సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (వీఎస్కేయూ) రెండవ స్నాతకోత్సవం సందర్భంగా ఏడుగురు ప్రముఖులకు డాక్టరేట్ పట్టాలు శనివారం అందజేసింది. వాటిని అందుకున్న వారిలో ప్రముఖ సినీ నటుడు శివరాజ్‌కుమార్, కొట్టూరు స్వామి మఠం సంగన బసవ మహా స్వామీజీ, ప్రముఖ శాస్త్రవేత్త యూ ఆర్ రావ్, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ క్రాస్టా, దావణగెరెకు చెందిన సీ.ఆర్.నాసిర్ అహమ్మద్, తుమకూరు విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఎస్‌వీ శర్మ, బళ్లారి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారిణి సుభద్రమ్మ మన్సూర్ ఉన్నారు.
అన్నా హజారేకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించాల్సి ఉండగా, ఆయన రాలేకపోయారు. నగరంలోని బీడీఏఏ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ మంజప్ప హొసమనే, మాజీ గవర్నర్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి రామాజోయిస్ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.
శివన్నకు డాక్టరేట్
Published Sun, Jun 22 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM
Advertisement
Advertisement