Captain Miller Movie
-
Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' చిత్రానికి అంతర్జాతీయ అవార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ ఏడాదిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా తాజాగా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. లండన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ' కెప్టెన్ మిల్లర్' సత్తా చాటింది.యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. గ్రే మ్యాన్ సినిమా ద్వారా ధనుష్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో ఆయన పేరు ఇప్పుడు హాలీవుడ్లో ట్రెండ్ అవుతుంది. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడినప్పటికీ విజేత కెప్టెన్ మిల్లర్ కావడంతో ధనుష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ కూడా నామినేషన్లో చోటు దక్కించుకుంది. కానీ, అవార్డ్ అందుకోలేపోయింది.ఈ చిత్రంలో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ధనుష్‌తో పాటు, ఈ చిత్రంలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనెన్బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసి ధనుష్ బెస్ట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం విశేషం. జులై 26న ఈ చిత్రం విడుదల కానుంది. సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Arun Matheswaran (@thatswatitis) -
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధనుష్ సినిమా నామినేట్
తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా సత్తా చాటుతున్నాడు ధనుష్. ఆయన నటుడిగానే కాకుండా గాయకుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత ఇలా మల్టీటాలెంటెడ్ కావడంతో ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో కెప్టెన్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమా విడుదలై సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్‌కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.అయితే, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్‌కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. -
హీరో ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. ఫైనల్ తీర్పు ఇచ్చిన కోర్టు
పాన్ ఇండియా స్టార్ హీరో ధనుష్ తమ కుమారుడు అని పేర్కొంటూ మేలూర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. మేలూర్కి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు.. నటుడు ధనుష్ తమ కుమారుడని 2015లో మేలూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను గతంలో వారు కోర్టుకు సమర్పించారు. స్కూల్లో చదువుతున్నప్పుడు ధనుష్ ఇంట్లో నుంచి పారిపోయాడని వారు కోర్టుకు తెలిపారు. ధనుష్ తమ అబ్బాయి అని వారు సమర్పించిన అధారాలను పరిశీలించిన కోర్టు తాజాగా ఈ కేసును కొట్టివేసింది. పిటిషన్ దారుడు ఆరోపణలు రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసులో నిజంలేదని తెలిపి పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ధనుష్ తమ కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరిన కదిరేశన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పుట్టుమచ్చలతో కేసు క్లియర్ కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం ధనుష్ వ్యక్తిగతంగా కోర్టుకు హజరయ్యారు. కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. ధనుష్‌కు పుట్టుమచ్చలు లేవని తేలడంతో కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్ జన్మించినట్లు తీర్పును వెళ్లడించింది. -
ఓటీటీలో ధనుష్ మూవీ.. ఇన్నాళ్లకు మోక్షం!
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోటీపడ్డాయి. మహేశ్‌బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగతో పాటు తేజ సజ్జ హనుమాన్ కూడా సంక్రాంతి బరిలో దిగింది. అయితే పెద్ద సినిమాలను వెనక్కినెట్టి హనుమాన్ విజేతగా నిలిచింది. సైంధవ్ మినహా మిగతా రెండు చిత్రాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. నిజానికి ఈ చిత్రాలతో పాటు ధనుష్ యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తం ఎన్నికోట్లు వచ్చాయంటే? కానీ థియేటర్లు దొరక్కపోవడంతో ఇక్కడ ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సాధారణ వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. తమిళనాట మాత్రం హిట్ కొట్టింది. ఓవరాల్‌గా రూ.104 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. హిందీ వర్షన్ మాత్రం విడుదల చేయలేదు. ఇక హిందీలో చూడొచ్చు తాజాగా హిందీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఓటీటీకి వచ్చిన నెల రోజులకు హిందీలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. మార్చి 8 నుంచి హిందీ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ధనుష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య.. ఇక హిందీలో చూడొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. witness the rise of this revolution, coming soon in Hindi! #CaptainMillerOnPrime in Hindi, Mar 8 pic.twitter.com/QrRXr0gLcz — prime video IN (@PrimeVideoIN) March 1, 2024 చదవండి: మందు తాగే అలవాటు లేదు.. బూతులు తిట్టాడు.. అందుకే అలా చేశానంటూ ఏడ్చేసిన నటి -
ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్‌లో ట్రెండింగ్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్‌కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్‌లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. -
OTT: ఒకేరోజు ఐదు సినిమాలు.. సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్
ప్రతివారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రమే పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటాయి. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన భారీ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయలాన్, కాటేరా సినిమాలు శుక్రవారం (ఫిబ్రవరి 9న) డిజిటల్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టాయి. మరి ఈ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.. కెప్టెన్ మిల్లర్ ఎక్కడంటే? మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. రూ.280 కోట్లకు పైగా రాబట్టిన గుంటూరు కారం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ తమిళనాట జనవరి 12న విడుదలైంది. తెలుగులో సంక్రాంతి బరిలో దిగిన సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉండటంతో ఇక్కడ కాస్త ఆలస్యంగా విడుదలైంది. తెలుగులో జనవరి 26న రిలీజైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాటేరా స్ట్రీమింగ్ అక్కడే! కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా విడుదలైన ఈ మూవీ తన సత్తా నిరూపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన్ రామ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సన్ నెక్స్ట్లో అయలాన్ తమిళ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం అయలాన్. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్ చేసిన హంగామా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ జనవరి 12న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమా సన్ నెక్స్ట్‌లోకి వచ్చేసింది. Ayalaan vandhutaan! 👽🔥#Ayalaan is streaming worldwide now only on #SunNXT https://t.co/xFjM7jf2GI@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/Ni1c8W4pHD — SUN NXT (@sunnxt) February 9, 2024 ఓటీటీలో థ్రిల్లర్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అదే భక్షక్. భూమి పడ్నేకర్ నటించిన ఈ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్ నిర్మించారు. ఈ సినిమా నేడే నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎట్టకేలకు సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా రాబట్టింది. జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్ ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై బిగ్ అప్డేట్ వచ్చింది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 19న హిందీ వర్షన్ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. Tumne bulaya aur Salaar chala aaya 😎 #SalaarInHindi streaming from 16th Feb.#Salaar #SalaarOnHotstar pic.twitter.com/few5IFwQyA— Disney+ Hotstar (@DisneyPlusHS) February 9, 2024 చదవండి: ‘ఈగల్’ టాక్ ఎలా ఉందంటే.. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ మూడు మాత్రం స్పెషల్!
మరోవారం రానే వచ్చింది. వీకెండ్ ముగియడంతో సినీ ఆడియన్స్ ఎప్పటిలాగే వర్క్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. కాగా.. గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చేవారంలో ఓటీటీల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో ముఖ్యంగా సంక్రాంతికి సందడి చేసిన సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులో మహేశ్ బాబు గుంటూరు కారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ కెప్టెన్ మిల్లర్, కన్నడ స్టార్ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా ఈ వారంలో మాస్ మహారాజా నటించిన ఈగల్ థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరీ ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా ది ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 6 ది నన్ 2 - ఫిబ్రవరి 7 హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్
ఓటీటీలోకి మరో స్టార్ హీరో సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది. మొన్నీమధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థే అధికారికంగా ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తోంది. అయితే ఇదే పండక్కి తమిళ హీరోలు ధనుష్, శివకార్తికేయన్ కూడా తమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలనుకున్నారు. కానీ థియేటర్ల దొరక్క వాయిదా వేసుకున్నారు. అలా ధనుష్ నటించిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'.. తెలుగులో జనవరి 26న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించేశారు. ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే తెలుగు వెర్షన్.. జస్ట్ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?) what makes a soldier go rogue? the answer lies in Miller’s journey#CaptainMillerOnPrime, Feb 9 @dhanushkraja @priyankaamohan @ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @SathyaJyothi pic.twitter.com/EknEyYNW7O — prime video IN (@PrimeVideoIN) February 2, 2024 -
ఓటీటీకి స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కోలీవుడ్ పొంగల్ బరిలో నిలిచి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. రిలీజ్ ఆలస్యం కావడంతో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ కాగా...కేవలం రూ.కోటి వరకు మాత్రమే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది. జవనరి 12న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం నెల రోజుల్లోనే ఓటీటీ రానుందని టాక్ వినిపిస్తోంది. ఈనెల 9 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళంలో ఓకేసారి స్ట్రీమింగ్కు రానుందని టాక్. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
Captain Miller Review: ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ
టైటిల్: కెప్టెన్ మిల్లర్ నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత తనీష్ తదితరులు నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్ దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని ఎడిటర్: నాగూరన్ విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో) కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అంటరానితనం, కులవివక్షతో , నిమ్నవర్గాల అణచివేత నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి. కెప్టెన్ మిల్లర్ కథ కూడా అలాంటిదే. బ్రిటీష్ కాలంలో కుల వివక్ష ఎలా ఉండేది? తక్కువ కులం వారిని బ్రిటీష్ వారితో పాటు సంస్థాన రాజులు ఎలా చిన్న చూపు చూసేవారు? తమ అవసరాలకు ఎలా వాడుకునేవారు? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి జర్నీని ఐదు చాప్టర్లుగా విడగొట్టి చెబుతూ..అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. బీభత్సమైన వయొలెన్స్ కారణంగా కథలోని మెయిన్ పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. హీరో ఎవరి కోసం పోరాడుతున్నాడో, ఎందుకు మారిపోయాడో అనేది క్లారిటీగా చూపించలేకపోయారు. సన్నివేశాల పరంగా చూస్తే సినిమా బాగుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం గత సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఈ కథలో సినిమాటిక్ లిబర్టీని కూడా ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు. కథ 1930లో సాగినప్పటికీ.. అత్యాధునిక ఆయుధాలు వాడడం, స్టైలిష్ బైక్స్, గాగూల్స్ వాడటం వాస్తవికతతో దూరంగా అనిపిస్తాయి. 'ఘోర హరుడు' కథతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. అతని నేపథ్య సన్నివేశలను చూపించారు. హీరో బ్రిటీష్ సైన్యంలోకి చేరడానికి గల కారణం బలంగా ఉంటుంది. అయితే సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేశారు. దీంతో ఆయా పాత్రల తీరు ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది. అలాగే ఇన్ని పాత్రలను పరిచయం చేయడంతో కథ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని సంభాషణలు కూడా ఆలోచింపచేస్తాయి. ‘మనం వాళ్ల(బీటీష్) దగ్గర బానిసలమే.. వీళ్ల(స్థాయిక రాజు) దగ్గర బానిసలమే.. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్రం అన్నాలి?’ లాంటి డైలాగ్స్ అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో మొత్తం ధనుష్ వన్‌మ్యాన్ షో. అగ్నిగా, కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ అదరగొట్టేశాడు. అయితే ఇలాంటి పాత్రలు ధనుష్‌కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ తరహా పాత్రల్లో నటించాడు. ఇక శివన్నగా శివరాజ్‌కుమార్ తన పాత్ర పరిధిమేర అద్భుతంగా నటించాడు. భానుమతిగా ప్రియాంక అరుల్ మోహన్ ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోతుంది. నివేదితా సతీష్ డిఫరెంట్ పాత్రలో నటించింది. రాజుగా జయప్రకాశ్, రాజన్నగా ఎలగో కుమారవేల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘కెప్టెన్ మిల్లర్’ విభిన్నమైన కథ.. నా క్యారెక్టర్ చాలా ఢిపరెంట్: హీరోయిన్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' తమిళంలో ఇప్పటికే 100 కోట్ల వసూళ్ళని దాటింది. జనవరి 26 న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కెప్టన్ మిల్లర్ విశేషాలని పంచుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత 'కెప్టెన్ మిల్లర్'తో తెలుగులో కనిపించడం ఎలా అనిపిస్తోంది? నా గత చిత్రాలు ‘వరుణ్ డాక్టర్,' 'డాన్' తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ తో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. కెప్టెన్ మిల్లర్' లో ధనుష్ లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేయడానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సినిమా, పాత్ర గురించి వివరంగా చెప్పారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడి విజన్ ని ఫాలో అయ్యాం. మీరు ఎక్కువ నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకుంటారు కదా? ఏదైనా కథను బట్టి ఉంటుంది. కథ, నా పాత్ర నచ్చితేనే ఎంచుకుంటాను. 'కెప్టెన్ మిల్లర్' కథతో పాటు నా పాత్ర నాకు బాగా నచ్చింది. ఇంత రగ్గడ్ రోల్ చేయడం ఎలా అనిపించింది ? దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మునుపటి చిత్రం నాకు బాగా నచ్చింది. అతను స్పష్టమైన విజన్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్. ఇంత పెద్ద కాన్వాస్ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది 'కెప్టెన్ మిల్లర్'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? సినిమా చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, యూనిక్ ఉంటుంది. 1930ల నేపధ్యంలో సాగే సినిమాలోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులకు ఫ్రెష్ గా కనిపిస్తుంది, విభిన్న కథ, పాత్రలు, కాస్ట్యూమ్స్, యూనిక్ స్టయిల్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. 'గ్యాంగ్ లీడర్' తర్వాత నానితో మళ్లీ కలిసి వస్తున్న 'సరిపోదా శనివారం' సినిమా ఎలా వస్తోంది? సినిమా చాలా బాగా వస్తోంది. ప్రస్తుతం దాని షూటింగ్లో ఉన్నాను. మీరు ఇంకేమైన తెలుగు సినిమాలు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి'ఓజీ' సినిమా చేస్తున్నాను. నాని, ధనుష్ వంటి వెర్సటైల్ నటులతో కలిసి పనిచేయడం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు? వారంతా కష్టపడి, అంకితభావంతో పని చేస్తారు. చాలా హంబుల్ గా ఉంటారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలని చూశారా? ప్రస్తుతం షూటింగ్లో ఉండటం వలన చూడలేకపోయాను. సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాలన్నింటిని చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. -
టాలీవుడ్ లో రిపబ్లిక్ డే కి గట్టి పోటీ ఇవ్వబోతున్న తమిళ హీరోలు
-
ధనుష్, శివకార్తికేయన్, విజయ్ లో సంక్రాంతి విన్నర్ ఎవరంటే...?
-
పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీ
-
Captain Miller HD Stills: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ స్టిల్స్
-
తెలుగులో 'కెప్టెన్ మిల్లర్' వచ్చేస్తున్నాడు.. పండుగరోజు సందడే
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లోకి వచ్చేసింది. కానీ తెలుగులో విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు విడుదల కావడమే అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. తాజాగా కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ వారు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. కానీ తెలుగులో ధునుష్కు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి కెప్టెన్ మిల్లర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. నేడు విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. సినిమాలో సెట్టింగ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో జివి ప్రకాష్ బిజిఎమ్ మరో లెవెల్ అని విమర్శకులు అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అని, సెకండాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ఎఫైర్ అని అంటున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. #CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥 Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W — Suresh Productions (@SureshProdns) January 12, 2024 -
ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. RRR నటుడు వైరల్ కామెంట్
ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్.. దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు హీందీ కూడా వచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడంతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఆయనకు ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్లో జనవరి 12న వడుదల కానుంది. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటులు సినిమా ప్రమోషన్స్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికన్ నటుడు 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్‌లో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించాడు. గతంలో కూడా RRR చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. రాజన్న, షిర్డీ సాయి, కేసరి, సామ్ బహదూర్, మణికర్ణిక వంటి పాపులర్ చిత్రాల్లో ఆయన నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కోలీవుడ్ హీరోల గురించి పలు విషయాలు షేర్ చేశాడు. ధనుష్ కాకుండా ఈ హీరోలు తెలుసా.. ? అని ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అజిత్, సూర్య, విజయ్ ఫోటోలను అతని ముందు ఉంచగా... విజయ్ను మాత్రమే సరిగ్గా ఆయన గుర్తించాడు. 2005లోనే విజయ్ నటించిన చిత్రాన్ని చూశానని ఎడ్వర్డ్ చెప్పాడు. అతనిలో మంచి టాలెంట్ ఉందని అప్పుడే అనుకున్నానని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోలీవుడ్‌లో విజయ్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. I have seen #ThalapathyVijay film in 2005 and liked him. - RRR and Captain Miller fame Edward Sonnenblick#TheGreatestOfAllTime @actorvijaypic.twitter.com/Hy8TdBTSw9 — Actor Vijay FC (@ActorVijayFC) January 7, 2024 -
భారీ యాక్షన్ సీన్స్‌తో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ తెలుగులో విడదల కావడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. తాజాగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ విడుదలైంది. ధనుష్‌తో పాటు చిత్ర బృందం కూడా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమ ఎక్స్ పేజీలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్ నటించాడు. ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. దీంతో పార్ట్-2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ వచ్చింది. -
భారీ బడ్జెట్‌తో చేయగలరా అని డైరెక్టర్‌ను అడిగా: ధనుశ్
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్ కథా చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్‌కు ధనుశ్ తన ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులతో పాల్గొనడం విశేషం. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్‌కు నివాళులు అర్పించాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై ధనుష్ మాట్లాడుతూ.. 'చిన్న చినుకు పెను తుపాన్‌గా మారుతుందని అంటారని. అదేవిధంగా 2002లో చిన్న చినుకుగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఇప్పుడు పెను తుపాన్‌గా ఎదిగాను. ఇప్పుడు తాను సంపాదించుకున్న సొత్తు అభిమానులే అని పేర్కొన్నారు. ఇకపై ఈ చిత్రాన్ని చూస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రమ అన్నారు. దర్శకుడు అరుణ్ మాతీశ్వరన్ను చూస్తున్నప్పుడు తనకు వెట్రిమారన్ గుర్తుకు వస్తారన్నారు. ఆయన మొదటిగా కలుసుకున్నప్పుడు ఈ తమ్ముడా దర్శకుడు అని అనిపించిందన్నారు. అయితే కథ విన్న 15 నిమిషాల తరువాత భారీ బడ్జెట్ అవుతుందిగా.. సాధ్యం అవుతుందా? అని అడిగానన్నారు. అందుకాయన అలాగే చేద్దామని చెప్పారన్నారు. ఇటీవల చిత్రాన్ని చూశానని ఆయన చెప్పినట్టుగానే ఉందని పేర్కొన్నారు. కెప్టెన్ మిల్లర్ విజయం సాధించడం తథ్యమని ధనుష్ పేర్కొన్నారు. గౌరవమే స్వాతంత్య్రం అన్నది ఈ చిత్ర ట్యాగ్ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది. ఎవరికి స్వాతంత్య్రం ఉంది అన్నది తనకు తెలియడం లేదన్నారు. ఏం చేసినా ఆలోచించి చేయాల్సి వస్తుందని.. అలా ఆలోచించి చేసిన మంచి పనును కూడా తప్పు పట్టేందుకు ఒక వర్గం ఉండటమే స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. తన వరకు అది స్వాతంత్య్రం కాదని ధనుష్ పేర్కొన్నారు. -
స్టార్ హీరో ఈవెంట్లో అసభ్య ప్రవర్తన.. యాంకర్‌తో అలా!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్‌తో అసభ్య ప్రవర్తన బుధవారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది. 😨😨 pic.twitter.com/JJljl7ntBc — Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024 -
సంక్రాంతి రేసు నుంచి రెండు టాప్ సినిమాలు ఔట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది 'సార్' చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు అదే జోష్‌ను 2024 కొత్త ఏడాదిలో కొనసాగించాలని ఆయన 'కెప్టెన్ మిల్లర్'గా సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇదే క్రమంలో ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. సంక్రాంతి బరిలోనే మరో తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం కూడా ఉంది. (ఇదీ చదవండి: భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్) ధనుష్, శివకార్తికేయన్ ఇద్దరు కూడా తెలుగులో గుర్తింపు ఉన్న హీరోలే.. దీంతో వీరి సినిమాలకు టాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఈ సంక్రాంతికి టాలీవుడ్లో తెలుగు స్ట్రైట్ చిత్రాలు గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టంగానే మారింది. అలాంటిది డబ్బింగ్ చిత్రాలు అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టంగానే ఉంది. దీంతో ఆ రెండు చిత్రాల మేకర్స్ సినిమా విడదల విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్, అయలాన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్‌ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ మూవీల మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకడం కష్టంగా ఉందని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ఎలా థియేటర్లు ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే కెప్టెన్ మిల్లర్, అయాలాన్కు సంక్రాంతికి రావాడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. -
పొంగల్ బరిలో మరో స్టార్ హీరో.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!
కోలీవుడ్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి పిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. పొంగల్ సందర్భంగా జనవరి 12వ తేదీన కెప్టెన్ మిల్లర్ చిత్రం భారీ అంచనాల మధ్య తెరపైకి రానుంది. పీరియడ్ కథాంశంతో రూపొందిన ఇది స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగుతుందని యూనిట్ వర్గాలు ఇంతకు ముందే తెలిపారు. ఈ చిత్రంలో ధనుష్ పోరాట యోధుడిగా నటించారు. ఆయన గెటప్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల గురించి అందరూ చెప్పుకోవడం విశేషం. కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ధనుష్ సాధారణంగా ఒక చిత్రానికి మూడు నెలల వరకు కాల్షీట్స్ కేటాయిస్తారు. అలాంటిది ఈ చిత్రానికి 9 నెలలకు పైగా కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో కెప్టెన్ మిల్లర్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందిస్తుండగా.. సిద్ధార్థ్ నునీ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా చిత్రం పొంగల్ బరిలో భారీ చిత్రాలతో పోటీ పడబోతోంది. #CaptainMiller U/A 12.01.24 The Cry for Freedom Begins 🔥 pic.twitter.com/TeEk5vAYfT — Sundeep Kishan (@sundeepkishan) December 29, 2023 -
సంక్రాంతి ఫైట్.. మహేశ్ 'గుంటూరు కారం' సినిమాకు కొత్త టెన్షన్!
సాధారణంగా పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయంటే హడావుడి ఉంటుంది. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా రిలీజ్ విషయంలో ముందునుంచే కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. వేరే ఏ సినిమాలు ఆ రోజు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. తద్వారా వసూళ్లు ఎక్కువ వస్తాయి. అయితే ఈసారి మహేశ్ మూవీకి ఈ విషయంలో టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి! సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త మూవీ 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడం, మాస్ జానర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు సంక్రాంతి బరిలో ఉండటం.. టాక్‌తోపాటు కలెక్షన్స్‌కి చాలా ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) జనవరి 12న 'గుంటూరు కారం' రిలీజ్ కానుంది. అదే రోజు తెలుగు స్ట్రెయిట్ మూవీ 'హనుమాన్' కూడా థియేటర్లలోకి రానుంది. దైవభక్తి నేపథ్యంలో తీసిన ఈ చిత్రం.. మహేశ్ మూవీతో పోటీలో ఉంటుందా? తప్పుకొంటుందా? అనుకున్నారు. కానీ కన్ఫర్మ్గా వస్తామని పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఖరారైపోయింది. వీటితో పాటు అదే రోజున మరో మూడు క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో తమిళ స్టార్ హీరో ధనుష్ చేసిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్', విజయ్ సేతుపతి 'మేరీ క్రిస్మస్' కూడా జనవరి 12నే రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో ఏదైనా వాయిదా పడితే చెప్పలేం కానీ ఇలా ఒకరోజు ఐదు బడా సినిమాలు రిలీజ్ కావడం వల్ల అందరికీ వసూళ్ల పరంగా దెబ్బపడే ఛాన్సుంది. మరీ ముఖ్యంగా మహేశ్ సినిమాకు అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లే రావొచ్చు. అయితే ఈ ఐదింటి రిలీజ్ విషయంలో ఏవైనా తప్పుకొంటాయా? లేదా అదే రోజు రిలీజ్ అవుతాయా అనేది చూడాలి? (ఇదీ చదవండి: 'సలార్' రూట్లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?) -
'కెప్టెన్ మిల్లర్' నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ జోడీగా తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథాంశంతో అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. ఇందులోని లిరిక్స్‌తో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మొదటి పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. యుద్ధభూమిలో కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ కనిపిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించారు.