పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగిన వినియోగదారులు
చాంద్రాయణగుట్ట: కొత్తగా మార్కెట్‌లోకి విడుదలైన రూ.2000 నోటుకు కూడా సరి పడా చిల్లర దొరకకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జీఎం చావునీ లోని పెట్రోల్ బంక్ సిబ్బంది, వినియోగదారుల నడుమ చిల్లర విషయంలో వివా దం నెలకొంది. ఒకనొక దశలో ఘర్షణకు దిగారు. అంతలో అక్కడే ఉన్న ఛత్రినాక పోలీసులు సముదారుుంచడంతో పరిస్థితి సద్దుమణిగింది.
సాధారణంగా పెట్రోల్ బంక్‌లో పాత రూ.500, రూ.1000 నోట్లను కూడా తీసుకోవాలని కేంద్రం ఆదేశించినప్పటికీ పెట్రోల్ బంక్ సిబ్బంది మాత్రం రూ.500-1000కి ఎంత వస్తుందో అంత కావాలంటేనే పెట్రోల్ పోస్తున్నారు తప్ప రూ.100-200లకు పెట్రోల్ పోయలేని పరిస్థితి నెలకొంది. చిల్లర సమస్య కారణంగా సోమవారం ఉదయం పెట్రోల్ పోరుుంచుకొని రూ.2000 నోటు ఇచ్చిన వినియోగదారుల కు చిల్లర లేవని చెప్పడంతో వివాదం నెలకొంది. పాతబస్తీలోని పలు వ్యాపార సముదాయాల వద్ద ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నారుు.