కారణంగా 25 ప్రభుత్వబ్యాంకుల్లో ఇప్పటికే కనీసం 15 బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2017-18 సంవత్సరానికిగాను క్రెడిట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వరంగబ్యాంకులకు 36 వేల కోట్ల రూపాయల మేరకు నిధులు కావాలి. మోదీ ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంక్, స్టార్టప్ ఇండియా, గోల్డ్ మానిటైజేషన్ వంటి పథకాలు బ్యాంకుల కష్టాలను మరింత పెంచాయి. ప్రభుత్వపథకాలేవీ సరిగా అమలు కాకపోవడానికి బ్యాంకుల వద్ద వాటికి సరిపడా ద్రవ్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వం ఆశిస్తోంది ప్రధానంగా "ద్రవ్యం" కావచ్చు. అయితే అది ఏ మేరకు అందివస్తుందో కాలమే తేల్చాలి! దేశంలో 4 కోట్ల మంది చిన్నతరహా వ్యాపారులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన జాతీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం 8 శాతం వాటాను కలిగి ఉంది. దీనికి (Micro, small and medium enterprises - MSME) వస్తువుల ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతులలో40 శాతం వాటా ఉండడం విశేషం. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికంగా ఉద్యోగితను కల్పించే రంగం ఇది. ఇప్పుడు పెద్దనోట్ల రద్దుతో ఈ రంగం పెనుసంక్షోభంలో చిక్కుకుపోయింది. కరెన్సీ లభ్యత తగ్గిపోవడమంటే అది ప్రజల కొనుగోలుశక్తి తగ్గడమే. కొనుగోలు శక్తిని ప్రభుత్వం హరించడమంటే అది దేశంలో వస్తూత్పత్తికి గిరాకీ తగ్గించడమే అవుతుంది. అలా ఇది ద్రవ్యోల్బణం నుండి తొలుత ద్రవ్యమాంద్యానికి...అంతిమంగా ఆర్థిక మాంద్యానికీ దారితీస్తుందన్న భయసందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకుల జాతీయకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పలువురు స్వతంత్ర ఆర్థికవేత్తలతో విపులంగా చర్చించారు. దాని లాభనష్టాలను బేరీజు వేశాకే ప్రకటన చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం తమ ఆలోచనలకు తలాడించే ఆర్థికశాఖ అధికారులపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుపై పెద్దగా అధ్యయనం లేకుండానే నిర్ణయం తీసుకోవడం వల్ల దాని దుష్పరిమాణాలకు సిద్ధం కావలసిందేనని ప్రభాత్ పట్నాయక్ వంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి 2014 నుండే వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల వాడకం విపరీతంగా పెరిగింది. (దీనిని గ్రాఫ్ ద్వారా చూడవచ్చు). రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో రూ.16.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో రూ.6.3 లక్షల కోట్లు అంటే 38.6 శాతం వెయ్యి రూపాయల నోట్లు. కాగా రూ.7.8 లక్షల కోట్లు అంటే 47.8 శాతం ఐదు వందల రూపాయల నోట్లు. వీటి రద్దుతో ఏకంగా 86.4 శాతం కరెన్సీని చెల్లుబాటు కాకుండా చేశారు. ఒకనాటి చాయ్-వాలాగా చెప్పుకునే మోదీ ఇప్పుటి చాయ్-వాలాలతో సహా రోజువారీ కష్టం మీద బతికే బడుగుజీవులకు మాత్రం పూట గడవకుండా చేశారు. ప్రశ్నార్థకంగా మారనున్న నిత్యవసర సరుకుల వినియోగం పెరిగిన ధరలు! తాజా వినియోగ ధరల సూచీ ప్రకారం దేశంలో 2016 అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ లో ఇది 4.39. కాగా నిరుడు 5 శాతంగా ఉండింది. అధికారిక గణాంకాల ప్రకారం "ద్రవ్యోల్బణం" తగ్గింది. కానీ ఆహార దినుసుల ధరలు ఏ మాత్రం తగ్గలేదు. పైగా మరింత పెరిగాయి. రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై 2016 త్రైమా సికంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆహారద్రవ్యోల్బణం కుదిపివేసింది. పప్పుధాన్యాలకు సంబంధించి తెలంగాణలో సగటున 37.6 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అలాగే మసాలా దినుసుల్లో 15.4 శాతం, పండ్లధరల్లో 13.1 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పప్పుధాన్యాలకు సంబం ధించి 34.7 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు వెల్లడైంది. పెద్దనోట్లను ఆకస్మికంగా రద్దు చేయడంతో మోదీ దేశంలో ఒక మోస్తరు ధనవంతుల నల్లధనానికి ఒక మేరకు చెక్ పెట్టగలిగి ఉండవచ్చు. కానీ ద్రవ్యం సరిపడా చలా మణిలో లేని పరిస్థితులను సృష్టించడం అంతిమంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రద్దు చేయదలిస్తే వెయ్యి నోట్లను ఎందుకు అంత విస్తారంగా, అనాలోచితంగా చలామణిలోకి తెచ్చినట్లో మోదీ మాత్రమే చెప్పగలరు. ఏదిఏమైనా దశలవారీగా, శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పనిని హఠాత్తుగా చేయడం వల్ల దుష్పరిమాణాలు తప్పకపోవచ్చు. ఒక మంచి పనిని సరైన రీతిలో చేయకపోవడం కూడా చెడుఫలితాలకే దారితీస్తుందని మోదీ ఆలస్యంగానైనా గ్రహించవలసి వస్తుంది. -
వాళ్లను విపక్షాలే పంపిస్తున్నాయి: రాందేవ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో విమర్శలు చేస్తున్న విపక్షాలపై యోగా గురువు రాందేవ్ బాబా ఎదురుదాడికి దిగారు. బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్దకు ప్రతిపక్ష పార్టీలు... తమ వ్యక్తులను పంపించి, రద్దీని సృష్టిస్తోందంటూ విమర్శలు చేశారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్నిరాందేవ్ బాబా మరోసారి ప్రశంసించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కరోనరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా కీర్తిస్తోంది, దీని వల్ల అక్రమ వ్యాపారాలు, అవినీతి, ఆర్థికనేరాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అవినీతి, నల్లధనం, తీవ్రవాదం అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు కూడా సహకరించాలని రాందేవ్ బాబా కోరారు. యుద్ధ సమయంలో శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ వారం, పదిరోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటారని, అలాంటిది దేశం కోసం మనం ఆ మాత్రం కూడా చేయలేమా అంటూ ప్రశ్నించారు. అయితే కొంతమంది వ్యక్తులు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్నారని, కేంద్రం చర్యతో వాళ్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. అలాగే యోగాతో పాటు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు. -
నేపాల్‌పై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
మోదీ ప్రసంగం పెద్ద డ్రామా: బృందాకరత్
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం పెద్ద డ్రామాగా ఆమె అభివర్ణించారు. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తున్న విపక్షాలన్నీ కలిసికట్టుగా ఈ అంశంపై పోరాడతాయని సోమవారమిక్కడ స్పష్టం చేశారు. డిసెంబర్ 31 వరకూ పాత నోట్ల చెల్లుబాటయ్యేలా చూడాలని మోదీ సర్కార్‌ను కోరతామని బృందాకరత్ చెప్పారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో బద్దశత్రువు తృణమూల్‌తో కలిసి ముందుకెళ్లేందుకు అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు -
ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు..
-
పెద్ద నోట్ల రద్దు విప్లవాత్మక నిర్ణయం
దేశంలో ఉప్పు కొరత వట్టి వదంతే.. చర్చావేదికలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అవినీతి, నల్లధనం నిర్మూలనలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓ విప్లవాత్మకమైన అడుగని, దేశంలో ఉప్పు కొరత లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రోజుల్లో కొత్త నోట్లు వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ క్లబ్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తగినంత డబ్బు బ్యాంకుల్లో ఉందని ఎవరూ భయపడవద్దన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో పన్నుకట్టే తత్వం పెరుగుతుందన్నారు. 15 వేల జనాభాకు ఒక బ్యాంక్ బ్రాంచి చొçప్పున ఉన్నాయని.. బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నారన్నారు.పన్నులు కట్టకుండా ప్రజల్ని దోచుకున్న వారికి మాత్రమే ఈ నిర్ణయం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ చర్యతో ద్రవ్వోల్బణం తగ్గి, ధరలు మరింత తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. కానీ దీన్ని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. దీర్ఘకాలిక, విప్లవాత్మకమైన యజ్ఞం తలపెట్టిన ప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ఈ నోట్ల రద్దుతో పాకిస్తాన్ కుట్రలకు తెరపడిందన్నారు. అలాగే ఉప్పు కొరత వదంతులను కొట్టిపారేస్తూ దేశంలో 285 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుంటే, కేవలం 60 లక్షల టన్నులు మాత్రమే ఉపయోగించుకుంటున్నా మన్నారు. అవినీతి క్యాన్సర్ లాంటిదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సామాన్యులకు చేరాల్సిన సంక్షేమ పథకాల అమలులో వేల కోట్ల కుంభకోణం జరుగుతోంద న్నారు. సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు..
ప్రస్తుతం దేశంలో ఏ ఇద్దరు కలుసుకున్నా మాట్లాడేది నోట్ల గురించే. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల్లో ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. నోట్ల సమస్య ఎలా ఉన్నా అసలు దేశంలో నోట్లు ఎప్పటి నుంచి వాడకంలోకి వచ్చాయి? వెనకటి కాలంలో నోట్లు ఎలా ఉండేవో ఓసారి చూద్దాం.. నవంబర్ 8, 2016 దేశ ఆర్థిక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు. నవంబర్ 8, మంగళవారం రాత్రి 8 గంటలకు కరెన్సీ బాంబు పేల్చారు ప్రధాని మోదీ. నోట్ల రద్దు ప్రక్రియ మన దేశంలో గతంలో రెండుసార్లు జరిగినా ఆ రోజుల్లో కరెన్సీ నోట్లు ఇప్పుడున్నంత మొత్తాల్లో జనాల దగ్గరుండే కావనే చెప్పాలి. అప్పట్లో పెద్ద కరెన్సీ నోట్లు సమాజంలో అతి కొద్ది మంది దగ్గరే మాత్రమే ఉండేవి. రంగు, రూపుపరంగా అనేక మార్పులను దేశంలో కరెన్సీ నోట్లు చూశాయి. కరెన్సీ నోట్ల గురించి చెప్పాలంటే వాటికి 150 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 18వ శతాబ్దం వరకు దేశంలో బంగారు, వెండి నాణెలు చలామణీలో ఉండేవి. యూరోపియన్ వ్యాపార సంస్థల పట్టు ఎప్పుడైతే దేశంలో పెరిగి, డబ్బుల అవసరం ఎక్కువ ఏర్పడటంతో కాగిత నోట్లు ముద్రించాల్సిన అవసరం ఏర్పడింది. యూరోపియన్ కంపెనీలు అప్పట్లో సొంతంగా బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నాయి. భారత్‌లో మొట్టమొదటి పేపరు నోట్లను అప్పటి కలకత్తాలోని బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్ ముద్రించింది. దానిపై కేవలం అక్షరాలు మాత్రమే ఉండేవి. బ్రిటీష్ కంపెనీల పట్టు పెరిగిన తర్వాత బెంగాల్, బొంబాయి, మద్రాసులో ప్రెసిడెన్సీ బ్యాంకులు వెలిశాయి. ఇందులో మొదటిది బ్యాంక్ ఆఫ్ బెంగాల్. వీటి రాక వల్ల కాగితపు నోట్ల పాపులారిటీ మరింత పెరిగింది. బ్యాంకు ఆఫ్ బెంగాల్ విడుదల చేసిన మొట్టమొదటి కరెన్సీ నోట్లపై వ్యాపారానికి ప్రతిరూపంగా ఓ మహిళ చిన్న బొమ్మ, బ్యాంకు పేరు, నోటు విలువ ఉండేవి. నోటు విలువను ఉర్దూ, బెంగాలీ, దేవనాగరి భాషల్లో ముద్రించారు. నోట్ల వాడకం పెరగడం, అందరికీ అవి అవసరం అవుతుండటంతో 1861లో బ్రిటీష్ ప్రభుత్వం పేపర్ కరెన్సీ చట్టాన్ని తీసుకువచ్చింది. అంతే కాదు నోట్ల ముద్రణను బ్రిటీష్ ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లకు అదే ఆధారం. అప్పట్లో డబ్బును బ్యాంకులు కాకుండా ప్రభుత్వమే జారీ చేసేది. పేపర్ కరెన్సీ చట్టం ఇండియన్ కౌన్సిల్‌లోని ఫైనాన్స్ మెంబర్ జేమ్స్ విల్సన్ ఆలోచనకు ప్రతిరూపం. అప్పట్లో ఆయన భారత్‌లోని బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్థిక మంత్రని చెప్పవచ్చు. ఎకానమిస్ట్ పత్రిక, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు వ్యవస్థపకుడు ఆయన. విక్టోరియా బొమ్మతో కూడిన రూ.10, 20, 50, 100, 1000 నోట్లు తొలిసారిగా ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ నోట్లపై రెండు భాషల్లో నోట్ల విలువ, నోటు పైభాగంలో బ్రిటన్ మహారాణి చిన్న చిత్రం ఉండేది. నోట్ల జారీ కోసం అప్పట్లో కరెన్సీ సర్కిల్స్ ఉండేవి. కలకత్తా, బొంబాయి, మద్రాసు, రంగూన్, కాన్పూర్, లాహోర్, కరాచీ నగరాలను కరెన్సీ సర్కిల్స్‌గా గుర్తించారు. ఈ సర్కిల్స్ జారీ చేసే నోట్లు ఆ సర్కిల్ పరిధిలో చలామణీ అవుతుండేవి. అప్పట్లో దూరప్రాంతాలకు భద్రంగా చేరవేందుకు నోటును సగానికి చించి పోస్టులో పంపించే వారు. ఆ సగం వారికి చేరిన తర్వాత మిగిలిన సగం పంపించేవారు. బ్రిటీష్ కంపెనీలే కాదు అప్పట్లో భారత్‌లో ఉన్న ఫ్రాన్స్, పోర్చుగల్ ప్రభుత్వాలు కూడా నోట్లు ముద్రించాయి. 1890ల్లో ఫ్రాన్స్ బ్యాంకు జారీ చేసిన రూపాయి నోట్లు 1954 వరకు భారత్‌లో చలామణీలో ఉండేవి. 1883లో పోర్చుగీసు వారు జారీ చేసిన రూపాయా నోట్లు భారత్‌లో 1961 వరకు వాడకంలో ఉన్నాయి. దేశంలో బ్రిటీష్ వారి పెరుగుతున్న ప్రాబల్యానికి అనుగుణంగా కరెన్సీ నోట్లు మార్పులు చూశాయి. 1923 కింగ్ జార్జ్ ఐదు బొమ్మతో కూడిన నోట్లు వాడకంలోకి వచ్చాయి. 1928లో నాసిక్‌లో కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పేవరకు నోట్లన్నీ బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ ముద్రించేవారు. 1935లో కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు భారత ఆర్థిక వ్యవహారాల బాధ్యతను అప్పగించారు. 1938లో ఆర్బీఐ తొలి నోటును ముద్రించింది. దానిపై కింగ్ జార్జ్-VI చిత్రముండేది. స్వేచ్ఛా భారత్‌కు సంబంధించిన నోట్లు ముద్రించేందుకు ఆర్బీఐకి చాలా సంవత్సరాలు పట్టింది. స్వతంత్ర భారత్‌కు సరిపోయేలా గుర్తులు, చిత్రాల ప్రతిబింబించేలా కొత్త రూపుతో నోట్లు ముద్రించడంపై చాలా కసరత్తు జరిగింది. స్వతంత్ర భారత్‌లో తొలి కరెన్సీ నోటు 1949లో విడుదలైంది. రూపాయి నోటుపై సారనాథ్ అశోక స్థూపం ముద్ర ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఆర్బీఐ దేశంలోని అని చారిత్రాక కట్టడాలను నోట్లపై ముద్రించింది. ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా, తంజావూరు బృహదీశ్వర ఆలయం బొమ్మలు నోట్లపై ఉండేవి. 1960ల్లో తొలిసారి నిరాక్ష్యరాస్యులు గుర్తించేలా వివిధ రంగుల్లో నోట్ల ముద్రణ ప్రారంభమైంది. 1980ల వరకు నోట్లపై అశోక స్థూపం ఉండేది. 1944లోనే సెక్యూరిటీ థ్రెడ్, ఆర్బీఐ వాటర్ మార్కుతో కూడిన నోట్లు ముద్రించారు. 1996, ఆ తర్వాత 2005లో మహాత్మ గాంధీ సిరీస్‌లో నోట్ల ముద్రణ మొదలైంది. చూపులేని వారు సులువుగా గుర్తించేందుకు వీలుగా కరెన్సీ నోట్లలో మార్పులు చేశారు. కరెన్సీ నోట్లలో చివరిసారి జరిగిన మార్పు 2010లో రూపొందించిన రూపాయి గుర్తు. 2011లో తొలిసారి రూపాయి గుర్తుతో కూడిన నోట్ల ముద్రణ చేపట్టారు. -
ఈసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ గురి తప్పింది
న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై నిజంగా ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేసే సదావకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేజార్చుకున్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1978లో పదివేలు, ఐదువేల రూపాయల నోట్లను నిషేధించినప్పుడు దేశంలో ఆర్థికంగా మంచి ఫలితాలు వచ్చాయని, వ్యక్తుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు కూడా తరిగి పోయాయని వారంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వెయ్యి రూపాయల నోటుకు మించిన నోట్లను భారత ప్రభుత్వం తీసుకరాకపోవడం కూడా కొంత నల్ల డబ్బును అరికట్టిందని వారు చెబుతున్నారు. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను నిషేధిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, అయితే రెండు వేల రూపాయల కొత్త నోటును తీసుకురావడం ద్వారా అనసరంగా లక్ష్యాన్ని గురితప్పారని కొంతమంది ఆర్థిక వేత్తల అభిప్రాయం. రెండు వేలకు బదులుగా రెండు వందల నోటును తీసుకొచ్చి ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉండేవని వారంటున్నారు. కొంత మంది నల్ల కుబేరులు పెద్ద నోట్లను పరుపుల్లో దాచుకుంటారని ఓ నానుడిగా చెబుతారు. దాని ప్రకారమే ఆలోచిస్తే రెండు పరుపుల్లో దాచుకునే సొమ్ము ఇప్పుడు ఒక్క పరుపులోనే దాగి పోతుంది. కొత్త నోటు పాత వెయ్యి రూపాయిలకన్నా పలుచగా ఉన్నందున మరిన్ని ఎక్కువ నోట్లను దాచుకోవచ్చు. కొత్త ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యుంటాయని, వాటికి బదులు 200 నోట్లను మాత్రమే తీసుకొచ్చి, ఆన్లైన్, మొబైల్ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించినట్లయితే నరేంద్ర మోదీకి ఆశించిన ప్రయోజనం దక్కేదని ఆర్థిక నిపుణుల అంచనా. పేటీఎం, ఫ్రీచార్జ్, పేటూయు లాంటి ఆన్లైన్ చెల్లింపుల సంస్థలెన్నో నేడు అందుబాటులోకి వచ్చాయి. మరింత సులువైన అప్లికేషన్లతో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ చెల్లింపులను ప్రోత్సహించినట్లయితే క్రమంగా నల్లడబ్బు దానంతట అదే కరుగుతూ వచ్చేది. నల్ల డబ్బంటే కేవలం డబ్బు రూపంలోనిదేనన్న భ్రమ కొంత మంది ప్రజల్లో ఉంది. ప్రధానంగా స్థలాలు, బంగారం రూపంలో ఎక్కువగా ఉంటోంది. ఈ బంగారమే విదేశీ బ్యాంకులకు నల్ల డబ్బును తరలించేందుకు ప్రధాన సాధనంగా కూడా మారింది. కేవలం నల్ల డబ్బును అరికట్టినంత మాత్రాన అవినీతి, చీకటి సొమ్ము నిలిచిపోదు. అన్ని రూపాల్లో ఉన్న నల్ల డబ్బును అరికట్టాలంటే సింగిల్ ఎంట్రీ పాస్‌బుక్ వ్యవస్థను తీసుకరావచ్చు. దానికి అవసరమైతే ఆధార్ కార్డును కూడా జత చేయవచ్చు. దేశ పౌరుడికి దేశ, విదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో వాటిన్నింటి వివరాలను ఆ పాస్ బుక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. బంగారు నగల విలువలను కూడా జత చేయాలి. ప్రతి పౌరుడి ఆర్థిక లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఆ పాస్‌బుక్‌లోకి ఎంట్రీ అవ్వాలి. వాటికి ప్రతి పౌరుడి నుంచి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలి. డిక్లరేషన్‌ను ఉల్లంఘించినట్లయితే కఠిన శిక్షలు అమలుచేసే చట్టాలు తేవాలి. అప్పుడే మోదీ కల సంపూర్ణంగా నెరవేరగలదని కొంత మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
నోట్లు... జనం పాట్లు
-
మోదీ ట్విట్టర్ చిత్రం..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అత్యంత చురుగ్గా ఉండే రాజకీయ ప్రముఖుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన చేపట్టిన బ్లాక్‌మనీ యుద్ధంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, ట్విట్టర్ అభిమానుల స్పందన మాత్రం ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ కౌంటర్ అందించిన సమాచారం ప్రకారం నవంబర్ 8 రూ.500,.రూ.1000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత నవంబర్ 9న దాదాపు మూడులక్షలమందికి పైగా ఫాలోయర్స్ ను మోదీ కోల్పోయారు. కానీ ఆ మరునాడు నవంబర్ 10న మరో 4,30,128 మంది ట్విట్టర్ జనాలు వచ్చి చేరారట. ఆయనకు మొత్తం 2.4కోట్ల మంది ట్విట్టర్ జనాలు ఫాలో అవుతుండగా, 3,13,312 మంది విత్ డ్రా అయిపోయారని ట్విట్టర్ డాటాను ఎనలైజ్ చేసే ట్విట్టర్ కౌంటర్ ఈ వివరాలను వెల్లడించింది. కాగా పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ట్విట్టర్ ద్వారా వచ్చిన సానుకూల స్పందనలపై మోదీ స్పందించారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ఇతర రంగాల ప్రముఖుల నుంచి వచ్చిన స్పందనకు ధన్యవాదాలుతెలుపుతూ ఆయన రీట్వీట్ చేశారు. దీంతోపాటు అవినీతి రహిత భారతంకోసం అందరం భుజం భుజం కలిపి పోరాడుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
పాత నోట్లతో బిల్లులు కట్టొచ్చు
-
వారంలో డబ్బిస్తానని మాటిచ్చి కొడుకు పెళ్లి చేశా
భూపాలపల్లి: ‘‘నా కొడుకు పెళ్లికి రెండు నెలల కిత్రమే నవంబర్ 9న ముహూర్తం నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో పెళ్లి పను ల కోసం నిల్వ ఉంచిన నగదుకు విలువ లేకుండా పోయింది. వంట, షామి యానా, పురోహితుడు, బ్యాండు తదితర పెళ్లి ప నులకు అప్పటికే అడ్వా న్సులు చెల్లించాను. మిగిలిన డబ్బు చెల్లించడం కష్టంగా మారిం ది. చివరికి వారం రోజుల్లో మిగిలిన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి పెళ్లి జరిపిం చాను. వారు నా మాటను గౌరవించారు’’ - వేముల శ్రీనివాస్, భూపాలపల్లి 500 నోటు మార్పిడికి యాచకుడి పాట్లు రామన్నపేట: పెద్ద నోట్ల మా ర్పిడి ఓ యాచకుడికి తీవ్ర ఇబ్బందులు తె చ్చిపెట్టింది. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్ప త్రి జంక్షన్లో ఉండే ఓ యాచకుడు యాచన ద్వారా కూ డబెట్టుకున్న చిల్లరను రూ. 500 నోటుగా మార్చుకున్నాడు. అరుుతే రూ. వెరుు్య, రూ. 500 నోట్లు రద్దు అయినట్లు తెలియడంతో గురువారం ఉదయం తన వద్ద ఉన్న రూ. 500 నోటు మార్పిడి కోసం ఎంజీఎం వద్దనున్న ఎస్బీహెచ్ బ్రాంచ్‌కు చేరుకుని నిరీక్షించసాగాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివరామయ్య దీన్ని గమనించి తన సిబ్బంది సాయంతో ఆ నోటు మార్పిడి చేసి యాచకుడికి చిల్లరనందించాడు. ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రా మానికి చెందిన యువ సర్పంచ్ వైనాల మురళి. ఈ నెల 12 న వరంగల్ నగరం లోని ఓ పంక్షన్హాల్లో జరగనున్న తన పెళ్లి కోసం బంగారం, బట్టలు తీసుకున్నాడు. కిరాణా, కూరగా యలు చిల్లర ఖర్చుల కోసం రూ.50 వేల విలువైన పెద్దనోట్లు అట్టిపెట్టుకున్నాడు. గురువారం ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్లు తీసుకోకపోవడంతో మిత్రులు, బంధువుల సహకారంతో ఆర్థిక అవసరాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తనకు ఇబ్బంది ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని మురళి పేర్కొనడం గమనార్హం. -
860 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్ల మార్పిడికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. గురువారం బ్యాంకుల నుంచి కొత్త కరెన్సీ చేరుకోవడంతో పోస్టాఫీసుల్లో మధ్యాహ్నం నుంచి మార్పిడికి అవకాశం కల్పించారు. హైదరాబాద్ జీపీవోతో పాటు ప్రధాన పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. కొత్త కరెన్సీ అలస్యంగా రావడం, రూ.2,000 నోట్లను మాత్రమే జారీ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని సుమారు 860 పోస్టాఫీసుల్లో ఈ నెల 24 వరకు వరకు కరెన్సీ మార్పిడికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర తపాలా సేవల సంచాలకులు వెన్నం ఉపేందర్ తెలిపారు. మొత్తంమీద 35 హెడ్ పోస్టాఫీసులు, 825 సబ్ పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోస్టాఫీసుల్లో వినియోగదారులు నిర్ణీత నమూనా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వరంగ సంస్థళు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ జతచేసి, రోజుకు రూ.4 వేల వరకు పాత నోట్లు అందజేసి కొత్త కరెన్సీ డ్రా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5,832 పోస్టాఫీసుల్లో డిసెంబర్ 31 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. -
జబ్బుకు అందని డబ్బు
నిబంధనల సాకుతో వైద్యానికి డబ్బు ఇవ్వని బ్యాంకు సిబ్బంది చికిత్సకు రూ.30 వేలు అవసరమన్నా రూ.10 వేలే ఇచ్చి పంపిన వైనం సాక్షి, మెదక్: పెద్ద నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారం ఓ కిడ్నీ రోగి ప్రాణం మీదకు తెచ్చింది! బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా వైద్యం పొందలేని దయనీ య పరిస్థితి. డయాలసిస్‌కు అవసరమైనన్ని డబ్బు లు డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరా కరించడంతో ఆమె చికిత్సకు దూరమైంది. వైద్యా నికి డబ్బులు కావాలని బతిమాలుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించకపోవడంతో కన్నీళ్లతో వెనుది రిగింది. మెదక్‌లోని ఫతేనగర్‌కు చెందిన ప్రమీలకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2015లో హైద రాబాద్లోని కిమ్స్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఏడాదిన్నరగా కిమ్స్‌లో చికిత్స పొందుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు. అయితే ప్రతినెలా ఓసారి డయాలసిస్ పైప్ మార్చుకోవటంతోపాటు డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయాలి. ఈ నెల 9న ప్రమీల డయాలసిస్ కోసం కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంది. బ్యాంకుల బంద్ ఉండటంతో వెళ్లలేదు. గురువారం డబ్బులు డ్రా చేసుకుని కిమ్స్ వెళ్లాలనుకుంది. మెద క్ ఎస్బీహెచ్ బ్యాంకులోని తన ఖాతాలో రూ.35 వేల డబ్బులు ఉండటంతో రూ.30 వేలు డ్రా చేసు కుందామని భర్త ప్రేమ్‌కుమార్‌తో కలిసి స్థానిక రాంనగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంకుకు వెళ్లింది. అరుుతే బ్యాంకు సిబ్బంది కేవలం పది వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉం దన్నారు. తన ఖాతాలో రూ.35 వేలు ఉన్నాయని, వైద్యం కోసం తనకు తక్షణం రూ.30 వేలు అవస రమని బ్యాంకు సిబ్బందిని వేడుకుంది. అయినా సిబ్బంది ససేమిరా అనటంతో అకౌంట్ నుంచి రూ.10 వేలు డ్రా చేసుకుంది. మరో రెండు రోజులు ఆగితేగానీ ప్రమీల రూ.20 వేలు డ్రా చేసుకోలేని పరిస్థితి. వైద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా?: ప్రేమ్‌కుమార్ ‘‘నా భార్య ప్రమీలకు ప్రతినెలా డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయటంతోపాటు పైప్ మార్చుకోవాలి. డయాలసిస్ కిట్లకు రూ.20,070, ఇంజెక్షన్‌కు రూ.5 వేలు, రవాణా చార్జీలు మరో రూ.3 వేలు అవుతుంది. మొత్తంగా రూ.30 వేల వరకు అసవరం. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోనివ్వటంలేదు. దీంతో డయాలసిస్‌ను వారుుదా వేసుకోవాల్సి వచ్చింది’’ నా వద్దకు రాలేదు: శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్ వైద్యం కోసం డబ్బులు అవసరమని ప్రమీల తనను సంప్రదించలేదని ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు అకౌంట్లో నుంచి ఒకరోజు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయాలన్న నిబంధన ఉంది. అయితే వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి ఉంటే ఆ పత్రాలు చూపిస్తే తప్పకుండా సాయం చేసే వాళ్లమని చెప్పారు. -
జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
చాంతాడంత లైన్లు.. గంటల తరబడి నిరీక్షణ రాజధానితోపాటు రాష్ట్రమంతటా ఇదే సీన్ పలుచోట్ల తోపులాటలు.. బందోబస్తు మధ్య కార్యకలాపాలు కొన్ని బ్యాంకుల్లో తెరిచిన కొద్ది గంటల్లోనే ఖజానా ఖాళీ రూ. 2 వేల నోటు అందుకుని మురిసిపోరుయిన ప్రజలు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు పోటెత్తిన జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు సాక్షి, హైదరాబాద్: కరెన్సీ కదిలింది.. రెండ్రోజులుగా బీరువాల్లో, పర్సుల్లో, పోపుడబ్బాల్లో అచేతనంగా పడి ఉన్న పెద్ద నోటుకు ప్రాణమొచ్చింది.. బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆపపోపాలు పడుతూ వెళ్లి క్యూ కట్టింది..! తళతళలాడే కొత్త రూపాన్ని ధరించి జేబులో చేరింది!! నిన్నమొన్నటిదాకా పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డ జనం గురువారం వాటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. వారితోపాటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినవారితో ఉదయం 8 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. రాజధాని భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలో ఎక్కడచూసినా బ్యాంకుల ముందు చాంతాడంత బారులు కనిపించాయి. పోలీసు బందోబస్తు, గంటల తరబడి పడిగాపుల మధ్య... కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2 వేల నోట్లు అందుకున్న వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కొన్నిచోట్ల నగదు చాలకపోవడంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే సేవలను నిలిపివేశారుు. దీంతో జనం నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బ్యాంకు కార్యకలాపాలు సాగాయి. అటు జిరాక్స్ సెంటర్లు కూడా కిటకిటలాడాయి. నోట్ల మార్పిడికి, డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పనిసరి అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో జనం జిరాక్స్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గంటల తరబడి పడిగాపులు జనం ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని లైన్లలో నించున్నారు. ఉదయం 10.30కు బ్యాంకులు తెరుచుకున్నారుు. ఒక్కో వినియోగదారుడు ఐదారు గంటలకుపైనే లైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం బ్యాంకుకు వచ్చిన వారు మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లారు. కొత్త రూ.2,000 నోట్లు చెలామణిలోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రాలేదు. పలుచోట్ల కొత్త నోట్లను అందుకున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కకావికలమైన నగరం గురువారం కాస్త తెరిపిన పడింది. చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగదును ఖాతాల్లో జమ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం కల్పించారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం వరకే క్లోజ్... చంపాపేట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గురువారం వైద్య చికిత్సల కోసం కోఠీలోని ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ రాశారు. వెంటనే తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొనేందుకు కోఠీలోని ఎస్బీఐకి వెళ్లాడు. అప్పటికి మధ్యాహ్నం 2.30 అయింది. అప్పటికే కొత్త రూ.2000 నోట్లు, పాత వంద నోట్లు అయిపోయాయంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఆరా తీస్తే రూ.50 లక్షల వరకు తాము పై అధికారులను అడిగితే బ్యాంకుకు కేవలం రూ.10 లక్షలే అందజేశారని చెప్పారు. ఒక్క కోఠీలోనే కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విద్యానగర్, కాచిగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు మధ్యాహ్ననికే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోవైపు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది కనిపించలేదు. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఒకట్రెండు కౌంటర్లనే ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో సర్వర్ డౌన్ వల్ల కొన్ని బ్యాంకుల్లో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. పోస్టాఫీసుల్లో గందరగోళం... రాజధానిలో పలుచోట్ల పోస్టాఫీసుల్లోకి కొత్త కరెన్సీ, వంద నోట్లు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో క్యూలో నించున్న వారు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పంపిణీ మొదలైంది. తప్పని చిల్లర తిప్పలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో గురువారం కూడా జనానికి చిల్లర తిప్పలు తప్పలేదు. చిల్లర లేక పెట్రోల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కోదాడ పట్టణ సమీపంలో చిల్లర ఇవ్వలేదంటూ జగ్గయ్యపేట డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ ప్రయాణికులను కోదాడ శివారులో దింపేశాడు. ఇక సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 130 బ్యాంకుల్లో గురువారం ఒక్కరోజే రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర జమ అరుునట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాల్లో 367 బ్యాంకులకు జనం క్యూ కట్టారు. పోస్టాఫీస్‌లో డబ్బుల మార్పిడి జరగలేదు. డిపాజిట్లు మాత్రమే చేశారు. కొత్తనోటు చూడముచ్చటగా ఉంది కొత్త రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ఉదయ మే బ్యాంకుకు వెళ్లాను. భారీ క్యూలైన్లో నిలబ డి నోటు చేతికి తీసుకు న్నాను. నోటు కొత్తగా ఉంది. పాత వెయి నోటు అంత అందంగా లేకున్నా చూడముచ్చటగా ఉంది. - తుమ్మలపల్లి మహేశ్, హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంది పాత వెయి నోటు కంటే రూ.2 వేల నోటు కొంత భిన్నంగా ఉంది. మూడు గంటల పాటు లైన్లో నిలబడి పాత నోట్లను మార్పిడి చేసుకున్నాను. - బాలు, హైదరాబాద్ రెండోరోజూ స్తంభించిన మార్కెట్లు రెండోరోజు కూడా హైదరాబాద్‌లోని మార్కెట్లు కళా విహీనంగానే కనిపించారుు. అన్నిచోట్ల కార్యకలాలు స్తంభించారుు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లు వెలవెలబోయారుు. సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, మోండా మార్కెట్. కోఠి, మలక్‌పేట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లో గిరాకీ లేక వ్యాపారులు ఉసూరుమన్నారు. నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్ వంటి ప్రాంతాలు కూడా వెలవెలబోయారుు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోనూ వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. -
పాత నోట్లతో బిల్లులు కట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పాత రూ.1,000, రూ.500 నోట్లను వినియోగించుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పిం చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో చెల్లించాల్సిన ఇంటి, ఆస్తి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు, పాత బకాయిలు, ఇతర పన్నులు, ఫీజులు ఏవైనా శుక్రవారం అర్ధరాత్రి వరకు చెల్లించవచ్చని గురువారం రాత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, కార్యాలయాలు అదనపు సమయాలు పని చేస్తాయని తెలిపారు. ‘ఈ (గురువారం) ఉదయం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ప్రజల స్పందనేమిటని నన్నడిగారు. మంచి నిర్ణయమేనని, అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ప్రజలకు వెసులుబాటు కల్పించాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. రద్దయిన నోట్లతో బిల్లులు కట్టొచ్చంటూ గెజిట్ విడుదల చేశారు’ అని వివరించారు. ‘రాష్ట్రంలోని మున్సిపల్, పంచయతీ అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో శుక్రవారం అన్ని కార్యక్రమాలనూ సస్పెండ్ చేశాం. మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటారుు. చెల్లింపులకు రసీదు ఇస్తాం. ఈ పన్నుల రూ పేణా ప్రజలు చెల్లించే మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు’ అని స్పష్టం చేశారు. వాట్సాప్‌లో వెల్లువెత్తుతున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. -
నోట్ల రద్దుపై పిటిషన్లు
న్యూఢిల్లీ: పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుతో సహా దేశంలోని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈనెల 15న ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉందని సుప్రీం తెలి పింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై ఏవైనా ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదన వినాలంటూ సుప్రీం కోర్టులో గురువారం కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. ద్రవ్య విధానాలపై ప్రభుత్వ చర్యల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. -
చెత్తకుండీలో వెయ్యి నోట్ల కలకలం!
పుణె: కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటి నుంచీ నల్లధనం ఏదో రూపంలో బయటకు వస్తుంది. అయితే మహారాష్ట్రలోని పుణెలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వెయ్యి రూపాయల నోట్లు చెత్తకుండీలో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రూ. 52,000 విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లను పారిశుధ్య కార్మికురాలు గుర్తించింది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి డబ్బులు ఇక్కడ పడవేశారని ఓ అధికారికి చెప్పగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. శాంతా ఓవహల్ అనే మహిళా పారిశుధ్య కార్మికురాలు గురువారం ఉదయం లా కాలేజీ రోడ్డులో విధులు నిర్వహిస్తుండగా డబ్బు దొరికింది. ఈ విషయాన్ని తనపై అధికారితో కలసి దక్కన్ జింఖానా స్టేషన్ పోలీసులకు తెలిపారు. వారు వచ్చి నోట్లను పరిశీలించి.. ప్రభుత్వం రద్దు చేసిన వెయ్యి రూపాయల నోట్లేనని నిర్ధారించారు. అవినీతి రహిత భారత్ ను చేయడంతో భాగంగా ప్రధాని మోదీ రెండు రోజుల కిందట రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. నల్లధనం ఏం చేయాలో, వాటిని వాడుకలోకి తెచ్చుకోవాలో అర్థంకాక నల్ల కుబేరులతో పాటు సామాన్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పెళ్లింట పరేషానీ
-
కరెన్సీ.. ఎమర్జెన్సీ..!
-
కరెన్సీ.. ఎమర్జెన్సీ..!
► బ్యాంకుల మూత.. పనిచేయని ఏటీఎంలు, ఆన్లైన్ డిపాజిట్ల కోసం భారీ క్యూలు ► ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్‌డౌన్.. స్తంభించిన వ్యాపార లావాదేవీలు.. చెల్లింపులు ► బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో టిక్కెట్ల కోసం జనం బారులు ► అంతా పెద్ద నోట్లతోనే క్యూ.. చిల్లర సమస్యలతో జనం ఇబ్బందులు ► పెట్రోల్ బంకుల వద్దా అదే పరిస్థితి.. ఆసుపత్రులు, మాల్స్‌లో పెద్ద నోట్ల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో మహానగరం ఒక్కసారిగా కకావికలమైంది. ఒకవైపు పనిచేయని బ్యాంకులు, ఏటీఎంలు. మరోవైపు సర్వత్రా రూ.500, రూ.1,000 నోట్ల తిరస్కరణ. దీంతో పెద్ద నోట్లు బుధవారం నగర వాసులకు కష్టాలు తెచ్చి పెట్టాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, మార్కెట్ ఇలా ఎక్కడికెళ్లినా.. బస్సెక్కినా, రైలు టికెట్ కోసం వెళ్లినా అంతటా రూ.500, రూ.1,000 నోట్లకు చుక్కెదురే అయింది. పెట్రోలు బంకుల్లో, ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పాలబూత్‌లలో పెద్ద నోట్టు చెల్లుబాటు అయినా చిల్లర లేకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో నగరమంతటా వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. ఇక కేంద్రం ప్రకటించిన మేరకు బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంల సేవలు నిలిచిపోయాయి. ఇక ఆన్లైన్ లో చెల్లింపుల కోసం కూడా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆన్లైన్ చెల్లింపులు జరగడంతో సర్వర్లు డౌనై సేవలు నిలిచిపోరుు జనం గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు నగదు చెల్లింపులను నిలిపివేశాయి. ఆసుపత్రుల్లో రోగుల ఇబ్బందులు.. నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చలామణి అయినప్పటికీ చిల్లర సమస్య రోగులు, వారి బంధువులను ఇబ్బందులకు గురి చేసింది. ఇన్పేషెంట్లుగా చేరేవారి నుంచి పెద్ద నోట్లు తీసుకున్నా.. బయటి రోగులకు మాత్రం వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం, వైద్యుల ఫీజుల కోసం, మందుల కొనుగోళ్ల కోసం ఇక్కట్లు తప్పలేదు. ఇక గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర ఆసుపత్రుల్లో అయితే రోగులు నరకం చవిచూశారు. మార్కెట్లు, మాల్స్ వెల వెల.. నగరంలోని బిగ్‌బజార్, మోర్, స్పెన్సర్, హెరిటేజ్, డీమార్ట్, రిలయన్స, మొబైల్ షోరూమ్‌లు, సినిమాహాళ్లు వెలవెలబోయాయి. రూ.500 ,రూ.1,000 నోట్లతో వెళ్లి వస్తువులు కొనుగోలు చేసిన వాళ్లు చివరి క్షణంలో బిల్లు చెల్లించే సమయంలో నిరాకరించడంతో ఘర్షణకు దిగారు. బార్లు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు సైతం గిరాకీ తగ్గింది. కొన్ని చోట్ల వైన్‌షాపులు, బార్ల వద్ద వినియోగదారులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇక ప్రజలు కూరగాయల మార్కెట్లకు వెళ్లకపోవడంతో అవి వెలవెలబోయాయి. రూ.500 నోట్లను తీసుకునేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించడంతో వచ్చిన కొద్దిమంది కాస్తా కూరగాయలు తీసుకోకుండానే తిరిగి వెళ్లిన పరిస్థితి కనిపించింది. మార్కెట్లకు వెళితే చిల్లర తంటాలు ఎదురవడంతో సిటీవాసులు తమకు సమీపంలోని కిరాణా దుకాణాలకు దారి పట్టారు. దీంతో గల్లీలోని కిరాణాషాప్ల్లో వ్యాపారం ఊపందుకుంది. హోటళ్లలోనూ ‘నోట్ల’ తిప్పలు.. సిటీలోని చాలా హోటళ్లలోనూ నోట్ల తిప్పలు, చిల్లర తంటాలు కనిపించాయి. టిఫిన్స, భోజనం చేద్దామని వెళ్లిన వారు పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. టిఫిన్ చేసిన కొంత మంది తమ వద్ద చిల్లర లేదని చెప్పడంతో కొన్నిచోట్ల గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. నోట్ల రద్దు వల్ల చాలా హోటళ్లలో వ్యాపారం బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. కౌంటర్లు కిట కిట.. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో, టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్ కార్యాలయాల్లో రూ.500, రూ.1,000 నోట్లతో ఇబ్బంది లేకపోయినా చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు కౌంటర్లలో చేతులెత్తేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రూ.350 టిక్కెట్ కోసం రూ.500 నోటు ఇచ్చిన వారికి తిరిగి రూ.150 చెల్లిం చడం పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది రిజర్వేషన్లు చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇదే సమస్య ఎదురైంది. చిల్లర లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది చేతులెత్త్తేశారు. డబ్బులు బదులు టికెట్ డిపాజిట్ స్లిప్‌లు రైల్వే టికెట్ కొన్నప్పుడు చిల్లర ఇవ్వాల్సి వస్తే నగదు బదులు డిపాజిట్ రశీదులు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటిని తర్వాత నగదుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యం లో పరిస్థితిని సమీక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త ఈ నిర్ణయం తీసుకున్నారు. కిక్కిరిసిన పెట్రోల్ బంకులు గ్రేటర్లో పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసి పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు తమ వాహనాల్లో ఒక లీటర్, రెండు లీటర్లు కాదు.. ట్యాంకులు నింపుకోక తప్పలేదు. ఫలితంగా బుధవారం సగటు కంటే 30 నుంచి 40 శాతం వరకు అదనంగా పెట్రో, డీజిల్ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు వాహనదారులు అష్ట కష్టాలు పడ్డారు. బంకుల నిర్వాహకులు తమ వద్ద చిల్లర లేదంటూ.. రూ.500.. రూ.వెయికి తక్కువ పెట్రోల్ పోయమని తేల్చి చెప్పారు. ప్రతి వాహనదారులు రూ.500.. రూ.వెరుు్యకి పెట్రోల్.. డీజిల్ పోరుుంచుకున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ఆరుుల్ కంపెనీల నుంచి ముందస్తు ట్యాంకర్లను తెప్పించుకుంటుండటంతో ఎలాంటి కొరత ఏర్పడ లేదు. నోట్ల మార్పిడి.. ఓ నయా దందా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వంద నోట్ల కోసం నానా అవస్థలు పడ్డారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో తమ జేబులో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు రూ.1,000 నోట్లకు రూ.800..రూ.700, రూ.500కు రూ..400.. రూ.300 చిల్లర ఇచ్చి దోచేసుకున్నారు. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, పెట్రోల్ బంకులు, మార్కెట్లు.. మొదలైన చోట్ల ఈ వ్యాపారం జోరుగా సాగింది. రాష్ట్రంలో కోట్ల రూపాయల్లో ఈ వ్యాపారం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
11న అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటు
ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: ప్రధాన ఆయిల్ కంపెనీలైన బీపీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ పెట్రోల్ బంకులు, సీఎన్జీ స్టేషన్లలో ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి పెట్రోల్, డీజల్ కొనుగోలు చేయవచ్చని ప్రధాన ఆయిల్ కంపెనీల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త, చీఫ్ రీజినల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన ఆయిల్ కంపెనీల గ్యాస్ వినియోగదారులు ఈనెల 11వ తేది అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చి ఎల్పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన మేరకు కొనుగోలు చేసి సహకరించాలని కోరారు. -
పెళ్లింట పరేషానీ
చేతిలో చిన్ననోట్లు లేవు.. పెద్దనోట్లు చెల్లవు పెళ్లి సామాన్లు కొనలేక జనం నానా అవస్థలు ఈ నెల 24 వరకు మంచి ముహూర్తాలు తెలుగు రాష్ట్రాల్లో 10 వేల పెళ్లిళ్లు సాక్షి, హైదరాబాద్ : రాజయ్య... ఈయనది గద్వాల సమీపంలోని ఓ కుగ్రామం..ఈ నెల 11న కూతురి పెళ్లి.. ఇందుకు తెలిసినవారివద్ద అప్పు చేసి డబ్బు సమకూర్చుకున్నాడు రాజయ్య.. గురువారం బంగారం కొనేందుకు కర్నూలు వెళ్లాడు.. అక్కడ డబ్బు చెల్లించే సమయంలో పెద్ద నోట్లు తీసుకోబోమని నగల షాపు యజ మాని చెప్పటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు! బ్యాం కులో చిల్లిగవ్వ లేనందున ఆన్లైన్ చెల్లింపు వెసులుబాటూ లేదు. దీంతో బంగారం కొనకుండానే వెనుదిరిగాడు! బంగా రం లేకుండా పెళ్లి ఎలా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది! మెహిదీపట్నంలో నివసించే సుధీర్ కుటుంబంలో ఈ నెల 10న పెళ్లి. వంటకు కూరగాయలు లేవు. చేతిలో చిన్న నోట్లు లేవు. ఉన్న పెద్ద నోట్లు చెల్లవు. ఎంత గాలించినా వంద నోట్లు చిక్కలేదు. ఇప్పుడేం చేయాలా? అని ఆ కుటుంబం తల పట్టుకుంది!! ...ఇవి ఒక్కరిద్దరి సమస్యలు కాదు.. రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో ఇప్పుడు ఇలాంటి చిక్కులే వచ్చిపడ్డాయి. పెద్ద నోట్ల రద్దు పెళ్లిళ్లకు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. కార్తీకమాసం మంచి ముహూర్తాలుండటంతో తెలంగాణ, ఏపీలో విసృ్తతంగా పెళ్లిళ్లు జరగబోతున్నారుు. ముహూర్తాలు దగ్గరపడటంతో అంతా షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆహ్వాన పత్రికలు ఇస్తూనే బంగా రం, వస్త్రాలు, ఇతర సామగ్రి కొనే పనిలో పడిపోయారు. కానీ వారికి ఊహించని ఉపద్రవం ఎదురైంది. బంగారం మొదలు కూ రగాయల వరకు ఎక్కడా ఏదీ కొనలేని పరిస్థితి. చేతిలో కావల్సినంత డబ్బు ఉన్నా వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొనడంతో పెళ్లింట అయోమయం నెలకొంది. కొందరు ఆ డబ్బును బ్యాం కులో డిపాజిట్ చేయొచ్చులే అనుకుని ప్లాస్టిక్ కరెన్సీతో పని కాని చ్చేందుకు సిద్ధపడ్డారు. వీరికి పెద్దగా ఇబ్బంది లేకున్నా... అప్పుసొప్పు చేసి చేతిలో డబ్బు ఉంచుకున్న పేదల పరిస్థితే గందరగోళంగా మారింది. బ్యాంకు నిల్వ లేకపోవటంతో కార్డుల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయలేక తలలు పట్టుకున్నారు. దాదాపు 10 వేల పెళ్లిళ్లు..: ఇటీవలే ఆషాఢం, మూఢాలు... ముహూర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా పడ్డ ఇళ్లల్లో కార్తీకమాస వేళ బాజాలు మోగుతున్నాయి. 10, 11, 12, 13, 16, 17, 23, 24 ఇలా వరసగా మంచి ముహూర్తాలుండటంతో మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. కృష్ణా పుష్కరాల వేళ శుభకార్యాలు వద్దనుకున్నవారు కూడా ఇప్పుడు వివాహాలకు సిద్ధమయ్యారు. ఇలా తెలంగాణ, ఏపీలో 10 వేల పెళ్లిళ్లున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లిళ్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా షాపింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతినిండా డబ్బున్నవారు చిన్న నోట్లు అందుబాటులో లేకున్నా ఆన్‌లైన్‌తో పనికానిచ్చేస్తున్నా.. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నాయి. పోనీ చేతిలో సొమ్మును బ్యాంకులో వేసి తర్వాత తీసుకుందామంటే... రోజుకు రూ.పది వేలు, వారానికి గరిష్టంగా రూ. 20 వేలకు మించి విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవటంతో అయోమయంలో పడిపోయారు. ఉన్న డబ్బు ఖర్చు చేయలేక, చేబదులుగా చిన్న నోట్లు తెచ్చుకోలేక, ఆన్లైన్ చెల్లింపులు జరిపే వెసులుబాటు లేక విలవిల్లాడుతున్నారు. ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, బ్యాండ్‌మేళాలు.. ఇలా అన్నింటికీ స్పాట్ పేమెంట్ ఇవ్వాలి. పెద్దనోట్లు వారు తీసుకోరు. దాంతో పెళ్లింట పెద్ద చిక్కే వచ్చిపడింది. ‘పెళ్లి’ల్లో పెద్దనోట్ల కష్టాలకు బంగారం కూడా తోడైంది. బుధవారం ఒక్కసారిగా 10 గ్రాముల బంగారానికి రూ.4 వేల మేర పెరగడంతో పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు తలలు పట్టుకున్నాయి. -
'నోట్' దిస్ పాయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనాథ్.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికెళ్లే సరికి.. తన కొడుక్కి సడన్‌గా జ్వరమొచ్చిందని భార్య చెప్పింది. సరే తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్దాంలే అనుకున్నాడు. కానీ అప్పుడే గుర్తొచ్చింది.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏటీఎంలో ఉన్నా అవేమో పనిచేయట్లేదే అని!! సర్లే తెల్లారాక చూద్దాంలే అని పడుకున్నాడు. తెల్లారాక అసలు విషయం భార్యతో చెప్పాడు. పర్లేదు నా దగ్గర రూ.1,000 నోటుంది అంది భార్య. ఇదీ సమస్యే. ముందైతే ఆసుపత్రికెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తే ఇబ్బందనుకున్నారు. ఆటోలో వెళ్దామని రోడ్డెక్కారు. ఆటో వచ్చింది కానీ, ‘‘సర్ మీ దగ్గర రూ.100 నోటుంటేనే ఎక్కండి. పెద్ద నోట్లయితే వద్దు. ఇప్పటికే ఇద్దరు ప్యాసింజర్లను వదిలేశాను’’ అన్నాడు ఆటో డ్రైవర్. చేసేదేం లేక ఇంటికెళ్లి బైక్ తీసుకొని బయల్దేరారు. తీరా ఆసుపత్రికెళ్లాక.. ‘‘దయచేసి చిల్లర ఇవ్వండి.. పెద్ద నోట్లు తీసుకోబడవు’’ అని బోర్డు చూసి కంగుతిన్నారు. ముందు డాక్టర్ని చూడనిద్దాం. ఫీజు సంగతి తర్వాత చూద్దాంలే అని అనుకుని డాక్టర్ వద్దకెళ్లారు. తీరా పూర్తయ్యాక.. కన్సల్టేషన్ ఫీజు కోసం చేతిలో ఉన్న రూ.1,000 నోటిస్తే.. బోర్డు చూడలేదా? అంటూ నోటు తీసుకోనన్నాడు డాక్టర్. నా దగ్గర ఈ నోటు తప్ప వేరే లేదు. కార్డుంది కావాలంటే స్వైప్ చేయడన్నాడు శ్రీనాథ్. కానీ, డాక్డర్ వద్ద స్వైప్ మిషన్ లేదు. ముందెళ్లి మందులు తీసుకో.. ఆ తర్వాత వచ్చి ఫీజు ఇవ్వమన్నాడు డాక్టరు. సరే అని మందుల షాపుకెళ్తే పెద్ద నోటు మార్చడానికి రూ.100 అదనంగా చార్జీ చేశాడు షాపతను. చేసేదేంలేక చేతి చమురు వదిలించుకొని బైక్ వద్దకెళితే బండిలో పెట్రోల్ నిండుకుంది. దగ్గర్లోని బంకుకెళితే.. చాంతాడంత క్యూ. సరే అని తన వంతొచ్చేదాకా వెరుుట్ చేస్తే.. ఫుల్ ట్యాంక్ తప్ప చిల్లరకు పెట్రోల్ పోయలేమన్నారు. ఇక్కడా చేసేదేం లేక జేబు గుల్ల చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. రూ.1,000తో ఇంట్లోంచే బయటికెళితే.. డాక్టర్ ఫీజు, మందులు, పెట్రోల్, ఎక్స్ట్రా చార్జీలు పోగా.. రూ.100తో ఇంటికి చేరాడు. .. ఇది జరిగిన ఘటన. సామాన్యుడి యాతనకు నిదర్శనం. నిత్యావసరాలన్నిటికీ పాత నోట్లు చెల్లుతాయని చెబుతున్నారు. నిజమా? ఈ నెల 11వ తేదీ వరకూ పాత రూ.500, రూ.1,000 నోట్లు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో చెల్లుతాయని ప్రభుత్వం చెబుతోంది. పైన చెప్పిన వాటిల్లో సామన్యుడికి రోజువారీ అవసరమైంది పెట్రోల్ బంకే. మరి ప్రభుత్వం లేదా చమురు సంస్థలు నేరుగా నడుపుతున్న పెట్రోల్ బంకులు దేశంలో ఎన్నున్నాయి? వాటికి ఎందరు వెళ్లగలరు? ఎంతమందికని వారు చిల్లర ఇవ్వగలరు? నిజానికి పెద్ద నోట్లు రద్దయిన రాత్రి నుంచే పెట్రోల్ బంకుల్లో జనాలు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకులు ఇదే అదనుగా పెట్రోల్ రేట్లను కృత్రిమంగా పెంచేశాయి. ఇంకొన్ని తమ వద్ద చిల్లర లేదంటూ కస్టమర్లను తిరిగి పంపేశాయి. ఇంకొన్ని ఫుల్ ట్యాంక్ అరుుతేనే కొడతామని చెప్పాయి. అవసరం నిమిత్తం కొందరు వాహనదారులు కావాల్సినంత పెట్రోల్ పోయించుకొని రూ.500 నోటు ఇచ్చి చిల్లర లేదనటంతో ఏం చేయలేక వదిలేసి వెళ్లిపోయిన వారూ ఉన్నారు. ఈ రకంగానూ సామాన్యుడి జేబుకే చిల్లు పడింది. టోల్‌ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి. తగినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అన్ని వర్గాలకూ అష్టకష్టాలు.. శుభకార్యం కోసమని ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే ఏం చేయాలి? కొత్త నోట్లెలా వస్తారుు? చేతిలోని పెద్ద నోట్లను బ్యాంకుల్లో వేసి, కొత్త నోట్లు తీసుకోవటం పెద్ద కసరత్తే. మరి ఇంట్లో శుభకార్యం కోసమని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసో, స్నేహితుల నుంచి అప్పోసప్పో చేసి ఇంట్లో పెట్టుకున్నవారి పరిస్థితేంటి? చాలామంది పెళ్లిళ్లలకు, శుభకార్యాలకు సరైన రోజులు కావటంతో అడ్వాన్సలు, ఖర్చుల కోసమని భారీగా నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అడ్వాన్స ఇవ్వటానికి వెళితే పెద్ద నోట్లు తీసుకోలేమని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. విహారయాత్రలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వారు చేతిలో ఉన్న పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊరు కాని ఊళ్లో పరిచయస్తులు కూడా లేని ప్రాంతాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు, తినడానికి తిండీ లేక నరకయాతన అనుభవించారు. బ్యాంకు ఖాతాల్లో అయితే ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఖాతాలు లేనివారికి, నగదు అవసరమైన వారికి రోజుకు రూ.4 వేలు మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ అవసరమైనవారి సంగతేంటి? నోట్ల మార్పునకు ఈ నెల 24 వరకు పరిమితిని రూ.4 వేలుగా విధించారు. కానీ దేశంలో రోజుకు రూ.4 వేలకన్నా ఎక్కువ ఖర్చుచేసేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల తొలి రోజే దేశంలో 70 శాతం వ్యాపారం పడిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారుు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో, వ్యాపారాలతో కిటకిటలాడే హైదరాబాద్‌లో రోడ్లు సైతం ఖాళీగా కనిపించారుు. చాలా మంది చేతిలో ఉన్న సొమ్ముతో నిత్యావసర కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో రెస్టారెంట్లు, బార్ షాపులు, వైన్‌షాపులు, సినిమా థియేటర్లు వెలవెలబోయారుు. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగం, ఆన్లైన్ చెల్లింపుల వంటి ఎలక్ట్రానిక్స్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం, పరిమితి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో వీటిద్వారా జరుగుతున్న జరుగుతున్న లావాదేవీలు 52 శాతమే. అది కూడా అధికారికంగా నమోదైనవి మాత్రమే. గురువారం (ఈ నెల 10) నుంచి డిసెంబర్ 30 వరకు మన చేతిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ఈ సొమ్మునంతా ఒకేసారి క్యాష్ రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చా? సమాధానం: కుదరదు. ఒక వ్యక్తికి రోజుకు రూ.4 వేలు మాత్రమే నగదు రూపంలో తీసుకునే వీలుంది. మిగిలిన సొమ్మును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నా వ్యక్తిగత అవసరాలకు రూ.4,000 సొమ్ము సరిపోదు. మరిప్పుడేం చేయాలి నేను? డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్స్, చెక్, డీడీ రూపంలోనూ వినియోగించుకునే వీలుంది. రూ.4,000లకు పైన సొమ్ము కావాలంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మరి నాకు ఖాతా లేకుంటే? భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఏదైనా బ్యాంకుకు వెళ్లండి. కేవైసీ నిబంధనలను పూర్తి చేసి.. బ్యాంకు ఖాతాను తెరవండి. ఆపైన చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకవేళ నాకు కేవలం జన్‌ధన్ ఖాతా మాత్రమే ఉంటే? జన్‌ధన్ ఖాతా నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఆయా ఖాతాలో నగదును వేసుకునే వీలుంది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎక్కడికి వెళ్లాలి? రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకులు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు అకౌంట్ ఉన్న బ్యాంకుకు కాకుండా ఇతర బ్యాంకుకు వెళ్లవచ్చా? తప్పుకుండా వెళ్లవచ్చు. కానీ, సరైన గుర్తింపు కార్డు, మీ బ్యాంక్ ఖాతా వివరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా బ్యాంక్ ఖాతా లేదు. కానీ, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అకౌంట్ ఉంది. మరి నా వద్ద ఉన్న సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయవచ్చా? చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఖాతాలో పాత పెద్ద నోట్లను జమ చేసుకునే వీలుంది. కానీ, మీరు లిఖితపూర్వకంగా రాసిన అనుమతి పత్రాన్ని సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది. నోట్ల మార్పు, నగదు ఉపసంహరణకు వ్యక్తిగతంగా వెళాల్సిందేనా? లేక రిప్రజెంటివ్ను పంపిస్తే సరిపోతుందా? సాధ్యమైనంత వరకూ వ్యక్తిగతంగా వెళ్లటమే ఉత్తమం. వెళ్లలేని పక్షంలో మీ రిప్రజెంటివ్ను పంపించొచ్చు. కానీ, ఖాతాదారుని వివరాలు, గుర్తింపు కార్డుతో పాటూ రిప్రజెంటివ్ గుర్తింపు కార్డు, వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా క్యాష్‌ను డిపాజిట్ చేయవచ్చా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పాత రూ.1,000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఉంది? డిసెంబర్ 30 లోగా పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి మార్చుకోవచ్చు. ఒకవేళ ఆ తేదీలోగా మార్చుకోలేని పక్షంలో... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 2017 మార్చి 31వరకూ మార్చుకోవచ్చు. ప్రస్తుతం నేను ఇండియాలో లేను. మరి నేనేం చేయాలి? మీ వద్ద ఇండియన్ కరెన్సీకి ఉండి.. అది కూడా పెద్ద నోట్లు ఉంటే.. వాటిని తీసుకొని ఏదైనా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును ఇచ్చి! లేదా మీకు తెలిసిన వారి బ్యాంక్ ఖాతాలోనూ ఆన్లైన్ ద్వారా మీరే జమ చేయవచ్చు. ఏ గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసైన్‌స, పాస్‌పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డు, లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్దు లేదా పబ్లిక్ సెక్టార్ తమ ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డునూ సమర్పించవచ్చు. నేను ప్రవాస భారతీయుడిని. నాకు దేశంలో ఎన్నారై ఖాతా ఉంది? నా వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎన్నారై ఖాతాలో జమ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, మీ ఎన్నారై ఖాతా అకౌంట్లోనే జమ చేసుకోవాల్సి ఉంటుంది. నేను విదేశీ పర్యాటకుడిని. నా వద్ద రూ.1,000, రూ.500 నోట్లు ఉన్నారుు. మరిప్పుడు నేనేం చేయాలి? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, ఫారెన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లలో రూ.5 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రి, మందులు, ట్రావెల్ వంటి అత్యవసరాల సేవల నిమిత్తం నగదు అవసరం మరి నేనిప్పుడు ఏం చేయాలి? ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో మీ చేతిలో ఉన్న పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయి. రైల్వే కౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గరున్న పెద్ద నోట్లను అప్పగించండని చెప్పి.. తీరా నా సొమ్మును ఒకేసారి తీసుకునే వీలులేకపోవటమేంటి? నల్లధన ప్రవాహానికి ప్రధాన కారణం నగదు చెల్లింపులే. అందుకే నగదు చెల్లింపులను పూర్తిగా రూపుమాపాలనే ధ్యేయంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా అని మీ దగ్గరున్న సొమ్ము మొత్తాన్ని తీసుకొని ఒకేసారి కొత్త నోట్లను మీకిస్తే.. మిగిలిన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. పెపైచ్చు ప్రజలందరికీ సరిపడేంత కొత్త నోట్లను ముద్రించలేదు. అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు మాత్రమే వెళ్లాలా? నోట్ల మార్పునకు అది కూడా రూ.4 వేల వరకై తే ఏ బ్యాంకుకు వెళ్లినా పర్వాలేదు. కానీ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీకు రూ.4 వేలకు మించి అది కూడా మీ ఖాతాలో జమ చేస్తే చాలనుకుంటే మాత్రం.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు గానీ లేదా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు గానీ వెళ్లవచ్చు. చెక్ రూపంలో బ్యాంక్‌లో నగదును డ్రా చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, చెక్ రూపంలో రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారానికి రూ.20 వేలు మించి డ్రా చేయటానికి వీల్లేదు. (ఇందులో ఏటీఎం నుంచి డ్రా చేసిన సొమ్ము కూడా కలుస్తుంది) ఈ నిబంధన ఈనెల 24 వరకూ ఉంటుంది. ఆ తర్వాత పరిమితిని పెంచే అవకాశముంది.) ఏటీఎం నుంచి నగదును డ్రా చేసుకోవచ్చా? ప్రస్తుతమైతే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు కాబట్టి డ్రా చేయలేరు. ఏటీఎంలు పనిచేయటం మొదలెట్టాక.. డ్రా చేసుకునే వీలుంది. కానీ, రోజులో ఒక్కో కార్డుపై రూ.2,000లకు మించి డ్రా చేయటానికి వీల్లేదు. ఈనెల 18వ తేదీ వరకూ ఈ నిబంధన ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒక్కో కార్డుపై రూ.4,000 వరకూ నగదును తీసుకోవచ్చు. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితర హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్ ఈ వారంలోనే విచారణకొస్తుంది. హైకోర్టులోనూ వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించే విధంగా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడి జీవితం స్తంభించిందని, నిత్యావసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ జారీచేసేందుకు అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26(2)ను రద్దు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారించాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య అభ్యర్థించినా ధర్మాసనం నిరాకరిస్తూ గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల నిబంధనలు, వివరాల మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్బీఐ.ఓఆర్జీ.ఇన్ లేదా 022 22602201/022 22602944 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ!
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500, రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వీటిస్థానంలో రూ. 500, రూ. రెండువేల నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రూ. రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉంటుందని, ఈ నోట్లు ఎవరు పెద్దమొత్తంలో దాచినా.. అవి ఎక్కడ ఉన్నాయో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అవలీలగా కనుక్కోగలదని పెద్ద ఎత్తున వదంతులు ఫేస్బుక్, వాట్సాప్‌లో షికార్లు చేశాయి. ఈ నోట్లలో ఉండే నానో జీపీఎస్ చిప్‌లు శక్తిమంతమైనవనీ, భూమిలో 120 మీటర్ల లోతులో ఈ నోట్లను పాతిపెట్టినా.. వీటిని రాడర్ నిఘా నుంచి తప్పించలేరని, నానో చిప్ ఆధారంగా వచ్చే సిగ్నళ్లతో వీటిని ఐటీ అధికారులు ట్రాక్ చేసే వీలు ఉంటుందని వదంతులు భారీగా వచ్చాయి. అయితే, ఈ వదంతులన్నీ ఉత్తవేనని తాజాగా భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తేల్చింది. రూ. 2000 నోటుకు సంబంధించిన ఆర్బీఐ ఇచ్చిన వివరణలో ఎక్కడా కూడా నానో చిప్ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంతేకాకుండా నోటులో చిప్ ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. రూ. 2వేల నోట్లలో అలాంటివేమీ ఉండవని స్పష్టం చేసింది. -
బ్లాక్‌మనీ పెద్దలకు భారీ షాక్!
పన్ను పరిధిలోకి రాని నగదుకు 200శాతం పెనాల్టీ! న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం కలిగి ఉన్నవారికి షాక్ తప్పదని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. ఆదాయపన్నుశాఖ (ఐటీ)కు వెల్లడించిన నగదు కన్నా ఎక్కువమొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి జరిమానా చెల్లించక తప్పదని తేల్చింది. అధికంగా ఉన్న మొత్తం నగదుకు చెల్లించాల్సిన పన్నుమొత్తంపై 200శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హంసముఖ్ అధియా స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి వచ్చే నెల 30వ తేదీవరకు బ్యాంకుల్లో రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువమొత్తం డిపాజిట్ అయ్యే నగదు వివరాలన్నిటినీ తెప్పించుకుని ప్రతి ఖాతాలోని వివరాలు విశ్లేషిస్తామని, డిపాజిటర్లు పెట్టిన నగదు మొత్తాన్ని, వారు చెల్లించిన ఆదాయపన్నులను బేరిజు వేసి.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. Penalty of 200% of the tax payable would be levied if cash deposited in bank accounts doesn't match with income declared: Revenue Secy — ANI (@ANI_news) 9 November 2016 చిన్నవ్యాపారులకు, కార్మికులకు ఊరట పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్న వ్యాపారులు, కార్మికులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హంసముఖ్ అధియా భరోసా ఇచ్చారు. చిన్న వ్యాపారులు, కార్మికులు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చునని, ఈ నగదు మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి రాదు కాబట్టి, వారు ఎలాంటి చింత పడాల్సిన అవసరం లేదని చెప్పారు. -
నోట్ దిస్ పాయింట్!
-
‘ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు’
న్యూఢిల్లీ: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, 2014 నుంచి తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇది ఒకటని కేంద్ర సమాచార, ప్రసార, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది. విప్లవాత్మకమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం కోసం, నల్ల ధనాన్ని అరికట్టడం కోసం, అవినీతికి కళ్లెం వేయడం కోసం తీసుకున్న ఈ చర్యకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అన్ని వర్గాలు ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని అభినందిస్తున్నారు. ఇదేదో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆర్థిక వ్యవస్థను సంస్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నల్లధనం వెలికితీసే ప్రయత్నం మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ప్రారంభమైంది. ఆ తరువాత కఠిన చట్టాలు తెచ్చింది. నల్లధనాన్ని పన్ను చెల్లించి మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఆ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరుగు దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవారి ఆటలు కట్టించే ప్రయత్నమే కాకుండా నిజాయతీగా పన్ను కట్టేవారికి వెన్నుదన్నుగా నిలిపే చర్య ఇది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆ సంపద ప్రజలకు చేరుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలి. నాయకత్వానికి దూరదృష్టి ఉండాలి. ఈ చర్య సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. స్థిరాస్తి రంగంలో భూముల ధరలు తగ్గుతాయి. ధరల స్థిరీకరణ జరుగుతుంది. ద్రవ్యోల్భణం తగ్గుతుంది. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఉపయోగకరమైన పరిణామం. ఆర్థిక పరిపుష్టితోపాటు సాంఘిక భద్రతను ఈ ప్రభుత్వం ప్రజలకు తెచ్చిపెడుతోంది. కేవలం ఏదో ఒకటి అనాలి కాబట్టి రాజకీయ నేతలు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలు ఈ చర్యను ఆదరించారు. ఎక్కడైనా చిన్నచిన్న కష్టాలు ఉంటే సంబంధిత యంత్రాంగం వాటిని పరిష్కరిస్తుంది. ఈ ధన ప్రవాహం రాజకీయ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికారణంగా ప్రజల అభిప్రాయం సరిగ్గా వ్యక్తంకావడం లేదు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గుతుంది..’ అని పేర్కొన్నారు. -
‘బిచ్చగాడు’ సినిమాను మోదీ చూశారా?
న్యూఢిల్లీ: దేశంలో 500, 1000 రూపాయల నోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దుచేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం డబ్బింగ్ ‘బిచ్చగాడు’ చూసి స్ఫూర్తి పొందిందా? ఆ చిత్రంలోని బిచ్చగాడు పాత్ర రేడియో స్టేషన్ జాకీతో మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే 500, 1000 రూపాయల నోట్లను నిషేధించాలని సూచించడం, దేశాన్ని నల్లడబ్బు ఎలా దోచుకుంటుందో వివరించడం మరోసారి చూస్తే మనకు ఈ అనుమానం రాక తప్పదు. విజయ్ ఆంటోనీ హీరోగా ఇటీవల తెలుగులో విడుదలై హిట్ ట్రాక్‌తో పాటు భారీ వసూళ్లును సొంతం చేసుకున్న తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’లోని డైలాగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బిచ్చగాడు ఒక్క చిత్రంలోనే కాదు నల్లడబ్బు గురించి వెయ్యిరూపాయల నోటు మంచి, చెడుల గురించి పలు బాలీవుడ్‌తోపాటు పలు దక్షిణాది చిత్రాల్లో కూడా ప్రస్థావన ఉంది. ‘ఎక్ హజారచి నోట్’ అని మరాఠీ చిత్రంలోనైతే సినిమా అంతా ఆ నోటు చుట్టే తిరుగుతుంది. ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఓ వెయ్యి రూపాయల నోటును తీసుకున్నందుకు ఓ గ్రామీణ పేద మహిళ ఆ చిత్రంలో తీవ్రంగా కుమిలి పోతుంది. ‘నోట్ హజారోంకా, ఆయి చిక్నీ చమేలి, చుట్టా కరానా హాయి’ అంటూ కత్రినా కైఫ్ ఓ బాలివుడ్ చిత్రం పాటకు ఆటను జోడించడం ప్రస్తుతం పరిస్థితిని సూచిస్తోంది. కాలా బజార్ చిత్రంలోని పైసా బోల్తాహై...పాట, దే దనాదన్ చిత్రంలోని పైసా,పైసా అన్న పాట, బ్లాక్‌మనీ మ్యూజిక్ వీడియో.....వీటిలో ఏవైనా మోదీ ప్రభుత్వానికి స్ఫూర్తినివ్వవచ్చు. బిచ్చగాడు చిత్రంలోని బ్లాక్‌మనీ సన్నివేశానికి సంబంధించిన క్లిప్పింగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చెక్కర్లు కొడుతోంది. చిల్లర సమస్యలు మాత్రం 1980 నాటి ‘ఉదార్ కీ జిందగీ’ కష్టాలను గుర్తుచేస్తున్నాయి. ఏదేమైనా ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం ఆశించిన ఫలితాలను ఇవ్వదని, అంతేకాకుండా ఊహించని సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని కొంత మంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోకి నకిలీ నోట్లను చేరవేస్తున్న టెర్రరిస్టు మూకలను పాత నోట్ల రద్దు ద్వారా అరికట్టవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు. నకిలీ నోట్లను చేరవేయగలిగిన టెర్రరిస్టులు వాటిని సకాలంలోనే విదేశీ కరెన్సీలోకి తీసుకొని దేశంలోకి తీసుకరాలేరా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. -
‘ప్రధాని మోదీది లెక్కలేనితనం...’
-
పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...
-
శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా దేశంలోని అన్నీ బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్దనోట్లను రద్దుచేయడం, ఆ వెంటనే బుధవారం బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లు చెలామణి కాకపోవడంతో చాలాచోట్ల టోల్గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను దూరం చేయడానికి టోల్‌ట్యాక్స్‌లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో బుధవారం బ్యాంకులు వినియోగదారుల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు, రేపు ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్పిడి కోసం జనాలు గురువారం పెద్ద ఎత్తున బ్యాంకులకు పోటెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు దినాలైన వచ్చే శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, చిన్నతరహా బ్యాంకులు, రిజినల్ రూరల్ బ్యాంకులు, అన్ని సహకార బ్యాంకులను ఆదేశిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. 2 గంటలు ఎక్కువ పనిచేయనున్న బ్యాంకులు! పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ప్రజలకు సౌకర్యార్థం తమ బ్యాంకుకు చెందిన అన్నీ శాఖలు రెండుగంటలపాటు అధికంగా పనిచేయనున్నాయని కెనరా బ్యాంకు ఎండీ, సీఈవో రాకేశ్ శర్మ తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు కూడా తన శాఖల పనివేళలను రెండుగంటలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రద్దైన పెద్దనోట్ల స్థానం కరెన్సీ బదిలీ కోసం ప్రజలు పోటెత్తనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఐసీఐ తెలిపింది. రేపు, ఎల్లుండి (గురువారం, శుక్రవారం) పొడిగించిన పనివేళలు వర్తిస్తాయని పేర్కొంది. -
పెద్ద నోట్లు చెల్లవు... చిన్న నోట్లు మాయం...
హైదరాబాద్ : రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తొలిరోజు బుధవారం ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా సామాన్యులు, పేద వర్గాలు ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. మరోవైపు మార్కెట్ లో చిల్లర కొరత తీవ్రమైంది. 50 రూపాయల వస్తువేదైనా కొనుగోలు చేసి షాపు యజమానికి వంద రూపాయలు ఇస్తే తిరిగి చెల్లించడానికి చిల్లర లేదని చెబుతున్నారు. మార్కెట్ లో ప్రతినిత్యం జరిగే లావాదేవీలన్నీ గందరగోళంగా మారాయి. ఎక్కడ చూసినా... ఏ చేయాలన్నా వంద రూపాయలు అంతకన్నా తక్కువ డినామినేషన్ చెల్లించాల్సి రావడం, చాలా మంది వద్ద ఆ డినామినేషన్ లేకపోవడంతో క్రయవిక్రయ మార్కెట్ అంతా అతలాకుతలమైంది. అవసరాలు తీరక సామాన్యులు, వ్యాపారం జరక్క వ్యాపారస్తులు బోరుమన్నారు. వివిధ పనుల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రధానమంత్రి మంగళవారం రాత్రి చేసిన ప్రకటన ఈరోజు ఉదయం వరకు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కూరగాయల మార్కెట్ లో ప్రతి ఒక్కరూ 500 నోటును ఇస్తుండటంతో కొందరు వ్యాపారస్తులు వాటిని అంగీకరించినప్పటికీ మిగిలిన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యారు. మరికొందరు ఆ నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. తద్వారా వారి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. సిటీ బస్సెక్కినా, ఊర్లకు వెళ్లడానికి బస్సెక్కినా, రైలెక్కినా, క్యాబ్ లో ప్రయాణం చేయాలన్నా, ఆటోలో వెళ్లాలన్నా... చిల్లర లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. చిల్లర లేని కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు సైతం ప్రయాణికులను ఎక్కించుకోలేక గిరాకీ వదులుకొనే పరిస్థితులు తలెత్తాయి. ఉబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసుల వారైతే 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కానందున క్యాబ్ ల్లో ప్రయాణించాలనుకునే వారు సరిపడా చిల్లర ఉంచుకోవాలని కస్టమర్లకు మెసేజ్ లు సైతం పంపించింది. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం రెండు రోజుల కిందట బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకురాగా, అందులో అన్నీ వెయ్యి, 500 రూపాయల నోట్లే ఉన్నాయి. తక్షణం ఉపయోగించాలంటే ఇప్పుడా డబ్బు ఏమాత్రం పనికి రావడం లేదు. పోనీ రెండు రోజుల తర్వాత తిరిగి ఆ డబ్బును బ్యాంకులో జమ చేసి మళ్లీ విత్ డ్రా చేద్దామంటే... పది వేలకు మించి తీసుకోవడానికి లేదని తెలిసి ఆ మధ్య తరగతి కుటుంబం ఇప్పుడేం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఒక వ్యక్తి తన ఇంటిని అమ్ముకోగా తొలివిడత చెల్లింపుగా రెండు రోజుల ముందే 20 లక్షల డబ్బు ఇచ్చారు. ఇప్పుడున్న నిబంధనల మేరకు రెండో విడత చెల్లింపు ఎప్పటివరకు చేస్తారో తెలియని పరిస్థితిని పక్కన పెడితే... అంత మొత్తం సొమ్మును బ్యాంకులో ఎలా జమ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇతరత్రా పెద్దగా ఆదాయం లేకపోగా ఉన్న ఒక్క ఇంటిని విక్రయిస్తే వచ్చిన సొమ్ముకు ఎలా లెక్క చూపించాలో (మార్కెట్ ధరకు వాస్తవ విక్రయ ధరకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి) తెలియక తలపట్టుకున్నారు. ఒక వ్యక్తి అత్యవసర మందులు కొనుగోలుకు మెడికల్ షాపులో వెయ్యి రూపాయల నోటు ఇవ్వగా రెండు వందల బిల్లు పోగా మిగిలిన చిల్లర లేదని, కావాలంటే చిట్టీ రాసిస్తాం... రెండు రోజుల తర్వాత తీసుకోవాలని చెప్పడంతో మందులు అత్యవసరం కాబట్టి చేసేదేమీ చిట్టీతో వెనుదిరిగాడు. ఆస్పత్రిలో ఉన్న పేషంట్ కోసం బయటకెళ్లి బ్రెడ్ కొనుగోలు చేయాలన్నా చిల్లర లేక అనేక బాధలు పడుతున్నారు. సాధారణంగా ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారు మందులు వైద్యులకు చెల్లించడానికి ఈరోజుల్లో ఎవరైనా వేలల్లో డబ్బు తెచ్చుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల్లో వైద్యం కోసం వచ్చే వాళ్లు చిల్లర కొరత కారణంగా బ్రెడ్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా కొనుగోలు చేయలేక అనేక అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లాంటి చిన్న వాహన దారులకు చిల్లర లేదన్న కారణంగా ఎక్కడ కూడా 500, 1000 నోట్లను అంగీకరించకపోవడం లేదు. కొన్ని చోట్ల బంకులను మూసివేశారు. నేషనల్ హైవేస్ పైన టోల్ గేట్ల వద్ద 500, 1000 నోట్లను తీసుకోకపోవడంతో దాదాపు అన్ని హైవేస్ ల్లోనూ ట్రాఫిక్ స్థంభించిపోయింది. టోల్ గేట్ వారితో అనేక చోట్ల వాహనదారులు గొడవకు దిగారు. ముందు ఏం జరుగుతుందో తెలియక బారులు తీరిన వాహన శ్రేణుల్లో వెనకాల నిలిచిపోవిన వారు, ట్రాఫిక్ లో ఇరుక్కుని సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మార్కెట్ లో లీటరు పాలు కొందామన్నా... కూరగాయలు కొనాలన్నా... ఒక పేస్ట్, పెన్ను, నోట్ బుక్... ఒకటేమిటి. ఏవీ కొనుగోలు చేయాలన్నా చేయలేకపోయారు. ఎక్కడైనా కొందరు వంద లేదా 50 రూపాయల నోట్లను చెల్లిస్తుంటే... వ్యాపారస్తులు చెల్లించాల్సిన చోట చెల్లించడం లేదు. మరో రెండు రోజులు ఎలా వెళ్లదీయడం అన్న కోణంలో చాలా మంది తమ వద్ద ఉన్న ముఖ్యంగా 50, 100 రూపాయల నోట్లను వినియోగంలో పెట్టకపోవడం, కొందరు వ్యాపారస్తులు వంద రూపాయల నోట్లను బ్లాక్ చేయడం కూడా చిల్లర కొరతకు కారణమవుతుందని తెలుస్తోంది. -
బ్యాంకులపై కేంద్రం కీలక నిర్ణయం!
-
పెళ్లి వేడుకల్లోనూ ‘నోట్ల’ కల్లోలమే!
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందిపడ్డ ప్రజలు తెలుగురాష్ట్రాల్లో బుధవారం వేలల్లో పెళ్లివేడుకలు ఏ వేడుకలో చూసినా ఇదే చర్చ పెద్దనోట్ల రద్దు ప్రభావం తెలుగురాష్ట్రాల్లో పెద్దస్థాయిలోనే కనిపించింది. ముఖ్యంగా కార్తిక మాసం కావడం మంచి ముహూర్తాలు ఉండటంతో బుధవారం రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పెళ్లిల్లు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 500, రూ. వెయ్యినోట్ల రద్దు నిర్ణయం అనుకోని పిడుగులా మారింది. చాలా పెళ్లి వేడుకల్లోనూ పెద్ద నోట్ల రద్దుపైనా ఎక్కువగా చర్చ కనిపించింది. పెళ్లిల్లో ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనా చర్చించుకున్నారు. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలన్న ఆందోళన చాలామందిలో కనిపించింది. అట్టహాసంగా పెళ్లి వేడుకలు చేయాలనుకున్న పెళ్లి పెద్దలపై పెద్దనోట్ల రద్దు బాగానే ప్రభావం చూపింది. పెళ్లిళ్ల కోసం అప్పో-సప్పో చేసి తెచ్చిన నగదమొత్తమంతా పెద్దనోట్ల రూపంలో ఉండటంతో వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక ఆడపిల్ల తల్లీతండ్రులు ఆందోళన చెందారు. పెళ్లిల సందర్భంగా ఇక వరుడి తరఫున, వధువు తరఫున బంధుమిత్రులు కట్నకానుకలు సమర్పించుకోవడం సాధారణంగా జరిగే రివాజు. పెద్దనోట్ల రద్దు వల్ల కొన్ని పెళ్లిల్లో ఈ తంతు జరగలేదని తెలుస్తోంది. ఇక చాలామంది బంధువులు కవర్లలో పెద్దనోట్లు పెట్టి కట్నకానుకలు చదివించుకొని మమ అనిపించారు. మొత్తానికి పెళ్లిళ్ల వేడుకపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేస్తే తప్ప పెళ్లి వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం సాధ్యం కాదు. ఇందుకోసం పెద్దమొత్తంలో సమీకరించిన నగదు మొత్తం పెద్దనోట్ల రూపంలో ఉండటంతో పెళ్లి పెద్దల కుటుంబాల్లో ఒకరకమైన ఆందోళన కనిపించింది. ఈ పెళ్లి వేడుకలకు బయలుదేరిన బంధుమిత్రులను కూడా అవసరమైన చిల్లర నగదు అందుబాటులో లేకపోవడం, పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూలు ఉండటం, చిల్లర నగదు లేకపోవడం వల్ల బస్సు, రైలు ప్రయాణాలు వీలుకాకపోవడం ఇబ్బందులకు గురిచేశాయి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ నలుగురు గుమిగూడినా పెద్దనోట్ల రద్దుపైనా మాట్లాడుకోవడం కనిపించింది. పెళ్లి వేడుకల్లో వధూవరుల గురించి ముచ్చటించుకోవడం కన్నా ఈ పెద్దనోట్ల గండాన్ని ఎలా తప్పించుకోవడం అన్నదానిపైనా ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాలు చర్చించుకున్నాయి. ఇక దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు, నిరుపేదలపై ఇంకా ఎక్కువ ప్రభావమే ఇది చూపింది. తమ వద్ద ఉన్న ఒకటి, రెండు పెద్దనోట్లను అప్పటికప్పుడు మార్చుకొని వినియోగిస్తే తప్ప పూట గడవని పరిస్థితి వారిది. దీంతో చాలామంది నిరుపేదలు తమ వద్ద ఉన్న పెద్దనోట్లు చెలామణి కాకపోవడంతో ఇబ్బంది పడ్డారు. పైసలు చేతిలో ఉన్నా పూట గడవని పరిస్థితి ఎదుర్కొన్నారు. హోటళ్లు, క్యాంటీన్లు, టీస్టాళ్లలో పెద్దనోట్లు తీసుకోకపోవడం, తగినంత చిల్లర లేకపోవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, రోగులు, బీపీ పేషంట్లను సైతం తగినంత చిల్లర నగదు లేకపోవడం, పెద్దనోట్లు చెలామణి కాకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పెద్ద నోట్ల రద్దుతో తెలుగురాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలైన కొనుగోలు-అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయి.. ఒకరకమైన స్తబ్దత వాతావరణం నెలకొన్నదని నిపుణులు చెప్తున్నారు. -
రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ
-
‘ప్రధాని మోదీది లెక్కలేనితనం...’
న్యూఢిల్లీ: రూ.500,1000 నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సాధారణ ప్రజల పట్ల ప్రధాని మోదీది లెక్కలేనితనమని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, చిన్న దుకాణదారులు, గృహిణులు అష్టకష్టాలు పడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. నిజమైన దోపిడీదారులు తప్పించుకుంటున్నారని, విదేశాలతో పాటు, రియల్ ఎస్టేట్‌ల్లో దాచుకున్న నల్లధనాన్ని కేంద్రం వదిలి పెడుతోందని ఆయన ఈ మేరకు తన ట్విట్టర్లో ధ్వజమెత్తారు. While the real culprits sit tight on their black money stashed away abroad or in bullion/ real estate.Well done Mr Modi — Office of RG (@OfficeOfRG) November 9, 2016 Once again MrModi shows hw little he cares abt ordinary ppl of this country-farmers,small shopkeepers,housewives-all thrown into utter chaos — Office of RG (@OfficeOfRG) 9 November 2016 -
రెండు రోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని... సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్ని డబ్బులున్నా బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని..అయితే ఐడీ ప్రూఫ్ మాత్రం కచ్చితంగా చూపించాలని ఆయన బుధవారమిక్కడ పునరుద్ఘాటించారు. బ్లాక్‌మనీ ఉన్నవారే కేంద్రం ప్రతిపాదనకు కంగారు పడతారన్నారు. రెండురోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పలు రంగాలు నష్టాల పాలవుతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు. రియల్ ఎస్టేట్ ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు. నిజాయితీగా సంపాదించిన డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జైట్లీ వ్యాఖ్యానించారు. అక్రమంగా డబ్బులు సంపాదించినవారికే అసలైన ఇబ్బంది ఉంటుందన్నారు. పెద్దనోట్ల రద్దు దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని, నగదు లావాదేవీలను సాధ్యమైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ఇబ్బందులన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. -
మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా..
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం ► అవి మంగళవారం అర్ధరాత్రి నుంచే విలువ కోల్పోతాయని ప్రధాని ప్రకటన ► తాజా నిర్ణయంపై జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన ► ఆశించిన ప్రయోజనం ఉండదంటున్న పలువురు ఆర్థికవేత్తలు ► మార్పు మంచిదే అంటున్న మరికొందరు.. మేధావి వర్గాల్లోనూ అదే అభిప్రాయం ► నేడు, రే పు ఏటీఎంలు పనిచేయవు.. రోజుకు విత్‌డ్రా రూ.10 వేలు మాత్రమే.. ► ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు ► ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానం సాక్షి, నల్లగొండ : మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా.. కుటుంబం కోసం ఏదైనా కొనుగోలు చేయడానికి ఈ నోట్లను మీరు దాచిపెట్టుకున్నారా.. బ్యాంకుల్లో ఉంటే ఓకే.. నగదు రూపంలో ఉంటే మాత్రం వెంటనే కదలండి. బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి వాటిని మార్చుకోండి. ఎందుకంటే.. మంగళవారం అర్ధరాత్రి నుంచే 500, 1000 నోట్లు విలువ కోల్పోతున్నాయి. వాటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఉన్నట్టుండి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వాసుల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏ నోటవిన్నా.. ఎక్కడ చూసినా.. ఇదే విషయంపైనే చర్చ సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ ప్రకటన సంచలనాన్నే సృష్టించింది. అవినీతి, బ్లాక్‌మనీ టార్గెట్‌గా... వాస్తవానికి ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వ చ్చినప్పటి నుంచే.. ఏదో ఒక సంచలన ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభమైన మొదట్లో దేశంలో అవినీతి, బ్లాక్‌మనీ, ఉగ్రవాద కార్యకలాపాలు ఎలాంటి ఆటంకంగా మారాయనే దానిపై ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా రూ.500, రూ.1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లవని, ముద్రణ నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన విన్న ప్రజలు తాము విన్నది నిజమేనా..? అనుకున్న ప్రజలు ప్రధాని ప్రకటన పూర్తిగా అవగతం అయిన తర్వాత మాత్రం తదుపరి పరిణామాలపై చర్చించుకున్నారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం జరిగిందనే చర్చ జరిగింది. దీనికి తోడు అవినీతి, ఉగ్రకార్యకలాపాలకు ఆసరాగా మారిన దొంగనోట్ల ముద్రణ లాంటి వాటిని అరికట్టవచ్చనే, కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రా యం జిల్లా వాసుల్లో వ్యక్తమయింది. కేం ద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు ఎలా ఉన్నా.... సామాన్య ప్రజల వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానమనే అంశం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ప్రధాని చెప్పిన నేపథ్యంలో గ్రామీణులకు ఈ విషయాన్ని తెలియపరిచే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మిశ్రమ స్పందన.. ఇక, ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందనే అభిప్రాయం జిల్లా ఆర్థిక వర్గాల్లో వ్యక్తం కాలేదు కానీ...దీనివల్ల కేంద్రం ఆశించిన ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. కేంద్రం నిర్ణయంలో కీలకమైనవి.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే రూ.500, 1000 నోట్లు చెల్లవు. ఇకపై పాత నోట్ల ముద్రణ ఉండదు. ఈ నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లు ముద్రిస్తారు. అవి త్వరలోనే చెలామణిలోకి వస్తాయి. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయవచ్చు. అప్పటివరకు బస్సులు, రైళ్లు, ఇతర ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి. నవంబర్11 వరకు పెట్రోల్ బంకుల్లో కూడా చెల్లుతాయి. ఇంటర్నెట్ లావాదేవీలు, డీడీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బుధ, గురు వారాల్లో ఏ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలు కూడా పనిచేయవు. ఇక నుంచి ఏటీఎంల ద్వారా డబ్బు ఉపసంహరణ (విత్‌డ్రాయల్) మొత్తాన్ని కూడా మార్చారు. రోజుకు రూ.10,000, వారానికి రూ..20,000 మాత్రమే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ఆశించిన ప్రయోజనం ఉండదు.. రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం కొంతమేర బయటకు వస్తుంది. అయితే, నగదు రూపంలో ఉన్న నల్లధనమే బయటకు వస్తుంది. అక్రమార్జన ద్వారా సంపాదించిన ఆస్తులు, బంగారం లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక, నల్లధనం ఉన్న వారు కూడా మార్చుకోకుండా నష్టపోవడానికి సిద్ధపడితే ఈ నిర్ణయం మరింత వృధా అవుతుంది. ఇక, దొంగనోట్ల విషయానికి వస్తే దొంగనోట్ల ముద్రణ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. ఈ కారణాల వల్ల ప్రధాని నిర్ణయం ఆశించిన ప్రయోజనం పొందదు. - డాక్టర్ అందె సత్యం, ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.. ఇది మంచి పరిణామమే. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చు. చేతుల మీదుగా విచ్చలవిడి డబ్బు ప్రవాహాన్ని కూడా నియంత్రించవచ్చు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగానే కనిపిస్తోంది. సమసమాజ నిర్మాణం దిశలో కమ్యూనిస్టుల అభిప్రాయానికి ద గ్గరగా ఈ నిర్ణయం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. - ఆకుల రవీందర్, కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ‘స్మార్ట్’ లావాదేవీల కోసమే.. ఁఅభివృద్ధి చెందిన దేశాల తరహాలో భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను తీసుకురావాలన్న క్రమంలో ఈ నిర్ణయం చాలా కీలకమైంది. కేవలం ఇంటిసామాన్లు, కూరగాయలు లాంటివి కొనుక్కునేందుకే నగదు లావాదేవీలు జరిపి, మిగిలిన అన్నింటినీ స్మార్ట్ లావాదేవీలు జరపాలనేది కేంద్రం యోచనగా భావించవచ్చు. ఏదైనా మార్పు మంచిదే. - కందిమళ్ల సుధీర్‌రెడ్డి, సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి, హైదరాబాద్ సామాన్య ప్రజలకు నష్టం లేదు.. లాభం లేదు ఈ నిర్ణయం మంచిదేననే భావన వస్తోంది. అయితే, దీని వల్ల సామన్య ప్రజలకు ఎలాంటి నష్టం, లాభం ఉండదు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అదే విధంగా దొంగనోట్ల ముద్రణను కూడా కొంతమేర నివారించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ ప్రక్రియలో సామాన్య ప్రజలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -పెరమాళ్ల వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ప్రజల్లో అవగాహన కల్పించాలి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల విషయం లో జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలి. వారి దగ్గర న గదు రూపంలో ఉన్న మొత్తాన్ని దళారులకు ఇవ్వకుం డా, బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే జమ చేసుకోవాలని తె లియజేయాలి. ఈ బాధ్యతలను ప్రభుత్వ వర్గాలే తీసుకోవాలి. డిసెంబర్ 31 కల్లా గ్రామాల్లోని ప్రజల వద్ద రూ.500, 1000 నోట్లు లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలి. - గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, నల్లగొండ -
కరెన్సీ కలకలం..!
ఏటీఎంల ఎదుట బారులుదీరిన ప్రజలు పెట్రోలు బంకుల్లో రూ.500, రూ.1000 నోట్ల నిరాకరణ నిర్ణయం మంచిదే... హడావుడి ప్రకటనతో జనం ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న రూ.500, రూ. 1000 కరెన్సీ నోట్లు ఉపసంహరణ నిర్ణయం జిల్లాలో కలకలాన్ని సృష్టించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోఒక కుదుపు కుదిపే ఈ కరెన్సీ ఉపసంహరణపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ప్రభుత్వం నల్లదనాన్ని వెలికి తీయడం ద్వారా సామాన్యులు, మధ్య తరగతి వర్గాల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లధనం బయటకు వస్తుందని భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు సంపన్న వర్గాల్లోనే కనిపించే రూ.1000లు నోటు ఇప్పుడు సామాన్య, మ««దl్య తరగతి కుటుంబాలు కూడా విరివిగానే వినియోగిస్తున్నాయి. ప్రధాన మంత్రి ప్రకటన వెలువడిందో లేదో మంగళవారం రాత్రి దాని ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని పెట్రోలు బంకుల్లో రూ.500ల నోటు ఇచ్చి రూ.100లు పెట్రోలు పోయమని వెళ్లిన వాహన చోదకులకు బంకుల్లో పెట్రోలు పోయడం లేదు. బంకుల్లో తమ వద్ద రూ.500లకు చిల్లర లేదనే సమాధానం ఎదురైంది. కావాలంటే రూ.500లు పెట్రోలు పోయమంటే పోస్తామంటున్నారు. లేదంటే రూ.100లు నోటు ఇస్తేనే పెట్రోలు పోస్తామని బంకుల్లో సమాధానం చెప్పడంతో వినియోగదారులు తిరుగుముఖం పట్టడం కనిపించింది. బ్యాంకుల్లో ఇక ఇక్కట్లే... ఈ రెండు నోట్లు ఉపసంహరణ మాట ఎలా ఉన్నా వాటిని బ్యాంకులు, తంతితపాలా కార్యాలయాల్లో జమచేసి కొత్త నోట్లు తీసుకోవాలని ప్రధాని ప్రకటించారు. ప్రధాని ప్రకటన పైకి చూడటానికి అంతా బాగానే కనిపిస్తున్నా ఆ నోట్లను బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో జమ చేయడానికి నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో అయితే నగదు వెనక్కు ఇచ్చేస్తే ఆ మేరకు బ్యాంకు ఖాతాల్లో వివరాలు నమోదు చేస్తారు, అదే పోస్టల్ కార్యాలయాల్లో జమచేస్తే ఏదైనా రశీదు ఇస్తారా లేదా అనే మీమాంసలో ఖాతాదారులున్నారు. ఎందుకంటే దాదాపు అన్ని బ్యాంకుల్లో నగదు లావాదేవీలన్నీ ఇప్పటికే ఆ¯ŒSలై¯ŒSలో అయిపోయింది. అయినా ఏ బ్యాంకులో చూసినా నగదు కోసం ఖాతాదారులు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు ప్రధానమైన రూ.500లు, రూ.1000లు నోట్లు ఉపసంహరణ అంటే వాటిని తిరిగి తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అందునా ఏటీఎంలు బుధ, గురువారాల్లో రెండు రోజులు పనిచేయవని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల మరింత ఇబ్బందుల్లో పడతామంటున్నారు. రెండు రోజులపాటు ఎ.టి.ఎం.లు పనిచేయవని కేంద్రం ప్రకటించడంతో రాత్రికి రాత్రి అవసరాల కోసం సొమ్ము తీసుకోవడానికి జనం పరుగులు తీస్తున్నారు. రూ.500లు, రూ.1000లు నోట్ల స్థానంలో కొత్తగా ఇచ్చే నోట్లు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు పంపించినట్టు బ్యాంకు వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆయా బ్యాంకులకు ఉన్న చెస్ట్ బ్యాంకులో నగదు బండిల్స్ రెండు రోజుల క్రితమే వచ్చాయంటున్నారు. సాహసోపేతమే నల్లధనాన్ని నిరోధించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే. రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల వద్దే నల్లధనం ఉంది. వీరంతా ఇప్పటికే బంగారాలు, ఆస్తులపై పెట్టేశారు. వీటిని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తే మోదీ తీసుకునే నిర్ణయానికి సాఫల్యం ఉంటుంది. – పి.చిరంజీవినికుమారి, విద్యావేత్త, కాకినాడ విప్లవాత్మక నిర్ణయం ప్రధాని మోదీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సొమ్మును అదుపు చేసేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. అర్థం లేకుండా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలకు బ్లాక్‌మనీయే ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. – వైడీ రామారావు, రేట్పేయర్ అసోసియేష¯ŒS అధ్యక్షులు, కాకినాడ నల్లధనం బయటకు వస్తుంది నల్లధనాన్ని బయటపెడతామని ప్రధాని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించారన్నారు. అందు కే ఈ నోట్లను రద్దు చేశారు. ఈ నెల 31లోగా ఈ నోట్లను బయటకు తెచ్చి రెగ్యులైజ్ చేసుకోవాలి. ఆర్ఎఫ్ఐడీ విధానంలో విడుదల చేస్తున్న రూ.2 వేల నోటు వల్ల భవిష్యత్‌లో బ్లాక్ మనీకి అవకాశం ఉండదు. – ఉంగరాల చినబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
ఆ నోట్లు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!
ముంబై: దేశంలో నకిలీ కరెన్సీ చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.500, రూ.1,000 నోట్లను స్వీకరించేటపుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంలో ఈ నోట్లలో నకిలీలు పెరుగుతున్నందున, వాటిని స్వీకరించడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. "జాగ్రత్తగా పరిశీలించిన" తరవాతే ఆ నోట్లు తీసుకోవాలని కోరింది. రోజువారీ లావాదేవీల్లో నకిలీనోట్లను ప్రవేశపెట్టేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. నకిలీ కరెన్సీ చలామణి దారులు హయ్యర్ డినామినేషన్ లో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని తెలిపింది. కొంచెం నిశితంగా పరిశీలిస్తే నకిలీ నోట్లను గమనించడం చాలా సులువనీ, దీనికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ వెబ్సైట్లో అందుబాటులో వున్నాయని పేర్కొంది. వెబ్సైట్లో పొందపర్చిన నోట్లపై ఉండే భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని కోరింది. నకిలీ నోట్లను కలిగి ఉండడం, మార్పిడి, అంగీకారం, నకిలీ నోట్లను చెలామణి చేయడం, అలాంటి సహకరించిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కఠినమైన శిక్షలు తీసుకుంటాయని హెచ్చరించింది. నకిలీ నోట్ల చలామణిని గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే పెద్ద సంఖ్యలో భారతీయ నోట్ల ఉపయోగం కోసం అదనపు గుర్తింపు అవసరాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. -
2005 క్రితం కరెన్సీ నోట్ల మార్పునకు గడువు పొడిగింపు
ముంబై: 2005 క్రితం నాటి రూ.500, రూ.1,000సహా పలు డినామినేషన్లలోని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది. ఈ ఏడాది చివరి వరకూ ఉన్న గడువును మరో ఆరు నెలలు 2016 జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కేవలం గుర్తింపు పొందిన బ్యాంక్ బ్రాంచీలు, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో మాత్రమే బ్యాంక్ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జనవరితో ముగిసిన 13 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో 164 కోట్లకుపైగా 2005 క్రితం నోట్లను వ్యవస్థ నుంచి (చించివేత యంత్రం ద్వారా) తొలగించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.21,750 కోట్లు. -
రూ. 500 పోగొట్టినందుకు హత్య..!