
డ్రగ్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులు
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్‌ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్‌కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్‌లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్‌టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు.
బూట్ల కింద దాచి స్మగ్లింగ్
బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్‌లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్‌పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment