మైసూరు: ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి లంచం తీసుకునేలా భూ విజ్ఞాన శాఖాధికారి అల్ఫోన్సెస్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి హెచ్.సీ.మహదేవప్ప కుమారుడు సునీల్‌బోస్‌పై గురువారం మైసూరు మూడవ అదనపు సెషన్స్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గురువారం విచారణకు సునీల్‌బోస్ గైర్హాజరు కావడంతో మూడవ అదరపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సురేంద్రనాథ్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేశారు.