mustafa
-
ముగ్గురూ పాసయ్యారు
కొడుకు పాఠాలు చెప్పే మాస్టర్ అయ్యాడు. తల్లిదండ్రులు స్టూడెంట్స్ అయ్యారు. ముగ్గురూ ఇంటర్లో పాస్ అయ్యి విన్నవారి పెదాల మీద చిర్నవ్వు, కళ్లల్లో ప్రశంస పుట్టిస్తున్నారు. కేరళ మలప్పురంలో జరిగింది ఇది. ఆ ఊరి ముస్తఫా టెన్త్ పాసయ్యాక చదువు మానేసి ఆ పనులూ ఈ పనులూ చేసి అబూదాబీ వెళ్లాడు. అక్కడ ఒక హాస్పిటల్లో పని చేస్తూ తిరిగి వచ్చి పదోక్లాసు చదివిన నుసైబాను పెళ్లి చేసుకుని తిరిగి అబూదాబీ వెళ్లిపోయాడు. కొడుకు పుడితే వాణ్ణి మలప్పురంలోనే చదివించారు. ఐదేళ్ల క్రితం కేరళ వచ్చేసిన ఈ దంపతులిద్దరూ చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఆపేసిన చదువును కొనసాగించడం ఎలా అని ఆలోచించారు. ఈలోపు కొడుకు ఇంటర్‌కు వచ్చాడు. కొడుకుతో పాటు తాము ఇంటర్ చదివితే బాగుంటుందని అనుకున్నారు. కాని వారిని నేరుగా చేర్చుకునే కాలేజీలు లేవు. అయితే కేరళ సాక్షరతా మిషన్ వారి ఇంటర్ సమాన కోర్సు ఉందని తెలుసుకుని అందులో చేరారు. కొడుకు రెగ్యులర్ కోర్సు చేస్తుంటే వీరు సండే క్లాసెస్ ద్వారా ఇంటర్ చదివారు. ‘మా అబ్బాయి షమాస్ మంచి స్టూడెంట్. వాడు తనతోపాటు మేము కూడా చదువుతుంటే ఎగ్జయిట్ అయ్యాడు. మాకు టీచరై డౌట్స్ తీర్చాడు. ప్రశ్నలు అడిగి ఎంకరేజ్ చేశాడు’ అన్నాడు ముస్తఫా. మొన్నటి పరీక్షల్లో ముగ్గురూ పరీక్షలు రాశారు. కొడుకు షమాస్ ఏ ప్లస్‌లో పాస్ అయ్యాడు. తల్లి నుసైబాకు 80 శాతం మార్కులు వచ్చాయి. తండ్రి ముస్తఫాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ‘బిజినెస్ ట్రిప్పుల వల్ల కొన్ని క్లాసులు మిస్ అయ్యాను. లేకుంటే నాకూ మంచి మార్కులు వచ్చేవి’ అని మొహమాటంగా నవ్వాడు ముస్తఫా. ‘ముందు ఇదంతా మా బంధువుల నుంచి దాచిపెడదామనుకున్నాం. ఈ వయసులో చదువంటే ఏమనుకుంటారో అని. కాని ఇప్పుడు అందరూ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు తల్లిదండ్రులు. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ బి.కామ్ చదవాలని నిశ్చయించుకున్నారు. కొడుకు సి.ఏ చేద్దామనుకుంటున్నాడు. మొత్తం మీద ‘చదివితే ఎదుగుతావు’ అని సందేశం ఇస్తున్నారు ఈ ముగ్గురు. -
చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
-
గుంటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ముస్తాఫా ప్రచారం
-
‘పగలు కాంగ్రెస్‌తో కాపురం.. రాత్రి బీజేపీతో సంసారం’
సాక్షి, గుంటూరు : టీడీపీ నాయకులు వైఎస్ జగన్ సతీమణిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముస్తాఫా, అప్పిరెడ్డిలు హెచ్చరించారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగో అలా గెలవాలని టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. నియోజక వర్గంలోని నాయకులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసుకొని అన్ని విధాల జగన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. అధికారాలను, డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రి బీజేపీతో సంసారం చేయడం టిడీపీకే చెల్లుబాటు అవుదుందని ఎద్దేవా చేశారు. వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు అధికారుల అండతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లక్షకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. డోర్ నెంబర్ మారుపేరుతో మున్సిపల్ అధికారులు నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా తయారుచేశారని విమర్శించారు. ఓకే డోర్ నెంబర్లోని ఓట్లు, ఓకే కుటుంబానికి చెందిన ఓట్లు నాలుగు బూతుల్లో కేటాయించారని ఆరోపించారు. అధికారుల్లో ఇప్పటికైనా మార్పురావాలని, లేకపోతే భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనారీటీలపై టీడీపీకి ప్రేమ ఉంటే నాలుగెళ్లల్లో ఒక్క మంత్రి పదవైనా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మైనార్టీలు టీడీపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
డయేరియా మృతులు సర్కారీ హత్యలే
-
ఆంధ్ర పరాజయం
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ప్రారంభించింది. సౌత్జోన్లో భాగంగా తమిళనాడుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 119 పరుగులు చేసింది. రికీ భుయ్ (25; 2 ఫోర్లు, ఒక సిక్స్), రవితేజ (19), ప్రశాంత్ కుమార్ (19), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (20 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు వికెట్లు లభించాయి. అనంతరం తమిళనాడు 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. కెప్టెన్ అపరాజిత్ (22 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో తమిళనాడుకు నాలుగు పాయింట్లు లభించాయి. రాణించిన రాయుడు: హైదరాబాద్ గెలుపు విజయనగరంలో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ పది పరుగుల తేడాతో కేరళను ఓడించింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఏటీ రాయుడు (31 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... అక్షత్ రెడ్డి (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (14 బంతుల్లో 21; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం కేరళ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 158 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ సచిన్ బేబీ (50 బంతుల్లో 79; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ (3/28), సిరాజ్ (2/28) ఆకట్టుకున్నారు. -
డ్రైవర్‌కు ఓనం బంపర్ లాటరీ
మల్లప్పురం: కేరళకు చెందిన ముస్తఫా బంపర్ ఆఫర్ కొట్టేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఓనం బంపర్ లాటరీ లోరూ 10కోట్లను దక్కించుకున్నాడు. పరప్పనాన్గడి సమీపంలోని మూనినియూర్ కు చెందిన ముస్తఫా మూత్తరమ్మాళ్ (48) ఈ ప్రభుత్వం నిర్వహించే ఓనం లాటరీ ప్రథమ బహుతి గెల్చుకున్నారు. దీని విలువ రూ. 10కోట్లు. శుక్రవారం నిర్వహించిన డ్రాలో బంపర్ బహుమతి విజేతగా నిలిచారు. దీంతో శనివారం ఫెడరల్ బ్యాంక్ మేనేజర్ కు టికెట్ ను (AJ2876) ముస్తఫా అందజేశారు. దీంతో ముస్తఫా కుటుంబంలో దసరా సంబరాలు, వేలదివ్వెల దీపావళి కాంతులు ఒక్కసారిగా విరజిల్లాయి. అటు గ్రామస్తులతో ముస్తఫా సెల్ఫీల జోరు సాగింది. ఐదుగురు సభ్యులతో కూడిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముస్తఫా, పికప్ వాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు . తన తండ్రి మరణించిన తరువాత కొబ్బరి వ్యాపారాన్ని చేపట్టాడు. ఈ సొమ్ముతో కొబ్బరి కాయల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు, సొంత ఇల్లు కట్టుకోవాలని యోచిస్తున్నాడు. తాను ఇరవై సంవత్సరాల నుంచి లాటరీ టిక్కెట్లను కొనటం మొదలుపెట్టాననీ, ఇపుడు ఓనం బంపర్ టికెట్ బహుమతి గెల్చుకోవడం సంతోషంగా ఉందని ముస్తఫా చెప్పారు. అయితే బహుమతి సొమ్ములో కోటి రూపాయలు కమిషన్ టికెట్ అమ్మిన ఏజెంట్‌కు దక్కనుందని తెలుస్తోంది. -
జువైనల్ హోమ్‌లో బాలుడి అనుమానాస్పద మృతి
కడప: కడప జువైనల్ హోమ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు. షేక్ ముస్తఫా(16) అనే బాలుడు హోమ్‌లో ఉన్న ఓ బాత్రూం నిర్జీవ స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేశారు. అధికారులు పరిశీలించి చూడగా బాలుడి అప్పటికే మృతిచెందాడు. షేక్ ముస్తఫా స్వస్థలం ప్రొద్దుటూరు. నాలుగు నెలల క్రితం బంధువుల ఇంట్లో దొంగతనం చేయడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. -
'చీప్ పాలిటిక్స్ కు లొంగం'
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమ ప్రయాణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే అని ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ముస్తఫా సృష్టం చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ' టీడీపీలోకి చేర్చుకోవడానికి రకరకాల ఆఫర్స్ ఇస్తున్నారు. అటువంటి చీప్ పాలిటిక్స్ కి లొంగే వ్యక్తులం కాదు. ప్రజలు వారి సమస్యలు పరిష్కరించడం కోసం మమ్మల్నీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వైఎస్ఆర్ సీపీ సింబల్ పై గెలిచిన మేము ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతాం. అధికార పార్టీకి వంత పాడుతున్న ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలి' అని సూచించారు. -
విఐపి రిపోర్టర్ - గుంటూరు (తూర్పు) ఎమ్మెల్యే ముస్తఫా
-
నిలిచిన ఆర్మీజవాన్ అప్పలరాజు అంత్యక్రియలు
విశాఖ : ఆర్మీ జవాన్ అప్పలరాజు అంత్యక్రియలు విశాఖ వేపగుంట శ్మశాన వాటికలో మంగళవారం నిలిపిపోయాయి. అధికార లాంఛనాల కార్యక్రమానికి ఆర్మీ అధికారులు ఎవరూ రాకపోవటంపై బంధువులు ఆందోళనకు దిగారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు. 14 ఏళ్ల పాటు కుటుంబాన్ని వదిలి దేశసేవకు అంకితమైన ఆర్మీ జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ అప్పల రాజు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మోహదీపట్నం ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున అప్పలరాజు పిస్టోలుతో కాల్చుకుని మరణించిన విషయం తెలిసిందే. -
విశాఖకు ఆర్మీ జవాన్ అప్పలరాజు మృతదేహం
విశాఖ : హైదరాబాద్ మోహదీపట్నంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మంగళవారం విశాఖ చేరింది. మృతుని బంధువులు, స్థానికులు రేగొండ జంక్షన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఆందోళనకు యత్నించిన అప్పలరాజు భార్య అనసూయను ఆర్మీ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా అప్పలరాజు స్వస్థలం వేపగుంట. జవాను అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మోహదీపట్నం ఆర్మీ ఏరియాలో గత నెల 8వ తేదీన ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పలరాజును కూడా ఇటీవలే విచారించి వదిలిపెట్టారు. తరచు విచారణ పేరుతో అప్పలరాజును వేధిస్తుండటంతో మన స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మిలటరీ అధికారుల భావిస్తున్నారు. కాగా ముస్తఫా కేసులో అప్పలరాజును నిందితుడిగా భావించరాదని మిలటరీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో న అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్టోలుతో కాల్చుకుని మరణించటం మిస్టరీగా మారింది. -
మిస్టరీగా ఆర్మీ జవాను మృతి
గోపాలపట్నం: ఆర్మీ జవాను బల్ల అప్పలరాజు(38) ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణంతో వేపగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో ఈనెల 8న ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆర్మీ ఉద్యోగి బల్ల అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్తోలుతో కాల్చుకుని మరణించడం మిస్టరీగా మారింది. ఏడాదిలో సర్వీసు ముగుస్తుందనగా... అప్పలరాజు స్వస్థలం వేపగుంట. ము త్యాలమ్మ, నరసమ్మ దంపతుల మూడో కుమారుడు. ముందు నుంచి చురుగ్గా ఉండే ఆయన చిన్న వయసులోనే ఆర్మీ లో చేరారు. తొమ్మిదేళ్ల క్రితమే అనసూయతో వివాహం జరిగింది. వీరికి కొడు కు నిషాంత్(7), కుమార్తె ప్రణతి (15 నెలలు) ఉన్నారు. అప్పలరాజు గతంలో జమ్ము, సిక్కిం, పంజాబ్, అండమాన్ లో సైనికునిగా పనిచేసి ఉన్నతాధికారులతో పతకాలు కూడా అందుకున్నాడు. తాజాగా హైదరాబాదు మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో భార్యా పిల్లలతో ఉం టున్నాడు. మరో ఏడాదిలో సర్వీసు ము గియనుంది. దసరాకి భార్యాపిల్లలతో వేపగుంట వచ్చిన అప్పలరాజు పది రోజులు గడిపి వెళ్లారు. పేదరికంలో ఉన్న అన్నయ్య, అమ్మకీ అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇంతలో అప్పలరాజు మరణంచినట్లు టీవీల ద్వా రా తెలుసుకున్న ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు షాకయ్యారు. నా కుమారుడు దేశభక్తుడు తన కుమారుడు హత్యలు చేసే వ్యక్తి కాడని, దేశభక్తుడని తల్లి ముత్యాలమ్మ తెలిపిం ది. చనిపోయేటంత పిరికివాడు కాదని, అతడి మరణంపై తమకు అనుమానాలున్నాయని సోదరుడు ముత్యాలు అన్నారు. అప్పలరాజు స్వతహాగా వివాదరహితుడని, ఎవరో హతమార్చి పిస్తోలుతో కాల్చుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మోహదీపట్నంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
హైదరాబాద్ : మెహదీపట్నంలో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ గత రాత్రి గారీసన్ ప్రాంతంలో రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బాలుడు ముస్తాఫా కేసులో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. మనస్తాపంతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా గత నెల 8న మిలటరీ ఎక్యుప్మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముస్తఫాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. -
ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదు
తేల్చిన ఫోరెన్సిక్ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలకు గురై మృతి చెందిన ముస్తఫా (11)పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. అందులో ముస్తఫాపై లైంగిక దాడి జరగలేదని తేలింది. ఈ నెల 8న మిలటరీ ఎక్యుప్మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో కేసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో కూడి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పక్షం రోజుల క్రితం ఏర్పాటు చేశారు. సిట్ బృందం ఇప్పటికే ఎనిమిది మంది మిలటరీ జవాన్లను, చుట్టుపక్కల ఉన్న దుకాణాల యజమానులను విచారించింది. అగ్గిపెట్టెను ముస్తఫానే ఖరీదు చేశాడు.. ఘటనకు ముందు ముస్తఫా స్వయంగా తన దుకాణానికి వచ్చి రెండు అగ్గిపెట్టెలు, రెండు చాక్లెట్లు ఖరీదు చేశాడని ఓ దుకాణ యజమానురాలు సిట్ అధికారులకు తెలిపింది. ఆ సమయంలో ముస్తఫా ఒక్కడే దుకాణానికి వచ్చాడని, తన దుకాణానికి వచ్చిన 15 నిముషాలకే ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె వెల్లడించింది. అయితే నీలి కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం నేటికి తెలియరాలేదు. సిద్ధికీనగర్తో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో బ్లూ కిరోసిన్ విక్రయించే కిరాణా షాప్ యజమానులను సైతం పోలీసులు విచారించినా ఫలితం దక్కలేదు. బ్లూ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తులిస్తే కేసు కొలిక్కి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
ముస్తఫాది హత్యే.. ఫోరెన్సిక్ నిపుణుల నిర్ధారణ
మెహిదీపట్నం ఆర్మీ ప్రాంతంలో కొంతకాలం క్రితం జరిగిన హత్యపై ఫోరెన్సిక్ విభాగం కీలక నివేదిక సమర్పించింది. ముస్తఫాది హత్యేనని, అతడి ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించింది. అయితే అతడిపై లైంగిక దాడి మాత్రం జరగలేదని తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న కిరోసిన్, అతడి ఒంటిమీద పోసిన ఇంధనం ఒకటేనని కూడా తేల్చిచెప్పారు. ముస్తఫాది హత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు దాదాపుగా తేల్చడంతో.. ఇప్పుడు ఇక పోలీసు దర్యాప్తు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. క్లూస్ టీం సిబ్బంది మొత్తం 24 రకాల ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులకు అందించారు. సంఘటన స్థలంలో ఉన్న రక్తపు మరకలు ఎవరివనే విషయంపై తొలుత కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే.. ముస్తఫాను కాపాడే క్రమంలో అతడి సోదరుడి చేతికి గాయాలయ్యాయని, అతడి రక్తమే అక్కడ మరకలుగా ఉందని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. ఎవరు హత్యచేసి ఉంటారనే విషయం మాత్రం ఇంక పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆర్మీ జవాన్ల చేశారా లేదా స్థానికులు ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా అనే విషయం తేల్చాలి. -
అది నీలి కిరోసిన్...
ముస్తఫా కేసు దర్యాప్తు ముమ్మరం ఘటనా స్థలాన్ని మళ్లీ పరిశీలించిన ‘సిట్’ సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం మిలటరీ ఏరియాలో కాలిన గాయాలతో మృతి చెందిన ముస్తఫా (11) ఉదంతంపై నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులకు ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించాయి. మరోపక్క ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం ఘటన జరిగిన మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాను నగర సీసీఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులతో పాటు మిలటరీ అధికారులు మరోసారి సందర్శించి వివరాలు సేకరించారు. ముస్తఫా హత్యకు గురై ఉంటే అందుకు కార ణాలేమిటి? అనే కోణంలో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఘటన జరిగిన రోజే డాగ్‌స్క్వాడ్ ముస్తఫా మృతదేహం పడిన చోటి నుంచి మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్ లోపల ధోబీరూమ్ వద్ద ఉన్న బాత్రూం వద్దకు (ఇక్కడే ముస్తఫా ఒంటికి మంటలంటుకున్నాయి) వెళ్లింది. బాత్రూం నుంచి ముస్తఫా పడిన చోటికి, అక్కడి నుంచి బాత్రూమ్ వరకు ఇలా ఐదుసార్లు పోలీసు శునకం వెళ్లొచ్చింది. అది మరోచోటికి వెళ్లకుండా ముస్తఫా వద్దకే వచ్చి ఆగిందంటే ఘటన ప్రారంభమైన ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నాడా?.. ఉంటే అతను పారిపోయి ఉంటే అటు వైపు డాగ్ ఎందుకు వెళ్లలేదు. అనే ప్రశ్నలు పో లీసులను వేధిస్తున్నాయి. బయట నుంచే కిరోసిన్ తెచ్చారా? ముస్తఫా ఒంటిపై పడింది బ్లూ కిరోసినేనని దర్యాప్తు అధికారులు నిర్థారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులూ గుర్తించారు. క్లూస్ టీం కూడా ఘటన జరిగిన సమయంలో ధోబీరూమ్ పక్కనే బాత్రూమ్ ముందు పడిఉన్న (అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్)బాటిల్లో ఉన్న నీలి రంగు కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరోసిన్‌ను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు కూడా పంపిచారు. అయితే ఈ కిరోసిన్ ఘటనా స్థలానికి ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. తెల్ల కిరోసిన్ అయితే ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది. అదే నీలి రంగు (ప్రభుత్వం దీన్ని సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తోంది) కిరోసిన్. మిలటరీ సిబ్బందికి ఈ కిరోసిన్ సరఫరా కానేకాదు. వారి క్వార్టర్స్‌లో కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లే ఉన్నాయి. ఇక సైనికుల దుస్తులు ఇస్తిరీ చేసే ధోబీరూమ్లో కూడా ఎక్కడా కిరోసిన్ ఉన్న దాఖలాలు లేవు. బొగ్గుల పెట్టేతో ఇస్తిరీ చేస్తే బొగ్గులకు నిప్పంటించేందుకు కిరోసిన్ వాడతారు. అయితే ఇక్కడ కరెంట్ పెట్టెతో ఇస్తిరీ చేస్తున్నారు కాబట్టి కిరోసిన్ అవసరం లేదు. అలాగే ధోబీ రూమ్ చుట్టుపక్కల ఎక్కడా బొగ్గులు కాని, కాలిన బొగ్గు బూడిద కాని కనిపించలేదు. అలాగే మిలటరీ సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ కాంపౌండ్‌లోని ఐదు గదులను కూడా మిలటరీ అధికారుల సహకారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆ గదులలో కూడా ఎక్కడా కిరోసిన్ పెట్టిన ఆనవాళ్లు లేవు. దీంతో ఈ నీలిరంగు కిరోసిన్ మిలటరీ ఏరియాకు బయటి నుంచే వచ్చి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడితే ముస్తఫా మృతిపై మిస్టరీ వీడే అవకాశం ఉందంటున్నారు. ఘటన స్థలంలో కాలిపోయిన చిన్నపాటి చెట్ల ఆకులతో పాటు కిరోసిన్ పడిన ఆకులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆ ఆకులపై పడింది కూడా నీలిరంగు కిరోసినేనని తేలింది. -
కొలిక్కిరాని ముస్తఫా హత్య కేసు
ఘటనా స్థలంలో లభించిన అగ్గిపెట్టె, చాక్లెట్లు వీటిని ఖరీదు చేసిన వ్యక్తి గురించి ఆరా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు కిరోసిన్ సాక్షి, సిటీబ్యూరో: మెహదీపట్నం మిలటరీ ఏరియాలో హత్యకు గురైన ముస్తఫా (11) కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కిరాలేదు. దర్యాప్తునకు కావాల్సిన వస్తువులు కొన్ని పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగానే దర్యాప్తును సాగిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదిస్తామని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తుకు సైనికాధికారులు కూడా పూర్తి గా సహకరిస్తున్నారిని ఆయన తెలిపారు. ఈ నెల 8న ముస్తఫా కాలిన గాయాలకు గురై, మరుసటి రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఘటనా స్థలాన్ని మిలటరీ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులే కేసు పురోగతికి కీలకం కానున్నాయి. సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాలోనే... మెహదీపట్నం మిలటరీ ఏరియాలో మిలటరీ సిగ్నల్ వ్యవస్థ పరికరాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఐదు గదులు దూరం దూరంగా కట్టి ఉన్నాయి. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ గదుల చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో పహరీ గోడలు, ఆపై నాలుగడుగుల ఇనుప సీకులతో కంచె ఉంది. లోపల ఓ మూలన వేరుగా బాత్రూమ్, వీటి పక్కనే మరో ధోబీ రూమ్ ఉన్నాయి. ఆ గదులలో మిలటరీ సిబ్బందికి సంబంధించిన సామాగ్రి భద్రపరుస్తారు. పది అడుగులతో ప్రధాన గేటు, దానికి ఆనుకుని మూడడుగుల వెడల్పుతో మరో చిన్నగేటు ఉంది. గేటు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. గేటు కింది నుంచి ఎవరైనా లోపలికి దూరే అవకాశం ఉంది. బాత్రూమ్ వద్దే మంటలు.. బాత్రూమ్ గోడకు అనుకుని ఉన్న సమయంలోనే ముస్తఫా ఒంటిపై కిరోసిన్ పడింది. అక్కడ ఉన్న చిన్న నీటి గుంటలో కిరోసిన్ పడిన దాఖలాలు ఉన్నాయి. ముస్తఫా చెప్పులు కూడా అక్కడే పడి ఉన్నాయి. బాత్రూమ్కు ఐదడుగుల దూరంలో పుల్లల డబ్బి లభించింది. మూడడుగుల దూరంలో చాక్లెట్ కవర్ కూడా లభించింది. పదడుగుల దూరంలో విసిరేసినట్లుగా అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ఇందులో ఐదు మిల్లిలీటర్ల కిరోసిన్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. బాత్రూమ్ వద్దే ముస్తఫాకు నిప్పంటుకుంది. 50 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి... కాలుతున్న మంటల్లోనే ముస్తఫా అక్కడి నుంచి 40 మీటర్ల దూరం వరకు ఉన్న ప్రధాన గేటు వరకు వచ్చాడు. చిన్నపెద్దగేటు రెండు కూడా తాళాలు ఉండడంతో గేటు కింది నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చి మరో 10 మీటర్ల దూరం వరకు (సిద్దిఖీనగర్ వైపు) వెళ్లి తారు రోడ్డుపై పహరీ గోడకు మూడు అడుగులో దూరంలో కుప్పకూలిపోయాడు. మరో 30 మీటర్ల దూరం వెళితే సిద్దిఖీనగర్ బస్తీకి వేసిన మిలటరీ కంచె దాటే అవకాశం ఉంది. ఇవే కీలక ఆధారాలు... ఘటనా స్థలంలో లభించిన పుల్లల డబ్బి (జోకర్ కంపెనీ), చాక్లెట్ కవర్ (కోజ్కో కంపెనీ)లు సిద్దిఖీనగర్‌లోని ఓ చిన్నపాటి కిరాణా షాప్‌లోంచి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే పథకం ప్రకారమే అదే రోజు ఈ రెండు వస్తువులు షాప్‌లో ఖరీదు చేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే వాటిని ఎవరు ఖరీదు చేశారు అనే కోణంపై ఆరా తీస్తున్నారు. ముస్తఫా మంటల్లో కాలుతున్న సమయంలో అతడి ఒంటిపై 450 మిల్లీలీటర్ల కిరోసిన్ పడిందని. ఘటనా స్థలంలోని మురికి నీళ్లు, గడ్డిలో 45 మిల్లీలీటర్ల వరకు కిరోసిన్ పడిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. కేవలం బాటిల్లో ఐదు మిల్లీలీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలిఉంది. దూరంగా విసిరేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్‌కు మూత పెట్టలేదు, మూత మరో దిక్కున పడి ఉంది. ఈ కిరోసిన్ షాంపిల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చింది. అనే విషయంపై ఆరా తీస్తున్నారు.కిరోసిన్ ఎక్కడిదనేది చెప్పగలిగితే కేసు మిస్టరీ వీడుతుందని అధికారులు అంటున్నారు. సమగ్ర విచారణ జరపాలి సాక్షి,సిటీబ్యూరో: మదర్సా విద్యార్థి ముస్తఫా మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మెనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ శనివారం కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్, ఆర్మీ ప్రతినిధి అనుపమ శర్మ, పీర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ముస్తఫాకు నివాళి.. గోల్కొండ: షేక్ ముస్తఫా హత్యపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ చైర్మన్ మహ్మద్ నజీబ్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం టోలీచౌకీలోని ఐహెచ్‌ఆర్‌ఓ కార్యాలయంలో షేక్ ముస్తఫా మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ ముస్తఫాది హత్యేనని ఆయన అన్నారు. మిలటరీ జవాన్లే కిరోసిన్ పోసి నిప్పంటించారని షేక్ ముస్తఫా వాగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని అన్నారు. సయ్యద్ సుల్తానా, సమీర్, నాగిరెడ్డి, ముస్తఫా పాల్గొన్నారు. -
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
హైదరాబాద్: మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లి దుండగులు నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ముస్తఫా (11) గురువారం ఉదయం డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో మిలిటరీ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, సిద్ధిఖీనగర్ బస్తీవాసులు మిలిటరీ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు సిద్దిఖీనగర్‌లో అతని ఇంటికి తీసుకెళ్తున్న సమయం లో స్థానికులు మిలిటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా 92 శాతం కాలిన గాయాలతో ముస్తఫా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ టకియుద్దీన్ మీడియాకు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముస్తఫా కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబం మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్లో ఉండటంతో మేయర్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాలుడి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. సుమోటోగా స్వీకరించిన మైనారిటీ కమిషన్ ముస్తఫా (11) మృతిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 18 లోగా అందించాలని నగర పోలీసు కమిషనర్, వెస్ట్‌జోన్ డీసీపీ, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల న ష్టపరిహారం, ఇంటివసతి కల్పించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
ఎవరికి కక్ష?
ముస్తాఫా మృతితో విషాదం మెహిదీపట్నంలో ఉద్రిక్తత లాఠీ చార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం తెలియని బాలుడిపై ఎవరు కక్ష కట్టారు? ఆ కుర్రాడిపై ఎవరికి పగ ఉంటుంది? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవీ ముస్తఫా మరణం రేకెత్తిస్తున్న ప్రశ్నలు. ఈ బాలుడి మృతిపై రకరకాల సందేహాలు వినిపిస్తున్నాయి. దీం తో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులు జరిగాయా అనే కోణంలో నూ ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మెహదీపట్నం మిల టరీ ఏరియాలోని కేపీఎల్ అకామిడేషన్ క్యాం పస్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంటలతో కాలుతూ ముస్తఫా ఓ గదిలోంచి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ గది ఎవరిది? ఆ గదిలో ఏమైనా అఘాయిత్యం జరిగిం దా? ఈ విషయం బయట పడుతుందనే భయంతో కావాలనే కిరోసిన్ పోసి ముస్తఫాను కాల్చి చంపాల నుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక అందితేగానీ లైంగిక దాడికి సంబంధించిన వాస్తవాలు వెలుగు చూడవని పోలీ సులంటున్నారు. బాలుని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అతని వల్ల ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందా? లేక పెద్దలపై ఉన్న కక్షతో చిన్నారిని టార్గెట్ చేశారాఅనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. ఇతరులు వచ్చే అవకాశమే లేదు ఆ ప్రాంతంలోకి ప్రయివేటు వ్యక్తులు వచ్చే అవకాశా లు లేవు. ఒకవేళ వచ్చినా 24 గంటలూ ఆర్మీ సిబ్బంది నిఘా ఉంటుంది. అనుక్షణం కాపలా కాస్తూ ఆయుధాలు ధరించిన సిబ్బంది ఉంటారు. భద్రతాపరంగా పూర్తి రక్షిత ప్రాంతంలోకి బయటి వ్యక్తులు వచ్చే ప్రసక్తే లేదని బస్తీవాసులు అభిప్రాయ పడుతున్నారు. నిందితులను గుర్తించడం కష్టమే ముస్తఫా హత్య కేసులో నిందితులను గుర్తించడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముస్తఫా ఇచ్చిన వాంగ్మూలంలో ఇద్దరు మిలటరీ డ్రెస్‌లో ఉన్న సిబ్బంది తనను కొట్టి, కిరోసిన్ పోసి కాల్చారని ఉందని నగర మేయర్ మాజిద్‌హుస్సేన్ పేర్కొన్నారు. వారి పేర్లను మాత్రం బాలుడు వెల్లడిం చలేదు. నిజానికి ఘాతుకానికి పాల్పడిన వారి పేర్లు ముస్తఫాకు తెలిసే అవకాశమూ లేదు. ఈ కేసులో నిజానిజాలు వెలుగు చూడాలంటే సైనికాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, సహకరిస్తేనే నింది తులు చిక్కే అవకాశం ఉంది. సైనికాధికారుల సా యం లేకుండా నిందితులను పోలీసులు గుర్తించడం అసాధ్యమే. హుమాయూన్‌నగర్ పోలీసులు ముందు గా ఈ ఘటనపై హత్యాయత్నం (ఐపీసీ 307) కింద కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ ముస్తఫా గురువారం ఉదయం మృతి చెందడంతో హత్యాయత్నం కేసును హత్య (ఐపీసీ 302)గా మార్చారు. కేసును చేధిస్తాం.. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఉంటే ఇప్పటికే కేసు మిస్టరీ వీడేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను గుర్తించి తీరుతామని, ఇందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కేసు దర్యాప్తునకు సైనికాధికారుల సాయం తీసుకుంటామన్నారు. రికార్డు చేసిన ముస్తఫా వాంగ్మూలం అధికారికంగా పోలీసులకు ఇంకా చేరలేదని, మీడియాలో వ చ్చిన కథనాలను బట్టి ఆర్మీ సిబ్బందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ముస్తఫా చెప్పినట్లు తెలుస్తోందన్నారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు మెహిదీపట్నం: ముస్తాఫా హత్య కేసును చేధించేం దుకు డాగ్‌స్క్వాడ్‌తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపినట్లు ఏసీపీ శ్రీనివాస్, హుమాయూన్‌నగర్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. సంఘటన స్థలంలో కిరోసిన్ తెచ్చిన ఖాళీ సీసా తప్ప ఇప్ప టి వరకు మరే ఆధారమూ దొరకలేదు. సంఘటన జరిగినప్పుడు బాలుడు ఒక్కడే ఉన్నాడా? మరికొంత మంది బాలురు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు పరిశోధనను వేగవంత చేసి, నిందితులను పట్టుకోవాలని ఘటనా స్థలాన్ని సంద ర్శించిన పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు ఈ ఘట నతో తమకు సంబంధం లేదని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలి సాక్షి, సిటీబ్యూరో: ముస్తఫాను కిరాతకంగా హతమార్చిన నిందితులను గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు పోలీసులకు డిమాండ్ చేశారు. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
-
ఆ ఘటనతో మాకు సంబంధం లేదు
హైదరాబాద్ : బాలుడుపై కిరోసిన్ పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆర్మీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలో దోబీ కుటుంబం ఉందని, ఆ సమయంలో దోబీ కూడా నివాసంలో లేడని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై వస్తున్న వార్తలు వదంతులేనని అన్నారు. కాగా మెహిదీపట్నం మిలటరీ క్యాంపులో షేక్ ముస్తఫా అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆర్మీ జవాన్ల పనేనని స్థానికులు, బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిలటరీ గ్యారిసన్ వద్ద ఉద్రిక్తత నెలకొనటంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై రూమర్లు నమ్మవద్దని వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ సూచించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
హైదరాబాద్ : మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందటంతో మోహదీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ ముస్తఫా ఈరోజు ఉదయం చనిపోయాడు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొటంతో మిలటరీ క్యాంప్ ఎదుట పోలీసులు మోహరించారు. మరోవైపు బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. (ఇంగ్లీష్ కథనం కోసం) -
బాలుడి పై కిరోసిన్ పోసి.. నిప్పంటించి
మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఘాతుకం ఆర్మీ వ్యక్తులే చేశారని బాలుడి వాంగ్మూలం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం హైదరాబాద్: మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు. ఈ దారుణం బుధవారం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మిలిటరీ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముస్తఫా 92 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన మేజిస్ట్రేట్... ముస్తఫా స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తన కుమారుడు వాంగ్మూలమిచ్చాడని తండ్రి షేక్ ముఖీదుద్దీన్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలుడు పేర్కొనడంతో సిద్దిఖీనగర్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. -
'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'
గుంటూరు నగర తూర్పు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తాఫాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని ధర్మాన ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో ధర్మాన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు వ్యూహత్మక నేరమని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఎంపీటీసీ సభ్యులతో కలసి వాహనాలలో బయలుదేరారు. ఆ వాహనాలు మేడికొండూరు సమీపంలోనికి రాగానే వారిపై దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలలో ఉన్న ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ముస్తాఫాకు స్వల్పంగా గాయపడ్డారు. -
బాబు ప్రమాణ స్వీకారం శాపంగా మారింది
-
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్
గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు బస్టాండ్ సెంటర్లోని రోడ్డు పక్కన వుండే చిరువ్యాపారుల పాలిట శాపంగా మారింది. ఆయన ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్లే మార్గాలకు ఇరువైపుల వున్న దుకాణాలను అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రోజు పనిచేస్తే కానీ పూట గడవలేని తమకు బాబు ప్రమాణ స్వీకారం ఉపాధి లేకుండా చేస్తుందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరును తప్పుపట్టారు. కూల్చివేతలను అడ్డుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధితుల పక్షాన ఆయన చేస్తున్న ఆందోళనను అడ్డుకుని, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రాహుల్‌ను జోకర్ అన్న నాయకుడి సస్పెన్షన్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని జోకర్ అంటూ విమర్శించిన కేరళ మాజీ మంత్రి టీహెచ్ ముస్తఫాను ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీని ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ పగ్గాలను ఆయన సోదరి ప్రియాంకా వాద్రాకు అప్పగించాలని ముస్తఫా ఇంతకుముందు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ సభ్యుడు కూడా అయిన ముస్తఫా వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ఖండించారు. మీడియా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలు కావడంతో రాహల్ గాంధీ మీద ముస్తఫా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయాలని, ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన పిచ్చి విధానాలు, జోకర్ లాంటి ప్రవర్తన, కాంగ్రెసేతర సలహాదారులతో ఆయన అనుబంధం.. ఇవే పార్టీ ఓటమికి ప్రధాన కారణాలని అన్నారు. -
రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత
'రాహుల్ గాంధీ ఒక జోకర్. ఆయన తనంతట తానుగా పార్టీ పదవులనుంచి తప్పుకోవాలి. లేకపోతే ఆయన్ని బలవంతంగా పంపించేయాలి. ఆయన జోకర్ వ్యవహారం వల్లే కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. ప్రధానమంత్రి పదవి అంటే పిల్లలాట కాదు.' ఈ మాటలన్నది ఏ విపక్ష నేత లేక రాజకీయ విమర్శకుడో కాదు. ఏకంగా ఒక కాంగ్రెస్ నేత. ఆయన కూడా ఆషామాషీ నేత కాదు. కేరళలో మంత్రిగా పనిచేశారు. టీ హెచ్ ముస్తఫా అనే సీనియర్ నేత రాహుల్ గాంధీని ఏకంగా జోకర్ అని అన్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీ వ్యవహారం పిచ్చోడిలా ఉందని కూడా అన్నాడు. మరి పార్టీని బతికించి, బాగుచేయాలంటే ఏం చేయాలని విలేఖరులు అడిగితే ఆయన ప్రియాంకాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. ముస్తఫా మరో అడుగు ముందేసి, భజనపరుల వల్లే రాహుల్ దెబ్బతిన్నారని, రక్షణ మంత్రి ఏ కె ఆంటోనీ కూడా ఆ భజనపరుల్లో ఒకరని అనేశారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ముస్తఫాని విమర్శించే ధైర్యం కూడా చేయలేదు.