mephidrin
-
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. ఈనెల 21న నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నగరంలోని ఓ ల్యాబ్‌లో ఈ మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మూఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. రూ.49.77 కోట్లు విలువైన 24.885 కిలోల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు డీఆర్ఐ అధికారులు. అరెస్ట్ చేసిన ఏడుగురు ముఠా సభ్యులకు గతంలో ఇండోర్, యమునా నగర్ ఎఫిడ్రిన్ తయారీ కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇదీ చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్‌నగర్‌కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
మాదకద్రవ్యాల ముఠా పట్టివేత
రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సన్‌సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నైజీరియాకు చెందిన సిమోన్ చుక్వు, హైదరాబాద్‌కు చెందిన మనీష్ కుమార్ గోయెల్‌గా గుర్తించారు. వారి నుంచి 44 గ్రాముల బరువైన 50 డ్రగ్స్ ప్యాకెట్లతోపాటు రూ.30వేల నగదు, రెండు సెల్ఫోన్లను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నానల్‌నగర్‌కు చెందిన మనీష్కుమార్గోయెల్ ప్రస్తుతం సన్‌సిటీలో నివాసం ఉంటూ మెఫిడ్రిన్ అనే మత్తుమందును నైజీరియన్ల ముఠాతో కలసి విక్రయిస్తున్నాడు. పట్టుబడిన నైజీరియా దేశస్తుడు ఇప్పటి వరకు ఐదు సార్లు ఇండియాకు వచ్చి బెంగళూరు, గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలను విక్రయించాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరనీ రిమాండ్‌కు తరలించారు.