
మైసూరు: రూ.500 నోటు కింద పడేసిన దుండగులు ఓ వ్యక్తిని ఏమార్చి రూ.1.50 లక్షలు దోచుకొని ఉడాయించారు. ఈ ఘటన మైసూరు జిల్లా, కే.ఆర్. నగర్‌లో చోటుచేసుకుంది. హుణసూరులోని కల్కుణికె గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కేఆర్ నగర్‌లోఉన్న నగర అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. తర్వాత సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పని ముగించుకున్నాడు.
సీ.ఎ. రోడ్డులోని శ్రీహోటల్‌లో టీ తాగుతుండగా అతన్ని వెంటాడిన దుండగులు అక్కడకు వచ్చారు. కింద రూ.500 నోటు పడేశారు. ఆ నోటు మీదేనా? అని గణేష్‌ను అడిగారు. నోటు తీసుకుంటుండగా దుండగులు గణేష్ చేతిలోని నగదు సంచి లాక్కొని బైక్‌పై ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేఆర్‌నగర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment