MLA arrest
-
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్
తుమకూరు: కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్)కు సంబంధించిన లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఎం.విరూపాక్షప్పను ఎట్టకేలకు లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తుండగా మార్గమధ్యంలోనే విరూపాక్షను అదుపులోకి తీసుకున్నట్లు లోకాయుక్త ఐజీ తెలిపారు. విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మార్చి 2న ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. విరూపాక్ష నివాసంపై జరిపిన దాడుల్లో మరో రూ.8.23 కోట్లు దొరికాయి. అనంతరం కోర్టు ప్రభుత్వ రంగ కేఎస్‌డీఎల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్న విరూపాక్షకు బెయిలిచ్చింది. అయితే, ప్రధాన ముద్దాయిగా ఉన్న విరూపాక్షప్ప కేసు విచారణలో సహకరించడం లేదంటూ లోకాయుక్త పిటిషన్ వేయగా కోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. -
మమతకు మరో షాక్.. స్కూల్ జాబ్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యే మానిక్ భట్టాచర్యను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. టీచర్స్ జాబ్ స్కాంలో భాగంగా సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఈడీ.. ఉదయం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను అరెస్ట్ చేసింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పార్థా ఛటర్జీ అరెస్ట్ తర్వాత మానిక్ భట్టాచార్య పేరు బయటకు రావటంతో.. ఆయనను బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇదీ చదవండి: Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్ -
ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..
సాక్షి, చెన్నై: డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్‌కు మద్దతుగా చెంగోడు గ్రామం కదిలింది. ఆయనే లేకుంటే గ్రామంలో రక్తం ఏరులై పారి ఉండేదని, ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం గ్రామస్తులు బైటాయించారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో డీఎంకే ఎమ్మెల్యే ఇదయ వర్మన్ ఫైరింగ్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. స్థల వివాదం ఈ ఫైరింగ్‌కు కారణంగా ఉన్నా, ఎమ్మెల్యేను అధికార పక్షం టార్గెట్ చేసింది. నకిలీ తుపాకుల్ని కల్గినట్టుగా పేర్కొంటూ, కేసులు నమోదుచేసిన కటకటాల్లోకి ఎమ్మెల్యేను నెట్టారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెంగోడు గ్రామం ఏకమైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా పోలీసుస్టేషన్ వైపు కదిలారు. (పరిస్థితి ఉద్రిక్తం.. ఎమ్మెల్యే ఫైరింగ్) తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌ఎదుట గ్రామస్తులు బైటాయించారు. ఎమ్మెల్యేను విడుదల చేయాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో నిరసనలు వద్దు అని పోలీసులు వారించినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని అనుసరిస్తూ నిరసనకు దిగారు. అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత కుమార్ మద్దతుదారులు, కిరాయి ముఠాలు సంఘటన జరిగిన రోజున కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించాయని గ్రామస్తులు గుర్తు చేశారు. ఎమ్మెల్యే తండ్రి లక్ష్మీ పతి ప్రశ్నించగా, హతమార్చేంతగా పరిస్థితి చోటుచేసుకుందని, తమపై కత్తులతో కిరాయి ముఠా దూసుకొచ్చిందని, ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే ఇదయవర్మన్ కాల్పులు జరపకుండా ఉండి ఉంటే, గ్రామంలో ఈ పాటికి రక్తం ఏరులై పారి ఉండేదని, పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుని ఉండేదని చెంగోడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పెట్టిన కేసును ఎత్తి వేయాలని నినదిస్తూ గ్రామస్తులు బైటాయించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. (చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..) -
ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా : హైకోర్టు
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉనావోలో యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైన ఇప్పటివరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశామని త్వరలోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకి నివేదించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో తీర్పును శుక్రవారం వెలువరించనుంది. బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు డీజీపీ మాట్లాడుతూ.. కేసు సీబీఐకి అప్పగించినందున మళ్లీ కొత్తగా కేసు నమోదుచేసిన తర్వాతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయగలమని తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆయన విచారణను ప్రభావితం చేస్తారని అన్నారు. తన తండ్రిని చంపేశారని, ఇప్పుడు తన కోసం పోరాడుతున్న తన బాబాయి జీవితం గురించి భయపడుతున్నానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తోపాటు, ఆయన సోదరుడిపై చర్యలు చేపట్టాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట యువతి బంధువులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుది ‘టైర్రర్’ పాలన
ఫలితంలేని దావోస్ పర్యటన ఎందుకు బాబూ: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. ప్రభుత్వ దురాగతాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ‘టై’ పాలనను సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడమే నేరమన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో రైతులకు మద్దతుగా నిలిచి నిరసన తెలిపిన స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆమె మండిపడ్డారు. తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణీకుల తరఫున మాట్లాడినందుకు అక్కడి మేనేజర్‌తో ఫిర్యాదు చేయించి తమ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మిథున్‌రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర అంటూ నిరసన వ్యక్తం చేసిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేశారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌పై శాసనసభలో గట్టిగా నిలదీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసి టీడీపీ దురాగతానికి పాల్పడిందని పద్మ దుయ్యబట్టారు. బాబుది పిరికితనం.. పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిన చంద్రబాబును ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఓ రకంగా అది ఆయన పిరికితనానికి అద్దం పడుతోందని ఆమె అన్నారు. తన పాలనను ప్రశ్నిస్తున్నారనే భయంతోనే పెట్టుబడులు తెస్తామనే పేరుతో దావోస్ పర్యటనకు పరిగెత్తారన్నారు. గతంలో కూడా పలు మార్లు అక్కడకు వెళ్లిన చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. -
తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
తిరుపతి: తిరుపతి పట్టణంలో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో పార్టీ నాయకులు బంద్ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా మూతపడ్డాయి. -
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
-
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
కొడంగల్‌లో లాఠీచార్జి, ఎమ్మెల్యే అరెస్ట్.. విడుదల సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో మార్కెట్ గోదాం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిర్ణీత సమయానికి వచ్చారు. భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాకపోవడంతో అసహనానికి గురైన రేవంత్.. గోదాం వద్ద గల ప్రాంగణంలో చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించారు. శంకుస్థాపన జరిగే వరకు ఎవరూ లోపలకు వెళ్లరాదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెదరగొట్టేందుకు యత్నిస్తుండగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ తరలించగా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి, ఇతర కార్యకర్తలను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాదాపు గంటసేపు ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. రేవంత్‌ను అరెస్టు చేసిన తర్వాత కొద్దిసేపటికే మంత్రి జూపల్లి సభా ప్రాంగణానికి వచ్చారు. స్థానిక శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని.. ఆయనను తీసుకురావాలని నారాయణపేట డీఎస్పీకి మంత్రి సూచించారు. అయితే కార్యక్రమానికి రావడానికి రేవంత్ నిరాకరించారని డీఎస్పీ చెప్పడంతో జూపల్లి గోదాం శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి రాకుండా అధికార పార్టీ అడ్డుకుందన్న ప్రచారం కోసమే రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారే తప్ప ప్రజలకు జరిగే మేలులో పాల్గొనాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మంత్రి జూపల్లి పర్యటన ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కేసీఆర్‌ను దించేవరకూ నిద్రపోను: రేవంత్ దౌల్తాబాద్: తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయపబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుర్చీదించే వరకు తాను నిద్రపోనని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల అయిన అనంతరం గాంధీ కూడలిలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను బయటపెడితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల లిక్కర్ మాఫియాతో ముఖ్యమంత్రి ముడుపులు తీసుకుని ఇంటింటికీ చీప్ లిక్కర్ పంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, అక్రమాలపై పోరాటం సాగిస్తామన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కొడంగల్‌లో జూపల్లి చిచ్చు రేపి రణరంగాన్ని సృష్టిం చారన్నారు. టీఆర్ఎస్ పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. జూపల్లి గూండాగిరీ చేస్తున్నారు: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గూండాగిరీ చేస్తున్నారని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎర్రబెల్లి గురువారం విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఢిల్లీ వెళ్లి ప్రయత్నించాలని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. శుక్రవారం తన నియోజకవర్గం పాలకుర్తిలో మంత్రి కార్యక్రమం ఉందని, అయితే, తనకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. -
బాబు ప్రమాణ స్వీకారం శాపంగా మారింది
-
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్
గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు బస్టాండ్ సెంటర్లోని రోడ్డు పక్కన వుండే చిరువ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఆయన ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్లే మార్గాలకు ఇరువైపుల వున్న దుకాణాలను అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రోజు పనిచేస్తే కానీ పూట గడవలేని తమకు బాబు ప్రమాణ స్వీకారం ఉపాధి లేకుండా చేస్తుందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరును తప్పుపట్టారు. కూల్చివేతలను అడ్డుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితుల పక్షాన ఆయన చేస్తున్న ఆందోళనను అడ్డుకుని, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఇంజనీర్‌పై దాడి: ఎమ్మెల్యే అరెస్టు
న్యూఢిల్లీ: తన ఆదేశాలను పాటించలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) జూనియర్ ఇంజనీర్‌పై దాడి చేసిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను అరెస్టు చేశామని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. నిందితుడు, దేవ్లీ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆగ్నేయ జిల్లా డీసీపీ పి.కరుణాకరణ్ పేర్కొన్నారు. సంగమ్ విహార్‌లో బోరుబావి డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న తమ జూనియర్ ఇంజనీర్‌పై జర్వాల్ దాడి చేశాడని డీజేబీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే జర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉన్నందున, నిర్మాణ పనులు ఆపివేయాలని ఆయన అనుచరులు ఇంజనీర్‌కు సూచించారు. డ్రిల్లింగ్‌ను మధ్యలో నిలిపివేయడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని చెబుతూ పనులు కొనసాగించాడు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే ఇంజనీర్‌పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. దీనిపై జర్వాల్ వివరణ ఇస్తూ తాను ఎవరిపైనా దాడి చేయలేదని, ఇంజనీరే తనను తిట్టాడని ఆరోపించారు. లంచం డిమాండ్ చేస్తూ పనులు నిలిపివేయడంతో అతణ్ని ప్రశ్నించానని అన్నారు.