స్టార్‌ హీరో ఈవెంట్‌లో అసభ్య ప్రవర్తన.. యాంకర్‌తో అలా! | Anchor Aishwarya Ragupathi Breaks Silence On Dhanush Fan Molests Her At Captain Miller Event, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Captain Miller Event Anchor Controversy: ఈవెంట్‌లో యాంకర్‌కు వేధింపులు.. ఆమె ఏం చేసిందంటే?

Published Thu, Jan 4 2024 4:51 PM | Last Updated on Thu, Jan 4 2024 5:44 PM

Anchor Breaks Silence On Dhanush Fan Molests Her At Captain Miller Event - Sakshi

కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు లేని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో  శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

యాంకర్‌తో అసభ్య ప్రవర్తన

బుధవారం చెన్నైలో  నిర్వహించిన ఈవెంట్‌లో ఓ చేదు సంఘటన జరిగింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్న యాంకర్‌ ఐశ్వర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చాలామంది ఫ్యాన్స్ హాజరైన ఈవెంట్‌లో ఆమె అసభ్యకరంగా తాకాడు. అతని తీరుతో విసిగిపోయిన యాంకర్‌ అక్కడే దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ సైతం యాంకర్‌ ఐశ్వర్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. వెంటనే స్పందించి అతనికి బుద్ధిచెప్పడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలోనూ పోస్ట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement