అక్కడ ఫెడ్ భయం... ఇక్కడ నోట్ల రద్దు నీరసం!
ముంబై/న్యూయార్క్: సమీప కాలంలో పసిడి అడుగులు తడబాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు భయాలు ఒకవైపు... దేశీయంగా రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం పసిడి బలహీనతకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి . డిసెంబర్ 13-14 తేదీల్లో వాషింగ్టన్‌లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు వినబడుతున్నాయి
ఈ పరిణామం పసిడి గమనానికి ఒక దిశా నిర్దేశం చేస్తుందన్న వాదనలు ఉన్నాయిఇక దేశీయంగా చూస్తే... పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా డిమాండ్ ఉన్నప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయిపలు ఆంక్షలు, ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వారంలో అసలు ఢిల్లీ, ముంబైలలో బంగారం షాపులు అసలు తెరవకపోవడం గమనార్హం.
ధరల జారుడు...: శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధరలు భారీగా పడిపోయాయిఅంతర్జాతీయంగా ఔన్‌స (31.1గ్రా) ధర దాదాపు 17 డాలర్లు పడిపోకయి 1,207 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగానూ ఇదే పరిస్థితి. ముంబై స్పాట్ మార్కెట్‌లో ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.1,205 తగ్గి రూ.29,310కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిపడిపోయి.29,160 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ.3,655 పడిపోయి.41,765 వద్దకు చేరింది.