ఫెడ్‌ అర శాతం వడ్డీ కట్‌ | US Federal Reserve: Powell-led FOMC delivers 50 bps rate cut for first time in 4 years | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ అర శాతం వడ్డీ కట్‌

Published Thu, Sep 19 2024 4:35 AM | Last Updated on Thu, Sep 19 2024 8:10 AM

US Federal Reserve: Powell-led FOMC delivers 50 bps rate cut for first time in 4 years

నాలుగేళ్ల తర్వాత యూటర్న్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి.  32 నెలల తదుపరి ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అధ్యక్షతన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్‌ తీసుకుంది.

 ఆగస్ట్‌లో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్‌ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం కోవిడ్‌–19 కారణంగా 2000 మార్చిలో ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. 

2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచి్చన ఫెడ్‌ 2023 జూలై తదుపరి నిలకడను కొనసాగిస్తూ వచి్చన సంగతి తెలిసిందే. 2000 డిసెంబర్‌లో 6.5 శాతానికి ఎగసిన ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు గతేడాది తిరిగి 5.5 శాతానికి చేరడంతో గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి! వడ్డీ రేట్ల తగ్గింపుతో యూఎస్‌ మార్కెట్లు 1% పైగా ఎగసి ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్‌ ధర 24 డా లర్లు పెరిగి 2,618 డాలర్ల ఆల్‌టైమ్‌ హైని చేరింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement