కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్‌కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండో రోజే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్‌లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది.
ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment