హీరో ధనుష్‌ మా కుమారుడే అంటూ పిటిషన్‌.. ఫైనల్‌ తీర్పు ఇచ్చిన కోర్టు | Petition Saying That Dhanush Is Our Son, The Court Gave The Final Judgement, Know Details Inside - Sakshi
Sakshi News home page

Actor Dhanush Paternity Case: ధనుష్‌ మా కుమారుడే అంటూ పిటిషన్‌.. తీర్పు ఇచ్చిన కోర్టు

Published Thu, Mar 14 2024 9:16 AM | Last Updated on Thu, Mar 14 2024 10:42 AM

Petition Saying That Dhanush Is Our Son The Court Gave The Final Judgment - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ధనుష్‌ తమ కుమారుడు అని పేర్కొంటూ  మేలూర్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ని మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. మేలూర్‌కి చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు.. నటుడు ధనుష్‌ తమ కుమారుడని 2015లో మేలూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్‌ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ధనుష్‌ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్‌లను గతంలో వారు కోర్టుకు సమర్పించారు.

స్కూల్‌లో చదువుతున్నప్పుడు ధనుష్‌ ఇంట్లో నుంచి పారిపోయాడని వారు కోర్టుకు తెలిపారు. ధనుష్‌ తమ అబ్బాయి అని వారు సమర్పించిన అధారాలను పరిశీలించిన కోర్టు తాజాగా ఈ కేసును  కొట్టివేసింది. పిటిషన్‌ దారుడు ఆరోపణలు రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసులో నిజంలేదని తెలిపి పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.  ధనుష్‌ తమ కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరిన కదిరేశన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

పుట్టుమచ్చలతో కేసు క్లియర్‌
కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్‌ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్‌ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్‌ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్‌ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్‌కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం ధనుష్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హజరయ్యారు.

కోర్టు రిజిస్టార్‌ సమక్షంలో మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టుమచ్చలను పరిశీలించారు. ధనుష్‌కు పుట్టుమచ్చలు లేవని తేలడంతో కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు  కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్‌ జన్మించినట్లు తీర్పును వెళ్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement