సాధారణంగా పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయంటే హడావుడి ఉంటుంది. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా రిలీజ్ విషయంలో ముందునుంచే కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. వేరే ఏ సినిమాలు ఆ రోజు రిలీజ్ కాకుండా చూసుకుంటారు. తద్వారా వసూళ్లు ఎక్కువ వస్తాయి. అయితే ఈసారి మహేశ్ మూవీకి ఈ విషయంలో టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త మూవీ 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడం, మాస్ జానర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు సంక్రాంతి బరిలో ఉండటం.. టాక్‌తోపాటు కలెక్షన్స్‌కి చాలా ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)
జనవరి 12న 'గుంటూరు కారం' రిలీజ్ కానుంది. అదే రోజు తెలుగు స్ట్రెయిట్ మూవీ 'హనుమాన్' కూడా థియేటర్లలోకి రానుంది. దైవభక్తి నేపథ్యంలో తీసిన ఈ చిత్రం.. మహేశ్ మూవీతో పోటీలో ఉంటుందా? తప్పుకొంటుందా? అనుకున్నారు. కానీ కన్ఫర్మ్‌గా వస్తామని పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఖరారైపోయింది. వీటితో పాటు అదే రోజున మరో మూడు క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి.
వీటిలో తమిళ స్టార్ హీరో ధనుష్ చేసిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్', విజయ్ సేతుపతి 'మేరీ క్రిస్మస్' కూడా జనవరి 12నే రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో ఏదైనా వాయిదా పడితే చెప్పలేం కానీ ఇలా ఒకరోజు ఐదు బడా సినిమాలు రిలీజ్ కావడం వల్ల అందరికీ వసూళ్ల పరంగా దెబ్బపడే ఛాన్సుంది. మరీ ముఖ్యంగా మహేశ్ సినిమాకు అనుకున్న దానికంటే తక్కువ వసూళ్లే రావొచ్చు. అయితే ఈ ఐదింటి రిలీజ్ విషయంలో ఏవైనా తప్పుకొంటాయా? లేదా అదే రోజు రిలీజ్ అవుతాయా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'సలార్' రూట్‌లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?)
Comments
Please login to add a commentAdd a comment