పెద్ద నోట్ల రద్దుతో మహానగరం ఒక్కసారిగా కకావికలమైంది. ఒకవైపు పనిచేయని బ్యాంకులు, ఏటీఎంలు. మరోవైపు సర్వత్రా రూ.500, రూ.1,000 నోట్ల తిరస్కరణ. దీంతో పెద్ద నోట్లు బుధవారం నగర వాసులకు కష్టాలు తెచ్చి పెట్టాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, మార్కెట్ ఇలా ఎక్కడికెళ్లినా.. బస్సెక్కినా, రైలు టికెట్ కోసం వెళ్లినా అంతటా రూ.500, రూ.1,000 నోట్లకు చుక్కెదురే అయింది.