
యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు బళ్లారి మైనింగ్ కేసులో ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా యడ్డీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమోదైన కేసులో ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా యడ్యూరప్ప సహా నలుగురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.