హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో కెప్టెన్ మిల్లర్ ఒకటి. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరం దర్శకత్వం వహిస్తున్న ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, సందీప్‌కిషన్, జాన్ కొక్కెన్, అడ్వర్డ్ సోనెన్ బ్లిక్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ నుని ఛాయాగ్రహణం, జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఒక యదార్థ సంఘటన అధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ శ్రీలంక LTTE రెబెల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కన్నడ భాషలోనూ అనువదించి విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ముఖ్యభూమిక పోషించడమే. ఈయన ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం కర్ణాటకలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని కూడా కన్నడ భాషలోకి అనువదించి విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒక కీలకపాత్రను అతిథిబాలన్ పోషించినట్లు తాజా సమాచారం. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయనున్నారు. రెండవ భాగంలో అతిథిబాలన్ పాత్ర చిత్రానికి కీలకంగా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ పాత్రను ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. అయితే త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
చదవండి: పెళ్లి, విడాకులే కాదు ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది: రేణు దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment