మాదకద్రవ్యాల ముఠా పట్టివేత | drug gang Captured in hyderabad | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల ముఠా పట్టివేత

May 4 2016 8:20 PM | Updated on Oct 17 2018 5:27 PM

రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సన్‌సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సన్‌సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నైజీరియాకు చెందిన సిమోన్ చుక్వు, హైదరాబాద్‌కు చెందిన మనీష్ కుమార్ గోయెల్‌గా గుర్తించారు. వారి నుంచి 44 గ్రాముల బరువైన 50 డ్రగ్స్ ప్యాకెట్లతోపాటు రూ.30వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

నానల్‌నగర్‌కు చెందిన మనీష్‌కుమార్‌గోయెల్ ప్రస్తుతం సన్‌సిటీలో నివాసం ఉంటూ మెఫిడ్రిన్ అనే మత్తుమందును నైజీరియన్ల ముఠాతో కలసి విక్రయిస్తున్నాడు. పట్టుబడిన నైజీరియా దేశస్తుడు ఇప్పటి వరకు ఐదు సార్లు ఇండియాకు వచ్చి బెంగళూరు, గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలను విక్రయించాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరనీ రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement