పెట్రోల్ బంకు యజమానుల మెరుపు సమ్మె
Published Thu, Nov 3 2016 11:26 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
పెట్రోలు బంకు యజమానులు జిల్లాలో గురువారం రాత్రి 7:30 గంటలకు మెరుపు సమ్మె చేశారు. అపూర్వచంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆయిల్ కంపెనీల నుంచి గురు, శుక్ర వారాల్లో పెట్రో, డీజిల్ కొనుగోళ్లు నిలిపివేస్తూ పెట్రోలియం డీలర్స్ రాష్ట్ర అసోసియేష¯ŒS నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కొండపల్లి హెచ్‌పీసీఎల్ ఆయిల్ డిపో నుంచి ట్యాంకర్లు బయటకు రాకుండా డీలర్లు అడ్డుకున్నారు. దీనిపై హెచ్‌పీసీఎల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డీలర్లను అరెస్టు చేశారు. ఆ అరెస్ట్‌లను నిరసిస్తూ రాష్ట్ర అసోసియేష¯ŒS తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో పెట్రోల్ బంకు యాజమాన్యాలు మెరుపు సమ్మెకు దిగాయి. జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ కంపెనీలకు చెందిన 267 పెట్రోలు బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే వరకు అన్ని కంపెనీల పెట్రోలు బంకుల్లో సమ్మె కొనసాగుతుందని జిల్లా పెట్రోలియం డీలర్ల అసోసియేష¯ŒS అధ్యక్షుడు నల్లమిల్లి జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి తెలిపారు. డీలర్ల పట్ట దురుసుగా ప్రవర్తించిన హెచ్‌పీసీఎల్ క్షమాపణలు చెప్పే వరకూ జిల్లాలో ఆ కంపెనీ చెందిన బంకుల్లో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Advertisement