వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్
గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు బస్టాండ్ సెంటర్‌లోని రోడ్డు పక్కన వుండే చిరువ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఆయన ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్లే మార్గాలకు ఇరువైపుల వున్న దుకాణాలను అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రోజు పనిచేస్తే కానీ పూట గడవలేని తమకు బాబు ప్రమాణ స్వీకారం ఉపాధి లేకుండా చేస్తుందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరును తప్పుపట్టారు. కూల్చివేతలను అడ్డుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితుల పక్షాన ఆయన చేస్తున్న ఆందోళనను అడ్డుకుని, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.