Bribery case
-
తప్పుడు వార్తలను ప్రచురించే మీడియా సంగతేంటి..?
-
Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది! ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105(2), ఆరి్టకల్ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం. ‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క. అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ... జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టారు. ఆరి్టకల్ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది. ఏమిటీ పీవీ కేసు... 1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్ 105(2), ఆర్టికల్ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది. అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్
తుమకూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్)కు సంబంధించిన లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎం.విరూపాక్షప్పను ఎట్టకేలకు లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు. విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మార్చి 2న ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. విరూపాక్ష నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అనంతరం కోర్టు ప్రభుత్వ రంగ కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్న విరూపాక్షకు బెయిలిచ్చింది. అయితే, ప్రధాన ముద్దాయిగా ఉన్న విరూపాక్షప్ప కేసు విచారణలో సహకరించడం లేదంటూ లోకాయుక్త పిటిషన్ వేయగా కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. -
సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన ఇంట్లోనే నిర్జీవంగా పడివున్న అతడిని పోలీసులు గుర్తించారు. ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జుననగర్ కాలనీకి చెందిన కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో మూడేళ్ల క్రితమే భర్తను వదిలి వెళ్లడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండటంతో భరించలేని తల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం నాగరంలోని కూతురు ఇంటికి వెళ్లింది. మూడు రోజులుగా ఇంట్లో ఎవరులేక పోవడంతో ఇంటిని శుభ్రం చేసేందుకు ఆదివారం ఉదయం నాగార్జుననగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చింది. తాను ఉండే ఇంటిని శుభ్రం చేసి కొడుకు గది వద్దకు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతకు పలకకపోవడంతో డోర్ తెరుచుకొని లోనికి వెళ్లింది. డైనింగ్ టేబుల్ వద్ద కొడుకు పడిపోయి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె చుట్టు పక్కల వారిని పిలిచింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధాంరించారు. తండ్రి ఆత్మహత్య.. కొడుకు అనుమానాస్పద మృతి శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగా జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదీ వివాదం.. భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న కీసర అప్పటి తహసీల్దార్ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
‘ఎవర్నీ వదలం’.. భారత్‌లో పరిణామాలపై అమెజాన్ గరం
న్యూఢిల్లీ: భారత్‌లోని కొందరు లీగల్ ప్రతినిధులపై వచ్చిన లంచం ఆరోపణలను అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సీరియస్‌గా తీసుకుంది. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలను నిర్ధారించడం గానీ లేదా ఖండించడంగానీ చేయని అమెజాన్..‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము‘ అని పేర్కొంది. ది మార్నింగ్ కాంటెక్ట్స్ అనే పత్రికలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత్‌లో ప్రభుత్వాధికారులకు తమ లీగల్ ప్రతినిధులు కొందరు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై అమెజాన్ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో సీనియర్ కార్పొరేట్ కౌన్సెల్‌ను సెలవుపై పంపించింది. దీనిపైనే కంపెనీని వార్తా సంస్థలు సంప్రదించగా.. ఆరోపణలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయబోమని, విచారణ ప్రస్తుతం ఏ దశలో ఉందో చెప్పలేమని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. విదేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు కోసం తమ సిబ్బంది ఎవరైనా ఆయా దేశాల ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చినట్లు ఆరోపణలు వస్తే.. అమెరికన్ కంపెనీలు వాటిని తీవ్రంగా పరిగణిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐతో విచారణ జరిపించాలి: సీఏఐటీ మరోవైపు, ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన వ్యవహారమని, అన్ని స్థాయిల్లో అవినీతి పేరుకుపోయిందన్న భావనను తొలగించేందుకు ప్రభుత్వం దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు లేఖ రాసింది. అమెజాన్ లీగల్ ప్రతినిధుల మీద లంచాల ఆరోపణల అంశాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) చైర్మన్ గ్యారీ గెన్సలర్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసే శక్తుల నుంచి దేశీ ఈ–కామర్స్ మార్కెట్‌ను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలను దెబ్బ తీసే విధంగా చౌక ధరలు, తన ప్లాట్‌ఫాంపై కొందరు విక్రేతలకు ప్రాధాన్యం ఇస్తూ ఇతర విక్రేతల అవకాశాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో అమెజాన్ మీద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేస్తున్న తరుణంలో కంపెనీ ఈ వివాదంలో చిక్కుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు ఫ్యూచర్ గ్రూప్‌లో ఇన్వెస్టరయిన అమెజాన్.. ఆ సంస్థ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కుదుర్చుకున్న ఒప్పందంపై న్యాయపోరాటం కూడా చేస్తోంది. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టుల్లో అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ పరస్పరం దావాలు వేశాయి. చదవండి: చైనాకు అమెజాన్ భారీ షాక్ -
ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో బూర్గంపహాడ్ మండలంలో డబ్బు పంపిణీ చేశారంటూ ఆమెపై నమోదుచేసిన కేసులో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. -
బ్లాక్ మనీని బూడిద చేసిన తహసీల్దార్
-
ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్
రాజస్తాన్: అవినీతికి పాల్పడే వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేస్తే ఏం చేస్తారు.. ఆ అవినీతి డబ్బును దాచడానికి నానా తంటాలు పడతారు. ఇక్కడ ఓ తహసీల్దార్ అధికారులకు సాక్షం ఉండకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు. ఉద్యోగం ఉంటే ఇలాంటి లక్షలు ఎన్నైనా సంపాదించుకుంటా అనుకున్నాడో ఏమో ఇలాంటి వింత పని చేసి వార్తల్లో నిలిచాడు. ఏకంగా 20 లక్షలు స్వాహా రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును లంచంగా తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అనంతరం పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో అతడిని పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. జరిగినదంతా ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ఎవరో సమాచారం ఇచ్చారు. ఇంకేముంది బ్లాక్ మనీతో పట్టుబడితే శ్రీ కృష్ణ జన్మస్థానమే అని కంగారుపడ్డాడు. అంతకు పూర్వం పలువురు వద్ద లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లోనే ఉండడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు కాల్చి పడేస్తే పీడా పోతుందని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలు పెట్టాడు. తెలివిగా ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ కూడా పెట్టాడండోయ్. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్లను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకొని వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపుకి గడియ ఉండడంతో అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. 20 లక్షల వరకు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు చేసిన ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైర్ల్ అయ్యింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆశ చూపి.. బాలికల అమ్మకం ) -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్‌కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
అవినీతిలో నాగ ‘రాజు’ లీలలు
సాక్షి, మేడ్చల్: కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేస్తారా?
న్యూఢిల్లీ: సొంత డీఎస్పీని అరెస్ట్ చేసి, కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయడంపై సీబీఐకి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అవినీతికి సంబంధించిన ఒక కేసును సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా అనేక ఆధారాలు కన్పిస్తున్న సోమేశ్వర్ శ్రీవాస్తవను అరెస్ట్ చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ వ్యాపారి, ప్రధాన నిందితుడు అయిన మనోజ్ ప్రసాద్‌కు శ్రీవాస్తవ్ సోదరుడవుతాడు. ‘శ్రీవాస్తవ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనోజ్ ప్రసాద్ కన్నా ఈయనే కీలకంగా కనిపిస్తున్నాడు. ఆయనను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? మీరు మీ సొంత డీఎస్పీనే అరెస్ట్ చేశారు. కేసులో పెద్ద పాత్ర పోషించినవారిని వదిలేశారు’ అని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీబీఐ.. శ్రీవాస్తవ్ పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై ఎల్ఓసీ(లుక్ ఔట్ సర్క్యులర్) జారీ చేశామంది. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఎల్ఓసీ ఎందుకు? దాంతో ఏం లాభం. భారతదేశం చాలా పెద్దది. ఇక్కడే హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్ కన్నా శ్రీవాస్తవ్‌కు వ్యతిరేకంగా ఎక్కువ సాక్ష్యాలున్నాయని, కీలక నిందితుడైన ఆయనను అలా వదిలేశారని వ్యాఖ్యానించారు. అనంతరం.. అవసరమైతే గతంలో ఈ కేసును విచారించిన అధికారిని పిలిపిస్తామని చెప్పి.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. మాంసం ఎగుమతిదారు అయిన మొయిన్ ఖురేషీకి సంబంధించిన 2017 నాటి కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ బాబు నిందితుడు. ఆ కేసును విచారిస్తున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు తనపై చర్యలేవీ తీసుకోకూడదని కోరుతూ పలు విడతలుగా రూ. 2 కోట్లు మనోజ్ ప్రసాద్, శ్రీవాస్తవ్‌ల ద్వారా ఇచ్చానని సతీశ్ బాబు ఫిర్యాదు చేశారు. దాంతో ఆస్థానాపై కేసు నమోదు చేశారు. సహ నిందితుడిగా సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను, మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. -
సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అరెస్టు
గంభీరావుపేట: లంచం కేసులో ముగ్గురు పోలీసులపై ఏసీబీ అధికారులు శుక్రవారం కొరడా ఝళించారు. సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్లను అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గత నెల 19న ఇసుక తరలిస్తున్న మినీ టిప్పర్ వాహనాన్ని ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి లచ్చపేట గ్రామ శివారులో పట్టుకున్నారు. వాహనాన్ని గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహన యజమాని సింహాచలంది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం. తన వాహనాన్ని వదిలిపెట్టాలని గంభీరావుపేట ఎస్ఐ అనిల్‌కుమార్‌ను సంప్రదించగా.. కొంత డబ్బు సమకూర్చుకోవాలని సూచించాడు. సింహాచలం అక్కడే ఉన్న కానిస్టేబుల్ కనుకరాజును కలిస్తే రూ.25 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై బాధితుడు ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తిని కలసి విషయం చెప్పగా.. తాను ఎస్ఐతో మాట్లాడుతానని చెప్పి పంపించారు. తర్వాత గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్ఐలు కలసి రూ.20 వేలు కావాలని డిమాండ్ చేశారు. తాను రూ.10 వేలు మాత్రమే ఇస్తానని బాధితుడు బతిమిలాడితే సరేనని అంగీకరించారు. అనంతరం సింహాచలం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రూ.10 వేలను కానిస్టేబుల్ కనుకరాజుకు పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వగానే.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణలో సీఐ, ఎస్ఐల ప్రమేయం ఉన్నట్లు తెలియడంతో సిరిసిల్లలో ఉన్న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శనివారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. -
3 కోట్ల లంచం కేసులో అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: రూ.3 కోట్ల లంచం కేసుకు సంబంధించి పంజాబ్‌లోని లూధియానాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీనియర్ అధికారి చంద్రశేఖర్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. పలు ఎగుమతిదారులకు సేవలందించే ఓ ప్రైవేట్ క్లియరింగ్ ఏజెన్సీలో 2019, జూన్‌లో డీఆర్ఐ తనిఖీలు చేపట్టిందని, అందులో భాగంగా కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో ఆ పత్రాలకు సంబంధించి క్లియరింగ్ హౌజ్ ఏజెంట్ అనూప్ జోషి, చంద్రశేఖర్ సన్నిహితుడు రాజేశ్ ధాండా ప్రభుత్వ అధికారి తరపున రూ.3 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. అధికారి తరపున మొదటి విడతగా రూ.25 లక్షల లంచం తీసుకున్నందుకు సీబీఐ.. జోషి, ధాండాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. -
పది లక్షలిస్తేనే పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ‘రూ.10 లక్షలిస్తే పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బు డిమాండ్ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకొచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ నాలుగున్నరేళ్ల పాటు అప్పటి ప్రభుత్వంతో పోరాడారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుకున్నారు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అయితే కిరణ్‌కుమార్ బావమరిది ఆనంద్... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి అంశాన్ని చర్చించారు. తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్ ఇస్తానని యిర్మియా డిమాండ్ చేశారు. ఫైలు చదివాక మిగతా విషయాలు మాట్లాడుతా నవంబర్ 4న గుంటూరులో కిరణ్‌కుమార్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లిన యిర్మియా.. దాదాపు 30 నిముషాలు మాట్లాడి రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నవంబర్ 20న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి రూ.50వేలు తీసుకున్నారు. ‘మీకు మూడేళ్ల నుంచి వేతనం రాలేదు కదా అది కూడా వచ్చేలా చేస్తా..మీ ఫైలు చాలా క్లిష్టంగా ఉంది. బాగా చదవాలి. అన్నీ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారు. ఫైలు పరిశీలించాక నాలుగైదు రోజుల్లో కలుస్తానని, అప్పుడు మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను క్లినిక్‌కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయారు. వైద్యుడి నుంచి డబ్బు తీసుకుంటున్న దృశ్యాలు.. ఎడమవైపు డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు, కుడివైపున వైద్యుడి బావమరిది ఆనంద్ సీఎంవో కార్యాలయ ఆదేశాలు బేఖాతరు తనకు న్యాయం జరగడం లేదని కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ వినతిని పరిశీలించిన సీఎం కార్యాలయం 2019 నవంబర్ 5న వైద్య ఆరోగ్యశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని, 2015లో జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి న్యాయం చేయాలని సూచించింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు డబ్బులు వసూలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రూ.10 లక్షలు డిమాండ్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోగా విజిలెన్స్, ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నా బావమరిది ఆనంద్...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజును సంప్రదించారు. అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను. – డా.కిరణ్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్ సర్జరీ -
ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ఓ అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సానా ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఆస్థానా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆస్థానాపై క్రిమినల్ విచారణ జరపకుండా, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వజీరీ మాట్లాడుతూ.. ఆస్థానా, కుమార్‌లను విచారించేందుకు, అరెస్ట్ చేసేందుకు ఇకపై కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కేసు విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ ఆలోక్ వర్మపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాల్లే్లవని అభిప్రాయపడ్డారు. ఓ కేసులో తనకు ఊరట కల్పించేందుకు ఆస్థానా లంచం తీసుకున్నారని సతీశ్ సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ తనను వేధించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. దీంతో ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టంలోని నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ తీర్పును ఆస్థానా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశముంది. -
ఏసీబీకి చిక్కిన మెట్రాలజీ అధికారి
ఖమ్మంక్రైం: లంచాలకు అలవాటు పడి వ్యాపారులను పీక్కుతింటున్న ఓ అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా శనివారం పట్టుకున్నారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి (తూనికలు కొలతలశాఖ)ఓ దళారి ద్వారా లంచం తీసుకొంటూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఎస్ఎస్ వేబ్రిడ్జి నడుపుతున్న సిద్ధారెడ్డికి ఆగస్టు 8వ తేదీతో రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న సిద్ధారెడ్డి దాని ఆమోదానికి అప్పటి నుంచి జిల్లా తూనికల కొలతలశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి గూడూరు అశోక్ బాబును పలుమార్లు కలిసాడు. వైరా రోడ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కాంటాలు, వే బ్రిడ్జిలు బాగు చేసే ప్రైవేట్ మెకానిక్ వచ్చి మీ పని కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని తనను అశోక్‌బాబు పంపించారని చెప్పాడు. దీంతో సిద్ధారెడ్డి అంత లంచం ఎలా తీసుకొంటారని ట్రంక్ రోడ్లో ఉన్న లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి వెళ్లి అశోక్‌బాబును కలిసాడు. శ్రీకాంత్ చెప్పింది చేస్తేనే మీదరఖాస్తు ఆమోదిస్తామని చెప్పగా సిద్ధారెడ్డి అంత లంచం ఇచ్చుకోలేనని అనడంతో దర ఖాస్తును పెండింగ్‌లో పెట్టారు. దీంతో సిద్ధారెడ్డి విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సిద్ధారెడ్డి శనివారం జిల్లా అధికారి అశోక్‌బాబుకు ఫోన్ చేసి శ్రీకాంత్‌ను పంపించండి డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీకాంత్ శనివారం సాయంత్రం వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఉన్న వేబ్రిడ్జి వద్దకు వచ్చాడు. సిద్ధారెడ్డి రూ.13 వేలు ఇవ్వడంతో మాటు వేసిన ఏసీబీ బృందం శ్రీకాంత్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. డబ్బును స్వాధీనపర్చుకొని జిల్లా లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి తీసుకొచ్చారు. లంచం తీసుకొకున్న దళారీ శ్రీకాంత్ తనకు ఏ తప్పూ తెలియదని తాను ఆత్మహత్య చేసుకొటానని కావాలనే తనను ఏసీబీ అధికారులు ఇరికించారని కొద్దిసేపు హైడ్రామా సృష్టించాడు. దీంతో లీగల్ మెట్రాలజీ అధికారి అశోక్‌బాబు కూడా తనకూ ఏమీ తెలియదని.. తనకు, శ్రీకాంత్‌కు ఎటువంటి సంబంధంలేదని తాను కూడా ఆత్మహత్య చేసుకొంటానని డ్రామా ఆడాడు. లంచం తీసుకొన్న అధికారి అశోక్‌బాబు, దళారీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసుల ఎదుట హాజరైన గాలి
సాక్షి, బెంగళూరు: మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి ఎట్టకేలకు శనివారం బెంగళూరులో తన లాయర్ చంద్రశేఖర రెడ్డితో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. యాంబిడంట్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ఈ కేసుతో తనకు అసలు ఏ సంబంధమూ లేదని జనార్దన రెడ్డి చెప్పారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను తప్పు చేశానని నిరూపించేలా పోలీసుల వద్ద ఒక్క పత్రమూ లేదు’ అని అంతకుముందు ఆయన ఓ వీడియో విడుదలచేశారు. ఆదివారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) జనార్దన రెడ్డికి నోటీసులు పంపడం తెల్సిందే. ‘యాంబిడంట్ కంపెనీ యజమాని ఫరీద్ ప్రతి ఒక్క రాజకీయ నేతతో ఫోటో దిగుతాడు. బెంగళూరులో ఎంతోమంది నాయకులతో అతనికి పరిచయం ఉంది. నేనెందుకు భయపడాలి, పారిపోవాలి?’ అని అన్నారు. యాంబిడంట్ సంస్థ ఆర్థిక పథకాల పేరుతో వందలాది మంది దగ్గర దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసి అనంతరం మోసానికి పాల్పడింది. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు జనార్దన∙రెడ్డి రూ. 18 కోట్లు లంచం అడిగారని ఫరీద్ ఆరోపించడం తెలిసిందే -
ఏసీబీ వలలో మరో అధికారి
సాక్షి, యాదాద్రి : ఏసీబీ అధికారుల వలకు మరో అధికారి చిక్కారు. భువనగిరి సబ్‌డివిజన్ పరిధిలోని టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ దుర్గారావు ఆ సంస్థకు చెందిన కాంట్రాక్టర్ పారునంది భాస్కర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం యాదాద్రిభువనగిరి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 1న చౌటుప్పల్ గ్రామ పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ ఏసీబీకి పట్టుబడ్డ విషయం మరువక ముందే జిల్లాలో మరో అధి కారి ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఎస్పీడీసీఎల్ డీఈ దుర్గారావు గతేడాది అక్టోబర్ 30న బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన ఇక్కడ ఏడీఈగా కూడా పనిచేశారు. తమ శాఖలో చేపట్టే పనుల మంజూరు, బిల్లుల మం జూరుకు లంచాలు డిమాండ్ చేస్తున్నాడని కాం ట్రాక్టర్ భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని గ్రీన్పార్క్కాలనీలోని తన నివాసంలో బుధవారం ఉదయం డీఈ రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు పట్టుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అదే సమయంలో భువనగిరిలోని డీఈ కార్యాలయంలో ఏసీబీ సీఐ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు డీఈ కా ర్యాలయంలో విచారణ చేపట్టారు. రాత్రి వరకు 6ఫైళ్లను పరిశీలించారు. మరికొన్నింటిని సీజ్ చేసి తమ వెంట తీసుకుపోయారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు ఏ కారణం చేత ఆగిపోయాయన్న విషయంపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. రాత్రి న్యూరాంనగర్లో డీఈ అద్దెకు ఉంటున్న ఇంటిని ఏసీబీ అధికారులు పరిశీలించారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ రాజాపేట మండలంలో నాటిన విద్యుత్ స్తంభాల బిల్లుల మంజూరు కోసం డీఈ కాంట్రాక్టర్ భాస్కర్‌ను రూ.50వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతోపాటు మార్చిలో చేసిన రూ.18లక్షల పనులకు ఏప్రిల్‌లో బిల్లులు మంజూరయ్యాయి. వా టికి సంబంధించి మూడు శాతం లంచం చొప్పున రూ.54వేలు గత నెల 30వ తేదీన భాస్కర్ డీఈకి చెల్లించారు. మరో 10 పనుల అగ్రిమెంట్, రూ.9 లక్షల పాత బిల్లుల మంజూరుకు లంచం డిమాం డ్ చేశారు. దీంతో భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు ఇచ్చిన సూచనల మేరకు రూ.50వేల నగదును తీసుకుని కర్మన్‌ఘాట్‌లోని డీఈ ఇంటికి వెళ్లి ఆయన గదిలో ఆ మొత్తాన్ని డీఈకి అప్పగించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావు సిబ్బందితో కలిసి డీఈ దుర్గారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. గతంలో పట్టుబడ్డ విద్యుత్ అధికారులు 2008లో భువనగిరి రూరల్ ఏఈ వినోద్‌రెడ్డి, రా యగిరిలో ఏఎల్ఎం యాదగిరి రాయగిరి, చౌటుప్పల్‌లో అప్పటి ఏఈ శ్రీనివాస్ పట్టుబడ్డారు. నల్లగొండ ఎస్ఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఈ అశోక్‌కుమార్, రామన్నపేట ఏడీ కృష్ణయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాంట్రాక్టుల వివాదమే కారణమా? కాంట్రాక్టు పనుల కేటాయింపులో తలెత్తిన వివా దమే డీఈపై ఏసీబీ దాడులు చేసే వరకు వెళ్లిందని తెలుస్తోంది. లక్ష రూపాయలలోపు కాంట్రాక్టు పనులను నామినేషన్ పద్ధతిపై డీఈకి కేటాయించే అధికారం ఉంటుంది. ఈ సమయంలోనే అతను ఒక కాంట్రాక్టర్‌కు రూ.3కోట్ల పనులను అప్పగిం చడం వల్లే మరో కాంట్రాక్టర్ అయిన భాస్కర్‌కు ఆగ్రహం కలిగించిందని విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో ఏడీఈగా పని చేసిన దుర్గారావు ఏడాది క్రితం బదిలీపై వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే డీఈ తమ శాఖ కు సంబంధించిన పనుల కేటాయింపులో వివక్ష చూపుతున్నాడని కాంట్రాక్టర్ భాస్కర్ ఆగ్రహం పెంచుకున్నట్లు తెలుస్తోంది. 20ఏళ్లుగా ఈప్రాం తంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తనను కాదని మరో కాంట్రాక్టర్‌కు డీఈ అధికంగా పనులు నామినేషన్‌పై కేటాయిస్తున్నాడన్న కారణంతోనే ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. -
లంచగొండ్లు.. యాచకులు ఒక్కటే
ప్రభుత్వశాఖల్లో నడుస్తున్న బల్ల కింద సంస్కృతిపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రెవెన్యూ శాఖలో ని ఆమ్యామ్యాలను ప్రస్తావిస్తూ, లంచాలు దండుకునేవారికి, గుడిముందు యాచకులకు తేడా లేదని ఘాటుగా మందలించింది. కొందరు రైతుల భూమార్పిడి కేసులో అనుమతుల తిరస్కృతి వ్యవహారంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సాక్షి, బెంగళూరు: ‘ప్రభుత్వం అందించే జీతంతో ఉద్యోగులు అత్యాధునిక కార్లు కాదు కదా... వాటి వైపర్లు (అద్దాలు తుడిచే ఉపకరణం) కూడా కొనలేరు. అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి పిల్లలు వారానికి రెండు మూడుసార్లు బెంజ్, ఆడి వంటి కార్లలో బెంగళూరులో విండ్సర్ మ్యానర్ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చి కాఫీ తాగి వెళుతున్నారు. అంతసొమ్ము ఎక్కడ నుంచి వస్తోందో’ అని రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వివరాలు...బెంగళూరు గ్రామీణ ప్రాంతంలోని కొంతమంది రైతులు వారి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగించడానికి వీలుగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖతో పాటు కలెక్టర్ కార్యాలయానికి కూడా దరఖాస్తులు పంపించారు. ఇందులో కొంతమందికి అనుమతులు లభించగా మరికొందరికి లభించలేదు. దీంతో సదరు అనుమతులు లభించని వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ఎస్.ఎన్ సత్యనారాయణ...‘రెవెన్యూ శాఖ కొంతమంది వల్ల బెగ్గర్స్ కాలనీగా మారుతోంది. అందులో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి గుడి ముందు బిక్షమెత్తుకునే వారికి తేడా లేదు. సొమ్ములు ఎక్కువగా ఉన్నవారి భూముల మార్పిడి అనుమతులు ఇచ్చారు, మిగిలినవారికి ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు’ అని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయమై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఎవరికి అనుమతులు లభించాయి. మిగిలిన దరఖాస్తులు ఎన్ని? తదితర వివరాలతో కోర్టుకు హాజరుకావాలంటూ బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్ పాలయ్యకు న్యాయమూర్తి నోటీసులు జారీచేశారు. -
దినకరన్‌కు చుక్కెదురు
-
న్యాయమూర్తి ఫిర్యాదుపై న్యాయమిదేనా..?
అటకెక్కిన లంచం కేసు రెండు నెలలైనా పట్టించుకోని పోలీసులు పుంగనూరు : న్యాయానికి న్యాయం కరువైన ఉదంతమిది. పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. పుంగనూరు క్రిమినల్ కోర్టుకు ఒక వ్యక్తి జనవరి నెల 9న కొరియర్ ద్వారా రూ.2 వేలు లంచం పంపించాడు. జడ్జి ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నెలలైనా దర్యాప్తు ముందుకు సాగలేదు. సాధారణంగా కేసుల్లో నిందితులను పరుగులు పెట్టించే పోలీసులు సంచలనం రేకెత్తించిన కేసును పరిశోధించకుండా వదిలివేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 8న కొరియర్ ద్వారా పంపిన సీల్డ్ కవర్ పుంగనూరు క్రిమినల్ కోర్టుకు 9న అందింది. దీనిని తీసుకున్న కోర్టు ఉద్యోగి ఆర్.వెంకట్రమణ న్యాయమూర్తి భారతి సమక్షంలో కవర్‌ను పరిశీలించారు. అందులో రూ.2 వేలు నోటు (నెంబరు: 4జి 254018) ఉంది. అలాగే లేఖ కూడా ఉంది. పుంగనూరు కోర్టులో ఉన్న సీఎఫ్ఆర్ కేసులన్నీ ఎత్తివేయాలని కోరుతూ పి.భవాని, కఠారు మణి, తాటిమాకులపాళ్యెం సంతకాలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి భారతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనుమతి మేరకు జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పుంగనూరు పోలీసులు జనవరి 17న క్రైౖమ్ నెంబరు 11/2017గా కేసు నమోదు చేశారు. ఇందులో 1వ నిందితురాలిగా భవానిని, రెండవ నిందితుడిగా కె.మణిని చూపుతూ సెక్షన్ 182, 417 కింద కేసు నమోదు చేశారు. అంతవరకు వేగవంతంగా సాగిన దర్యాప్తు తర్వాత ఆగిపోయింది. పుంగనూరు కోర్టులో భవాని అనే మహిళ ఐపీ దాఖలు చేసింది. ఈ సమయంలో కఠారి మణి అనే వ్యక్తికి రూ.10 లక్షలు బకాయిలు ఉండడంతో ఆయన భవానిపై కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి, భవానికి చెందిన ఇంటిని కఠారి మణికి రిజిస్ట్రేషన్ చేసి స్వాధీన పరిచింది. ఇలా ఉండగా అదే ఇంటిని 2012 నవంబర్ 8న రూ.6.50 లక్షలకు పి.సునీల్‌కుమార్ అనే వ్యక్తికి భవాని పాత తేదీన విక్రయ అగ్రిమెంటు చేసినట్లు పి.సునీల్‌కుమార్ పుంగనూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో ఉంది. ఇలా ఉండగా భవానిపై సునీల్‌కుమార్ చెక్కు కేసులను దాఖలు చేశారు. అవి కూడా విచారణలో ఉన్నాయి. ఈ సమయంలో న్యాయమూర్తికి లంచం పంపుతూ భవాని, కఠారిమణి రాసినట్లుగా లేఖ రాయడం వివాదాలకు దారి తీస్తోంది. కావాలనే ఈ రెండు కేసులకు చెందిన వ్యక్తులే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చారని, ఇతరులకు ఎలాంటి అవసరం ఈ కేసులతో లేదని పలువురు వాపోతున్నారు. నిజాలు నిగ్గుతేల్చాల్సిన పోలీసులు మౌనం దాల్చడం పోలీసుల తీరును వెక్కిరిస్తోంది. దీనిపై ఎస్ఐ హరిప్రసాద్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లేఖను హైదరాబాదులోని నిపుణులకు పంపామన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్నారు. -
'నాపై కుట్ర పన్నినా...న్యాయమే గెలిచింది'
బెంగళూరు : ఎట్టకేలకు న్యాయం గెలిచిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. లంచం ఆరోపణల కేసులో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప స్పందిస్తూ తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పట్లో కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ 'సత్యమేవ జయతే' అంటూ ట్విట్ చేశారు. తనకు దేవుడిపై, న్యాయస్థానంపై నమ్మకం ఉందని యడ్యూరప్ప పేర్కొన్నారు. కాగా 2011లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యడ్యూరప్ప సహా నలుగురికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. Justice is done, I stand vindicated... Thanks to all well wishers,friends & supporters who stood with me in my tough times... — B.S. Yeddyurappa (@BSYBJP) October 26, 2016 -
యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు బళ్లారి మైనింగ్ కేసులో ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా యడ్డీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమోదైన కేసులో ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా యడ్యూరప్ప సహా నలుగురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. -
మంత్రి కుమారుడికి అరెస్ట్ వారెంట్
మైసూరు: ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి లంచం తీసుకునేలా భూ విజ్ఞాన శాఖాధికారి అల్ఫోన్సెస్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి హెచ్.సీ.మహదేవప్ప కుమారుడు సునీల్‌బోస్‌పై గురువారం మైసూరు మూడవ అదనపు సెషన్స్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గురువారం విచారణకు సునీల్‌బోస్ గైర్హాజరు కావడంతో మూడవ అదరపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సురేంద్రనాథ్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేశారు. -
'మణి రాజీనామా చేయాల్సిన పనిలేదు'
తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణికి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేరళ చీఫ్ విప్, కాంగ్రెస్ నేత థామస్ ఉన్నియదాన్ అన్నారు. హైకోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా లేదని పేర్కొన్నారు. ఆయనను కోర్టు దోషిగా ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. మణి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. మంత్రి పదవికి మణి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ విషయంలో కేరళ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందన్న వాదనను తోసిపుచ్చారు. తామంతా మణికి మద్దతు తెల్పుతున్నామని అన్నారు. కేఎం మణి లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆయన కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. -
అడ్డగోలుగా మాట్లాడొద్దు.. ఆధారాలు ఉండాలిగా
పనాజీ: గోవాలో నీటి పారిశుద్ధ్యం, మురుగు వ్యవస్థ ప్రాజెక్టును అమెరికా సంస్థకు ఇచ్చే విషయంలో తామెవ్వరం ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలు చేసేముందు ఆధారాలు కూడా చూపించగలగాలని గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ అన్నారు. ఆ సంస్థ తన మంత్రులకు డబ్బులిచ్చిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని చెప్పారు. కేంద్ర మంత్రి గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కామత్ ప్రభుత్వంలోని మంత్రులకు అప్పట్లో ముడుపులు అందాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దిగంబర్ కామత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పారు. అడ్డగోలుగా మాట్లాడొద్దని ఏదైన అనే ముందు సాక్ష్యాధారాలు కూడా ఉండాలని హితవు పలికారు. 2009లో 'రివైవ్ వాటర్ అండ్ సెవేజ్ సిస్టం' ప్రాజెక్టు చేపట్టేందుకు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ) అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ వద్ద లంచాలు తీసుకొని ప్రాజెక్టు అప్పగించారని పారికర్ ఆరోపించారు. అయితే, నాడు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలో జైకా ఒకటని, ఇందులో మేం ప్రత్యేకంగా కల్పించుకోకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రాజెక్టు అప్పగించామని వివరణ ఇచ్చారు. -
'అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే..'
తిరుపతి: అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే అది సీఎం చంద్రబాబునాయడని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి వల్ల పక్క రాష్ట్రాల్లో పరువు పోయిందని, ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్లు తల ఎత్తుకొని తిరగకుండా చంద్రబాబు చేశారన్నారు. జిల్లాకు తాగు, సాగు నీరివ్వని చంద్రబాబు చిత్తూరు జిల్లా పరువు తీశారని, రోజుకో పార్టీ గొడుగు మార్చే నాయకులకు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తున్నారని రోజా మండిపడ్డారు. -
ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఏఈ మహెమూద్ అలీమండలానికి చెందిన ఓ రైతు నుంచి గురువారం ఉదయం 11గంటల సమయంలో రూ.16,000 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు అతనిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు. -
ఎయిరిండియాలో లంచాల బాగోతం!!
ఎయిరిండియాలో మరో లంచాల బాగోతం వెలుగుచూసింది. అసలే నష్టాల్లో మునిగి తేలుతున్న ఈ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ప్రతిష్ఠ దీంతో మరింత మసకబారింది. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసే బయోమెట్రిక్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించిన కాంట్రాక్టు పొందేందుకు భారతీయ అధికారులకు లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలతో ఇద్దరు అమెరికన్లు, ఒక భారతీయ బ్రిటిష్ వ్యాపారవేత్తలపై కెనడా పోలీసులు కేసులు పెట్టారు. శైలేష్ గోవిందియా అనే ఎన్నారై వ్యాపారవేత్తతో పాటు క్రిప్టోమెట్రిక్స్ కెనడా ఇంక్ మాజీ సీఈవో రాబర్ట్ బర్రా, కంపెనీ మాజీ సీఓఓ డారియో బెరినిలపై అంతర్జాతీయ దర్యాప్తు అనంతరం కేసులు పెట్టారు. ముగ్గురు నిందితులపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం విదేశీ ప్రభుత్వాధికారుల లంచాల చట్టం కింద కేసులు పెట్టడంతో వీరిపై కెనడా వ్యాప్తంగా వారంట్లు జారీ అయ్యాయి. -
లంచం కేసులో ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలు
అమెరికాలో డయాగ్నస్టిక్ సెంటర్ నడిపిస్తున్న ఓ ఎన్నారై వైద్యుడికి 46 నెలల జైలుశిక్ష పడింది. న్యూజెర్సీలో ల్యాబ్ నడుపుతున్న డాక్టర్ అశోక్ కుమార్ బబారియా (64) రోగులను తన వద్దకు పంపేందుకు కొంతమంది వైద్యులకు లంచాలు ఇచ్చిన కేసులో ఈ శిక్ష పడింది. అమెరికా జిల్లా జడ్జి క్లైర్ సి సెచి ఎదుట వాదనలు జరగగా, అందులో అశోక్ కుమార్ నేరం నిరూపితమైంది. దీంతో ఆయనకు 46 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు విడుదలైన తర్వాత మరో మూడు నెలల పాటు ఆయన్ను పరిశీలిస్తూ ఉండాలని జడ్జి ఆదేశించారు. అశోక్ కుమార్ బబారియాకు 25వేల డాలర్ల జరిమానా విధించి, మరో 2 మిలియన్ డాలర్లు జప్తుచేయాల్సిందిగా ఆదేశించారు. లైసెన్సు గల రేడియాలజిస్టు అయిన అశోక్ కుమార్.. న్యూజెర్సీలో ఆరంజ్ కమ్యూనిటీ ఎంఆర్ఐ సెంటర్ నడిపిస్తున్నారు. ఆ సెంటర్‌కు రోగులను పంపినందుకు గాను వైద్యులకు లంచాలు చెల్లించి, దాదాపు 2 మిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. ఒక ఎమ్మారై కేసు పంపితే ఒక్కో డాక్టర్‌కు సుమారు 100 డాలర్ల వరకు లంచం ఇచ్చేవారన్నాయి.అలాగే అల్ట్రా సౌండ్ లేదా డెక్సా స్కాన్ కేసు పంపితే 25 డాలర్లు ఇచ్చేవారట.