గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.అష్టమి సా.4.34 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రేవతి సా.6.24 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.7.13 నుండి 8.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.47 నుంyì 9.32 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.41 వరకు, అమృత ఘడియలు: సా.4.10 నుండి 5.36 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.36.
మేషం...ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
వృషభం....పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మిథునం...దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
కర్కాటకం...రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు తథ్యం.
సింహం...అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చిక్కులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
కన్య.....పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
తుల....బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం...ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు...చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మకరం...కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహం..
కుంభం....కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
మీనం.....కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
Comments
Please login to add a commentAdd a comment