- పట్టించుకోని అధికారులు
- చర్మనిల్వల కేంద్రానికి యత్నాలు
మళ్లీ మొదలైన కబేళా కంపు
Published Thu, Oct 20 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
రామచంద్రపురం:
కాకినాడ–రామచంద్రపురం రోడ్డులో రామచంద్రపురం వస్తోందనే సరికి భరించలేని దుర్వాసన స్వాగతం పలుకుతుంది. దానికి అసలు కారణం అనధికార కబేళా. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ముక్కుమూసుకు పోతున్నారే తప్ప దాన్ని మూయించేందుకు చర్యలు చేపట్టడం లేదు. దాంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
విజయవాడ వయా రామచంద్రపురం బస్సు కాకినాడలో ఎక్కిన సోమేశ్వరరావు టిక్కెట్ తీసుకుని కునుకు తీశాడు. 40 నిముషాల జర్నీ అనంతరం భరించలేని దుర్వాసనతో ఆయన మెళకువ వ చ్చింది. ముక్కుమూసుకుని అరే అంతలోనే రామచంద్రపురం వచ్చేసిందా...? అంటూ డోర్ దగ్గరకు వెళ్లాడు. ఇదీ పరిస్థితి. కాకినాడ నుంచి రామచంద్రపురం వచ్చే వాహనదారులకు, పట్టణ ముఖద్వారం వద్ద గుప్పుమనే దుర్వాసన స్వాగతం పలుకుతుంది. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా పశువధ జరుగుతున్నప్పటికీ అటు పోలీ సులు కానీ ఇటు అధికార యంత్రాగం చూసి చూ డనట్లు వ్యవహరిస్తోంది. దాంతో ఈ అక్రమ కబేళాపై చర్య తీసుకోని వారిని ఆ మార్గంలో వెళ్లేవారందరూ విమర్శించడం పరిపాటి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలోకి వచ్చినా రామచంద్రపురానికి మా త్రం ఈ దుస్థితి పోవటంలేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబేళా నిర్వహించరా దని కోర్టులు ఆదేశాలిచ్చి నా... మరోమార్గంలో నిర్వహిస్తున్న ఈ కబేళాను పూర్తి స్థాయిలో అధికారులు అరికట్టలేకపోతున్నారు. పట్టణం నుంచి కాకినాడ వెళ్లే రహదారిలో చోడవరం సమీపంలో గతంలో భారీ స్థాయిలో కబేళాను నిర్వహిస్తూ పశువధ చేసేవారు. మాంసాన్ని లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి మిగిలిన అవశేషాలను అక్కడే వదిలేసేవారు. మాంసం తీసిన దుమ్ములు, ఇతర వర్ధపదార్థాలను అక్కడే ఎండ బెట్టేవారు. దీంతో దుర్వాసన పట్టణంలోకి, చోడవరం గ్రామంలోకి విపరీతంగా వ్యాపిం చేది. కబేళా నుంచి కాలువల ద్వారా వ్యర్ధ జలాలు పంట పొలాల్లోనికి ప్రవేశించేవి. దాతో చోడవరం రైతులు, గ్రామస్తులు కోర్టును ఆశ్రయిచారు. దాంతో కోర్టు ఈ ప్రదేశంలో ఎటువంటి పశువధ జరపరాదని, కబేళాను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో 2013 డిసెంబర్ 13న ఆర్డీఓ కె. సుబ్బారావు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కబేళాపై దాడిచేసి దానికి సీలు వేశారు. దాంతో పట్టణ ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే తిరిగి ఏడాది కాలంగా ఇక్కడ అనధికారికంగా పశువధ జరుపుతుండడంతో తిరిగి కంపు ప్రారంభమైంది.
దొంగచాటుగా పశువధ
రామచంద్రపురం పరిసర గ్రామాల నుంచి, కోటిపల్లి, ద్రాక్షారామలలో జరుగుతున్న మార్కెట్లలో పశువులను కొనుగోలు చేసి పట్టణంలోని రాజబాబునగర్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటిని రాజబాబునగర్‌లోని పలు ప్రాంతాలలోను, పట్టణంలోని రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గల రోడ్డులో రెండు మూడు చోట్ల అనధికారికంగా వధిస్తున్నారు. ఆ పశువుల మాంసాన్ని విక్రయించి మిగిలిన వ్యర్ధాలను తొట్టి రిక్షాలు, ఆటోలలో చోడవరం వద్ద గల సీలు వేసిన కబేళా పక్క ప్రదేశంలో పడేస్తున్నారు. పశువుల దుమ్ములు, పేగులు, ఇతర వ్యర్ధాలను రోడ్డు పక్కనే గల ప్రాంతంలో ఎండబెడుతున్నారు. దీంతో దుర్వాసన కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తోంది. చోడవరం సమీపంలో వేస్తున్న వ్యర్థా వద్ద చర్మాల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిన్తున్నట్టు తెలుస్తోంది.
మున్సిపాలిటీ డ్రైన్లలో వ్యర్ధాలు
పట్టణంలో నిర్వహిస్తున్న అనధికార కబేళాతో ఆ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకోంటోంది. డ్రైనేజీలలో వర్ధాలను పడవేయటంతో ఆయా ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ అక్రమ కబేళాల నిర్వహణ విషయం తెలిసినప్పటికీ మున్సిప ల్ సిబ్బంది పట్టించుకోవటంలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయక్తంగా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాము
అనధికారికంగా పశువధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాశాం. వారికి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వారి నేతృత్వంలో అనధికార కబేళాపై చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్దంగా ఉంది.
– ఎ¯ŒSబీఎం మురళీకృష్ణ, డీఎస్పీ, రామచంద్రపురం
Advertisement
Advertisement