![DRI Seizes 25 KG Mephedrone Worth Around Rs 50 Crore In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/26/drugs.jpg.webp?itok=-ML2fhu2)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. ఈనెల 21న నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నగరంలోని ఓ ల్యాబ్‌లో ఈ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మూఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు వెల్లడించారు.
రూ.49.77 కోట్లు విలువైన 24.885 కిలోల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డీఆర్‌ఐ అధికారులు. అరెస్ట్ చేసిన ఏడుగురు ముఠా సభ్యులకు గతంలో ఇండోర్, యమునా నగర్ ఎఫిడ్రిన్ తయారీ కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment