public suffer
-
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
అంతరాయాల చింతలు
భారీగా పెరిగిన విద్యుత్తు వినియోగం అధికమైన లో వోల్టేజీ సమస్య ట్రిప్ అవుతున్న ఫీడర్లు ఈదురు గాలులకు పడిపోతున్న స్తంభాలు రూరల్‌లో సరఫరా పురనరుద్ధరణకు అధిక సమయం సెక్షన్ ఆఫీస్, హెల్్ప డెస్క్‌లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు . సాక్షి, రాజమహేంద్రవరం: ఉష్ణోగ్రత పెరిగి వేడిని తట్టుకోలేక వినియోగం పెరగడంతో జిల్లాలో విద్యుత్తు అంతరాయాలు అధికమయ్యాయి. వీటికితోడు ఈదురు గాలులు తోడై వర్షాలకు ఒరిగిన స్తంభాలు, తెగిపడిన విద్యుత్తు తీగలు ...విద్యుత్తు శాఖ సిబ్బందికి పని భారం పెరగడంతో సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించలేకపోతున్నారు. ఫలితంగా ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ పక్క విద్యుత్ అంతరాయాలు, మరో పక్క వేసవి ఉక్కపోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడక్కడా జనం ఆందోళనలకు దిగుతుండడంతో సిబ్బందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. . లో వోల్టేజీలతో ఉక్కిరిబిక్కిరి... వేసవి ఉపసమనం కోసం ఏసీలు, కూలర్లు విరివిగా ఉపయోగిస్తుండడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువై సంబంధిత సెక్షన్ ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య తీవ్రమైంది. గత నాలుగు రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సమస్య తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు విద్యుత్తు కోతలు అధికంగా ఉంటున్నాయి. బుధవారం జిల్లాలో 693 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే గురువారం 705 (ఒక మెగావాట్= 10 లక్షల యూనిట్లు) మెగావాట్లకు చేరింది. ఒక్క రోజులోనే 12 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 18వ తేదీన 14.85 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. విద్యుత్ వినియోగం అధికమవడంతో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. తిరిగి పునరుద్ధరించడానికి సిబ్బందికి ఎక్కువ సమయం పడుతోంది. . మోత మోగుతున్న సెక్షన్ ఆఫీసుల ఫోన్లు... ఎడా పెడా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండడంతో సెక్షన్ ఆఫీసులు, ఏపీఈపీడీసీఎల్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 84 సెక్షన్ల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వ్యక్తిగత కనెక్షన్లకు, టోటల్ గ్రూపులకు లోవోల్టేజీ సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో ఒక్కొక్క సెక్షన్ కార్యాలయానికి రోజుకు దాదాపు 10 నుంచి 15 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ లెక్కన రోజకు జిల్లాలోని 84 సెక్షన్ కార్యాలయాలకు దాదాపు వెయ్యి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇవిగాక విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ హెల్ఫ్డెస్క్కు వచ్చే ఫిర్యాదులు అదనం. జిల్లా నుంచి సోమవారం 390, మంగళవారం 526, బుధవారం 811, గురువారం 650 ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో లోవోల్టేజ్, సరఫరాకు అంతరాయాలు వంటి ఫిర్యాదులే 90 శాతం ఉన్నాయని చెబుతున్నారు. . ఉరుకులు పరుగుల తీస్తున్న సిబ్బంది... ఈదురుగాలల వల్ల పడిపోయిన స్తంభాలు, తెగిన విద్యుత్ వైర్లను తిరిగి పునరుద్ధరించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టణాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను 12 గంటలలోపు పరిష్కరించాల్సి ఉంటుంది. పని భారం పెరగడం, ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో నిర్ణీత సమయానికి ఫిర్యాదులను పరిష్కరించలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఆరుగంటల తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది తీసుకోకపోవడంతో ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం మరుసటి రోజు వరకు వేచిచూడాల్సి వస్తోంది. ––––––––––––––––––– సరఫరా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కూలిన స్తంభాలు, విద్యుత్తు తీగలను త్వరితగతిన తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వేసవిలో ఇప్పటి వరకు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఏసీల వినియోగం, లోడు ఎక్కువ కావడంతో సరఫరాలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. పట్టణాలలో పెద్దగా అంతరాయాలు లేవు. గ్రామీణ ప్రాంతాల పరిధి ఎక్కువగా ఉండడంతో సమస్యను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. – వై.ఎస్.ఎన్.ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్, తూర్పుగోదావరి. -
కరెన్సీ సంక్షోభంపై జనాగ్రహం
నగదు ఇవ్వకపోతే బ్యాంకు తెరవనివ్వం బిక్కవోలు : ప్రభుత్వం ఆదేశించినట్టు కనీసం రూ.2 వేలు కూడా ఇవ్వకపోతే బ్యాంకు తెరవడం దేనికంటూ బిక్కవోలు మండలం పందలపాక స్టేట్‌బ్యాంక్ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సరిగా నగదు బట్వాడా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ, బ్యాంకు తెరవడానికి వీల్లేదంటూ శనివారం సిబ్బందిని అడ్డుకుని, ఆందోళన చేశారు. గత గురువారం కూడా ఆందోళన చేస్తేనే కానీ నగదు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్ రమేష్ వచ్చీ రావడంతోనే నగదు లేదని చెప్పడంతో.. ఉదయం 7 గంటల నుంచీ క్యూలో నిలుచున్న ఖాతాదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో తాళాలు తెరవడానికి వీల్లేదంటూ బ్యాంకు గేటుకు అడ్డంగా బైఠాయించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగిన అసిస్టెంట్ మేనేజర్‌ను సముదాయించి మేనేజర్ రమేష్ అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. సాయంత్రం ఐదు గంటల వరకూ అక్కడే వేచి చూసిన ఖాతాదారులు.. అధికారులెవరూ రాకపోవడంతో ఉస్సురంటూ వెనుతిరిగారు. ఎస్బీఐ వద్ద వంట–వార్పు కాకినాడ సిటీ : నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మెయి¯ŒS రోడ్డులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయి¯ŒS బ్రాంచ్ వద్ద వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంట–వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ, 41 రోజులు గడిచినా, సమస్య పరిష్కారం కాకపోగా, మరోపక్క అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చిందని, సామాన్యులు మాత్రం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్, మహిళా నాయకురాలు, ప్రముఖ న్యాయవాది లక్షీ్మనాయుడు, నగర అధ్యక్షుడు హసన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిచ్మండ్ కేరే, అధికార ప్రతినిధి ఆర్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల చిక్కులు..జనానికి చుక్కలు
50 వేల మంది ఉద్యోగులకు నిరాశే వెనుతిరిగిన పింఛ¯ŒSదారులు పండుటాకులకూ పడరాని పాట్లు జనం శాపనార్థాలు అన్ని చర్యలూ తీసుకున్నామన్న పాలకుల మాటలు హుష్‌కాకి సాక్షి ప్రతినిధి, కాకినాడ : సామాన్య, మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల జీవితాలు ఒకటో తేదీతో ముడిపడి ఉంటాయి. నెలంతా పడ్డ శ్రమకు ఆ రోజు జీతం రూపంలో వచ్చే ప్రతిఫలం కోసం గంపెడాశతో నిరీక్షిస్తుంటారు. అటువంటిది ఈసారి డిసెంబరు ఒకటో తేదీ అందరికీ చుక్కలు చూపించింది. ఒకటో తేదీ వచ్చిందంటే ఇంటి అద్దె మొదలుకుని కిరాణా, పాలు, పేపర్, కేబుల్... ఇలా అన్నింటికీ ఖర్చు చేయాలంటే జీతం చేతిలో పడాలి కదా. ప్రభుత్వం సామాజిక పింఛ¯ŒS పథకంలో ఇచ్చే వెయ్యి, రూ.1500 పైనే జీవితాలు వెళ్లదీసే పింఛ¯ŒSదారులదీ అదే పరిస్థితి. అటు ఉద్యోగులకు ఇటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సామాజిక భద్రతా పింఛన్‌దారులు.. ఇలా ఒకరేమిటి అందరినీ ఒకటో తేదీ కంగారు పెట్టించింది. ఉద్యోగుల ఖాతాల్లో పడని జీతాలు.. జిల్లాలో ఉద్యోగులకు ఒకటో తేదీనాడే జీతాలు వారి ఖాతాలకు జమయ్యేవి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో గురువారం రాత్రికి కూడా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడలేదు. కొన్నిచోట్ల ట్రెజరీల నుంచి బ్యాంకులకు జమ అయినా బ్యాంకుల్లో నగదు లేక ఇవ్వలేదు. జీతాలు జమవుతాయనడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశారు. తీరా రాత్రికి పడతాయని నిరీక్షించినా నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్.అండ్.బి, వైద్య ఆరోగ్యం, దేవాదాయశాఖ తదితర అన్ని శాఖల్లో కలిపి 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఫించ¯ŒSదారులు 40 వేల మంది ఉన్నారు. వీరితోపాటు 12,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు పైమాటే. అంతెందుకు స్వయంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా అధికారులెవరికీ జీతాలు పడలేదు. వీరందిరికీ నేరుగా ప్రతినెలా ఒకటో తేదీన వారి వారి ఖాతాల్లో వేతనాలు జమ య్యేవి. పరిస్థితి తారుమారవడంతో ఉద్యోగవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పింఛ¯ŒSదారులదీ అదే వ్యథ: ఉద్యోగులతోపాటు ఫించ¯ŒSదారులు కూడా జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు పడినా ఫలితం దక్కలేదు. జిల్లాలో 4 లక్షల 75 వేల 823 మంది పింఛ¯ŒSదారులకు ప్రతినెల రూ.48 కోట్లు ఒకటో తేదీ నుంచి ఐదో తేదిలోపు నగదు ఇచ్చేవారు.వీరందరికీ రూ.100లు నోట్లు ఇవ్వాలంటే 48 లక్షల రూ.100 నోట్లు అవసరమవుతాయని లెక్కలేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు. కానీ అన్ని నోట్లు తమ వల్ల కాదని బ్యాంకులు చేతెలెత్తేసింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 32 వేల మందికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. అధికారులు చెప్పిన మాటలతో ఏజెన్సీలో పింఛ¯ŒSదారులంతా ఎదురుచూసినా ఒక్క రూపాయి కూడా వారి చేతిలో పడలేదు. మైదాన ప్రాంతంలో మిగిలిన 4 లక్షల 44 వేల మందికి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామన్నా గురువారం రాత్రికి కూడా జమకాలేదు. జిల్లా కేంద్రంలో: ఉదాహరణకు కాకినాడ సిటీలో 20,732 పింఛ¯ŒSదారులకు రూ.2.30 కోట్లు ఇవ్వాలి. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుదీరారు. నగరంలో బ్యాంకులకు ఒక్కొక్క బ్యాంకుకు రూ.25 లక్షలు వంతున మాత్రమే ఇవ్వడంతో మధ్యాహ్నానికే నగదు నిండుకుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో 43 గ్రామ పంచాయతీల్లో పింఛ¯ŒSదారులు ఉదయం 6 గంటలకే కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఏజెన్సీలో ఖాతాల్లో పొదుపు చేసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం రూ.4 వేలు ఇచ్చారు. అంతటా ఇవే వెతలు... చింతూరు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో మధ్యాహ్నానికి సొమ్ములు నిండుకున్నాయి. కూలీలకు సొమ్ములు ఎలా చెల్లించాలంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. పెదపూడి మండలంలో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల నుంచి విడుదలైన నగదు విషయాన్ని పరిశీలిస్తే బ్యాంకుల్లో ఒకటోతేదీన నెలకున్న పరిస్థితి స్పష్టమవుతోంది. ఆ మండలంలో ఏడువేల మంది పింఛ¯ŒSదారులు ఉదయం నుంచి పడిగాపులుపడితే వీరిలో 5వేల 703 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అమలాపురంలో ఉన్న 23 బ్యాంకుల వద్ద ఉద్యోగులు బారులు తీరడంతో క్యూలైన్లు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విశ్రాంత ఉద్యోగులు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేక అష్టకష్టాలు పడ్డారు. మొదట రూ.10వేలు ఇస్తామని చెప్పి రూ.4 వేలు, రూ.6వేలు మాత్రమే ఇవ్వడంతోశాపనార్థాలు పెట్టడం కనిపించింది. రాజానగరంలో ఉదయం నుంచి బ్యాంకుల వద్ద ఉద్యోగులు, రైతులు, పింఛ¯ŒSదారులు క్యూలో నిలబడి పడిగాపులు పడ్డారు. తునిలో ఉద్యోగుల జీతాలకు రూ.10 వేలు ఇస్తామని రూ.5వేలు మాత్రమే ఇచ్చారు. జగ్గంపేట స్టేట్‌బ్యాంక్ పరిధిలో ఎవరికీ పింఛన్లు ఇవ్వలేదు. పెద్దాపురం నియోజకవర్గంలో పింఛ¯ŒSదారులకు స్టేట్ బ్యాంకులో రూ.4,500 మాత్రమే ఇస్తామని చివరకు ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. తాటిపాక ఆంధ్రా బ్యాంకు వద్దకు వచ్చిన ఒక వృద్దుడు సొమ్మసిల్లి పడి పోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎటీఎంకార్డుల కోసం, అకౌంట్ల కోసం బ్యాంకుల క్యూ కట్టారు. నగదు లేక జీతాలు ఇవ్వలేదు. ఖాతాల్లో నిల్వ ఉన్న వారికి మాత్రమే మామిడికుదురు ఎస్బీఐ, నగరం కార్పొరేష¯ŒS బ్యాంకు, పి.గన్నవరం ఎస్బీఐలలో రెండు నుంచి నాలుగువేలు ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉద్యోగులు, పింఛ¯ŒSదారులకు కలిపి తొమ్మిదిన్నర కోట్లు వరకు బ్యాంకులకు అనుమతించారు. తీరా బ్యాంకులకు వెళ్ళినా నగదు లేక వెనుతిరిగారు. జిల్లా అంతటా ఉద్యోగులు, పింఛ¯ŒSదారులు, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒకటో తేదీన ముచ్చెమటలెక్కించింది. ప్రతిపాదనలు : జిల్లాకు రూ.500 కోట్లు అవసరం. కానీ రిజర్వు బ్యాంకుకు కేవలం రూ.300 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలను లీడ్ బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం పంపించారు. అంటే ఇవి ఉద్యోగులకు మాత్రమే సరిపోవచ్చు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని పలువురి ప్రశ్న. -
చితుకుతున్న బతుకులు
కరెన్సీ కల్లోలం.. పెను సంక్షోభం వాయిదా పడుతున్న పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలదీ అదే దారి చితికిపోయిన చిన్నవ్యాపారాలు కొనేవారు లేక కళ తప్పిన పెద్ద వ్యాపారాలు సొమ్ములు లేక రైతుల ఇక్కట్లు పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట.. మామిడితోరణాలు కట్టాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నవారే కనిపిస్తున్నారు. ఒకవేళ అనుకున్న ముహూర్తానికే ఆ శుభకార్యం తలపెడితే.. డబ్బులు సర్దుబాటు చేయడమెలాగన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కుటుంబ పరిస్థితులు అనుకూలించకో.. పెద్ద పెద్ద స్థానాలకు ఎదిగే శక్తి లేకో.. కాలం కలసిరాకో.. ఉన్నంతలోనే చిన్నచిన్న వ్యాపారాలతో బతుకుబండిని లాగిస్తున్నవారు.. పెద్ద నోట్ల రద్దుతో కొన్నాళ్లుగా బేరాలు లేక దారుణమైన నష్టాలు చవిచూస్తున్నారు. తెల్లవారితే చాలు.. ఆ రోజు ఎలా గడపాలో అర్థం కాక కలత చెందుతున్నారు. పండగలు వచ్చేస్తున్నవేళ.. కొనుగోలుదార్లతో కిటకిటలాడాల్సిన పెద్దపెద్ద షాపులు.. కనీస వ్యాపారం కూడా జరగక కళ తప్పుతున్నాయి. వ్యాపారం లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు తమవద్ద పని చేస్తున్న చిరుద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నేలతల్లిని తన చెమటతో తడిపి.. బంగారుపంటలు పండించి.. ప్రజలందరికీ తిండిగింజలను అందించే అన్నదాతలు.. ఖరీఫ్ వరి కోతల సమయాన.. చేతిలో సొమ్ములాడక.. రబీ పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక బావురుమంటున్నారు. మరోపక్క పనులు లేక.. చేసినా చిల్లర నోట్లు రాక.. కొత్త రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక రోజు కూలీలు నానా అవస్థలూ పడుతున్నారు. ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఇంటద్దె, కిరాణా, పాలబాకీలు.. ఇతర ఖర్చులకు డబ్బులు అందుతాయో లేదో అర్థంకాక సగటు ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. పాత రూ.వెయ్యి, రూ.500 నోట్లు చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రధాని ప్రకటించి ఇప్పటికి 22 రోజులు పూర్తయింది. ఇప్పటికీ కరెన్సీ కల్లోలం ప్రజాజీవితాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో తమ జీవితాలు చిత్తయ్యాయని.. తక్షణం ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని అన్ని వర్గాల ప్రజలూ గళమెత్తుతున్నారు. చిల్లర ఎక్కడ నుంచి తేవాలి? నోట్ల రద్దుతో రూ.500, రూ.1000 తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రూ.100 మిఠాయి కొనుగోలుకు కూడా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. వారికి చిల్లర ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. దుకాణంలో మిఠాయి తయారు చేయడానికి కనీసం ముగ్గురు కూలీలు కావాలి. వారికి రోజువారీ జీతాలు ఇచ్చేంత స్థాయిలో కూడా అమ్మకాలు సాగడం లేదు. వారికివ్వడానికి చిల్లర ఉండటం లేదు. అలాగని సెలవు ఇస్తే వారు మరో పనిలోకి పోతారు. దీంతో అనుభవం కలిగిన పనివారిని వదులుకోలేకపోతున్నాం. పప్పుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారం లేకపోయినా అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల కూలీలు చెల్లించకతప్పడం లేదు. నోట్ల రద్దుతో సామాన్యుల నోట్లో మట్టి పడింది. – మిత్తిపాటి మాధవరావు, చిరు మిఠాయి వ్యాపారి, సామర్లకోట డిసెంబరులో ముహూర్తమా? ‘మంచి ముహుర్తమైనా... బలమైన మూహూర్తమైనా ఈ రెండు నెలలూ పెళ్లిళ్లు చేయలేం. నోట్ల గందరగోళం తగ్గిన తరువాత చిన్న ముహూర్తమైనా పెళ్లి చేద్దాం. అంతవరకూ వాయిదానే’ పెద్దనోట్ల రద్దుతో చాలామంది పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఈ నెలలో పెట్టిన ముహూర్తాలు, వచ్చే నెలలో పెళ్లిళ్లు పెట్టుకుని, ఇప్పటికే బంధుమిత్రులకు శుభలేఖలు పంచినవారు మినహా తాజాగా పెళ్లిళ్లు కుదిరినవారంతా ఆ శుభకార్యాలను కాస్త ఆలస్యంగా జరుపుకోవాలని నిశ్చయించుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో వంటవాళ్లు, పురోహితులు, విద్యుద్దీపాలు అలంకరించేవారు, కల్యాణ మండపాలవారు, డెకరేష¯ŒS చేసేవారిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు.. చివరకు విందు భోజనాలకు అవసరమైన సరుకులు కొనేందుకు సహితం పెళ్లి నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు మారకపోవడం, చిన్న నోట్లు లక్షల్లో పోగు చేయలేక ముహూర్తాలను వాయిదాలు వేసుకుంటున్నారు. వచ్చే నెల 3, 4, 5, 7, 9 తేదీలతోపాటు 24న కూడా ముహూర్తాలున్నాయి. వీటిలో 3, 4, 5 తేదీల్లోవి భారీ ముహూర్తాలు. నోట్ల రద్దు గొడవ లేకుంటే ఈ మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా కనీసం 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగేవి. వీటితోపాటు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలు జరగాల్సి ఉంది. కరెన్సీ సంక్షోభంతో ఈ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. పుష్యమాసం కావడంతో జనవరి నెల 30 వరకూ ముహూర్తాలు లేవు. అదిగో ఇదిగో అంటే ఇక ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పెళ్లిబాజా ఘనంగా మోగే అవకాశముంది. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినవారు మాత్రం డిసెంబరు నెలలో పాలు పొంగించుకుని తరువాత ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంగా విందు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. – అమలాపురం డిసెంబరు వద్దంటున్నారు డిసెంబరు నెలలో బలమైన ముహూర్తాలున్నా చాలామంది ఫిబ్రవరిలో చూడమంటున్నారు. జనవరిలో ముహూర్తాలు లేనందున గతంలో పెళ్లిళ్లు కుదిరితే వారం రోజుల వ్యవధిలో కూడా ముహూర్తాలు పెట్టుకున్న సందర్భముంది. పెద్ద నోట్లు మారకపోవడంతో వారంతా ఫిబ్రవరిలో ముహూర్తాలకు మొగ్గు చూపుతున్నారు. – ఉపద్రష్ట నాగ ఆదిత్య, పురోహితుడు, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా శుభలేఖ చూపినా రూ.2వేలే ఇచ్చారు ఆమె పేరు ఎ¯ŒS.విజయలక్ష్మి, రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలో పని చేస్తూంటారు. తన కుమార్తెకు డిసెంబర్ ఒకటిన వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులోని తన అకౌంటులో దాచుకున్న రూ.80 వేలు తీసుకునేందుకు వెడ్డింగ్ కార్డుతోపాటు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వివాహాది శుభకార్యాలకు తగిన ఆధారాలు చూపిస్తే రూ.2 లక్షల వరకూ నగదును పొందవచ్చని ఆదేశాలున్నాయి. కానీ, అందరితోపాటే ఆమెకు కూడా బ్యాంకు సిబ్బంది రూ.2 వేలే చెల్లించారు. కుమార్తె వివాహం కోసం సొమ్ములు కావాలని ప్రాధేయపడినా సిబ్బంది వినలేదు. ఈ రూ.2 వేలతో పెళ్లి ఏర్పాట్లు ఏవిధంగా చేసుకునేదంటూ నిలదీసినా వారు పట్టించుకోవడంలేదు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలనే తాము పాటిస్తున్నామని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్యాంపస్‌లోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్ మేనేజర్ రాధాకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఆధారాలు చూపించినా కావలసినంత మేరకు నగదు ఇవ్వలేని స్థితిలో తమకు కేటాయింపులు ఉంటున్నాయన్నారు. రోజుకు రూ.4 లక్షలే తమకు కేటాయిస్తున్నారని, దీనిని ఎంతమందికి ఏవిధంగా చెల్లించగలమంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. – రాజానగరం చిన్న వ్యాపారులకు పెద్ద కష్టం అమలాపురం : పెద్ద నోట్ల రద్దుతో చిన్నవ్యాపారులు విలవిలలాడుతున్నారు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు వెయ్యిమంది చిరు వ్యాపారులున్నారు. ఒక్క అమలాపురం పట్టణంలోనే సుమారు 450 మంది వ్యాపారులున్నారని అంచనా. పెద్దనోట్ల రద్దుతో వారికి చిల్లర కష్టాలు మొదలయ్యాయి. పట్టణ పరిధిలో తోపుడుబళ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారి వ్యాపారం సగానికి సగం తగ్గింది. ‘‘ఇంతకుముందు రోజుకు రూ.3,500కు పైగా పండ్ల అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు రూ.1,500 కూడా జరగడం లేదు’’ అని పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి రంకిరెడ్డి రామదేవుడు వాపోయారు. ‘‘రూ.100 నోట్లు దొరికితేనే మావద్ద ఎంతోకొంత కిరాణా కొంటున్నారు. లేకపోతే అత్యవసరమైతేనే కానీ కొనడం లేదు. పెద్దనోటు ఉంటే బజారుకు పోతున్నారు. మా దుకాణంలో రోజుకు రూ.2,500 పైబడి అమ్మకాలు సాగేవి. ఇప్పుడు రూ.వెయ్యి దాటితే గొప్పగా ఉంది’’ అని అమలాపురం మండలం రోళ్లపాలేనికి చెందిన కిరాణా వ్యాపారి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో గోల్డ్ మార్కెట్‌కు కస్టమర్లు రాక.. దానిపై ఆధారపడిన పా¯ŒSషాపు, టీకొట్ల యాజమానుల వ్యాపారాలు సైతం సగానికి తగ్గాయి. వాయిదాల పద్ధతిలో సామాన్యులకు వస్రా్తలు అమ్మే వ్యాపారులదీ ఇదే పరిస్థితి. ‘‘మాకు ఇవ్వాల్సినవారు సమయానికి వాయిదా సొమ్ము ఇవ్వడం లేదు. షాపు యజమానులు మాత్రం వెంటనే సొమ్ములిమ్మంటున్నారు. అప్పులు చేయాల్సి వస్తోంది’’ అని ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన వస్త్ర వ్యాపారి సీహెచ్ నాగరాజు చెప్పాడు. గంటల తరబడి క్యూలో నిలబడితే.. రెండు మూడు వేలే ఇస్తారా? బోట్‌క్లబ్ (కాకినాడ) : పనులు మానుకొని గంటల తరబడి క్యూలో నిలబడితే రెండు, మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో బ్యాంకు సిబ్బందిపై ఖాతాదారులు మండిపడ్డారు. కాకినాడ సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘‘నాలుగు గంటలకు పైగా క్యూలో నిలబడితే రూ. 3 వేలు మాత్రమే ఇచ్చారు. ఉదయం 9 గంటలకే బ్యాంకుకు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలకు కూడా నగదు ఇవ్వలేదు’’ అని మహాలక్ష్మి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తమవద్ద పూర్తిస్థాయిలో నగదు లేనందువల్లనే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపలేకపోతున్నామని, ఉన్న నగదునే అందరికీ సర్దుతున్నామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నెలాఖరు కావడంతో నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు అవసరమైన డబ్బుల కోసం మళ్లీ బ్యాంకులకు పరుగు తీస్తున్నారు. దీంతో బ్యాంకులవద్ద మళ్లీ రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ఖాతాదార్లకు టోకెన్లు జారీ చేశారు. వీటిని తీసుకునేందుకు ఖాతాదారులు ఎగబడడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, పలువురు గాయపడ్డారు. కడియపులంకలో వాడిపోతున్న ‘పూలు’ కడియం : పెద్ద నోట్ల రద్దు కడియపులంక పూల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిల్లర అమ్మకాలు 70 శాతం వరకూ తగ్గిపోయాయి. రోజూ రూ.2 వేల వరకూ పువ్వులు తీసుకువెళ్లి చిల్లరగా అమ్ముతానని, కానీ కొనుగోలుదారుల వద్ద తగిన నోట్లు లేకపోవడంతో అరువులు పెడుతున్నారని అనపర్తికి చెందిన పూల వ్యాపారి సుబ్బారావు తెలిపారు. నిత్యం తనవద్ద కొనేవారికి మాత్రమే పూలు ఇస్తున్నానని, ఇందుకోసం రూ.500 నుంచి రూ.800 వరకూ కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. చిల్లర నోట్లు లేకపోవడంతో పెద్ద నోట్లే ఇస్తామని వ్యాపారులు చెబుతూండగా, అందుకు మార్కెట్‌కు పువ్వులు తెచ్చిన రైతులు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో పట్టీ (సరఫరా చేసిన పూలకు చెల్లింపు) పట్టుకెళ్లే రైతులు వారం రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. మార్కెట్లోకి పువ్వులు విరివిగా వస్తున్న ప్రస్తుత తరుణంలో చిల్లర కష్టాలతో అమ్మకాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఇదే రోజుల్లో కేజీ రూ.80 వరకూ పలికిన పలు రకాల పువ్వులు ఇప్పుడు రూ.25 నుంచి రూ.40 మధ్య మాత్రమే పలుకుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
ఎనీటైం నో మనీ
నగదు ఉన్నా ఏటీఎంల వరకూ వెళ్లనీయని పలు బ్యాంకులు లావాదేవీలపై చార్జీల ఎత్తివేతే కారణం ఏటీఎంల వైపే చూడని ప్రైవేటు బ్యాంకులు ప్రధాన శాఖలోని ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో నగదు 21 రోజులుగా ఇదే దుస్థితి అగచాట్లు పడుతున్న ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : తమ్ముడు తమ్ముడే...వ్యాపారం వ్యాపారమే అన్నట్లుంది పలు బ్యాంకులు తీరు. పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంలో విత్‌డ్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏటీఎం చార్జీలన్నింటినీ డిసెంబర్ నెలాఖరు వరకు ఎత్తివేసింది. ప్రజలు తమ డెబిట్ కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉచితంగా ఎన్నిసార్లయినా సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. అయితే నగదు కొరత చూపిస్తూ పలు ప్రభుత్వ, ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచడం లేదు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఏటీఎం లావాదేవీల చార్జీలు ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆయా బ్యాంకుల ఏటీఎం కేంద్రాల వద్ద ‘నో క్యాష్’ ‘అవుటాఫ్ సర్వీస్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. లావాదేవీకి రూ.14 నుంచి రూ.29 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 నుంచి ఏటీఎం లావాదేవీలపై చార్జీలు విధించేలా సర్క్యులర్ జారీ చేసిం ది. అప్పటి వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఏ బ్యాంకు కార్డుతోనైనా ఎన్నిసార్లయినా ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉండే ది. అయితే లావాదేవీలపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ ఏటీఎం లావాదేవీలపై చార్జీలు నిర్ణయించుకునే అధికా రం బ్యాంకులకే అప్పగించింది. పలు బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించి, అవి దాటిన తరువాత తమ సొంత ఖాతాదారుల వద్ద కూడా చార్జీలు వసూలు చేస్తుండగా మరికొన్ని బ్యాంకులు మినహాయింపునిచ్చాయి. అయితే ఇతర బ్యాంకు కార్డుదారులపై మాత్రం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఓ బ్యాంకు కార్డు, మరే ఇతర బ్యాంకు ఏటీఎంలోనైనా నెలలో మూడు లేదా ఐదుసార్లు వరకు చేసే లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఆ పరిమితి దాటిన తర్వాత ఆయా బ్యాంకులు ఒక్కో లావాదేవీకి రూ.14 నుంచి రూ. 29 వరకు చార్జీలు వసూలు చేస్తున్నాయి. నగదు విచారణ, మినీ స్టేట్మెంట్లకు కూడా రూ.5 నుంచి రూ.10 లెక్కన చార్జీలు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 31 వరకు ఏటీఎం లావాదేవీలపై చార్జీలు ఎత్తివేడంతో ఆయా బ్యాంకులు ఆదాయం కోల్పోతున్నాయి. దీంతో ఈ తాత్కాలిక నష్టం నుంచి గట్టెక్కేందుకు ఏటీఎంలలో నగదు నింపకుండా నగదు కొరతను సాకుగా చూపిస్తున్నాయి. ప్రధాన శాఖ ఏటీఎంలోనే నగదు... రోజువారీ అవసరాలకు చేతిలో నగదులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పలు బ్యాంకులు తమ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో ఆయా బ్యాంకులకు చెందిన 750 బ్రాంచీలున్నాయి. వీటి పరిధిలో 811 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ నెల 8న పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 10వ తేదీ వరకు ఏటీఎంలు పని చేయబోవని చెప్పారు. అప్పటి నుంచి కూడా 811 ఏటీఎంలలో కేవలం 20 శాతం కూడా పూర్తి స్థాయిలో పని చేయలేదు. క్యాష్ లేదనిపించుకోకుండా పలు ప్రైవేటు బ్యాంకులు కాకినాడ, రాజమహేద్రవరం నగరాల్లో పలు శాఖలున్నా ప్రధాన శాఖ వద్ద ఉన్న ఏటీఎంలలోనే నగదు అందుబాటులో ఉంచుతున్నాయి. ఏటీఎంల ముందు ప్రజల బారులు ఏటీఎం విత్‌డ్రాలపై పరిమితి విధించడం, పూర్తి స్థాయిలో ఏటీఎంలు పని పనిచేయకపోవడంతో గత మూడు వారాలు నుంచి ప్రజలు బ్యాంకులు, వాటి వద్ద ఉన్న ఏటీఎంల వద్ద బారులుదీరి ఉంటున్నారు. గత 20 రోజులుగా పనులు కూడా మానుకుని గంటల తరబడి ఏటీఎంల వద్ద నిలబడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఏటీఎంలను రూ. రెండువేల నోట్లను ఉంచినా ప్రజల ఇబ్బందులు చాలా వరకు తీరే అవకాశం ఉంది. కానీ నగదు నింపకుండా నో క్యాష్ బోర్డులు పెడుతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎంలను పూర్తిగా మూసివేస్తుండగా, మరికొన్ని ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భయంతో ’ఏటీఎం ఔట్ ఆఫ్ సర్వీస్’ బోర్డులు పెడుతున్నాయి. -
తెర పడేదెప్పుడో?
తీరని పాత నోట్ల మార్పిడి కష్టాలు సెలవు రోజైనా బ్యాంకుల ముందు బారులు ఆదివారం మరింతగా పెరిగిన రద్దీ ఉదయం ఏడు గంటల నుంచే క్యూలు పని ఒత్తిడితో బ్యాంకు సిబ్బంది సతమతం పేదలతో నల్లధనం మార్పించుకుంటున్న పెద్దలు రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక ప్రజల అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం : కరెన్సీ కష్టాలకు ఇప్పట్లో తెర పడే పరిస్థితి కనిపించడంలేదు. సెలవు రోజైన ఆదివారం కూడా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు క్యూలు కట్టారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఆదివారం రద్దీ పెరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు మహిళలు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని బ్యాంకులు లేకపోవడంతో ప్రజలు పట్టణాల బాట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు సిబ్బంది ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతున్న బ్యాంకులు రాత్రి 8 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. పాత నోట్ల మార్పిడి, జమ చేయడం కోసం వచ్చేవారితో సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి 8 తర్వాత లావాదేవీలు నిలిచినా.. తరువాత అంతర్గతంగా జరిగే పనులు రాత్రి 2 వరకూ సాగుతున్నాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రూ.100 నోట్లకు కొరత పాతనోట్లు మార్చుకుని రూ.2 వేల నోట్లు తీసుకున్న సంతోషంలో ఉన్న సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రూ.2 వేల నోటుకు చిల్లర లేకపోవడంతో చేతిలో నగదు ఉన్నా అవసరానికి ఉపయోగపడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకే రూ.2 వేల నోట్లతోపాటు రూ.100 నోట్లు ఇస్తున్నాయి. బ్యాంకులో ఖాతా లేకుండా నగదు మార్చుకునేందుకు వస్తున్నవారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. ఏటీఎంలలో పెడుతున్న రూ.100 నోట్లు రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. డిమాండుకు తగినట్టుగా రూ.100 నోట్ల సరఫరా లేకపోవడంతో బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. వ్యాపారం కోసం పెద్ద నోట్ల స్వీకరణ తాజా పరిస్థితుల్లో వ్యాపారులు పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నోట్లను డిసెంబర్ 31 వరకూ మార్చుకోవచ్చని అవగతమైన తర్వాత కొంతమంది రూ.500 నోట్లు స్వీకరిస్తున్నారు. నాలుగు రోజులుగా వ్యాపారం తగ్గిపోవడంతో గత్యంతరం లేక ఆదివారం మార్కెట్లో కొందరు చిరు వ్యాపారులు రూ.500 నోట్లు తీసుకుంటున్నారు. జోరుగా కమీషన్ల వ్యాపారం పేదలు, సామాన్యుల ద్వారా నల్లధనం మార్చుకునే ప్రణాళికలు పెద్దలు ఆచరణలో పెడుతున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల మహిళలను కూడా పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్కరు గరిష్టంగా రూ.4 వేలు మార్చుకోవచ్చు. ఇదే అదునుగా నల్ల కుబేరులు వారితో తమ డబ్బు మార్చుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను వారికి 10 శాతం కమీష¯ŒS ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల అధ్యక్షుల సహాయంతో కొందరు రాజకీయ నేతలు పెద్ద మొత్తంలో నల్లధనం మార్చుకుంటున్నట్లు సమాచారం. అందుకే నాలుగు రోజులైనా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గకపోగా పెరుగుతోందని అంటున్నారు. -
నోటు పాట్లు
-
కరెన్సీ కలకలం..!
ఏటీఎంల ఎదుట బారులుదీరిన ప్రజలు పెట్రోలు బంకుల్లో రూ.500, రూ.1000 నోట్ల నిరాకరణ నిర్ణయం మంచిదే... హడావుడి ప్రకటనతో జనం ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : కేంద్రప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న రూ.500, రూ. 1000 కరెన్సీ నోట్లు ఉపసంహరణ నిర్ణయం జిల్లాలో కలకలాన్ని సృష్టించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోఒక కుదుపు కుదిపే ఈ కరెన్సీ ఉపసంహరణపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ప్రభుత్వం నల్లదనాన్ని వెలికి తీయడం ద్వారా సామాన్యులు, మధ్య తరగతి వర్గాల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లధనం బయటకు వస్తుందని భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు సంపన్న వర్గాల్లోనే కనిపించే రూ.1000లు నోటు ఇప్పుడు సామాన్య, మ««దl్య తరగతి కుటుంబాలు కూడా విరివిగానే వినియోగిస్తున్నాయి. ప్రధాన మంత్రి ప్రకటన వెలువడిందో లేదో మంగళవారం రాత్రి దాని ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని పెట్రోలు బంకుల్లో రూ.500ల నోటు ఇచ్చి రూ.100లు పెట్రోలు పోయమని వెళ్లిన వాహన చోదకులకు బంకుల్లో పెట్రోలు పోయడం లేదు. బంకుల్లో తమ వద్ద రూ.500లకు చిల్లర లేదనే సమాధానం ఎదురైంది. కావాలంటే రూ.500లు పెట్రోలు పోయమంటే పోస్తామంటున్నారు. లేదంటే రూ.100లు నోటు ఇస్తేనే పెట్రోలు పోస్తామని బంకుల్లో సమాధానం చెప్పడంతో వినియోగదారులు తిరుగుముఖం పట్టడం కనిపించింది. బ్యాంకుల్లో ఇక ఇక్కట్లే... ఈ రెండు నోట్లు ఉపసంహరణ మాట ఎలా ఉన్నా వాటిని బ్యాంకులు, తంతితపాలా కార్యాలయాల్లో జమచేసి కొత్త నోట్లు తీసుకోవాలని ప్రధాని ప్రకటించారు. ప్రధాని ప్రకటన పైకి చూడటానికి అంతా బాగానే కనిపిస్తున్నా ఆ నోట్లను బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో జమ చేయడానికి నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లో అయితే నగదు వెనక్కు ఇచ్చేస్తే ఆ మేరకు బ్యాంకు ఖాతాల్లో వివరాలు నమోదు చేస్తారు, అదే పోస్టల్ కార్యాలయాల్లో జమచేస్తే ఏదైనా రశీదు ఇస్తారా లేదా అనే మీమాంసలో ఖాతాదారులున్నారు. ఎందుకంటే దాదాపు అన్ని బ్యాంకుల్లో నగదు లావాదేవీలన్నీ ఇప్పటికే ఆ¯ŒSలై¯ŒSలో అయిపోయింది. అయినా ఏ బ్యాంకులో చూసినా నగదు కోసం ఖాతాదారులు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు ప్రధానమైన రూ.500లు, రూ.1000లు నోట్లు ఉపసంహరణ అంటే వాటిని తిరిగి తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అందునా ఏటీఎంలు బుధ, గురువారాల్లో రెండు రోజులు పనిచేయవని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల మరింత ఇబ్బందుల్లో పడతామంటున్నారు. రెండు రోజులపాటు ఎ.టి.ఎం.లు పనిచేయవని కేంద్రం ప్రకటించడంతో రాత్రికి రాత్రి అవసరాల కోసం సొమ్ము తీసుకోవడానికి జనం పరుగులు తీస్తున్నారు. రూ.500లు, రూ.1000లు నోట్ల స్థానంలో కొత్తగా ఇచ్చే నోట్లు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు పంపించినట్టు బ్యాంకు వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆయా బ్యాంకులకు ఉన్న చెస్ట్ బ్యాంకులో నగదు బండిల్స్ రెండు రోజుల క్రితమే వచ్చాయంటున్నారు. సాహసోపేతమే నల్లధనాన్ని నిరోధించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే. రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల వద్దే నల్లధనం ఉంది. వీరంతా ఇప్పటికే బంగారాలు, ఆస్తులపై పెట్టేశారు. వీటిని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తే మోదీ తీసుకునే నిర్ణయానికి సాఫల్యం ఉంటుంది. – పి.చిరంజీవినికుమారి, విద్యావేత్త, కాకినాడ విప్లవాత్మక నిర్ణయం ప్రధాని మోదీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి సొమ్మును అదుపు చేసేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. అర్థం లేకుండా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలకు బ్లాక్‌మనీయే ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. – వైడీ రామారావు, రేట్పేయర్ అసోసియేష¯ŒS అధ్యక్షులు, కాకినాడ నల్లధనం బయటకు వస్తుంది నల్లధనాన్ని బయటపెడతామని ప్రధాని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించారన్నారు. అందు కే ఈ నోట్లను రద్దు చేశారు. ఈ నెల 31లోగా ఈ నోట్లను బయటకు తెచ్చి రెగ్యులైజ్ చేసుకోవాలి. ఆర్ఎఫ్ఐడీ విధానంలో విడుదల చేస్తున్న రూ.2 వేల నోటు వల్ల భవిష్యత్‌లో బ్లాక్ మనీకి అవకాశం ఉండదు. – ఉంగరాల చినబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
పెట్రోల్ బంకు యజమానుల మెరుపు సమ్మె
సాక్షి, రాజమహేంద్రవరం : పెట్రోలు బంకు యజమానులు జిల్లాలో గురువారం రాత్రి 7:30 గంటలకు మెరుపు సమ్మె చేశారు. అపూర్వచంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆయిల్ కంపెనీల నుంచి గురు, శుక్ర వారాల్లో పెట్రో, డీజిల్ కొనుగోళ్లు నిలిపివేస్తూ పెట్రోలియం డీలర్స్ రాష్ట్ర అసోసియేష¯ŒS నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కొండపల్లి హెచ్‌పీసీఎల్ ఆయిల్ డిపో నుంచి ట్యాంకర్లు బయటకు రాకుండా డీలర్లు అడ్డుకున్నారు. దీనిపై హెచ్‌పీసీఎల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డీలర్లను అరెస్టు చేశారు. ఆ అరెస్ట్‌లను నిరసిస్తూ రాష్ట్ర అసోసియేష¯ŒS తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో పెట్రోల్ బంకు యాజమాన్యాలు మెరుపు సమ్మెకు దిగాయి. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ కంపెనీలకు చెందిన 267 పెట్రోలు బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే వరకు అన్ని కంపెనీల పెట్రోలు బంకుల్లో సమ్మె కొనసాగుతుందని జిల్లా పెట్రోలియం డీలర్ల అసోసియేష¯ŒS అధ్యక్షుడు నల్లమిల్లి జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి తెలిపారు. డీలర్ల పట్ట దురుసుగా ప్రవర్తించిన హెచ్‌పీసీఎల్ క్షమాపణలు చెప్పే వరకూ జిల్లాలో ఆ కంపెనీ చెందిన బంకుల్లో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
సెజ్ భూములుండగా.. పేదలవే కావాలా?
తుని : కాకినాడ సెజ్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములు ఉండగా దివీస్ మందుల పరిశ్రమ కోసం పేద రైతుల భూములను తీసుకుని వారి కడుపు కొట్టడం దారుణమని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా తొండంగి మండలంలోని తీర ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మట్టా లక్షి్మని ఎమ్మెల్యే రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివీస్ పరిశ్రమకు సెజ్ భూముల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇందుకు భిన్నంగా కారు చౌకగా పేదల భూములను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సెజ్ భూములైతే ఎకరాకు రూ.75 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే పేదల భూములను రూ. 5 లక్షలకు అప్పనంగా కొట్టేయవచ్చనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేనైన తనను తీవ్రవాదిగా సీఎం చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని రాజా మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రజల తరఫున నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనమన్నారు. పేద రైతుల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. -
మన్యం బంద్ పాక్షికం
రవాణా వాహనాల లేక ప్రయాణికుల ఇక్కట్లు వైరామవరంలో దుకాణాల బంద్ రంపచోడవరం : ఆంధ్రా, ఒడిషా బోర్డర్ (ఏఓబీ) పరిధిలోని మల్కనగిరి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలీసు ఎదురు కాల్పులకు నిరసనగా మావోయిస్టులు గురువారం తలపెట్టిన బంద్ జిల్లా ఏజెన్సీలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాల నుంచి సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఎక్కడా ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మండల కేంద్రమైన వై రామవరంలో దుకాణాల మూసివేత, ఏజెన్సీ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేతతో బంద్ పాక్షికంగా ముగిసింది.వై రామవరం మండలంలో ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరగలేదు. నిర్మానుష్యంగా ఆంధ్రా–చత్తీస్‌గఢ్ రహదారి మావోయిస్టుల బంద్ పిలుపుతో గురువారం ఆర్టీసీ సర్వీసులు, ప్రయివేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆంధ్రా–చత్తీస్‌గఢ్‌లోని జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. దీంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రజారవాణాకు ఆటంకం కలిగింది. రాజమండ్రి, విశాఖ, విజయవాడ, కాకినాడ ,గోకవరం , రావులపాలెం ఆర్టీసీ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. విలీన మండలమైన ఎటపాక నుంచి డొంకరాయి వరకూ పోలీసులు ఆటోలు ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బంది పడ్డా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోగలిగారు. చత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.గోకవరం –రంపచోడవరంల మధ్య మాత్రం ఆర్టీసీ బస్సు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాజవొమ్మంగి, గంగవరం, మారేడుమిల్లి, అడ్డతీగల మండల కేంద్రాలతో పాటు లోతట్టు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. సరిహద్దులో అదనపు బలగాలు బంద్ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రంపచోడవరం –భద్రాచలం మార్గంలోని రంపచోడవరం, మారేడుమిల్లి , చింతూరు పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.అలాగే భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఎస్పీ రవిప్రకాశ్ ఏజెన్సీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. 54 ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత రాజమహేంద్రవరం సిటీ : ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ నేపథ్యంలో గురువారం రాజమహేంద్రవరం, కాకినాడ డిపోల నుంచి ఏజెన్సీకి వెళ్లే బస్సులను రద్దు చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. అలాగే గోకవరం, ఏలేశ్వరం డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంత బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేశామన్నారు. వివిధ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మొత్తం 54 సర్వీసులను నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. బంద్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కూడా ఈ డిపోలకు చెందిన బస్సులను అధికారులు నిలిపి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. -
కాంట్రాక్టర్ కోసం ప్రజలను బలిచేస్తున్నారు
వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ గిరిజాల బాబు రోడ్డు విస్తరణ పనుల నిర్లక్ష్యంపై పార్టీ శ్రేణుల ధర్నా కడియం : కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కెనాల్ రోడ్డు వెంబడి నివసిస్తున్న ప్రజల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ గిరజాల వీర్‌ారజు (బాబు) ఆరోపించారు. కెనాల్ రోడ్డు నిర్మాణం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వేమగిరి కొత్తపేట వద్ద రోడ్డుపై రెండు గంటల పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా గిరిజాల బాబు మాట్లాడుతూ ఇక్కడకు సమీపంలో సగం రోడ్డు కాలువలోకి జారిపోయిందన్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. 2013లో చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ పనులు ఈ మూడేళ్లలో కేవలం ఐదు శాతమే పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగిందని గిరజాల చెప్పారు. కడియం ఎస్సై ఎం. సురేష్‌బాబు ధర్నా వద్దకు చేరుకుని గిరజాల తదితరులతో చర్చించినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో రాజమహేంద్రవరం దక్షిణ మండలం డీఎస్పీ నారాయణరావు అక్కడకు చేరుకుని మాట్లాడారు. అనంతరం ఆర్అండ్బీ ఈఈ రాఘవరావుతో ఫో¯ŒSలో చర్చించారు. నవంబరు మొదటి వారంలో రోడ్డు మరమ్మతులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ గడవులోగా పనులు ప్రారంభం కాకపోతే ఆమర నిరాహార దీక్షకు దిగుతానని గిరజాల బాబు హెచ్చరించి, ఆందోళన విరమించారు. ధర్నాలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషగిరి, పార్టీ నాయకులు చిక్కాల ఉమామహేశ్వరరావు, మీర్జా ఆలీ, ఎలుగొండ లక్ష్మి, పెరుగు నాగేశ్వరరావు, ఎ¯ŒSవీ శేఖర్, జిల్లా కార్యదర్శి ఈలి గోపాలం, సాపిరెడ్డి కామేశ్వరరావు, దొంతంశెట్టి వీరభద్రరావు, గారపాటి బుజ్జిబాబు, ముద్రగడ ప్రసాదు, కప్పల భాస్కరరావు, కేవీ రావు, దండగల మరిడయ్య, ఒంటెద్దు కృష్ణ, వరసాల మూర్తి, గాడ తాతారావు, మామిడి మోరిస్, ఉప్పులూరి హనుమంతరావు, దంగుడుబియ్యం సత్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఆలమూరి శ్రీనివాసరావు, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు ముందు గిరిజాల బాబు పార్టీ సమావేశం నిర్వహించారు. -
మళ్లీ మొదలైన కబేళా కంపు
పట్టించుకోని అధికారులు చర్మనిల్వల కేంద్రానికి యత్నాలు రామచంద్రపురం: కాకినాడ–రామచంద్రపురం రోడ్డులో రామచంద్రపురం వస్తోందనే సరికి భరించలేని దుర్వాసన స్వాగతం పలుకుతుంది. దానికి అసలు కారణం అనధికార కబేళా. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ముక్కుమూసుకు పోతున్నారే తప్ప దాన్ని మూయించేందుకు చర్యలు చేపట్టడం లేదు. దాంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. విజయవాడ వయా రామచంద్రపురం బస్సు కాకినాడలో ఎక్కిన సోమేశ్వరరావు టిక్కెట్ తీసుకుని కునుకు తీశాడు. 40 నిముషాల జర్నీ అనంతరం భరించలేని దుర్వాసనతో ఆయన మెళకువ వ చ్చింది. ముక్కుమూసుకుని అరే అంతలోనే రామచంద్రపురం వచ్చేసిందా...? అంటూ డోర్ దగ్గరకు వెళ్లాడు. ఇదీ పరిస్థితి. కాకినాడ నుంచి రామచంద్రపురం వచ్చే వాహనదారులకు, పట్టణ ముఖద్వారం వద్ద గుప్పుమనే దుర్వాసన స్వాగతం పలుకుతుంది. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా పశువధ జరుగుతున్నప్పటికీ అటు పోలీ సులు కానీ ఇటు అధికార యంత్రాగం చూసి చూ డనట్లు వ్యవహరిస్తోంది. దాంతో ఈ అక్రమ కబేళాపై చర్య తీసుకోని వారిని ఆ మార్గంలో వెళ్లేవారందరూ విమర్శించడం పరిపాటి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా రామచంద్రపురానికి మా త్రం ఈ దుస్థితి పోవటంలేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబేళా నిర్వహించరా దని కోర్టులు ఆదేశాలిచ్చి నా... మరోమార్గంలో నిర్వహిస్తున్న ఈ కబేళాను పూర్తి స్థాయిలో అధికారులు అరికట్టలేకపోతున్నారు. పట్టణం నుంచి కాకినాడ వెళ్లే రహదారిలో చోడవరం సమీపంలో గతంలో భారీ స్థాయిలో కబేళాను నిర్వహిస్తూ పశువధ చేసేవారు. మాంసాన్ని లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి మిగిలిన అవశేషాలను అక్కడే వదిలేసేవారు. మాంసం తీసిన దుమ్ములు, ఇతర వర్ధపదార్థాలను అక్కడే ఎండ బెట్టేవారు. దీంతో దుర్వాసన పట్టణంలోకి, చోడవరం గ్రామంలోకి విపరీతంగా వ్యాపిం చేది. కబేళా నుంచి కాలువల ద్వారా వ్యర్ధ జలాలు పంట పొలాల్లోనికి ప్రవేశించేవి. దాతో చోడవరం రైతులు, గ్రామస్తులు కోర్టును ఆశ్రయిచారు. దాంతో కోర్టు ఈ ప్రదేశంలో ఎటువంటి పశువధ జరపరాదని, కబేళాను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో 2013 డిసెంబర్ 13న ఆర్డీఓ కె. సుబ్బారావు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కబేళాపై దాడిచేసి దానికి సీలు వేశారు. దాంతో పట్టణ ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే తిరిగి ఏడాది కాలంగా ఇక్కడ అనధికారికంగా పశువధ జరుపుతుండడంతో తిరిగి కంపు ప్రారంభమైంది. దొంగచాటుగా పశువధ రామచంద్రపురం పరిసర గ్రామాల నుంచి, కోటిపల్లి, ద్రాక్షారామలలో జరుగుతున్న మార్కెట్లలో పశువులను కొనుగోలు చేసి పట్టణంలోని రాజబాబునగర్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటిని రాజబాబునగర్లోని పలు ప్రాంతాలలోను, పట్టణంలోని రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గల రోడ్డులో రెండు మూడు చోట్ల అనధికారికంగా వధిస్తున్నారు. ఆ పశువుల మాంసాన్ని విక్రయించి మిగిలిన వ్యర్ధాలను తొట్టి రిక్షాలు, ఆటోలలో చోడవరం వద్ద గల సీలు వేసిన కబేళా పక్క ప్రదేశంలో పడేస్తున్నారు. పశువుల దుమ్ములు, పేగులు, ఇతర వ్యర్ధాలను రోడ్డు పక్కనే గల ప్రాంతంలో ఎండబెడుతున్నారు. దీంతో దుర్వాసన కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తోంది. చోడవరం సమీపంలో వేస్తున్న వ్యర్థా వద్ద చర్మాల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిన్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీ డ్రైన్లలో వ్యర్ధాలు పట్టణంలో నిర్వహిస్తున్న అనధికార కబేళాతో ఆ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకోంటోంది. డ్రైనేజీలలో వర్ధాలను పడవేయటంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ అక్రమ కబేళాల నిర్వహణ విషయం తెలిసినప్పటికీ మున్సిప ల్ సిబ్బంది పట్టించుకోవటంలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయక్తంగా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాము అనధికారికంగా పశువధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాశాం. వారికి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వారి నేతృత్వంలో అనధికార కబేళాపై చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్దంగా ఉంది. – ఎ¯ŒSబీఎం మురళీకృష్ణ, డీఎస్పీ, రామచంద్రపురం -
దూరా..భారం
ప్రజావాణి రద్దుతో అవస్థలు తెలియక తరలివచ్చిన గ్రామీణ ప్రాంతవాసుల సాక్షి, కాకినాడ : ప్రజావాణి ... ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక ... ఆ ఆశతోనే జిల్లాలోని నలుమూలల నుంచి జిల్లా కేంద్రమైన కాకినాడలోని కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం బాధితులు తరలివస్తుంటారు. అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసిన సమాచారం అందరికీ తెలియకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలా వచ్చిన వారి వెతలు వినడానికైనా ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేస్తే బాగుటుందని పలువురు భావిస్తున్నారు. పత్రికల్లో ప్రకటిస్తే తమకేమి తెలుస్తుందంటూ సోమవారం కలెక్టర్ ప్రాంగణానికి వచ్చిన బాధితులు ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండల కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియ సాగుతున్నా అక్కడికి వెళ్లకుండా వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రాలకు తరలివస్తున్నారంటే కిందస్థాయి వ్యవస్థల వైఫల్యాలమేనని చెప్పవచ్చు. -
మాఫీకి టోపీ!
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరని చంద్రబాబు హామీ జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు నయాపైసా కూడా మాఫీ కాని వైనం పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మిన నేతన్నలు ‘బాబు వస్తాడు.. తమ బతుకులు మారుస్తాడ’ని నమ్మారు. రెండున్నరేళ్లు గడిచినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండడంతో.. నట్టేట మునిగామని వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా.. నయాపైసా రుణం కూడా మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్‌లూమ్స్‌కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో డబ్బు పడితే ఖతం మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. కనీసం ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని వారు కోరుతున్నారు. మా ఖాతాకు ఏ డబ్బు వచ్చినా తీసేసుకుంటున్నారు రోజంతా నిద్రాహారాలు మాని నేత నేసినా పొట్ట గడవడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనగానే ఎంతో సంతోషపడ్డాం కానీ, ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడంలేదు. మా అబ్బాయి వేసిన డబ్బులు, గ్యాస్ సబ్సిడీ సహా నా బ్యాంకు ఖాతాకు ఏ డబ్బు వచ్చినా వడ్డీల కింద నాకు తెలియకుండానే బ్యాంకు సిబ్బంది తీసేసుకుంటున్నారు. మరోపక్క అప్పులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. అప్పు చెల్లించకపోతే బజారుకీడుస్తామంటున్నారు. – యచ్చిన తాతారావు, నేత కార్మికుడు, కొత్తపల్లి రూ.4.75 కోట్ల మాఫీకి ప్రతిపాదనలు పంపాం జిల్లావ్యాప్తంగా 2014 మార్చి 31 వరకూ రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు సంబంధించి రూ.4.75 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు పంపాం. రుణమాఫీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వడ్డీలు సహా రుణమాఫీ నివేదికలు పంపడం వల్ల జాప్యం జరుగుతోంది. అర్హులైన కార్మికులందరికీ అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నాం. రుణమాఫీ నిధులు నేరుగా ఆయా కార్మికుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. మిగిలి ఉన్న అర్హులైన చేనేత కార్మికుల వివరాలు సేకరించి రెండో దఫా పంపుతాం. – ఎస్ఎస్ఆర్కే ప్రసాద్, సహాయ సంచాలకుడు, చేనేత, జౌళి శాఖ, కాకినాడ -
రసాయనాల ఫ్యాక్టరీతో ప్రాణాలకు ముప్పు
తక్షణం నిర్మాణ పనులు ఆపాలి వైఎస్సాసీపీ నేత డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ జి.దొంతమూరులో రెండు గ్రామాల ప్రజల నిరాహార దీక్ష వివిధ పార్టీల నేతలు సంఘీభావం జి.దొంతమూరు (రంగంపేట) : ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణం నిలుపుదల చేయాలని వెఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆయన ఒక్కసారైనా అసెంబ్లీలో ప్రస్తావించారాని ప్రశ్నించారు. కేపీఆర్ కాస్టిక్ సోడా, సల్ఫూ్యరిక్ యాసిడ్, ఫెస్టిసైడ్స్, థర్మల్, రసాయన మూలకాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా జి.దొంతమూరులో భారీ సంఖ్యలో ప్రజలు ఆదివారం రిలే నిరాహార దీక్ష చేశారు. పోరాట సమితి అధ్యక్షుడు గిరిజాల సత్తిబాబు, బిక్కవోలు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పడాల వెంకటరామారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష శిబిరంలో డాక్టర్ సూర్యనారయణ రెడ్డి మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీ వేయిస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్కరిపై కూడా కేసులు, రౌడీ షీట్లు ఎందుకు రద్దు చేయించలేక పోయారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్దానాలను విస్మరించి ప్రజల్ని మోసగించిన ఎమ్మెల్యేకు సరైన సమయం ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉద్యమానికి వైఎస్సార్ సీపీ మద్దతునిస్తూ బలభద్రపురం గ్రామ పంచాయతీ ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాపోరాటాలను చూసి కేపీఆర్ సంస్థలకు బ్యాంకులు కూడా అప్పులు మంజూరు చేయడం మానేశాయన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాభివృద్ధికి, ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా, రాజకీయ పార్టీలకతీతంగా అంకిత భావంతో పనిచేసే వ్యక్తినే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. పడాల వెంకటరామారెడ్డి మాట్లాడుతూ 20 కేసుల్లో 400 మందిపై పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలని, కాలుష్యాన్ని వెదజల్లే ఈ ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ మార్గంలోనే శాంతియుతంగా చేతులకు నల్లరిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపామని, 1337 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుకలిగించే కేపీఆర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలకు అండాగా నిలుస్తామని ఏపీ రైతుకూలీ సంఘ రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి బాబ్జి, సీపీఐ (ఎంఎల్) జనశక్తి జిల్లా కార్యదర్శి బి.రమేష్ తదితరులు హామీ ఇచ్చారు. వీరంపాలెం ఎంపీటీసీ సభ్యుడు మత్సా వీరభద్రరావు మాట్లాడుతుండగా స్థానిక టీడీపీ నేతలకు, వైఎస్సార్ సీపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. పార్టీలకతీతంగా జరిగే ఈ ఉద్యమానికి అంతా సహకరించాలని పడాల రాము, గూడుపు సూరిబాబు కోరడంతో వివాదం సద్దుమణిగింది. తొలుత ఉద్యమకారులు బాలవరంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రగా జి.దొంతమూరు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ రైతు విభాగం సంయుక్త కార్యదర్శి లంక చంద్రన్న, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వంటిమి సూర్యప్రకాశం, అడబాల వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదిర్శి పేపకాయల రాంబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుడాల శామ్యూల్, మాజీ సర్పంచ్ దుప్పలపూడి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పి.ఏడుకొండలు, ఆత్మ డైరెక్టర్ పి.వెంకటేశ్వర్లు, జగ్గంపేట మార్కెట్ కమిటీ సభ్యుడు కరుపోతు సత్యనారాయణ, బాలవరం, జి.దొంతమూరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
జిల్లాలో గడచిన 24 గంటల్లో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అత్యధికంగా ఐ పోలవరంల 16 సెం.మీ. వర్షపాతం కాకినాడ, ముమ్మడివరం, తాళ్లరేవు, అమలాపురం, కాట్రేనికోనల్లో 10 సెం.మీ రాజానగరంలో చెరువుకు గండి, జాతీయరహదారిపై నీళ్ల పరవళ్లు నిలిచిన వాహనాలు, ప్రయాణికులు, విద్యార్థులు అష్టకష్టాలు 3000 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. బుధవారం మొదలైన వర్షాలు గురువారం రెండో రోజు కూడా జిల్లా అంతటా కురిశాయి. ఈ వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జిల్లా కేంద్రం కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కాలనీల చుట్టూ వర్షపు నీరు చేరడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నాయి. . జాతీయ రహదారిపై పరవళ్లు ... ఐ.పోలవరంలో 16 సెం.మీ. వర్షపాతం రాజానగరం మండలం సూర్యారావుపేట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాజమహేంద్రవరం – విశాఖపట్నం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గడచిన 24 గంటల్లో జిల్లాలో 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఐ.పోలవరం మండలం లో 169.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఎటపాక మండలంలో 6.4 మిల్లీమీటర్లు నమోదైంది. కాకినాడ, ముమ్మిడివరం, తాళ్లరేవు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో వంద మిల్లీమీటర్లు దాటి వర్షపాతం నమోదైంది. . రంపవద్ద రాకపోకలకు అంతరాయం... రంపచోడవరం ఏజెన్సీలోని సీతపల్లివాగు దండంగి వద్ద ఉధృతంగా పొంగి ప్రవహిస్తూ దేవీపట్నం–ఇందుకూరి పేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పందిరిమామిడి–బందపల్లి మధ్య తాటివాడ వాగు పొంగి ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమహేంద్రవరం నగరాల్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. రాజమహేంద్రవరం బృహన్నలపేటలోకి వర్షం నీరుచేరింది. ఆర్యాపురం, తుమ్మలోవ, కంబాలచెర్వు, కృష్ణానగర్, కాకినాడ ముత్తానగర్, దుమ్ములపేట, మహలక్ష్మినగర్, పర్లోపేట, రావులపాలెం ప్రియదర్శినినగర్, ఇందిరాకాలనీ, కొత్తకాలనీలు ముంపునీరు చేరింది. . మూడు వేల ఎకరాల్లో పంటకు నష్టం... కొత్తపేట నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా పసుపు, కంద, అరటి, పువ్వులు, బొప్పాయి తదితర ఉద్యాన వన పంటలు వర్షాలకు నేలనంటేశాయి. సుమారు 3000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ముంపు బారిన పడ్డాయి. గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్దంగా మారాయి. డ్రైన్స్ పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్ద సక్రమంగా లేకపోవడం వల్లన శివారు కాలనీలు బు«రదమయంగా మారాయి. సామర్లకోట మండలం జి.మేడపాడు మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల, సామర్లకోట కూరగాయల మార్కెట్లోని నీలమ్మ చెరువుగట్టు రోడ్డు ముంపునకు గురైంది. పి.బి.దేవం గ్రామంలో రోడ్లు జలమయమ్యాయి. పెద్దాపురం–జగ్గంపేట రోడ్డు నీట మునిగింది. పిఠాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలతో ఏలేరు కాలువలు, పెదయేరు, గొర్రిఖండి పొంగిపొర్లుతున్నాయి. . + ఉప్పాడ కొత్తపల్లి మండల తీరప్రాంతంలో చేపలవేట నిలిపివేశారు. రంగంపేట మండలంలో చెరువులు నిండిపోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జి.దొంతమూరు గ్రామం ముంపునకు గురైంది. కాకినాడరూరల్ తూరంగి, వాకలపూడి, సూర్యారావుపేట, కొవ్వూరు, రమణయ్యపేట, తిమ్మాపురంలో పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. + కరప మండలం గొర్రిపూడిలో 300 కుటుంబాల వారు నివాసముంటున్న ఇందిర కాలనీ ముంపునకు గురైంది. తుని నియోజకవర్గంలో 300 ఎకరాల్లో ప్రత్తిపంట నీట మునిగింది.మరో రెండు మూడు రోజులు వర్షాలు ఇలానే ఉంటే ప్రత్తిపంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందున్నారు. సుమారు 100 ఎకరాల్లో కాయకూరల తోటల్లో వర్షపు నీరు నిలిచిపోయి రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎగువున కొండలపై నుంచి వస్తున్న వర్షం నీటితో తుని పట్టణంలో పలు రోడ్లు, కాలనీలు జలమయయ్యాయి. పంపా, తాండవ రిజర్వాయర్లుతోపాటు, చెరువులు పూర్తిగా నిండాయి, తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మాగుడు, కాండంకుళ్ళు, ఉల్లికోడి తదితర తెగుళ్ళు ఖరీఫ్ పంటను ఆశించి ఉన్నాయి. ప్రస్తుత వర్షంతో తెగుళ్ళ బెడద ఎక్కువ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే తెగుళ్ళు ఉధృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రమాదరకరంగా చెరువు గట్లు... మెట్ట ప్రాంతంలో చెరువులు ప్రమాదకరంగా మారాయి. ఏలేరు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 24.11 టీఎంసీల సామార్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.77 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. సుబ్బారెడ్డి సాగర్, పంపా, తాండవ ప్రాజెక్టులలోకి వర్షపునీరు చేరింది. చెరువులు పొంగి పొర్లుతుండటంతో దిగువ ప్రాంతాల్లో ఆయకట్టు రైతులు, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.జగ్గంపేట సమీపాన ఉన్న జగ్గమ్మ చెరువు నుంచి వర్షపునీరు పోయే వాలుకాలువ ఆక్రమణలో ఉండడంతో వర్షం పడితే చెరువుకు ఏ క్షణాన్నైనా గండిపడే ప్రమాదం ఉందని జగ్గంపేటవాసులు భయపడుతున్నారు. మెట్టలోని పత్తి, అపరాల పొలాల్లో వర్షంనీరు మరో 24 గంటలు నిల్వ ఉంటే పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన నెలకొంది.గొల్లప్రోలు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30వేల ఎకరాల్లో పత్తి, రంపచోడవరం ఏజెన్సీతో పాటు తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 25 వేలు ఎకరాల్లో అపరాల పంటలపై వర్షం ప్రభావం పడింది. గొల్లప్రోలు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30వేల ఎకరాల్లో పత్తి, తుని, ఏజెన్సీ, జగ్గంపేట ప్రాంతాల్లో 25 వేలు ఎకరాల్లో అపరాలు ముంపులో ఉన్నాయి. మరో రెండు రోజులు ఇలానే వర్షాలు కురిసి నీటి నిల్వ ఉంటే పత్తి దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వర్షబీభత్సం
-
పథకాల పంపిణీలో వివక్ష
జన్మభూమి కమిటీలదే హవా గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల గోడు ‘పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారు. జన్మభూమి కమిటీలదే తుది నిర్ణయంగా మారుతోంది. రెండేళ్లయినా పింఛను ఇవ్వలేదు. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. ఇంటి రుణం ఇస్తామంటే, ఇల్లు కూల్చి, పునాదులు వేసుకున్నాం. రుణం మంజూరు కాక, అసంపూర్తిగా ఉన్నాయి.’ ఇదీ అనేక గ్రామాల్లో ప్రజల ఆవేదన. మంగళవారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ నేతల వద్ద ప్రజలు తమ గోడు వెళ్లగక్కారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బాలాంత్రంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదని, దీంతో రోడ్లపైనే మురుగునీరు ఉండిపోతోందని మహిళలు మేడిశెట్ది దుర్గాదేవి, పిల్లి వరలక్ష్మి, పిల్లి వెంకటలక్ష్మి తదితరులు వైఎస్సార్ సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. శివారు గ్రామాలైన గోపాలరావుపేటలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నేతల ఇష్టానుసారం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడితిప్పలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి.. అర్హులైన తమకు పింఛన్లు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడం ఏమిటని రాజమహేం ద్రవరం రూరల్ నియోజకవర్గం హుక్కుంపేటలో బూరా రాజమణి పేర్కొంది. బొమ్మూరులో మురళీకొండపై సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిక్కాల వెంకటేశ్వరరావు చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ 11వ డివిజన్ వీఎల్ పు రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు రూ.200 పింఛను ఇచ్చేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల నుంచి పింఛను ఇవ్వడం లేద ని 70 ఏళ్ల తమ్మరి నూకరాజు వాపోయాడు. తన కుమార్తెకు రేషన్‌కార్డు మంజూరుచేసి ఏడాదైనా, ఇప్పటి వరకూ రేషన్ ఇవ్వడం లేదని కోరుమిల్లి వరలక్ష్మి తల్లి బిక్కవోలు నూకాలమ్మ పేర్కొంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని గొల్లపేటలో తనకు అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని జ్యోతుల చక్రం తెలిపాడు. మరుగుదొడ్డికి రూ.3 వేలు వసూలు మండపేట నియోజకవర్గంలోని వెలగతోడులో స్వచ్ఛ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి మంజూ రుకు రూ.మూడు వేలు వసూలు చేశారని గ్రామానికి చెందిన ఎల్.వరలక్ష్మి పేర్కొంది. రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పాలవుతున్నామని మాచర మట్టలుకు చెందిన శీలం రాంబాబు పేర్కొన్నారు. శివారు గ్రామం కావడంతో శ్రీరాంపురానికి అధికారులు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో రాజుగారి బీడు ప్రాంతంలో కనీసం పంచాయతీ కుళాయిలు వేయడం లేదని భీమవరపు మంగ తెలిపింది. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని మురారిశెట్టి నారాయణరావు తెలిపాడు. పునాదుల్లో నిలిచిన నిర్మాణం ఎన్నికల్లో ఇల్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇవ్వలేదని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తండి కొండలో గొర్రెల కనకరత్నం తెలిపింది. రుణం మంజూరు చేయకపోవడంతో పునాదులతో ఇల్లు ఆగిపోయిందని పిల్లి అచ్చియమ్మ, మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని పిల్లి సాయమ్మ నిప్పులు చెరిగారు. తనకు రెండేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో నవుండ్రు లక్ష్మణరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గృహరుణం మంజూరు చేశారని, టీడీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని గోడ సత్యవతి విలపించింది. -
గిరిపుత్రులంటే చులకనెందుకో
మన్యం కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేవరకూ కదలికేదీ...? వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరా తీయడంతో అప్రమత్తత వైఎస్సార్ నేతల పర్యటనలతో కళ్లు తెరిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు సాక్షిప్రతినిధి–కాకినాడ : గిరిపుత్రులంటే ఆమాత్యులకెందుకంత చులకనో. అందునా విలీన మండలాలంటే మరీను. రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గంలోని నాలుగు విలీన మండలాల్లో 350 పైనే గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో సుమారు లక్షన్నర మంది గిరిజనులున్నారు. తెలంగాణా నుంచి విడవడి మన జిల్లాలో విలీనమవడమే ఆ మండలాల ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు. వారి ఓట్లతో మనకేంటి పని అనుకున్నారో ఏమో తెలియదు కానీ వారి కష్టాలు, కన్నీళ్లు తుడవాలని జిల్లాలోని ఇద్దరు మంత్రులకు అసలు పట్టనేలేదు.అందుకే ప్రభుత్వం, మంత్రులు, జిల్లా అధికారులు కూడా ఆ మండలాల గిరిజనుల పట్ల సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. లేదంటే విలీన మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో నలుగురు గిరిజనులు మృత్యువాత పడి 32 మంది ఆసుపత్రిపాలై గిరిజనం హడలెత్తిపోతున్నప్పటికీ 30 రోజుల తరువాత గానీ గిరిజనసంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబుకు మెలకువ రాలేదు. అంతు చిక్కని వ్యాధితో విలీన మండలంలో తొలి మరణం గత నెల 14న నమోదైంది.అనంతరం వరుసగా ముగ్గురు గిరిజనులను ఈ వ్యాధి పొట్టనపెట్టుకు ంది. అలా 20 రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడినప్పటికీ బాధిత కుటుంబాలను జిల్లా నుంచి కేబినెట్లో కీలకశాఖలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధిత కుటుంబాలను కనీసం మానవతాదృక్పధంతోనైనా పలకరించిన పాపాన పోలేదు. మొదటి మరణం సంభవించి శుక్రవారానికి నెల రోజులు. నలుగురు మరణించి అంతమంది ఆస్పత్రిపాలయ్యాక 30 రోజుల తరువాత తీరిగ్గా రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు రంపచోడవరం ఏజెన్సీలో శుక్రవారం పర్యటించారు. కనీసం ఇప్పటికైనా వచ్చారని గిరిజనులు సరిపెట్టుకుంటున్న పరిస్థితి. వచ్చిన మంత్రి కూడా పర్యటనంటే జరిపారు కాని మృతుల కుటుంబాలకు ఏమాత్రం భరోసా ఇవ్వకుండానే తిరుగు ముఖంపట్టారు. మృతి చెందిన నలుగురు కోసం ఎవరిమట్టుకు వారు ఆయా కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించారు. ఒకో రోగికి లక్ష నుంచి లక్షన్నర ఖర్చు చేసినా మృతువు నుంచి బయటరాలేకపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలే. నెల తరువాత మంత్రి వస్తున్నారంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం అందుతుందని గిరిజనం గంపెడాశతో ఎదురుచూశారు. ఆర్థికంగా కూడా ప్రకటిస్తారని ఎదురుచూశారు. తీరా మంత్రి రావెల కేవలం మాటలతో సరిపెట్టేసి మృతుల కుటుంబాలకు పైసా కూడా ప్రకటించకుండానే వెళ్లిపోయారు. అక్కడికే పరిమితం కాకుండా మలేరియా మరణాలు లేవని, వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఉచిత ప్రకటనలివ్వడం పట్ల కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి మంత్రి రావెల గురువారమే ఏజెన్సీలో పర్యటనకు రావాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలు సాకుగా పర్యటన రద్దయింది. భద్రతా కారణాలతో రద్దు చేసిన మంత్రి పర్యటన భద్రతతో నిమిత్తం లేకుండానే అంత హడావిడిగా 24 గంటల్లో తెల్లవారేసరికి ఎలా వచ్చేయడం అటు అధికారులకు, ఇటు గిరిజనులకు విస్మయాన్ని కలిగించింది. విలీన మండలాల్లో అంతుపట్టని ఈ వ్యాధి, మృతుల విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి వైఎస్ఆర్సీపీ నేతలను పంపించి వారికి భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. అగమేఘాలపై మంత్రి విలీన మండలాల్లో పర్యటనకు రావడానికి ఆ మండలాల్లో మృతుల కుటుంబాల పరిస్థితిని జగన్ ఆరా తీయడమే కారణమంటున్నారు. మంత్రి పర్యటించి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ ఉండదని మృతుల కుటుంబాలు కోలుకునేలా ఆర్థిక సాయం అందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. మన్యంలో మలేరియా మరణాలు లేవు రంపచోడవరం : తూర్పు మన్యంలో మలేరియా జ్వరాలు గిరిజనులను వణికిస్తూ ప్రాణాలు తీస్తుంటే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు మాత్రం మన్యంలో మలేరియా మరణాలు లేవని ప్రకటించడం ఆ ప్రాంతవాసులను ఆశ్ఛర్యపరిచింది. ఏజెన్సీ పర్యటనకు వచ్చిన మంత్రి శుక్రవారం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుకున్నారు. అనంతరం ఆయన స్దానిక విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియా ప్రభావం తగ్గిందని, మలేరియాతో మరణించిన దాఖలాలు లేవన్నారు. వీఆర్ పురం మండలం అన్నవరానికి చెందిన గిరిజనులు కాకినాడ జీజీహెచ్‌సీలో కాళ్లు వాపు వ్యాధితో చికిత్స పొందుతున్నారని వారిని పరామర్శించినట్లు తెలిపారు. రంచోడవరం ఏరియా ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇద్దరు ప్రత్యేక వైద్య నిపుణులను నియమించగా వారు మూడు నెలల కాలం పనిచేసి వెళ్లిపోయారని, కొత్త వారిని నియమిస్తామన్నారు. ఏరియా ఆస్పత్రిని వంద పడకల స్థాయి ఆసుపత్రిగా మారుస్తామని, బ్లడ్ బ్యాంకు, ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య సేవలు కోసం టీఎస్పీ ( ట్రైబుల్ సబ్‌ప్లాన్ నిధులు)నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఐటీడీఏలకు అంబులెన్స్‌ల సదుపాయం కల్పిస్తామని, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మందులు కొరత లేదని మంత్రి చెబుతుండగా...‘ మందులు బయట కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నా’రని ఫిర్యాదు చేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి తదితరులు ఉన్నారు. ఈ మరణాల మాటేమిటీ? గిరిజన శాఖా మంత్రి మన్యానికి వస్తున్నారంటే గిరిజనుల్లో ఏదో ఆశ. ఎంతలేదన్నా మన శాఖా మంత్రి కదా ఏదో న్యాయం చేయకపోతారా ... భరోసాగా మాట సాయమైనా ఉండకపోతుందా అని ఆశించిన గిరిజనులకు ‘మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు అదనంగా తగిలిన చందంగా’ తయారైంది. అయితే అధికారుల లెక్కల్లో...వారు రాసుకున్న లెక్కల్లో మాత్రం ఈ మరణాలు సహజ మరణాలుగానో...వేరే వ్యాధి మృతులుగానో నమోదవుతున్నాయి. వారం రోజుల కిందటే దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన పొడియం బన్ని (2) మలేరియాతోనే అసువులు బాసాడు. మంత్రి ప్రకటన నేపధ్యంలో మన్యంలోని ‘సాక్షి’ నెట్వర్క్ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది కంటే పెరిగిన మలేరియా కేసులు... గత ఏడాది కంటే మలేరియా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలున్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా వీరిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా 4,496 మందికి మలేరియా ఉన్నట్టు తేలింది. మారేడుమిల్లి పీహెచ్సీ పరిధిలో గత ఏడాది 231 మలేరియా కేసులు నమోదుగా ఈ ఏడాది 335 కేసులు నమోదైయ్యాయి. తులసిపాకలల్లో 508 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదనంగా వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మంగంపాడు పీహెచ్సీలో 440 కేసులు నమోదు కాగా 500కు పైగా నమోదయ్యాయి. విటిదబ్బల పీహెచ్సీలో గత ఏడాది 277 కేసులు నమోదు కాగా ఏడాది 439 కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేసులే లేవు ... మరణాలే లేవు ... అంతా బాగుందని మంత్రి ఎలా చెబుతారని మన్యం ప్రశ్నిస్తోంది. -
వర్ష బీభత్సం
-
రూ.కోట్లు మీకు.. కష్టాలు మాకా?
చమురు సంస్థలపై విశ్వరూప్ మండిపాటు అమలాపురం టౌన్ : కోనసీమలో చమురు సంస్థలు రూ.కోట్లకు కోట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి మినహా ఆయా సంస్థల కార్యకలాపాల వల్ల తలెత్తుతున్న అపాయాల నుంచి ప్రజలకు రక్షణ కొరవడిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీ రిగ్ నుంచి ఎగజిమ్ముతున్న గ్యాస్‌ను అదుపు చేయకపోతే, ఆ గ్యాస్ మండితే కోనసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కోట్లు మీకు కష్టాలు మాకా...? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఆయా సంస్థల లాభాల్లో ఒక శాతం ఇక్కడి రక్షణ, అభివృద్ధికి వెచ్చిస్తే, ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యం, సంతృప్తి ఉంటుందని వివరించారు. చమురు సంస్థల రిగ్‌లు, బావుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు.. ఎప్పుడు, ఏ బ్లోఅవుట్ సంభవిస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. రక్షణపరంగా సాంకేతిక జాగ్రత్తలు తీసుకోకుండా కార్యకలాపాలు చేస్తే, ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కూడా ప్రజలతో మమేకమై, ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.