పైలట్లకు వేతన బకాయిలు చెల్లించండి
కింగ్ఫిషర్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వేతన బకాయిల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కింగ్‌ఫిషర్ మాజీ పైలట్లకు ఊరట లభించింది. ముగ్గురు పైలట్లకు వేతన బకాయిలను 10 శాతం వడ్డీతోసహా చెల్లించాలని కింగ్‌ఫిషర్‌ను కోర్టు ఆదేశించింది. ఐదు నెలలకు సంబంధించి 26 లక్షల వేతనాన్ని చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ అహూజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
2012 మార్చి నుంచి జూలై మధ్య కాలానికి రూ.25.37 లక్షలను 10 శాతం వడ్డీతో అహూజాకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కింగ్‌ఫిషర్ మరో ఇద్దరు పైలట్లు గార్గ్, అమర్ భాటియాలు కూడా వేతన బకాయిల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది.