- నగదు ఇవ్వకపోతే బ్యాంకు తెరవనివ్వం
కరెన్సీ సంక్షోభంపై జనాగ్రహం
Published Sat, Dec 17 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
బిక్కవోలు :
ప్రభుత్వం ఆదేశించినట్టు కనీసం రూ.2 వేలు కూడా ఇవ్వకపోతే బ్యాంకు తెరవడం దేనికంటూ బిక్కవోలు మండలం పందలపాక స్టేట్‌బ్యాంక్ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సరిగా నగదు బట్వాడా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ, బ్యాంకు తెరవడానికి వీల్లేదంటూ శనివారం సిబ్బందిని అడ్డుకుని, ఆందోళన చేశారు. గత గురువారం కూడా ఆందోళన చేస్తేనే కానీ నగదు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు మేనేజర్ రమేష్ వచ్చీ రావడంతోనే నగదు లేదని చెప్పడంతో.. ఉదయం 7 గంటల నుంచీ క్యూలో నిలుచున్న ఖాతాదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో తాళాలు తెరవడానికి వీల్లేదంటూ బ్యాంకు గేటుకు అడ్డంగా బైఠాయించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారితో వాగ్వాదానికి దిగిన అసిస్టెంట్ మేనేజర్‌ను సముదాయించి మేనేజర్ రమేష్ అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. సాయంత్రం ఐదు గంటల వరకూ అక్కడే వేచి చూసిన ఖాతాదారులు.. అధికారులెవరూ రాకపోవడంతో ఉస్సురంటూ వెనుతిరిగారు.
ఎస్‌బీఐ వద్ద వంట–వార్పు
కాకినాడ సిటీ : నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మెయి¯ŒS రోడ్డులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయి¯ŒS బ్రాంచ్ వద్ద వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంట–వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ, 41 రోజులు గడిచినా, సమస్య పరిష్కారం కాకపోగా, మరోపక్క అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చిందని, సామాన్యులు మాత్రం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్, మహిళా నాయకురాలు, ప్రముఖ న్యాయవాది లక్షీ్మనాయుడు, నగర అధ్యక్షుడు హసన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిచ్‌మండ్ కేరే, అధికార ప్రతినిధి ఆర్‌వీ రమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement