దూరా..భారం | public suffer | Sakshi
Sakshi News home page

దూరా..భారం

Published Mon, Oct 17 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

దూరా..భారం

దూరా..భారం

  • ప్రజావాణి రద్దుతో అవస్థలు
  • తెలియక తరలివచ్చిన గ్రామీణ ప్రాంతవాసుల 
  •  
     సాక్షి, కాకినాడ  : 
    ప్రజావాణి ... ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక ... ఆ ఆశతోనే జిల్లాలోని నలుమూలల నుంచి జిల్లా కేంద్రమైన కాకినాడలోని కలెక్టరేట్‌కు  ప్రతి సోమవారం బాధితులు తరలివస్తుంటారు. అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసిన సమాచారం అందరికీ తెలియకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలా వచ్చిన వారి వెతలు వినడానికైనా ప్రత్యామ్నాయ ఏర్పట్లు చేస్తే బాగుటుందని పలువురు భావిస్తున్నారు. పత్రికల్లో ప్రకటిస్తే తమకేమి తెలుస్తుందంటూ సోమవారం కలెక్టర్‌ ప్రాంగణానికి వచ్చిన బాధితులు ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండల కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియ సాగుతున్నా అక్కడికి వెళ్లకుండా వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రాలకు తరలివస్తున్నారంటే కిందస్థాయి వ్యవస్థల వైఫల్యాలమేనని చెప్పవచ్చు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement