భారీ యాక్షన్‌ సీన్స్‌తో ధనుష్‌ 'కెప్టెన్‌ మిల్లర్‌' ట్రైలర్‌ | Dhanush Captain Miller Trailer Release | Sakshi
Sakshi News home page

Captain Miller Trailer: భారీ యాక్షన్‌ సీన్స్‌తో ధనుష్‌ 'కెప్టెన్‌ మిల్లర్‌' ట్రైలర్‌

Published Sat, Jan 6 2024 6:57 PM | Last Updated on Sat, Jan 6 2024 7:46 PM

Dhanush Captain Miller Trailer Release - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.  కానీ తెలుగులో విడదల కావడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని చెప్పవచ్చు.  ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్‌ నటీనటులు ఇందులో నటించారు.

తాజాగా కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్‌ విడుదలైంది. ధనుష్‌తో పాటు  చిత్ర బృందం కూడా  చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమ ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు.   ఈ ట్రైలర్‌ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్‌ నటించాడు.

ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. దీంతో పార్ట్‌-2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్  గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్‌ వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement