కరెన్సీ కలకలం..!
-
ఏటీఎంల ఎదుట బారులుదీరిన ప్రజలు
-
పెట్రోలు బంకుల్లో రూ.500, రూ.1000 నోట్ల నిరాకరణ
-
నిర్ణయం మంచిదే... హడావుడి ప్రకటనతో జనం ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న రూ.500, రూ. 1000 కరెన్సీ నోట్లు ఉపసంహరణ నిర్ణయం జిల్లాలో కలకలాన్ని సృష్టించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోఒక కుదుపు కుదిపే ఈ కరెన్సీ ఉపసంహరణపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ప్రభుత్వం నల్లదనాన్ని వెలికి తీయడం ద్వారా సామాన్యులు, మధ్య తరగతి వర్గాల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లధనం బయటకు వస్తుందని భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు సంపన్న వర్గాల్లోనే కనిపించే రూ.1000లు నోటు ఇప్పుడు సామాన్య, మ««దl్య తరగతి కుటుంబాలు కూడా విరివిగానే వినియోగిస్తున్నాయి. ప్రధాన మంత్రి ప్రకటన వెలువడిందో లేదో మంగళవారం రాత్రి దాని ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని పెట్రోలు బంకుల్లో రూ.500ల నోటు ఇచ్చి రూ.100లు పెట్రోలు పోయమని వెళ్లిన వాహన చోదకులకు బంకుల్లో పెట్రోలు పోయడం లేదు. బంకుల్లో తమ వద్ద రూ.500లకు చిల్లర లేదనే సమాధానం ఎదురైంది. కావాలంటే రూ.500లు పెట్రోలు పోయమంటే పోస్తామంటున్నారు. లేదంటే రూ.100లు నోటు ఇస్తేనే పెట్రోలు పోస్తామని బంకుల్లో సమాధానం చెప్పడంతో వినియోగదారులు తిరుగుముఖం పట్టడం కనిపించింది.
బ్యాంకుల్లో ఇక ఇక్కట్లే...
ఈ రెండు నోట్లు ఉపసంహరణ మాట ఎలా ఉన్నా వాటిని బ్యాంకులు, తంతితపాలా కార్యాలయాల్లో జమచేసి కొత్త నోట్లు తీసుకోవాలని ప్రధాని ప్రకటించారు. ప్రధాని ప్రకటన పైకి చూడటానికి అంతా బాగానే కనిపిస్తున్నా ఆ నోట్లను బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో జమ చేయడానికి నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో అయితే నగదు వెనక్కు ఇచ్చేస్తే ఆ మేరకు బ్యాంకు ఖాతాల్లో వివరాలు నమోదు చేస్తారు, అదే పోస్టల్ కార్యాలయాల్లో జమచేస్తే ఏదైనా రశీదు ఇస్తారా లేదా అనే మీమాంసలో ఖాతాదారులున్నారు. ఎందుకంటే దాదాపు అన్ని బ్యాంకుల్లో నగదు లావాదేవీలన్నీ ఇప్పటికే ఆ¯ŒSలై¯ŒSలో అయిపోయింది. అయినా ఏ బ్యాంకులో చూసినా నగదు కోసం ఖాతాదారులు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు ప్రధానమైన రూ.500లు, రూ.1000లు నోట్లు ఉపసంహరణ అంటే వాటిని తిరిగి తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అందునా ఏటీఎంలు బుధ, గురువారాల్లో రెండు రోజులు పనిచేయవని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల మరింత ఇబ్బందుల్లో పడతామంటున్నారు. రెండు రోజులపాటు ఎ.టి.ఎం.లు పనిచేయవని కేంద్రం ప్రకటించడంతో రాత్రికి రాత్రి అవసరాల కోసం సొమ్ము తీసుకోవడానికి జనం పరుగులు తీస్తున్నారు. రూ.500లు, రూ.1000లు నోట్ల స్థానంలో కొత్తగా ఇచ్చే నోట్లు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు పంపించినట్టు బ్యాంకు వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆయా బ్యాంకులకు ఉన్న చెస్ట్ బ్యాంకులో నగదు బండిల్స్ రెండు రోజుల క్రితమే వచ్చాయంటున్నారు.
సాహసోపేతమే
నల్లధనాన్ని నిరోధించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే. రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల వద్దే నల్లధనం ఉంది. వీరంతా ఇప్పటికే బంగారాలు, ఆస్తులపై పెట్టేశారు. వీటిని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తే మోదీ తీసుకునే నిర్ణయానికి సాఫల్యం ఉంటుంది.
– పి.చిరంజీవినికుమారి, విద్యావేత్త, కాకినాడ
విప్లవాత్మక నిర్ణయం
ప్రధాని మోదీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సొమ్మును అదుపు చేసేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. అర్థం లేకుండా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలకు బ్లాక్‌మనీయే ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది.
– వైడీ రామారావు, రేట్‌పేయర్ అసోసియేష¯ŒS అధ్యక్షులు, కాకినాడ
నల్లధనం బయటకు వస్తుంది
నల్లధనాన్ని బయటపెడతామని ప్రధాని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించారన్నారు. అందు కే ఈ నోట్లను రద్దు చేశారు. ఈ నెల 31లోగా ఈ నోట్లను బయటకు తెచ్చి రెగ్యులైజ్ చేసుకోవాలి. ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంలో విడుదల చేస్తున్న రూ.2 వేల నోటు వల్ల భవిష్యత్‌లో బ్లాక్ మనీకి అవకాశం ఉండదు.
– ఉంగరాల చినబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు