ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్‌ లిక్కర్‌ పట్టివేత? | Lok Sabha Elections Illegal Liquor Worth Rs 98 52 Crore Seized in Mysure | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. కర్ణాటకలో వంద కోట్ల ఇల్లీగల్‌ లిక్కర్‌ పట్టివేత?

Published Thu, Apr 4 2024 3:45 PM | Last Updated on Thu, Apr 4 2024 4:59 PM

Lok Sabha Elections Illegal Liquor Worth Rs 98 52 Crore Seized in Mysure  - Sakshi

మైసూర్: ఎన్నికలు మొదలయ్యాయంటే.. బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ నాయకులు తమవంతు ప్రయత్నాలు భారీగానే చేస్తారు. ఇప్పటికే దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. భారీ నగదు, లేదా లిక్కర్ తరలించడం చట్టరీత్యా నేరం. పలు ప్రాంతాల్లో లెక్కకు మించిన డబ్బు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో భారీ లెవల్‌లో ఇల్లీగల్‌ లిక్కర్‌ పట్టుబడినట్లు తెలుస్తోంది. 

చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్‌లో మైసూర్ డివిజన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భారీ అక్రమ మద్యం నిల్వలు ఘటన పెద్ద సంచలంగా మారింది. ఇప్పటికే సుమారు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని, 7,000 బాక్సులు మాత్రమే సోదాల్లో కనుగొన్నారని తెలుస్తోంది. అక్రమ రవాణా & హోర్డింగ్ వంటి వాటికి పాలపడిన కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement