Actor Dhanush Produce New Film After Five Years, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Dhanush: ఫుల్ బిజీగా ఉండి కూడా ధనుష్ అలా

Published Mon, Aug 21 2023 6:57 AM | Last Updated on Mon, Aug 21 2023 9:32 AM

Actor Dhanush Produce New Film After five Years - Sakshi

కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్‌. నటుడు, లిరిక్ రైటర్, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా తన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'కెప్టెన్‌ మిల్లర్‌' పూర్తిచేసి తన 50వ చిత్ర షూటింగ్‌ తో బిజీ. ఈ మూవీ డిసెంబర్‌ 15న థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్‌ గెటప్‌, ఇటీవల రిలీనైన టీజర్‌ భారీ అంచనాలను పెంచేస్తోంది. వార్‌ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయట. 

(ఇదీ చదవండి: రామ్ చరణ్.. చిన్న బ్రేక్!)

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో 50వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల తీయబోయే ద్విభాషా సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆర్.బాల్కీ దర్శకత్వంలో హిందీ మూవీ చేస్తారు. ఇకపోతే ధనుష్‌ నిర్మాతగా.. 3, ఎదుర్‌ నీచ్చల్‌, వేలై ఇల్లా పట్టాదారి, కాకి సాప్ట్‌, కాకాముట్టై, మారి, నానుమ్‌ రౌడీధాన్‌, విచారణై, కాలా, వడ చైన్నె వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరిగా 2018లో మారి 2 చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. 

అలాంటిది ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ధనుష్‌ ఇప్పటివరకు 14 చిత్రాలను నిర్మించారు. తన వండర్‌ బార్‌ ఫిలింస్‌ సంస్థలో 15వ చిత్రం మారి మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. కాగా ఆదివారం మరో చిత్ర ప్రకటన విడుదల చేశారు. 'కెప్టెన్‌ మిల్లర్‌' డైరెక్టర్ అరుణ్‌ మాతేశ్వరన్‌ తో వండర్‌ బాల్‌ ఫిలిమ్స్‌ సంస్థలో చిత్రం చేయనున్నట్లు ధనుష్‌ వెల్లడించారు. 

(ఇదీ చదవండి: శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement