sivarajkumar
-
Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' చిత్రానికి అంతర్జాతీయ అవార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ ఏడాదిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా తాజాగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. లండన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ' కెప్టెన్ మిల్లర్' సత్తా చాటింది.యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. గ్రే మ్యాన్ సినిమా ద్వారా ధనుష్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో ఆయన పేరు ఇప్పుడు హాలీవుడ్లో ట్రెండ్ అవుతుంది. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడినప్పటికీ విజేత కెప్టెన్ మిల్లర్ కావడంతో ధనుష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ కూడా నామినేషన్లో చోటు దక్కించుకుంది. కానీ, అవార్డ్ అందుకోలేపోయింది.ఈ చిత్రంలో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ధనుష్‌తో పాటు, ఈ చిత్రంలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనెన్బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసి ధనుష్ బెస్ట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం విశేషం. జులై 26న ఈ చిత్రం విడుదల కానుంది. సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Arun Matheswaran (@thatswatitis) -
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధనుష్ సినిమా నామినేట్
తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా సత్తా చాటుతున్నాడు ధనుష్. ఆయన నటుడిగానే కాకుండా గాయకుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత ఇలా మల్టీటాలెంటెడ్ కావడంతో ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కెప్టెన్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమా విడుదలై సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్‌కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.అయితే, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్‌కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. -
భార్య కోసం ప్రచారం.. స్టార్ హీరో సినిమాలు బ్యాన్ చేయాలంటూ విజ్ఞప్తి
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తరపున నటుడు 'శివరాజ్‌కుమార్' ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, బిల్‌బోర్డ్‌ల ప్రదర్శనలను పూర్తిగా నిషేధించాలని బీజేపీ శుక్రవారం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. 'శివరాజ్‌కుమార్' భార్య గీతా శివరాజ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో షిమోగా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ రఘు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాసిన లేఖలో.. శివరాజ్‌కుమార్ సినిమాలు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే శివరాజ్‌కుమార్ హక్కును మేము గౌరవిస్తున్నాము. అయితే ఎన్నికల సమయంలో ప్రజలపై ఆయన సినిమాల ప్రభావం ఉండకూడదు. కాబట్టి దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది అన్నారు. -
రామ్‌చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను సంప్రదించింది యూనిట్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా శివ రాజ్‌కుమార్ వెల్లడించారు. అయితే టాలీవుడ్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ మెంటర్‌గా శివరాజ్ కుమార్ కనిపించబోతున్నారట. ఈ స్పోర్ట్స్ డ్రామాలో శివన్న గురువు లాంటి పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పాయింటాఫ్ వ్యూలోనే ఫ్లాష్ బ్యాక్ లో కథ ఓపెన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
నా కళ్లతో భయపెట్టాను!
‘‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే డైలాగ్‌తో ‘ఘోస్ట్’ సినిమా టీజర్ విడుదలైంది. కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. బుధవారం శివ రాజ్ కుమార్ పుట్టినరోజుని (జూలై 12) పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి ‘ఘోస్ట్’ ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగు నిర్మాతతో... శివ రాజ్‌కుమార్ హీరోగా తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర పదిరి కన్నడంలో ఓ సినిమా నిర్మించనున్నారు. శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్సీఎఫ్సీపై (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) సుధీర్ చంద్ర పదిరి నిర్మించనున్న ఈ మూవీ క్యారెక్టర్ కాన్సెప్ట్ ΄ోస్టర్‌ని బుధవారం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
పాట కోసం ధనుష్ కు రూ.4 లక్షల వాచ్
శివరాజ్‌కుమార్ ‘వజ్రకాయ’ సినిమాలో ఓ పాటను పాడిన ధనుష్ సాక్షి, బెంగళూరు : ‘వై దిస్ కొలవెరి డీ’ ఈ పాట ఒకే ఒక్క రోజులో దేశాన్నంతా ఒక ఊపు ఊపేసింది. అంతేనా అప్పటి వరకు సినీపరిశ్రమలో మంచి నటుడిగా, రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్‌ను ఓ యూత్‌ఫుల్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి ధనుష్‌తో కన్నడలో కూడా ఓ పాటను పాడించాలని, ఎంతో మంది సంగీత దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులకు కన్నడ సినీప్రియులకు ధనుష్ గాత్రాన్ని వినే అవకాశం కలిగింది. అర్జున్‌జన్య సంగీత సారధ్యంలో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న వజ్రకాయ సినిమా ద్వారా కన్నడ సంగీత అభిమానులకు ధనుష్ చేరువకానున్నారు. చెన్నైలోని ధనుష్ స్టూడియోలో మంగళవారం ఈ పాటను రికార్డింగ్ చేశారు. ఈ విషయంపై వజ్రకాయ దర్శకుడు హర్ష మాట్లాడుతూ ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డీ పాటను విన్న తర్వాత కన్నడ సినిమాలో కూడా ఆయనతో ఓ పాటను పాడించాలని భావించానన్నారు. వజ్రకాయ సినిమాలోని ఓ పాట ఆయన గాత్రంలో అయితేనే చక్కగా ఉంటుందని భావించానన్నారు. అందుకే పాట లిరిక్స్, ట్యూన్ తీసుకుని చెన్నైలో ఉన్న ధనుష్‌ని కలిసి వినిపించామన్నారు. దీంతో ఈ పాటను పాడడానికి ఆయన అంగీకరించారని తెలిపారు. ఈ అద్భుతంగా వచ్చిందని వివరించారు. పాట కోసం రూ.4 లక్షల వాచ్ వజ్రకాయ చిత్రంలో పాట పాడినందుకు ధనుష్‌కి రూ.4 లక్షల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం గాంధీనగర్‌లో హాట్‌టాపిక్. ‘ధనుష్ పాటకు ఇంతని పారితోషికాన్ని చెల్లించడం కష్టతరమైన పని. అందుకే మా యూనిట్ తరఫున ఓ వాచ్‌ను ఆయనకు అందజేయనున్నాం. ఆ వాచ్ ధర ఎంతని మాత్రం నేను చెప్పలేను’ అని నిర్మాత సి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు. -
‘ఆర్యన్’గా నేడు ప్రేక్షకుల ముందుకు శివణ్ణ
ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్, నటి రమ్య ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్యన్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, రమ్య అథ్లెట్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకు బెంగళూరు నగర పరిసరాల్లోనే జరిగింది. ఇక ఈ సినిమాకు మొదట దర్శకత్వం వహించిన డీ రాజేంద్రబాబు గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణలో మిగిలిన భాగానికి గురుదత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే శాండల్‌వుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో శాండల్‌వుడ్‌లో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. -
శివన్నకు డాక్టరేట్
సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (వీఎస్కేయూ) రెండవ స్నాతకోత్సవం సందర్భంగా ఏడుగురు ప్రముఖులకు డాక్టరేట్ పట్టాలు శనివారం అందజేసింది. వాటిని అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు శివరాజ్‌కుమార్, కొట్టూరు స్వామి మఠం సంగన బసవ మహా స్వామీజీ, ప్రముఖ శాస్త్రవేత్త యూ ఆర్ రావ్, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ క్రాస్టా, దావణగెరెకు చెందిన సీ.ఆర్.నాసిర్ అహమ్మద్, తుమకూరు విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఎస్వీ శర్మ, బళ్లారి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారిణి సుభద్రమ్మ మన్సూర్ ఉన్నారు. అన్నా హజారేకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించాల్సి ఉండగా, ఆయన రాలేకపోయారు. నగరంలోని బీడీఏఏ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ మంజప్ప హొసమనే, మాజీ గవర్నర్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి రామాజోయిస్ డాక్టరేట్లను ప్రదానం చేశారు.