హైదరాబాద్ : మెహదీపట్నంలో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ గత రాత్రి గారీసన్ ప్రాంతంలో రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బాలుడు ముస్తాఫా కేసులో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. మనస్తాపంతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
కాగా గత నెల 8న మిలటరీ ఎక్యుప్‌మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ముస్తఫాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది.
మోహదీపట్నంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
Published Mon, Nov 3 2014 8:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement