former pilots
-
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్‌నగర్‌కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి
కింగ్ఫిషర్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: వేతన బకాయిల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌ఫిషర్ మాజీ పైలట్లకు ఊరట లభించింది. ముగ్గురు పైలట్లకు వేతన బకాయిలను 10 శాతం వడ్డీతోసహా చెల్లించాలని కింగ్‌ఫిషర్‌ను కోర్టు ఆదేశించింది. ఐదు నెలలకు సంబంధించి 26 లక్షల వేతనాన్ని చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ అహూజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2012 మార్చి నుంచి జూలై మధ్య కాలానికి రూ.25.37 లక్షలను 10 శాతం వడ్డీతో అహూజాకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కింగ్‌ఫిషర్ మరో ఇద్దరు పైలట్లు గార్గ్, అమర్ భాటియాలు కూడా వేతన బకాయిల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది.