OTT: ఒకేరోజు ఐదు సినిమాలు.. సలార్‌ హిందీ వర్షన్‌పై అప్‌డేట్‌ | Captain Miller, Ayalaan, Kaatera Movies Streaming on This OTT platforms | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన స్టార్‌ హీరోల సినిమాలు.. సలార్‌ హిందీ వర్షన్‌ ఆరోజే రిలీజ్‌!

Published Fri, Feb 9 2024 1:03 PM | Last Updated on Sat, Feb 10 2024 10:10 AM

Captain Miller, Ayalaan, Kaatera Movies Streaming on This OTT platforms - Sakshi

కెప్టెన్‌ మిల్లర్‌, అయలాన్‌, కాటేరా, గుంటూరు కారం, భక్షక్‌ సినిమాలు శుక్రవారం ఓటీటీలోకి వచ్చేశాయి. సలార్‌ హిందీ వర్షన్‌ రిలీజ్‌ డేట్‌ కూడా వచ్చేసింది..

ప్రతివారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రమే పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటాయి. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన భారీ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. గుంటూరు కారం, కెప్టెన్‌ మిల్లర్‌, అయలాన్‌, కాటేరా సినిమాలు శుక్రవారం (ఫిబ్రవరి 9న) డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టాయి. మరి ఈ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూసేద్దాం..

కెప్టెన్‌ మిల్లర్‌ ఎక్కడంటే?
మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. రూ.280 కోట్లకు పైగా రాబట్టిన గుంటూరు కారం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ హీరోగా నటించిన మూవీ కెప్టెన్‌ మిల్లర్‌. ఈ మూవీ తమిళనాట జనవరి 12న విడుదలైంది. తెలుగులో సంక్రాంతి బరిలో దిగిన సినిమాల లిస్ట్‌ పెద్దదిగా ఉండటంతో ఇక్కడ కాస్త ఆలస్యంగా విడుదలైంది. తెలుగులో జనవరి 26న రిలీజైంది. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

కాటేరా స్ట్రీమింగ్‌ అక్కడే!
కన్నడ స్టార్‌ దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా విడుదలైన ఈ మూవీ తన సత్తా నిరూపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. డిసెంబర్‌ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేడు జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీతో సీనియర్‌ హీరోయిన్‌ మాలాశ్రీ కూతురు ఆరాధన్‌ రామ్‌ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.

సన్‌ నెక్స్ట్‌లో అయలాన్‌
తమిళ హీరో శివకార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం అయలాన్‌. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్‌ చేసిన హంగామా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ జనవరి 12న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమా సన్‌ నెక్స్ట్‌లోకి వచ్చేసింది.

ఓటీటీలో థ్రిల్లర్‌ మూవీ
క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అదే భక్షక్‌. భూమి పడ్నేకర్‌ నటించిన ఈ మూవీకి పులకిత్‌ దర్శకత్వం వహించాడు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై షారుక్‌ఖాన్‌, గౌరీఖాన్‌ నిర్మించారు. ఈ సినిమా నేడే నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎట్టకేలకు సలార్‌ హిందీ వర్షన్‌పై అప్‌డేట్‌
ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.600 కోట్లకు పైగా రాబట్టింది. జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్‌ ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 19న హిందీ వర్షన్‌ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

చదవండి: ఈగల్‌’ టాక్‌ ఎలా ఉందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement