DRI
-
మాటలతో హింసిస్తున్నారు.. బెదిరిస్తున్నారు: కోర్టులో రన్యారావు
బెంగళూరు: గోల్డ్ స్మగ్మింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావును ఈరోజు(సోమవారం) బెంగళూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. తన మొహంపై గాయాలు కనిపిస్తున్న క్రమంలో ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు డీఆర్ఐ అధికారులు. అయితే కస్టడీలో ఏమైనా భౌతిక దాడులు జరిగాయా అని కోర్టు ప్రశ్నించగా.. తనను శారీరకంగా ఏమీ ఇబ్బందులు గురి చేయడం లేదని, కానీ మాటలతో మానసికంగా హింసిస్తున్నారని కోర్టులో కన్నీటి పర్యంతమైంది. అయితే మానసికంగా మాటలతో హింసిస్తున్నారని ఆమె చెబుతున్న వాదనను డీఆర్ఐ ఖండించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని, తమ నిబంధనల మేరjo దర్యాప్తు చేస్తున్నామన్నారు. తమ దర్యాప్తును మొత్తం రికార్డు చేస్తున్నామని డీఆర్ఐ పేర్కొంది.వైరల్‌గా మారిన ఫోటోరన్యారావుకు చెందిన ఓ ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. ఆమె కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో ఉంది. ఆమెను కస్టడీలో తీసుకుని విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై కర్ణాకట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రధానంగా వైరల్ గా మారిన ఫోటోను ఉటంకిస్తూ మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మీ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెపై అధికారులు దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్న లేవనెత్తారు. అయితే దీనిపై తాము నేరుగా దర్యాప్తు చేసే అవకాశం లేదన్నారు. రన్యారావు తముకు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆమెకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు నాగలక్ష్మి,‘మాకు ఆమె లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె నుంచి ఫిర్యాదు అందిన పక్షంలో తమ పరిధిలో ఉన్న ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తాం. సరైన రీతిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె ఏమైనా దాడికి గురయ్యిందా అనేది ఆమె ఫిర్యాదు రూపంలో ఇస్తేనే మేము ఏమైనా చేయగలం. ఒకవేళ ఆమె మమ్మల్ని సంప్రదించకపోతే దీనిపై కనీసం కామెంట్ కూడా చేయలేం’ అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెను స్పెషల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. గత సోమవారం 12 కేజీలకు పైగా బంగారం కడ్డీలను తన బెల్ట్ లో పెట్టుకుని దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ రన్యారావు పట్టుబడింది. బెంగూళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అధికారులకు చిక్కింది. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. దీనిలో భాగంగా ఆమెను విచారిస్తున్న అధికారులు ఇందులో ‘కింగ్ పిన్’ ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. -
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
HYD: కొరియర్ చేస్తుండగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో డీఆర్ఐ అధికారులు శనివారం(ఆగస్టు10) భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్యాకెట్లలో డ్రగ్స్ పొడిరూపంలో ఉన్నాయి. అరెస్టు చేసిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
రూ.7.19 కోట్ల విలువైన ఏనుగు దంతాలు పట్టివేత
సాక్షి, చెన్నై: చెన్నైలో ఏనుగు దంతాలను అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేసిన వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)– చెన్నై అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.19 కోట్ల విలువైన 4.03 కేజీల బరువు కలిగిన రెండు దంతాలను సీజ్ చేశారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 2023 కింద తొలి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... డీఆర్ఐ– చెన్నై అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు సెంట్రల్, టీ నగర్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా బృందాలు కాపు కాశాయి. ఏనుగు దంతాలను టీ నగర్లో ఓ చోట విక్రయించే ప్రయత్నం చేసిన ఏడుగురిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలను స్వా«దీనం చేసుకున్నారు. ఓ వాహనం కూడా సీజ్ చేశారు. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వన్యప్రాణుల రక్షణ చట్టం తాజా సవరణ మేరకు.. నిషేధ వస్తువులను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు సైతం కలి్పంచారు. దీంతో ఈ చట్టం కింద చెన్నై డీఆర్ఐ అధికారులు తొలి కేసును నమోదు చేశారు. పట్టుబడ్డ ఏడుగురిని, ఏనుగు దంతాలు, వాహనాన్ని తమిళనాడు చీఫ్ వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
హైదరాబాద్‌లో రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. ఈనెల 21న నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నగరంలోని ఓ ల్యాబ్‌లో ఈ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మూఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. రూ.49.77 కోట్లు విలువైన 24.885 కిలోల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డీఆర్ఐ అధికారులు. అరెస్ట్ చేసిన ఏడుగురు ముఠా సభ్యులకు గతంలో ఇండోర్, యమునా నగర్ ఎఫిడ్రిన్ తయారీ కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇదీ చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం -
రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత
న్యూఢిల్లీ: దాదాపు రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత ఆరోపణలపై చైనాకు చెందిన హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) షోకాజ్ నోటీసులు (ఎస్సీఎన్) జారీ చేసింది. జూలై 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థలోని కీలక ఉద్యోగుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో.. మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తుల వివరాలను తప్పుగా చూపినట్లు కచ్చితమైన ఆధారాలు లభించాయి. దీంతో రూ. 4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతపై ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీ జారీ అయ్యింది’ అని పేర్కొంది. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఒప్పో ఇండియా కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో, కంపెనీ కొన్ని దిగుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా పలు బహుళ జాతి సంస్థలకు రాయల్టీలు, లైసెన్సు ఫీజుల కింద నిధులు చెల్లించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దిగుమతి సుంకాలపరంగా కంపెనీ సుమారు రూ. 2,981 కోట్ల మేర మినహాయింపు ప్రయోజనాలు పొందింది. అంతే గాకుండా టెక్నాలజీ, బ్రాండ్, మేథోహక్కుల లైసెన్సులు వినియోగించుకున్నట్లు చూపడం ద్వారా పలు సంస్థలకు రాయల్టీ, లైసెన్సు ఫీజులు చెల్లించినట్లు/చెల్లించాల్సి ఉన్నట్లు ప్రొవిజనింగ్ చేసింది. వీటిని దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువకు జోడించకపోవడం ద్వారా రూ. 1,408 కోట్ల మేర సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. కా గా, ఎస్‌సీఎన్‌లో పేర్కొన్న ఆరోపణలపై తమ అభి ప్రాయం వేరుగా ఉందని ఒప్పో ఇండియా తెలిపింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద చిక్కుల్లో పడింది. షావోమి ఇండియా కస్టమ్స్ సుంకాన్ని ఎగవేస్తోందని వచ్చిన సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షావోమి, దాని కాంట్రాక్టు ఉత్పత్తిదారులపై దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తు సందర్భంగా డీఆర్ఐ దేశవ్యాప్తంగా ఉన్న షావోమి ఇండియా కార్యాలయాల్లో సోదాలను నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా ఒప్పంద నిబంధన ప్రకారం క్వాల్కామ్ యూఎస్ఏ, బీజింగ్ షావోమి మొబైల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్‌కు షావోమి ఇండియా రాయల్టీ, లైసెన్స్ ఫీజుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నట్టు గుర్తించింది. భారత్‌లో ఎంఐ బ్రాండ్‌తో షావోమి ఇండియా మొబైల్స్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్లలో కొన్నింటిని విదేశాల నుంచి షావోమి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. లేదంటే విడి పరికాలను ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్డ్ చేస్తుంది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ విపణిలో షావోమికి గణనీయమైన వాటానే ఉంది. విలువను తగ్గించి షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించామని డీఆర్ఐ తెలిపింది. సంబంధిత కంపెనీ, ఒప్పంద తయారీ సంస్థల్లో పరిశోధన చేపట్టామని పేర్కొంది. 'షావోమి ఇండియా, సంబంధిత తయారీ కంపెనీల్లోని కీలక ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేశాం. షావోమి కంపెనీ డైరెక్టర్ ఒకరు రాయల్టీ చెల్లించినట్టు ధ్రువీకరించారు' అని డీఆర్ఐ ప్రకటించింది. రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించడమే కాకుండా ఒప్పంద తయారీదారుల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తి లావాదేవీల విలువను జోడించలేదని వెల్లడించింది. దీంతో షావోమి ఇండియా కస్టమ్స్ సుంకం ఎగవేసినట్టు గుర్తించామని పేర్కొంది. ఇలా చేయడం కస్టమ్స్ చట్టం-1962 కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలను, 2007లోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమే అని తెలిపింది. 'డీఆర్ఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత 1962, కస్టమ్స్ చట్టం ప్రకారం.. షావోమి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 01-4-2017 నుంచి 30-06-2020 కాలానికి రూ.653 కోట్లు రికవరీకి డిమాండ్ చేస్తూ 3 షోకాజ్ నోటీసులు జారీ చేశాం' అని డీఆర్ఐ తెలిపింది. (చదవండి: ఆకర్షణీయమైన లుక్స్‌తో సరికొత్తగా రానున్న మారుతి సుజుకీ బాలెనో..!) -
ఎన్సీబీ నుంచి తిరిగి డీఆర్ఐకి సమీర్ వాంఖడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్‌గా కొనసాగిన సమీర్ వాంఖడే తిరిగి మాతృసంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే ఎన్సీబీ ముంబై విభాగం చీఫ్‌గా 2020 ఆగస్ట్ నుంచి కొనసాగుతున్నారు. 2021అక్టోబర్‌లో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో సోదాలు జరిపి డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ సహా కొందరిని అదుపులోకి తీసుకోవడంతో వాంఖడే పేరు మార్మోగింది. డిసెంబర్ 31వ తేదీతో ఎన్సీబీలో వాంఖడే పదవీ కాలం ముగిసింది. కేంద్రం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో తిరిగి వాంఖడే డీఆర్ఐకు వెళ్లిపోయారు. -
మ్యుటేషన్ మాయాజాలం
సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్ డీడ్లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రిజిస్టర్డ్ డీడ్ తప్పనిసరి.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్ చేయాలంటే పార్టీషన్ డీడ్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ‘రిజిస్ట్రేషన్ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్ డీడ్‌ను రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్ చేయాలి. సర్క్యులర్ సాకుతో చట్ట విరుద్ధంగా... రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్ డీడ్ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్మెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఓ సర్క్యులర్‌ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్ చేయవచ్చని అప్పటి కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పార్టీషన్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్‌లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్‌ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. ఏటా రూ.800 కోట్ల నష్టం... డీఆర్ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న న్యాయ వివాదాలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్ వివాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు -
రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసు.. సింగే కింగ్ పిన్
సాక్షి, అమరావతి: దేశంలో సంచలనం సృష్టించిన హెరాయిన్ దందా గుట్టు వీడింది! టాల్కం పౌడర్ పేరుతో అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్‌కు రూ.21 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కీలక పురోగతి సాధించింది. ఢిల్లీకి చెందిన కుల్దీప్సింగ్ ఈ డ్రగ్స్ రాకెట్లో కీలక సూత్రధారిగా డీఆర్ఐ దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఢిల్లీకి చెందిన మరొకరు కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించింది. కుల్దీప్సింగ్ చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులకు కమీషన్ల ఎరవేసి స్మగ్లింగ్ దందాను నడిపి నట్లు నిర్ధారించింది. ఢిల్లీలో కేంద్రీకృతమైన ఈ ముఠా అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ దందా సాగిస్తున్నట్లు ఆధా రాలు సేకరించింది. హెరాయిన్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఆర్ఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికను ఎన్ఐఏ కు సమర్పించింది. సింగే.. కింగ్ పిన్ అఫ్ఘనిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ దందాలో ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగే కింగ్ పిన్ అని డీఆర్ఐ నిర్ధారించింది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులతోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఆరుగురు అఫ్ఘన్ జాతీయులు, ఓ ఉజ్బెకిస్తాన్ జాతీయురాలి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, మెయిల్స్‌ను డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. కుల్దీప్ సింగ్ పేరుతో ఢిల్లీ నుంచి ఓ డాన్ స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. చాటింగ్‌లో కుల్దీప్సింగ్గా పేర్కొ న్నప్పటికీ మారుపేరుతో వ్యవహరించి ఉండవ చ్చని డీఆర్ఐ భావిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్లు డీఆర్ఐ అంచనాకు వచ్చింది. చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్) వాట్సాప్ గ్రూప్ ద్వారా... డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కుల్దీప్ సింగ్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతా చాటింగ్ ద్వారా నడిపించాడు. అఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ డీలర్ హాసన్ హుసేన్, చెన్నైకు చెందిన సుధాకర్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఈ కేసులో కీలక అంశాలను వెల్లడించింది. తాను పంపిస్తున్న సరుకును ఢిల్లీలోని కుల్దీప్సింగ్కు చేర్చాలని సుధాకర్‌తో హాసన్ హుసేన్ పేర్కొనడం గమనార్హం. డబ్బిస్తేనే సరుకు పంపిస్తా.. ఈ ఏడాది జూన్ 6న టాల్కం పౌడర్ పేరుతో హెరాయిన్ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చిన విషయాన్ని హాసన్ హుసేన్ సుధాకర్‌కు చెప్పాడు. ఆ కన్సైన్మెంట్ ‘కుల్దీప్సింగ్, అలీపుర్, న్యూఢిల్లీ’ పేరున ఉంది. వాటిని ఢిల్లీ చేర్చేందుకు అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన సుధాకర్ దిగుమతి చేసుకున్నాడు. ఈ సంద ర్భంగా వాట్సాప్ గ్రూప్‌లో సంభాషణలు డ్రగ్స్ దందాలో కీలక అంశాలను వెల్లడించాయి. తమ కంపెనీ పేరిట డ్రగ్స్ దిగుమతి చేసుకుంటు న్నందుకు సుధాకర్‌కు ఇవ్వాల్సిన కమీషన్‌ను కుల్దీప్ సింగ్ ఇంకా చెల్లించలేదు. దీంతో పోర్టులో ఆ సరుకును విడుదల చేసేందుకు సుధాకర్ సహకరించలేదు. ‘డబ్బులిస్తేనే సరుకు ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తా..’ అని సుధాకర్ చాటింగ్‌లో కుల్దీప్ సింగ్‌తో పేర్కొన్నట్లు డీఆర్ఐ గుర్తించింది. ఈ క్రమంలో కుల్దీప్సింగ్ రూ.4 లక్షలు సుధాకర్‌కు బదిలీ చేయడంతోపాటు మరో రూ.9 లక్షల నగదు హవాలా మార్గంలో చెల్లించాడు. అనంతరం ఆ హెరాయిన్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి చేరింది. ఈ సమాచారం అంతా వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌లో డీఆర్ఐ అధికారులు గుర్తించారు. చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!) స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్‌గా ‘అషీ’ అఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ పోర్టు మీదుగా కొన్నేళ్లుగా స్మగ్లింగ్ దందా సాగుతోంది. చెన్నైకు చెందిన సుధాకర్ దంపతులు లక్షలు కమీషన్‌గా తీసుకుంటూ స్మగ్లింగ్ ఫ్రంట్ ఆఫీస్‌గా తమ అషీ ట్రేడింగ్ కంపెనీని వాడుకునేందుకు అనుమతిం చారని రూఢీ అయింది. అందుకోసమే విజయ వాడ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజి స్టర్ చేశారు. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంతో విజయవాడకుగానీ ఆంధ్రప్రదేశ్‌కుగానీ నేరుగా ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. అస లు హెరాయిన్ ఏపీకి రాలేదని వెల్లడైంది. ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ భారీగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో సేకరించిన సమాచారంతో ముంబై, ఇతర మెట్రో నగరాల్లో డీఆర్ఐ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధారి స్తోంది. డీఆర్ఐ అధికారులు ఏపీలో ఎలాంటి తనిఖీలుగానీ దాడులుగానీ నిర్వహించక పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొనసాగుతున్న వేట... స్మగ్లింగ్ దందాలో కింగ్ పిన్ కుల్దీప్ సింగ్ ఆచూకీ కోసం డీఆర్ఐ, ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన హెరాయిన్ కన్సైన్మెంట్లో పేర్కొన్న కుల్దీప్ సింగ్ చిరునామా సరైంది కాదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు వెల్లడైంది. వాట్సాప్ గ్రూప్‌లోని ఫోన్ నంబర్లు ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ ఆచూకీ కనుగొంటామని డీఆర్ఐ వర్గాలు పేర్కొంటున్నాయి. -
GST Base Price: ‘బేస్’తో బాదేస్తున్నారు
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టినప్పుడు ఎల్ఈడీ టీవీలపై పన్ను రేటు 28 శాతంగా నిర్ణయించారు. 2018లో 24, 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. జీఎస్టీ 28 శాతం ఉన్నపుడు షోరూమ్‌ల్లో 24 అంగుళాల టీవీ ధర రూ. 11 వేలుగా, 32 అంగుళాల టీవీ ధర రూ. 17,500గా ఉండేవి. జీఎస్టీ 18 శాతానికి తగ్గిన తర్వాత కూడా అవే రేట్లతో షోరూముల్లో అమ్ముతున్నారు. కంపెనీలు, షోరూమ్‌లు ఆ టీవీల బేస్ రేట్ పెంచేసి వినియోగదారుడికి దక్కాల్సిన లాభాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్ఐ) ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. సాక్షి, అమరావతి: పలు రకాల గృహ వినియోగ ఉపకరణాల్లో జీఎస్టీ రేటు తగ్గినా.. ఆ లాభం వినియోగదారుడికి చేరడంలేదు. బేస్ రేటు(మూల)లో మాయాజాలంతో కంపెనీలు, షోరూమ్‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. ఈ అక్రమాలపై సమాచారంతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ డీఆర్ఐ డైరెక్టర్ ఎస్.నరసింహారెడ్డి ప్రత్యేక బృందాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విక్రయించే షోరూమ్‌ల్లో తనిఖీలకు ఆదేశించారు. జీఎస్టీ తగ్గిన మేరకు రాష్ట్రంలో టీవీల ధరలు తగ్గాయా లేదా అని అధికారులు పరిశీలించారు. ఆయా షోరూమ్‌ల్లో రికార్డులు పరిశీలించగా.. బేస్ ధర పెంచి అమ్మకాలు సాగిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు బయటపడింది. ఈ మేరకు అధికారులు పలు షోరూమ్‌లపై కేసు నమోదు చేశారు. ఇదీ బేస్ ధర.. మోసం సాధారణంగా ఒక వస్తువు తయారీ ఖర్చు, ఉత్పత్తిదారుని లాభం, అమ్మకందారుని లాభం కలుపుకొని బేస్ ధర నిర్ణయిస్తారు. దీనికి పన్ను జోడిస్తే ఎంఆర్పీ అవుతుంది. ఆ బేస్ ధరని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండా కంపెనీలు, షోరూమ్‌లు కుమ్మక్కయి బేస్ ధరను పెంచేశాయి. కేంద్రం నిర్ణయించినట్లు జీఎస్టీని తగ్గించి రశీదుల్లో చూపుతున్నాయి. బేస్ ధరను మాత్రం పెంచి పాత ధరకే విక్రయిస్తున్నాయి. దీంతో జీఎస్టీ తగ్గినా టీవీ ధర మాత్రం తగ్గడం లేదు. టీవీల్లోనే ఏటా రూ. 80 కోట్లకు పైగా మోసం ‘కౌంటర్ పాయింట్ టీవీ ట్రాకర్ సర్వీస్’ నివేదిక ప్రకారం దేశంలో 2018 నుంచి టీవీల మార్కెట్ 15 శాతం చొప్పున పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఏడాదికి సగటున 1.50 కోట్ల టీవీ సెట్లు విక్రయిస్తున్నారు. వాటిలో సామాన్యులు కొనుగోలు చేసే 24 అంగుళాలు, 32 అంగుళాల టీవీలదే 85 శాతం వాటా. మన రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 8 లక్షల టీవీలు విక్రయిస్తున్నారని అంచనా. ఒక్కో టీవీ మీద సగటున రూ. వెయ్యి చొప్పున మోసానికి పాల్పడినా.. ఏడాదికి రూ. 80 కోట్ల వరకు దోపిడీ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకూ... బేస్ రేట్ల మోసం టీవీలకే పరిమితం కాలేదు. ఫ్రిడ్జ్‌ల నుంచి సబ్బుల వరకు ఈ దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ(ఎన్ఏఏ) దేశవ్యాప్తంగా పలు షోరూమ్‌లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు అత్యధికంగా అమ్ముడయ్యే వినియోగదార ఉత్పత్తుల (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్– ఎఫ్ఎంసీజీ) విక్రయాలను పరిశీలిస్తే వాటిల్లో కూడా మోసానికి పాల్పడుతున్నట్టు వెల్లడైంది. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్లు, సూట్‌కేసులు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, డిటర్జెంట్లు, డియోడరెంట్లు, సబ్బులు, కాఫీ పౌడర్లు, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, అంబులెన్స్ ఉపకరణాలతో పాటు అపార్టుమెంట్లులో ఫ్లాట్లపై ధరల నిర్ణయంలో కూడా కంపెనీలు, షోరుమ్‌లు మోసాలకి పాల్పడుతున్నాయి. వాటిలో వివిధ వస్తువులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18, 12, 5 శాతానికి తగ్గించినా.. ఆ లాభాన్ని వినియోగదారులకు అందకుండా చేస్తున్నారు. కంపెనీలు, షోరూమ్‌ల విక్రయాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే భారీ మోసం బయటపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇం టెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన మహిళ మాదకద్రవ్యాలు తీసుకొ స్తున్నట్లు నిఘావర్గాల ద్వారా డీఆర్ఐకి సమా చారం అందింది. ఖతార్ ఎయిర్వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న విమానంలో ఆమె హైదరాబాద్ చేరుకుంది. లగేజీని తనిఖీ చేయగా, అధికారులకు అనుమానాస్పద పొడి లభించింది. దాన్ని పరీక్షించి హెరాయిన్ అని నిర్ధారించారు. 3.2 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గతనెలలో జూన్ 6న ఇద్దరు ఆఫ్రికా మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన, జూన్ 21న జాంబియాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పన్ను ఎగవేత ఆరోపణలు: శాంసంగ్‌కు షాక్!
సాక్షి,\న్యూఢిల్లీ: దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ చిక్కుల్లో పడింది. పన్ను ఎగవేత ఆరోపణలతో శాంసంగ్ కార్యాలయాలలో అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆధారాలను సేకరించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. నెట్ వర్కింగ్ కార్యకలాపాలు నిర్వహించే న్యూఢిల్లీ, ముంబైలోని శాంసంగ్ ఆఫీసులపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను అక్రమంగా దిగుమతి దిగుమతి చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఎఫ్‌టిఎయేతర దేశంలో తయారన పరికరాలను దక్షిణ కొరియా లేదా వియత్నాం గుండా తరలించిందనేది ప్రభుత్వానికి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సోదాలు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే నిజమని తేలితే సరఫరా చేసిన సంబంధిత పరికరాలపై కస్టమ్స్ సుంకం విధించవచ్చు. మరోవైపు డీఆర్ఐఅధికారులు సోదాలపై శాంసంగ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద 4జీ విక్రయ సంస్థ శాంసంగ్. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ప్రత్యేకమైన 4 జీ పరికరాల ప్రొవైడర్‌గా శాంసంగ్ ఉంది. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్‌ను ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అందుకున్న అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఫుడ్ మెటీరియల్స్ చాటున డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో కిలోకి పైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరాపై డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఫుడ్ ఐటమ్స్‌లో కలిపి తీసుకునే డ్రగ్‌గా దీన్ని గుర్తించారు. (వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్ ) -
డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు : ఎక్కడ దాచారంటే..
సాక్షి, ముంబై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని, దొంగ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వర్గం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి పై ఎత్తులు వేస్తూ మాఫియా ముఠా చెలరేగిపోతోంది. రకరకాల మార్గాల్లో మత్తు పదార్థాలను సునాయాసంగా దేశంలోకి పారిస్తూ, కోట్లరూపాయల దండుకుంటోంది. తాజాగా హెరాయిన్‌ను తరలించేందుకు ముఠా పన్నిన పన్నాగం చూసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులే షాకయ్యారు. మత్తు పదార్థాలను మహిళల గౌన్లకు కుట్టిన బటన్లలో దాచి పెట్టి మరీ ఇంటిలిజెన్స్ అధికారుల కన్ను గప్పాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరకు అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా రాకెట్‌ను డీఆర్ఐ అధికారులు ఛేదించారు. మహిళల గౌన్లకు అమర్చిన బటన్స్‌లో హెరాయిన్ దాచి కొరియర్ ద్వారా దేశంలోకి తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు 396 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణాఫ్రికా నుండి ముంబైకి కొరియర్ ద్వారా దీన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వెల్లడించారు. Directorate of Revenue Intelligence (DRI) busted an inter-continental racket of drug smuggling and seized 396 grams of Heroin ingeniously concealed in buttons sewn into women’s gowns sent in a courier consignment from South Africa to Mumbai: DRI pic.twitter.com/JgMuGIphi8 — ANI (@ANI) November 28, 2020 -
దుబాయ్ బంగారం: కృనాల్ పాండ్యాకు షాక్
సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. Cricketer Krunal Pandya stopped by Directorate of Revenue Intelligence (DRI) at the Mumbai International Airport over suspicion of being in possession of undisclosed gold and other valuables, while returning from UAE: DRI sources pic.twitter.com/9Yk82coBgz — ANI (@ANI) November 12, 2020 -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
-
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. జిన్నారంలోని ఫార్మా కంపెనీలో డ్రగ్స్ డెన్లు బయటపడ్డాయి. 50 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ని డి.ఆర్.ఐ అధికారులు పట్టుకున్నారు. డి.ఆర్.ఐ అధికారులకు దొరకకుండా డ్రగ్స్‌ను భూమీలో పాతి పెట్టారు. భూమిలో దాచిపెట్టినా డి.ఆర్.ఐ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్‌ను బయటకు తీశారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. -
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 250 కిలోల మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందు ఏపీడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్‌లను డీఆర్ఐ( డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ఏక కాలంలో ముంబై, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి కార్గో బస్సులో మత్తు మందు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఆర్ఐ అధికారులు కార్గో బస్సుని వెంటాడి పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో రూ. 100 కోట్ల విలువైన మత్తు మందును తయారు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ మత్తుమందును సరఫరా చేసేందుకు ఈ డ్రగ్ మాఫియా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో అరెస్ట్ అయిన ఒక డ్రగ్ డీలర్‌ను అధికారులు తిరిగి పట్టుకున్నారు. 28 కోట్ల రూపాయల విలువైన 142 కిలోల మెఫిడ్రిన్‌ను, 50 కోట్ల విలువైన రా మెటిరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (వరదలపై అధికారులను అప్రమత్తం చేసిన హరీశ్ రావు) -
భద్రాచలం టు బీదర్
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. శనివారం ఎల్బీనగర్ క్రాస్‌రోడ్ వద్ద ట్రక్కు (టీఎస్ 12సీ 5662), కారు (ఏపీ 29 ఏబీ 7351) లను తనిఖీ చేశారు. దీనిపై రూ.4,100 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ట్రక్కులో పైన ఖాళీ ప్లాస్టిక్ కేసులను ఉంచి, ఎవరికీ అనుమానం రాకుండా అడుగున గంజాయి సంచులను జాగ్రత్తగా అమర్చారు. కానీ, తనిఖీల్లో 1,554 కిలోల 751 గంజాయి సంచులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసుల తనిఖీలను ముం దుస్తుగానే గుర్తించి, ట్రక్కులోని సరుకును తప్పించేందుకు కారును పైలట్ వాహనంగా వాడారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు రెండు వాహనాలను ఆపారు. సరుకు భద్రాచలం సమీపంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం రాకెట్ ఎత్తులకు..డీఆర్ఐ చెక్
సాక్షి, హైదరాబాద్: చెన్నై నుంచి ఓరుగల్లుకు విదేశీ బంగారాన్ని అత్యంత రహస్యంగా తరలిస్తోన్న రాకెట్ గుట్టును డీఆర్ఐ అత్యంత చాకచక్యంగా ఛేదించింది.ముఠా వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారికి చెక్ చెప్పింది. కేవలం రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరిపిన దాడుల్లో అధికారులు రూ.13 కోట్ల విలువైన 31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషా బాద్ విమానాశ్రమంలో ఆధునిక స్కానర్లు పెరి గిన దరిమిలా.. దొంగబంగారం రవాణా చైన్నైకి మార్చారు స్మగ్లర్లు. ఈ నేపథ్యం లో ఎలాంటి రశీదులు లేకుండా తక్కువ ధరకు దొరికే విదేశీ పుత్తడిని మన వ్యాపారులు చెన్నైలోని బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? జనవరి 31 చెన్నై నుంచి వరంగల్ వెళ్లే ట్రైన్‌నెం 12969 జైపూర్ ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడ వద్ద డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3.05 కోట్ల విలువైన 7,228 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నా రు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేశారు. తాము ఆ బంగారాన్ని చెన్నైలో కొని, వరంగల్‌కు తీసుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 1న విజయవాడ రైల్వేస్టేషన్లో అదే తరహాలో మరికొందరు డీఆర్ఐకి చిక్కారు. చెన్నై నుంచి వరం గల్ వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో చేపట్టిన తనిఖీ ల్లో వారి వద్ద రూ.2.99 కోట్ల విలువైన 7055 గ్రాముల బంగారం లభించింది. స్వాధీనం చేసుకున్న బంగారం -
విమానాశ్రయంలో 4 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న అయిదుగురు ప్రయాణికులను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరి నుంచి 4.08 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 840 గ్రాముల బంగారాన్ని పైపుల్లో దాచుకుని తీసుకురాగా.. ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు రాత్రి మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడు తీసుకొచ్చిన మైక్రోవేవ్ ఓ వెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 2 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులను కూడా ముందస్తు సమాచారంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు బంగారం పేస్ట్‌ను క్యాప్సుల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా బంగారాన్ని బయటికి తీశారు. ఈ ఐదుగురు ప్రయాణి కుల నుంచి 4,083 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం విలువ రూ. 1.66 కోట్లుగా నిర్ధారించారు. -
3 కోట్ల లంచం కేసులో అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: రూ.3 కోట్ల లంచం కేసుకు సంబంధించి పంజాబ్‌లోని లూధియానాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీనియర్ అధికారి చంద్రశేఖర్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. పలు ఎగుమతిదారులకు సేవలందించే ఓ ప్రైవేట్ క్లియరింగ్ ఏజెన్సీలో 2019, జూన్‌లో డీఆర్ఐ తనిఖీలు చేపట్టిందని, అందులో భాగంగా కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో ఆ పత్రాలకు సంబంధించి క్లియరింగ్ హౌజ్ ఏజెంట్ అనూప్ జోషి, చంద్రశేఖర్ సన్నిహితుడు రాజేశ్ ధాండా ప్రభుత్వ అధికారి తరపున రూ.3 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. అధికారి తరపున మొదటి విడతగా రూ.25 లక్షల లంచం తీసుకున్నందుకు సీబీఐ.. జోషి, ధాండాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
6.46 కిలోల బంగారం పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు అక్రమ రవాణా కోసం పేదలను ఎంచుకుని నామమాత్రపు చార్జీలతో/ఉచిత ఉమ్రా యాత్ర పేర ఎర వేశారు. అలా వెళ్లిన వారిని భయపెట్టి జిద్దా నుంచి 6.46 కేజీల పసిడిని పంపారు. పక్కా సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులతో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్ చేపట్టగా 14 మంది చిక్కారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న సూత్రధారులు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొందరు ఏజెంట్ల ద్వారా కొత్త పంథాలో పసిడి అక్రమ రవాణాకు ప్రయత్నించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను నియమించుకున్న సూత్రధారులు వీరి సాయంతో నిరుపేదలైన మైనార్టీలను ఆకర్షించారు. ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ఉమ్రా యాత్రకు తీసుకువెళ్తామంటూ వారికి ఎర వేశారు. వీరి వలలో పడిన 14 మంది స్త్రీ, పురుషులు గత నెలలో యాత్రకు వెళ్లారు. క్యారియర్లుగా మారాలని ఒత్తిడి... యాత్ర పూర్తయిన తర్వాత వీరందరిని స్మగ్లర్లు జిద్దా తీసుకువెళ్లారు. అక్కడ ఓ ప్రాంతంలో నిర్భంధించి బంగారం స్మగ్లింగ్‌కు తమకు సహకరించాలని ఆదేశించారు. ఈ పని చేయడానికి యాత్రికులు విముఖత చూపగా... తమ మాట వినకపోతే జిద్దాలో అరెస్టు చేయిస్తామని, యాత్రకయ్యే మొత్తం ఖర్చులు చెల్లించాలని భయపెట్టారు. చివరకు ఎటూపాలుపోని స్థితిలో యాత్రికులు క్యారియర్లుగా మారడానికి అంగీకరించారు. దీంతో మొత్తం 6.46 కేజీల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు, 24 క్యారెట్ల కడ్డీలు, చైన్ల రూపంలోకి మార్చారు. వీటిని ఆ 14 మందికి అప్పగించి లోదుస్తుల్లో దాచుకునేలా ఆదేశించారు. మంగళవారం జిద్దా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో వీరిని హైదరాబాద్‌కు పంపారు. ఇలా వచ్చే వీరి ఫొటోలు, వివరాలను జిద్దాలో ఉండే ఏజెంట్లు వాట్సాప్ ద్వారా నగరంలోని ఏజెంట్లకు పంపారు. వీరి వివరాలను క్యారియర్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్లు చిక్కినా సూత్రధారులు వ్యవహారం బయటకు రాకూడదనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ వద్ద వీళ్లకు స్థానిక ఏజెంట్లు కలుస్తారు. అక్కడ నుంచి వీరిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం స్వాధీనం చేసుకుంటారు. ఈ పసిడిని చేరాల్సిన వ్యాపారులకు చేర్చి క్యాష్ చేసుకుంటారు. పక్కా సమాచారంతో.. నిరుపేదలకు పవిత్ర యాత్ర పేరుతో ఎర వేసి క్యారియర్లుగా మార్చుకునే ముఠా వ్యవహారంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఈ స్మగ్లింగ్‌కు చెక్ పడింది. మరికాస్త లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్రూప్ బుకింగ్ ద్వారా వెళ్లిన వీరందరికీ విమానం టికెట్లు ఒకే పీఎన్ఆర్ నంబర్‌తో బుక్ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో అదనపు డీసీపీ చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి ఆ పీఎన్ఆర్ నంబర్, ఓ ప్రయాణికుడి పేరు సేకరించారు. వీళ్లు విమానం దిగి బయటకొస్తే పట్టుకోవడం కష్టమని, కొందరైనా పారిపోయే ప్రమాదముందని భావించా రు. విమానాశ్రయంలోకి వెళ్లి ఆపరేషన్ చేపట్టే అవకాశం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో విషయాన్ని మంగళవారం రాత్రి డీఆర్ఐకి అందించారు. అప్రమత్తమైన ప్రత్యేక టీమ్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. సదరు పీఎన్ఆర్ నంబర్‌ను తనిఖీ చేయగా మొత్తం 14 మంది యాత్రికుల పేర్లు బయటపడ్డాయి. దీంతో విమానాశ్రయం లోపల డీఆర్ఐ, బయట టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్నారు. విమా నం దిగి ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేసిన 14 మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ.. తనిఖీ చేయగా వివిధ రూపా ల్లో ఉన్న 6.46 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్లో రూ.2.17 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీనికి సంబంధించి వీరివద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో అక్రమ రవాణాగా తేల్చారు. -
రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 944 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 1.8 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కొబ్బరి కాయల లోడ్ ముసుగులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందిన మేరకు డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. -
అడ్డదారుల్లో బంగారం అక్రమ రవాణా
సాక్షి, శంషాబాద్ : దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్, డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకవ్యక్తి వద్ద 405 గ్రాముల బంగారం పేస్ట్ బయటపడింది. శుక్రవారం అర్థరాత్రి ఇండిగో 6ఈ 025 విమానంలో వచ్చిన మహ్మద్ అన్షాద్ కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. అతడిని అధికారులు విచారించగా బంగారాన్ని మలద్వారంలో దాచుకుని తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి బంగారాన్ని బయటికి తీయించారు. దీని విలువ రూ.13,08,215 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అన్షాద్ తరచూ ఇదే విధంగా బంగారం తీసుకొస్తున్నట్లు విచారణలో బయటపడింది. మరోవైపు ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన మరోవ్యక్తిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో ఎటువంటి బంగారం బయటపడలేదు. దీంతో అతడి ని టెర్మినల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి మలద్వారంలో దాచి తీసుకొచ్చిన నాలుగు బంగారు క్యాప్సుల్స్‌ను బయటికి తీశారు. -
శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్ట్
-
డీఆర్ఐ భేష్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించే కేసులను డీల్ చేసే డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్)పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని అన్ని విచారణా సంస్థలు, ఏజెన్సీల్లో డీఆర్ఐ మాత్రమే ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. డీఆర్ఐ 61వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కస్టమ్స్ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్ లాంటి నేరాలను విచారించే అత్యున్నత సంస్థ డీఆర్ఐకి ఆయన కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అత్యున్నతమైన ప్రమాణాలు పాటించడం, విచారణను అతి గోప్యంగా ఉంచడం, పరిపూర్ణమైన సాధికార సంస్థగా మారాలన్న యోచనతో పనిచేయడం డీఆర్ఐకి చాలా అవసరమని సూచించారు. రచ్చ మంచిది కాదు ప్రాథమిక విచారణ ఆరంభం కాగానే తాము కనుగొన్న విషయాలను మీడియాకు వెల్లడించాలన్న దుగ్ధను ఆపుకోవాలని ఏజెన్సీ అధికారులకు అరుణ్‌జైట్లీ చురకలు వేశారు. ప్రతిచిన్న విషయాన్ని తుర్రుమంటూ మీడియా ముందు పంచుకోవడం సబబు కాదన్నారు. ఏజెన్సీలంటే అత్యున్నత వృత్తి ప్రమాణాలు పాటించాలని, అంతేకాని విచారణకు అవరోధాలు కలిగించేలా రచ్చకెక్కడం మంచిది కాదని చెప్పారు. ఇలా మీడియా ముందుకు పరిగెత్తే బదులు విచారిస్తున్న కేసులో బలమైన సాక్ష్యాలు సంపాదించేందుకు యత్నించాలన్నారు. విచారణాధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ జరపాలని హితవు చెప్పారు. నేరాన్ని రుజువు చేసి దోషులకు జరిమానాలు, శిక్షలు పడేలా చేయడమే ఏజెన్సీలకు అసలైన పరీక్షని చెప్పారు. మీడియా దృష్టి పడకుండా విచారణ సాగించడమే అధికారులకు మంచిదని జైట్లీ చెప్పారు. స్వీయ నియమావళి కీలకం విచారణా సంస్థల చుట్టూ వివాదాల ముసురు ముట్టిన వేళ ఇకపై అనవసరమైన ఆరోపణలు రాకుండా ఉండేందుకు కొన్ని నైతిక నియమాలుండాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు అత్యున్నతమైన వృత్తి ప్రమాణాలు పాటించడం, అనవసరంగా రచ్చకెక్కకుండా ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు పరిగెత్తకుండా సంయమనం పాటించడం.. లాంటి నియమాలు పాటించాలని జైట్లీ సూచించారు. నైతిక విలువలు, సమగ్రత, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడంపైనే ఒక ఏజెన్సీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని తెలిపారు. వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం కాగా వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. -
60 ఏళ్ల డీఆర్ఐ : ఎన్నో ఘనతలు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ స్మగ్లింగ్, నకిలీ నోట్లు, నకిలీ బంగారం, డ్రగ్స్ నియంత్రణలపై దృష్టి సారిస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1957లో డీఆర్‌ఐను స్థాపించారు. 1992లో హైదరాబాద్ కేంద్రంగా స్థానికంగా డీఆర్ఐ ప్రారంభమైంది. 1992 నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ డీఆర్ఐ ఎన్నో ఘనతలు సాధించిందని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్ పేర్కొన్నారు. డీఆర్ఐ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రం ఇప్పటివరకూ 660 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేసిందని వెల్లడించారు. 18,900 కిలోల గంజాయి, 26 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు చెప్పారు. వీటిపై 25 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. గత రెండేళ్లలో డీఆర్ఐ-హైదరాబాద్ మంచి పురోభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. 2017-18ల మధ్య 127 కేసుల్లో 817 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లు చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న 148 కోట్లను స్వాధీనం చేసుకుని 61 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.13 బంగారం స్మగ్లింగ్ కేసుల్లో 7 కోట్ల రూపాయల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 16 నార్కోటిక్ డ్రగ్ కేసుల్లో 41 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 14 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 9 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. వీటితో పాటు 4 సిగరెట్ స్మగ్లింగ్ కేసుల్లో 9 కోట్ల రూపాయలు విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ఎంకే సింగ్ పేర్కొన్నారు. -
రూ. 50 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టివేత
సాక్షి, సంగారెడ్డి: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిషేధించిన ఔషధాల రవాణాపై డీఆర్ఐ అధికారులు శనివారం ప్రత్యేక దాడులు జరిపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 46 కిలోల నిషేధిత డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. నిషేధిత డ్రగ్స్‌ను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన డ్రగ్స్ ముఠా హైదరాబాద్ మీదుగా చెన్నైకి నిషేధిత డ్రగ్స్‌ను తరలించేందుకు పథకం పన్నినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు
-
ఢిల్లీలో భారీగా పట్టుబడ్డ బంగారం, నగదు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బంగారం, నగదు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. యు అండ్ ఐ వాల్ట్స్ లిమిటెడ్ సంస్థలో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని ఢిల్లీ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు, బంగారం.. గుట్కా తయారీదారునివిగా గుర్తించారు. గుట్కా తయారీతో పాటు బిల్డర్‌గా పని చేస్తున్న ఆ వ్యక్తి నుంచి ఇప్పటి వరకు రూ.61కోట్ల నగదు, బంగారం సీజ్ చేశారు. -
గుజరాత్లో భారీగా పాతనోట్లు స్వాధీనం
గుజరాత్: గుజరాత్ లో ఒకవైపు అసెంబ్లీకి మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియగా మరోవైపు భారీ ఎత్తున రద్దయిన నోట్లను నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బారుచ్‌లో రద్దయిన రూ.500, 1000ల నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. సుమారు రూ. 50 కోట్లవిలువ చేసే పాత నోట్లను రికవరీ చేశామని డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. యమునా బిల్డింగ్ మెటీరియల్ ప్రాంగణంపై దాడిచేసిన అధికారులు రూ. 48.90 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ది డిప్యూటిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం రద్దయిన పాత కరెన్సీ నోట్లను కలిగి వుండడం నేరమని అధికారులు పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా ఇది ముఖ విలువకు ఐదు రెట్ల పరిమానా విధించవచ్చని తెలిపారు. దీని ప్రకారం రూ. 245 కోట్ల రూపాయల జరిమానా విధించబడుతుంది. ఈకేసులో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులపై కోర్టులో డీఆర్ఐ అధికారులు ఫిర్యాదు చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. దాదాపు 68శాతం పోలింగ్ జరిగినట్టు ఈసీ తెలిపారు. కాగా ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. -
రూ. 6 కోట్ల విదేశీ సిగరెట్ల సీజ్
సాక్షి, హైదరాబాద్ : అరబ్, తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న విదేశీ సిగరెట్లను నగరానికి చెందిన డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో డీఆర్ఐ పోలీసులు శాంషాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. శుక్రవారం అర్థరాత్రి 01.30 గంటల తర్వాత ఓ కంటైనర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. కంటైనర్‌లో ఉన్న బాక్సులన్నింటిలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. కంటైనర్‌ను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏయే దేశాల నుంచి సిగరెట్లను దిగుమతి చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువ రూ. 6.33 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తనిఖీల సమయంలో దొరికిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బాక్సుల్లో సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. -
తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సంచలనం
- భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించిన డీఆర్ఐ - మెదక్, నల్లగొండల్లో 600కేజీల మత్తుపదార్థాల పట్టివేత హైదరాబాద్: తెలంగాణ ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దర్యాప్తు జరుగుతుండగానే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ శుక్రవారం ఓ భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు.. రాజధానిని ఆనుకుని ఉన్న మెదక్, నల్లగొండ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపి భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సుమారు రూ.7 కోట్లు విలువచేసే 600 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసేకున్నట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో కేంద్ర సంస్థ ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భారీ ప్రయోగశాలల్లో డ్రగ్స్ తయారీ మెదక్, నల్లగొండ జిల్లాల్లో డీఆర్ఐ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా భారీ ప్రయోగశాలల్లో మత్తుపదార్థాలను తయారుచేస్తున్నట్లు డీఆర్ఐ గుర్తించింది. దీంతో ఆయా ల్యాబ్లలోని 20 లక్షల విలలువైన రెండు రియాక్టర్లు, ఒక సెంట్రిఫ్యూజ్, ఒక డ్రైయర్‌ను సీజ్ చేశారు. అయితే, ఈ ల్యాబ్‌లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ ముఠా స్వయంగా నిర్వహిస్తున్నవా? అనే విషయాలు తెలియాల్సిఉంది. డ్రగ్స్ రవాణా చేస్తోన్న పలు ముఠాలను తెలంగాణ అధికారులు అరెస్ట్ చేసిన దరిమిలా, కేంద్ర సంస్థలు సైతం దూకుడుపెంచడం గమనార్హం. -
మిక్సీలో మిక్స్ చేసేసి...
♦ మహిళా స్మగ్లర్ కొత్త పోకడ ♦ అబుదాబి నుంచి 1.29 కిలోల బంగారం అక్రమ రవాణా.. ♦ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్న డీఆర్ఐ సాక్షి, హైదరాబాద్: మిక్సీ లోపలి భాగంలో ఉంచి స్మగ్లింగ్ చేస్తున్న 1.29 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న నగర మహిళ తనతో పాటు మిక్సర్ గ్రైండర్‌ను తీసుకువచ్చింది. ఈమె బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు విమానా శ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగేజ్‌తో పాటు గ్రైండర్‌ను తనిఖీ చేశారు. మిక్సీ మోటర్ కింది భాగంలో ఉండే జిగ్ అనే ఉపకరణాన్ని తొలగించి, ఆ స్థానంలో బంగారం పెట్టి, పైన మెటల్ పూత పూసినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని మహిళను లోతుగా విచారిస్తున్నారు. 13 డ్రోన్ కెమెరాలు స్వాధీనం... శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు గురువారం 13 డ్రోన్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో వచ్చిన ఇద్దరు హైదరాబాదీలు తమ వెంట భారీ టీవీతో పాటు 2 బ్యాగుల్లో తొమ్మిది చిన్న, 4 పెద్ద డ్రోన్ కెమెరాలను తీసుకువచ్చారు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బ్యాగులు తనిఖీ చేశారు. వీటిల్లో డ్రోన్ కెమెరాలు బయటపడ్డాయి. వీటిని విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా, వినియోగించాలన్నా కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతులు లేకుండా తీసుకువస్తున్న నేపథ్యంలో కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కోల్‌కతాలో14 కేజీల బంగారం పట్టివేత
న్యూఢిల్లీ: అక్రమంగా తీసుకువచ్చిన కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కోల్‌కతాలో పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 2వ తేదీన స్థానిక నగేర్బజార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక్కోటి 116 గ్రాముల బరువున్న 120 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటిలో 62 బిస్కెట్లపై స్విట్జర్లాండ్ గుర్తులు, 58 బిస్కెట్లపై యూఏఈలో తయారైనట్లు గుర్తులున్నాయి. ఈ బంగారాన్ని దుబాయి నుంచి బంగ్లాదేశ్‌లోకి తీసుకువచ్చి...అక్కడి నుంచి భారత సరిహద్దు ప్రాంతం బసిర్హాత్ వద్ద వీటిని సదరు వ్యకి అందుకున్నట్లు విచారణలో తెలిసింది. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుంది. ఇలా ఉండగా, జనవరిలో కూడా ఇక్కడ డీఆర్ఐ అధికారులు 41కిలోల అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. -
40 కేజీల బంగారం.. అధికారులు అవాక్కు
-
ఓ వ్యక్తి వద్ద 40 కేజీల బంగారం పట్టివేత
నోయిడా: ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎన్‌ఎస్‌ఈజెడ్) నుంచి ఇతడు దేశీయ మార్కెట్‌కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు. దుబాయి నుంచి ఎన్‌ఎస్‌ఈజెడ్ ఆభరణాలు తయారు చేసి విక్రయించేందుకు గాను బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అనంతరం అదే ఆభరణాలను దుబాయ్‌కు ఎగుమతి చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి దాదాపు రూ.150 కోట్ల విలువైన బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్నంత కొంతమంతి బడా బాబుల వద్ద ఉన్న అక్రమ సంపాదనను తెల్లడబ్బుగా మార్చేందుకు ఉపయోగించినట్లు సమాచారం. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లి అనంతరం రిమాండ్‌కు తరలించారు. మరోపక్క, మీరట్‌లో ఓ ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆర్కే జైన్ అనే వ్యక్తి వద్ద నుంచి ఐటీ అధికారులు రూ.2.67కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 లక్షలు కొత్త కరెన్సీ ఉంది. -
భారీ ఎత్తున బంగారం, కరెన్సీ పట్టివేత
న్యూఢిల్లీ: రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) భారీ ఎత్తున బంగారాన్ని, అక్రమ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ జోనల్ యూనిట్ నల్లధనం,బంగారం అక్రమ రవాణా వెలికితీతలో భాగంగా దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 20.64 కిలోల బంగారాన్ని, 6.44 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. పాత ఢిల్లీ ప్రాంతంలో రాజేష్ గుప్తా కి చెందిన ఒక దుకాణంనుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంకజ్ కుమార్ అనే వ్యాపారి అక్రమ బంగారాన్ని అమ్మినట్టుగా డీఆర్ఐ అధికారి తెలిపారు. ఇరువురినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీ తరలించామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. 995 స్వచ్ఛత 1 కిలో బరువు తూగే 20విదేశీ బార్లనుతో పాటు నగదు మొత్తం మొత్తం విలువ సుమారు రూ 12.91 కోట్లు ఉంటుందని ప్రకటించారు. బ్లాక్ మనీ, అక్రమంగా రవాణా అవుతున్న విదేశీ బంగారానికి వ్యతిరేకంగా తమ డ్రైవ్ తో కొనసాగుతుందని తెలిపారు. కాగా గత నెల, డిఆర్ఐ ఢిల్లీ జోనల్ యూనిట్ రూ 2,000 కోట్ల విలువైన సుమారు 7,000 కిలోగ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ తయారీ మఠా పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు నలుగురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విశాఖపట్నం, పటాన్‌చెరులకు చెందిన వారిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నంలో 100 కేజీల మాదకద్రవ్యాలు, 50 కేజీల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 2.5 కోట్ల ఉంటుందని అంచనావేస్తున్నారు. -
అతి భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. ఒకటికాదు రెండు కాదు రూ.2000 కోట్ల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని భూతల, ఆకాశమార్గంలో తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయాసియా దేశం మయన్మార్ నుంచి భూతల మార్గం ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్ లోకి అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు.. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారని డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పటివరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగ్లింగ్ చేశారని, దాని విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు ఛేధించినవాటిల్లో అతి భారీ దందా ఇదేనని తెలిపారు. గుట్టురట్టైందిలా.. కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు గొంకను కదల్చగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 'విలువైన సరుకు'లను తనిఖీ చేసిన అధికారులు రూ.3.1 కోట్ల విలువచేసే10 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర సరుకులు అక్రమంగా రవాణాచేశారు. కాగా, కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. విమాన సిబ్బంది హస్తం? ఇంత భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నా విమానాశ్రయ, విమాన సిబ్బందికి ఇంతైనా అనుమానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని, ఈ వ్యవహారంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు, ఆ మేరకు వారిని త్వరలోనే ప్రశ్నిస్తామని డీఆర్ఐ అధికారులు చెప్పారు. -
డ్రగ్స్ మాఫియా
కడప అర్బన్: రాష్ట్రస్థాయిలో డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువుగా కడప మారుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో సూర్య కెమికల్స్‌లో ‘ఎఫిడ్రిన్ హెచ్‌సీఎల్’ను పట్టుకున్నారు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల నుంచి బ్రౌన్‌షుగర్ లాంటి మత్తు పదార్థాలను గల్ఫ్‌కు వెళుతున్న జిల్లావాసుల ద్వారా పంపుతూ కొందరు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గల్ఫ్‌లో కూడా అమాయకమైన ప్రజలు సైతం విమానాశ్రయాల్లో తనిఖీల్లో పట్టుబడి జైళ్ల పాలయ్యారు. తాజాగా ఎఫిడ్రిన్ దొరకడంతో డ్రగ్స్మాఫియాపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దిశగా పోలీసులు దృష్టిసారించారు. అసలేం జరిగింది ? కడప నగర శివార్లలోని పరిశ్రమల ప్రాంతంలో ప్లాట్ నం 183లో ప్రశాంతి ప్లైయాష్ బ్రిక్స్ పేరుతో యర్రగుడి సూర్యనారాయణ పరిశ్రమ నడుపుతున్నాడు. అందులో ఓవైపు సూర్య కెమికల్స్ పేరుతో ఓ గదిలో ఓ రియాక్టర్‌ను ఏర్పాటు చేసి ‘ఎఫిడ్రిన్ హెచ్‌సీఎల్’ నుంచి ‘ఎఫిడ్రిన్’ను తయారుచేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారమందింది. దీంతో హైదరాబాద్ జోనల్ కార్యాలయం నుంచి అధికారులు కడపకు గత నెల 30న వచ్చి సెర్చ్ వారెంట్ ద్వారా తనిఖీలు చేశారు. ఎరుపు రంగులోని ఓ బ్యాగ్‌లో 46 కిలోల ‘ఎఫిడ్రిన్ హెచ్‌సీఎల్’ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కెమికల్‌ను సీజ్ చేశారు. తర్వాత జిల్లా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్‌కు యర్రగుడి సూర్యనారాయణరెడ్డిని తీసుకుని వెళ్లారు. ఈ కెమికల్‌ను అల్లోపతి మందుల్లో కూడా తగిన మోతాదులో ఉపయోగిస్తుంటారు. కెమికల్స్ పరిశ్రమలపై డీఆర్ఐ అధికారుల నిఘా పరిశ్రమల్లో తయారుచేస్తున్న కెమికల్స్, పల్వరైజింగ్ పదార్థాలు, పెయింటింగ్స్‌లో ఉపయోగిస్తున్న రసాయనాలను గురించి డైరెక్టర్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలు నడుపుతున్న కొన్ని ప్రాంతాల్లో ఎఫిడ్రిన్ హెచ్‌సీఎల్ లాంటి కెమికల్స్ ఇంకా ఎక్కడైనా తయారవుతున్నాయా? అనే కోణంలో నిఘా ఉంచినట్లు సమాచారం. సూర్య కెమికల్స్ వైపు పరుగులు తీస్తున్న అధికారులు డీఆర్ఐ అధికారులు వచ్చి సూర్యనారాయణరెడ్డిని అరెస్ట్ చేసుకుని వెళ్లడంతో జిల్లాలోని సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పర్యవేక్షణలో తమ శాఖ వైపు నుంచి ఏమైనా సంబంధం వుందా! అన్నట్లు ఆయా శాఖల అధికారులు పరుగులు తీస్తున్నారు. మంగళవారం ఎక్సైజ్ అధికారులు, బుధవారం ఔషధ నియంత్రణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ... జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక విభాగానికి చెందిన వారు కెమికల్స్ ఫ్యాక్టరీలతో పాటు, మత్తు పదార్థాల ముడిపదార్థాలకు అవకాశం ఉన్న పరిశ్రమలపై కూడా నివేదికలు తయారుచేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కూడా ప్రత్యేక నిఘాను ఉంచినట్లు తెలుస్తోంది. ఐతే ఏ పరిశ్రమలోనైనా తాము ఉపయోగిస్తున్న లైసెన్స్డ్ కెమికల్స్‌ను, సంబంధిత తయారీ వస్తువులను ఎప్పటికపుడు సంబంధిత అధికారుల పర్యవేక్షణ చేయించుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. కానీ దురాశతో సూర్యనారాయణరెడ్డి లాంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ పట్టుబడుతుంటారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో 3.26 కేజీల గోల్డ్ సీజ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.97 లక్షల విలువైన 3.26 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు శనివారం సీజ్ చేశారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 28 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానం బాత్రూంలో బంగారం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కాట్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న విమానంలోని బాత్రూంలో నాలుగు కేజీల బంగారాన్ని విమాన సిబ్బంది గమనించి... అనంతరం డీఆర్ఐ అధికారులకు వారు సమాచారం అందించారు. డీఆర్ఐ అధికారులు బాత్రూంలోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనిఖీల్లో బంగారం పట్టుబడుతుందని భావించిన ప్రయాణికుడు భయపడి బాత్రూంలో వదిలేసి వెళ్లి ఉంటాడని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 26వ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా... బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సహకరిస్తున్న ఇద్దరు జీఎమ్ఆర్ ఉద్యోగుల పేర్లు వెళ్లడించాడు. దాంతో వారిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. -
బంగారం అక్రమ రవాణాపై కేంద్రం చర్యలు
హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాను నిరోధించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. భారత్ లో బంగారాన్ని విపరీతమైన డిమాండ్ ను ఆసరాకు చేసుకుంటున్న ముఠాల గుట్టురట్టు చేసేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విమానాశ్రయాలు, భూగర్భ, వాయు సరిహద్దులపై దృష్టి సారించాలని డీఆర్ఐకి ఆదేశాలు జారీ చేసింది. బంగారం తరలింపు మూడు రెట్లు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేసిన భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏప్రిల్-ఆగస్టు మధ్య 1780 కేసులు నమోదైయ్యాయి. ఈ క్రమంలోనే రూ.470 కోట్ల విలువైన బంగారం కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పండుగల సీజన్ పురస్కరించుకుని బంగారం అక్రమ తరలింపు అధికంగా ఉన్న నేపథ్యంలో భారత్ దానికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. -
రూ.118 కోట్ల విలువైన కేటమైన్ స్వాధీనం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూ.118 కోట్ల విలువ ఉండే 1.2 టన్నుల కేటమైన్ మాదకద్రవ్యాన్ని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జల్గావ్ జిల్లాలోని రుఖ్మా ఇండస్ట్రీస్‌లో ఇది శుక్రవారం రాత్రి దొరికింది. ఈ ముఠా సూత్రధారి వికాస్పురితోపాటు ఐదుగురిని అరెస్టు చేశారు. కేటమైన్ తయారీకి లెసైన్సు లేకున్నా రుఖ్మా యాజమాన్యం దీనిని ఉత్పత్తి చేస్తోందని డీఎఆర్ఐ తెలిపింది. ఇక పురిని పొవాయిలో శనివారం అరెస్టు చేసిన అధికారులు ఇతని ఇంట్లో రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేటమైన్ విక్రయంతోనే ఈ మొత్తం వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే రుఖ్మా ఇండస్ట్రీస్ యజమాని నితిన్ చించోలేను అరెస్టు చేయాల్సి ఉంది.