
వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాక ముందే నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హెచ్.బి.కాలనీలోని శ్రీ లక్ష్మీ నరసింహనగర్ కాలనీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ బిందెడు నీటి కోసం మహిళలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. కాలనీలో అనధికార కుళాయిలు పదుల సంఖ్యలో ఉండటంతో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫలితంగా కాలనీలోని ప్రతి ఇంటికి సరిగా నీరు అందడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యపై స్థానికులు ఇప్పటికే పలుమార్లు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంటే.. రానున్న వేసవిలో ఇంకెంత కష్టం వస్తుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే
స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment