
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తరపున నటుడు 'శివరాజ్‌కుమార్' ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, బిల్‌బోర్డ్‌ల ప్రదర్శనలను పూర్తిగా నిషేధించాలని బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది.
'శివరాజ్‌కుమార్' భార్య గీతా శివరాజ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో షిమోగా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాసిన లేఖలో.. శివరాజ్‌కుమార్ సినిమాలు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే శివరాజ్‌కుమార్ హక్కును మేము గౌరవిస్తున్నాము. అయితే ఎన్నికల సమయంలో ప్రజలపై ఆయన సినిమాల ప్రభావం ఉండకూడదు. కాబట్టి దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది అన్నారు.