తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా సత్తా చాటుతున్నాడు ధనుష్. ఆయన నటుడిగానే కాకుండా గాయకుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత ఇలా మల్టీటాలెంటెడ్ కావడంతో ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కెప్టెన్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చింది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమా విడుదలై సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్‌కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
అయితే, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్‌కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment