‘కెప్టెన్ మిల్లర్’ విభిన్నమైన కథ.. నా క్యారెక్టర్‌ చాలా ఢిపరెంట్‌: హీరోయిన్‌ | Priyanka Arul Mohan Talks About Captain Miller Movie | Sakshi
Sakshi News home page

‘కెప్టెన్ మిల్లర్’ విభిన్నమైన కథ.. నా క్యారెక్టర్‌ చాలా ఢిపరెంట్‌: ప్రియాంక అరుల్‌ మోహన్‌

Published Thu, Jan 25 2024 4:55 PM | Last Updated on Thu, Jan 25 2024 5:42 PM

Priyanka Arul Mohan Talks About Captain Miller Movie - Sakshi

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్  ధనుష్  'కెప్టెన్ మిల్లర్' తమిళంలో ఇప్పటికే 100 కోట్ల వసూళ్ళని దాటింది. జనవరి 26 న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కెప్టన్ మిల్లర్ విశేషాలని పంచుకున్నారు.

కొంత గ్యాప్ తర్వాత 'కెప్టెన్ మిల్లర్'తో తెలుగులో కనిపించడం ఎలా అనిపిస్తోంది?
నా గత చిత్రాలు ‘వరుణ్ డాక్టర్,' 'డాన్' తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ తో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది.  

కెప్టెన్ మిల్లర్' లో ధనుష్ లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేయడానికి మీరు ఎలాంటి  హోంవర్క్ చేశారు?
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సినిమా, పాత్ర గురించి వివరంగా చెప్పారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడి విజన్ ని ఫాలో అయ్యాం.

మీరు ఎక్కువ  నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకుంటారు కదా?
ఏదైనా కథను బట్టి ఉంటుంది. కథ, నా పాత్ర నచ్చితేనే ఎంచుకుంటాను. 'కెప్టెన్ మిల్లర్' కథతో పాటు నా పాత్ర నాకు బాగా నచ్చింది.

ఇంత రగ్గడ్ రోల్ చేయడం ఎలా అనిపించింది ?  
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మునుపటి చిత్రం నాకు బాగా నచ్చింది. అతను స్పష్టమైన విజన్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్. ఇంత పెద్ద కాన్వాస్ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది

'కెప్టెన్ మిల్లర్'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
సినిమా చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, యూనిక్ ఉంటుంది. 1930ల నేపధ్యంలో సాగే  సినిమాలోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులకు ఫ్రెష్ గా కనిపిస్తుంది, విభిన్న కథ, పాత్రలు, కాస్ట్యూమ్స్, యూనిక్ స్టయిల్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి.

తమిళంలో విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు?
తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

'గ్యాంగ్ లీడర్' తర్వాత నానితో మళ్లీ కలిసి వస్తున్న 'సరిపోదా శనివారం' సినిమా ఎలా వస్తోంది?
సినిమా చాలా బాగా వస్తోంది. ప్రస్తుతం దాని షూటింగ్‌లో ఉన్నాను.

 మీరు ఇంకేమైన తెలుగు సినిమాలు  చేస్తున్నారా?
 పవన్ కళ్యాణ్‌ గారి'ఓజీ' సినిమా చేస్తున్నాను.

నాని, ధనుష్ వంటి వెర్సటైల్ నటులతో కలిసి పనిచేయడం ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు?
 వారంతా కష్టపడి, అంకితభావంతో పని చేస్తారు. చాలా హంబుల్ గా ఉంటారు.

 సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలని చూశారా?
ప్రస్తుతం షూటింగ్‌లో ఉండటం వలన చూడలేకపోయాను. సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాలన్నింటిని చూడటానికి ఆసక్తిగా ఉన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement