
కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తానసలు బంగారం అక్రమ రవాణా చేయలేదని యూటర్న్ తీసుకుంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులే బలవంతంగా ఖాళీ పేపర్లపై సంతకం చేయించారని తెలిపింది. తనకు న్యాయం చేయండంటూ డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసింది.
ఒత్తిడి చేశారు
ఇటీవల బెంగళూరు ఎయిర్‌పోర్టులో దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారంతో అధికారులకు పట్టుబడింది నటి రన్యారావు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా బంగారం అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించింది. ఇంతలో తన తప్పే లేదంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. నేను ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టేవరకు నరకం చూపించారు. స్మగ్లింగ్ చేసినట్లుగా ఒప్పుకోమని ఒత్తిడి చేశారు.
ఖాళీ పేపర్లపై సంతకం
15 సార్లు నా చెంప పగలగట్టారు. బలవంతంగా సంతకం చేయించారు. నాపై దాడి చేసిన అధికారులను నేను గుర్తుపట్టగలను. శారీరక హింస, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. వారు చెప్పినట్లుగా 50-60 పేజీలను చదవకుండానే సంతకం చేశాను. అలాగే మరో 40 తెల్లకాగితాలపైనా సంతకం చేయించారు. దయచేసి ఈ కేసులో పారదర్శక విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి అని లేఖలో పేర్కొంది. ఇకపోతే ఇటీవల రన్య కస్టడీలో ఉన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో రన్య కళ్ల కింద చర్మం కమిలిపోయి ఉండటం స్పష్టంగా కనిపించింది.
(చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల)
ఏం జరిగింది?
నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

విచారణలో స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అంటూ నేరాన్ని అంగీకరించిన ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో కేసు ఆసక్తికరంగా మారింది. ఇటీవల రన్యారావు బెయిల్ కోసం బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె ఉన్నతాధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: హీరో విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశా: మ్యూజిక్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment