ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్‌నగర్‌కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్‌బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment