![Officer was arrested in 3 crores bribery case - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/2/6666.jpg.webp?itok=RHerXZmF)
న్యూఢిల్లీ: రూ.3 కోట్ల లంచం కేసుకు సంబంధించి పంజాబ్‌లోని లూధియానాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సీనియర్ అధికారి చంద్రశేఖర్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. పలు ఎగుమతిదారులకు సేవలందించే ఓ ప్రైవేట్ క్లియరింగ్ ఏజెన్సీలో 2019, జూన్‌లో డీఆర్‌ఐ తనిఖీలు చేపట్టిందని, అందులో భాగంగా కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో ఆ పత్రాలకు సంబంధించి క్లియరింగ్ హౌజ్ ఏజెంట్ అనూప్ జోషి, చంద్రశేఖర్ సన్నిహితుడు రాజేశ్ ధాండా ప్రభుత్వ అధికారి తరపున రూ.3 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. అధికారి తరపున మొదటి విడతగా రూ.25 లక్షల లంచం తీసుకున్నందుకు సీబీఐ.. జోషి, ధాండాలను అరెస్టు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment