తుమకూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్‌డీఎల్)కు సంబంధించిన లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎం.విరూపాక్షప్పను ఎట్టకేలకు లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు.
విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మార్చి 2న ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. విరూపాక్ష నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అనంతరం కోర్టు ప్రభుత్వ రంగ కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్న విరూపాక్షకు బెయిలిచ్చింది. అయితే,
ప్రధాన ముద్దాయిగా ఉన్న విరూపాక్షప్ప కేసు విచారణలో సహకరించడం లేదంటూ లోకాయుక్త పిటిషన్ వేయగా కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment