పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి | Delhi High Court orders Kingfisher Airlines to pay outstanding | Sakshi
Sakshi News home page

పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి

Published Sun, Apr 20 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి

పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి

కింగ్‌ఫిషర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: వేతన బకాయిల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌ఫిషర్ మాజీ పైలట్లకు ఊరట లభించింది. ముగ్గురు పైలట్లకు వేతన బకాయిలను 10 శాతం వడ్డీతోసహా చెల్లించాలని కింగ్‌ఫిషర్‌ను కోర్టు ఆదేశించింది. ఐదు నెలలకు సంబంధించి 26 లక్షల వేతనాన్ని చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ అహూజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

2012 మార్చి నుంచి జూలై మధ్య కాలానికి  రూ.25.37 లక్షలను 10 శాతం వడ్డీతో అహూజాకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కింగ్‌ఫిషర్ మరో ఇద్దరు పైలట్లు  గార్గ్, అమర్ భాటియాలు కూడా వేతన బకాయిల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement