Mehadipatnam
-
అందరిననీ రక్షించాం !..అగ్ని ప్రమాదానికి కారణం అదే
-
మెహదీపట్నం అంకుర ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
-
Hyd: మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం
Updates ► బిల్డింగ్ ఐదో అంతస్తులో హాస్పిటల్లో పనిచేసే నర్సులు హాస్టల్ ఉందని మంటలు అంటుకోవడంతో హుటాహుటిన కిందికి వచ్చేసామని సుమారు 100 మంది నర్సుల సర్టిఫికెట్స్ కూడా పైనే వదిలేసి వచ్చామని నర్సులు విలపిస్తున్నారు. ► షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆస్పత్రి టెరస్ ఔట్ లైట్లకు మంటలు అంటుకున్నాయి: అంకుర ఆస్పత్రి యాజమన్యం ► అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటను అదుపు చేశారు. ► రోగులెవరికీ ఏ ప్రమాదం జరగలేదని ఆస్పత్రి అధికారుల వెల్లడి ► సకాలంలో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెను ముప్పు తప్పింది. ► క్షేమంగా బయటపడ్డ ఆస్పత్రిలోని రోగులు ► ఫైర్ సిబ్బంది స్థానికులు సహకరించారు. ► పదో అంతస్తులో ప్లాస్టిక్ మెటీరియల్ అధికంగా ఉండటం వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ► ఆస్పత్రి నేమ్ బోర్డుకు మంటలు అంటుకొని వ్యాపించాయి. పక్కనే ఉన్న ఫ్లెక్సీకి మంటలు అంటుకోవడంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ► షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ► మంటలను గమనించి రోగులను ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపించారు. ► ఆస్పత్రితో గర్భిణీలు, పిల్లలు ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. Big blaze in Ankura Hospital near pillar no 68 of PVNR Expressway in Jyothinagar area. No information on casualties. pic.twitter.com/K5D2cfL2zc — serish (@serish) December 23, 2023 ►ఐదు అంతస్తుల్లో మంటలు విస్తరించాయి. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆస్పత్రితో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. -
మోహిదీపట్నం ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
HYD: గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్.. చరణ్ ప్రాణం పోయింది
క్రైమ్: ఆ యువకుడు నగరానికి కొత్త. రూల్స్‌కు విరుద్ధమైనప్పటికీ.. ఇద్దరు స్నేహితురాళ్లను బైక్‌పై ఎక్కించుకుని నగరం చూద్దామని బయల్దేరాడు. దారి కోసం గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించాడు. కానీ, అది అతన్ని తప్పుదారి పట్టించింది. తప్పు దోవలో వెళ్తున్నామని గుర్తించి.. మలుపు తీసుకునేలోపే ఊహించని పరిణామం జరిగింది. ఆ యువ ఇంజనీర్ జీవితాన్ని రోడ్డు ప్రమాదం అర్థాంతరంగా ముగించేసింది. ఎంహెచ్ఎన్వీఎస్ చరణ్(22) స్వస్థలం కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామం. బీటెక్ పూర్తి చేసి పోచారం వద్ద ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ సమీపంలోని టౌన్షిప్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వీకెండ్ కావడంతో నగరం చూద్దామని శనివారం స్నేహితులతో కలిసి బైక్‌లపై బయల్దేరారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితురాళ్లను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు చరణ్. ట్యాంక్ బండ్ మీద ఉన్నవి చూసుకుని.. దుర్గం చెరువు తీగల వంతెన చూద్దామని బయల్దేరారు. దారి తెలియక గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. ముందు రెండు బైక్‌లు వెళ్లిపోగా.. గూగుల్ మ్యాప్‌ను అనుసరించి ఆరాంఘర్ వద్ద బైక్‌ను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గం వైపు మళ్లించాడు. అయితే రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్లాక తప్పు దారిలో వెళ్తున్నట్లు గుర్తించారు. బండిని యూటర్న్ తీసుకున్నాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న ఓ కారు చరణ్ నడుపుతున్న బండిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చరణ్ రోడ్డుమీద కొద్దిసేపు కొట్టుమిట్టాడాడు. నిస్సహాయ స్థితిలో రక్తపు చేతులతో అక్కడికి వచ్చిన వారి పాదాలు పట్టుకొని కాపాడమంటూ సైగలు చేశాడు. ఆ సమయంలో రక్షించకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి వైరల్ చేశారు. ఈలోపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన చరణ్‌ను, స్వల్పంగా గాయపడిన అతని స్నేహితురాళ్లను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చరణ్.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మెహిదీపట్నం-శంషాబాద్ వరకు 11.6 కిలోమీటర్ల మేర పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ మార్గంలో కార్లు, ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే బస్సులు ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పర్యవేక్షణ లోపంతో కొందరు ద్వి, త్రి చక్ర వాహనదారులు ఆ రూట్లో ప్రయాణిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఆకాశ వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : నగరవాసుల ప్రయాణాన్ని సురక్షితం చేయడంతో పాటు పాదచారుల నడక సాఫీగా సాగేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే..మరోవైపు అక్కడి కొద్ది ఖాళీ స్థలంలోనే బస్సుల రాకపోకలకు బస్టాండ్లు నిరి్మంచడంతో పాటు అక్కడే ప్రయాణికులు షాపింగ్ చేసేందుకు వాణిజ్య భవనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద స్కైవాక్ (బోర్డు వాక్)లను నిరి్మంచే దిశగా కార్యచరణ రూపొందించింది. రూ.59.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంత రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాల్లో... వాహనాల సంచారం, జనాల రద్దీ కారణంగా రోడ్డు క్రాస్ దాటే సమయంలో పాదచారులు ప్రమాదాలు బారిన పడుతున్నారు. దీన్ని నివారించేందుకు స్కైవాక్‌లు నిరి్మంచాలని నిర్ణయించారు. తొలుత మెహిదీపట్నం, ఉప్పల్ జంక్షన్లను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా స్కైవాక్‌లు నిర్మించే ఆలోచన చేస్తున్నారు. మెహిదీపట్నం ప్రాజెక్టు రూపురేఖలిలా... గుడి మల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్ వరకు ఈ స్కైవాక్ (బోర్డు వాక్) నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఫ్లైఓవర్ పైనుంచి అటు, ఇటు బస్టాండ్లను కలుపుతూ ఓ ఆకృతి సరికొత్తగా ఉండేలా ప్లాన్లు సిద్ధం చేశారు. 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పు ఉంటుంది. 16 లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. రైతుబజార్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్ వరకు మరో స్కైవాక్‌ను కూడా అనుసంధానం చేస్తారు. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి ఉండే స్కైవాక్‌కు కలుపుతారు. దీంతో గుడి మల్కాపూర్ నుంచి వచి్చన జనాలు, ఇటు రైతు బజార్, ఆసిఫ్‌నగర్ నుంచి వచి్చన జనాలు అదే స్కైవే మీది నుంచి వెళతారు. బోర్డువాక్ వైపు నిలువు కనెక్టివిటీని ఒక గాజు ఎన్‌క్లోజర్ (మాడ్యూల్స్) ద్వారా ప్రవేశపెడతారు. ఇందులో మెట్లు, లిఫ్ట్‌లు ఉంటాయి. ఇరువైపులా ఎత్తు 2.5 మీటర్ల స్టీల్ గ్రిల్స్ ఏర్పాటుచేస్తారు. 12 మి.మీ మందపాటి పటిష్టమైన గ్లాస్ పేట్లను స్పష్టమైన దృష్టి కోసం ఏర్పాటుచేయనున్నారు. రైతు బజార్ పక్కన ఉన్న 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్లో బస్ బే ఉండే విధంగా, పై అంతస్తులో వాణిజ్య సముదాయం నిరి్మంచనున్నారు. ప్రయాణికుల షాపింగ్‌కు ఇది వేదిక కానుంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.34.28 కోట్లు ఉప్పల్ జంక్షన్లో ఇలా... ఉప్పల్ జంక్షన్లో నాలుగు వైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, స్టెయిర్కేసులు ఆరు ప్రాంతాల వద్ద ఏర్పాటుచేస్తారు. వీటికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, నాలుగు మీటర్ల వెడల్పుతో వాక్‌వేను నిరి్మంచనున్నారు. దుకాణాలు, కియోస్‌్కలు కూడా ఏర్పాటుచేస్తారు. అలాగే ఉప్పల్ జంక్షన్‌లోని మెట్రో స్టేషన్ మొదటి లెవల్ (ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే అంతస్తు)కు అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు వరంగల్ బస్సులు ఆగే ప్రాంతం వద్ద ఎస్కలేటర్లు ఎక్కిన వ్యక్తి వాక్‌వే మీదుగా నేరుగా మెట్రో స్టేషన్లోకి వెళ్లవచ్చు. అలాగే రామాంతపూర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న లిఫ్ట్‌ల నుంచి పైకి ఎక్కిన వ్యక్తి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. లేదంటే ఉప్పల్వైపు నడుచుకుంటూ రావొచ్చు. ప్రాజెక్టు అంచనా వ్యయం–రూ.25.39 కోట్లు. -
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుంటే.. మరోవైపు పలు ప్రైవేట్ ఆస్పత్రులు దారుణానికి పాల్పడుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ డ్యూటీకి రావాలంటూ నర్సులను వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మోహదీపట్నంలోని నానాల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం తమిళనాడుకు చెందిన నర్సులను నిర్భంధించింది. జ్వరం వచ్చినప్పటికీ ట్యాబ్లెట్ వేసుకుని డ్యూటీకి రావాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో దిక్కుతోచని నర్సులు ఈ విషయాన్ని తెలంగాణ నర్సింగ్ సమితికి దృష్టికి తీసుకు వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన న్యాయవాది
మొయినాబాద్(చేవెళ్ల): న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించి పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థిని(20) మొయినాబాద్ అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న జేబీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. గురువారం నగరంలోని మెహదీపట్నం నుంచి కళాశాలకు వచ్చేందుకు పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తున్న వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన న్యాయవాది వెంకటరాములు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని రెండు మూడుసార్లు చెప్పినా అతని తీరు మారలేదు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించింది. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సును ఆపి అతడిని పోలీసులకు అప్పగించింది. పోలీసులు సదరు న్యాయవాదిపై కేసు నమోదు చేశారు. -
గ్రేటర్లో కొత్త సబ్వే
మెహదీపట్నం రైతుబజార్ వద్ద.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ అంచనా వ్యయంరూ. 2 కోట్లు పీపీపీ పద్ధతిలో.. త్వరలో టెండర్లు సిటీబ్యూరో మెహదీపట్నం రైతు బజార్‌వద్ద పాదచారుల కష్టాలు తప్పించేందుకు సబ్వే నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. దాదాపు రూ. 2 కోట్లు వ్యయం కాగల దీనిని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్నారు. ఇక్కడ గంటకు సగటున 1500 మంది రోడ్డు దాటుతున్నారు. రోడ్డుకు రెండు వైపులా బస్టాప్‌లున్నాయి. వాటిని చేరుకునేందుకు తీవ్ర ట్రాఫిక్ ఇక్కట్లతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు సబ్వే (అండర్‌గ్రౌండ్ రోడ్) అవసరమని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం పంపించారు. ఆమోదం పొందగానే టెండరు ఆహ్వానించనున్నారు. పీవీఎన్ఆర్ ఎలివేటెడ్‌ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు 13, 14ల మధ్య ఈ సబ్వేను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడ రోడ్డును దాటే పాదచారుల్లో ౖరైతు బజార్‌కు వచ్చే రైతులతోపాటు పాఠశాల, కళాశాలల విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజెన్ల దాకా ఎందరో ఉన్నారు. సదుపాయంగా.. గతంలో 1980లలో కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద రెండు సబ్‌వేలను నిర్మించినప్పటికీ నిరుపయోగంగా మారాయి. నిర్వహణలోపంతో అవి పనికిరాకుండాపోవడంతో అలాంటిపరిస్థితి తలెత్తకుండా సబ్‌వేల్లో ప్రజలకుపకరించే వివిధ సదుపాయాలు ఏటీఎంలు, ఆయా అవసరాలు తీర్చే కియోస్క్‌లతోపాటు చిరువ్యాపారాలు చేసుకునే వారిని అనుమతించాలని భావిస్తున్నారు. తద్వారా ఎప్పుడూ వాడకంలో ఉంటుందని భావిస్తున్నారు. కోఠి సబ్‌వేకు వినియోగంలోకి తెచ్చేందుకు తగిన చర్య లు చేపట్టాలని రెండేళ్ల క్రితం భావించారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
సినీతారలతో ఎమ్మెల్యే పోటీ..
సాక్షి, సిటీబ్యూరో: షోరూం ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సినీ తారలతో ఎమ్మెల్యేలూ పోటీ పడుతున్నారు. మెహదీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ డైమండ్ జ్యువెలరీ షోని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ప్రారంభించారు. ‘దేరీజ్ యాన్ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్’ అనే థీమ్‌తో ఈ షో నిర్వహిస్తున్నామని షోరూం నిర్వాహకులు చెప్పారు. -
ఆడపిల్లని వద్దనుకున్నారేమో!
మెహిదీపట్నం : తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు నడిరోడ్డుపై దర్శనమిచ్చింది. ఒక రోజు వయసున్న ఆడ శిశువును బుధవారం సాయంత్రం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ మార్గంలో వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపారు. -
భార్య, అత్త, మరదలి పై రోకలిబండతో దాడి
మెహిదీపట్నం : పనీపాటా లేకుండా తిరుగుతూ..ఇదేమని అడిగినందుకు భార్యతో పాటు అత్త, మరదలిపై ఓ వ్యక్తి దాడచేశాడు. ఈ ఘటన మెహిదీపట్నం పోచమ్మబస్తీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బస్తీకి చెందిన శివసాయి స్థానిక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతడు జులాయిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భార్య ప్రశ్నించింది. ఆమెపై చేయిచేసుకోవటంతో ఇటీవల స్థానికంగా పంచాయితీ పెట్టారు. ఆగస్టు 10వ తేదీలోగా అతడు ఏదో ఒక పనిలో కుదురుకోవాలని, ఆ తర్వాతే భార్యను పుట్టింటికి పంపించాలని పెద్దలు నిర్ణయించారు. అయితే, శివసాయి మాత్రం ఆ మాట పట్టించుకోకుండా తరచూ వచ్చి భార్యను వేధిస్తున్నాడు. తాజా గా బుధవారం ఉదయం కూడా భార్య వద్దకు వచ్చి తన వెంట రావాలని కోరాడు. ముందుగా ఏదో ఒక పనిచేయాలని, ఆ తర్వాతే వస్తానని ఆమె చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన శివసాయి ఆమె తలపై రోకలి బండతో కొట్టాడు. అడ్డువచ్చిన అత్త, మరదలిని కూడా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. చుట్టుపక్కల వారు వచ్చే సరికి శివసాయి పరారయ్యాడు. బాధితులు ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
'మన ఊరు-మన కూరగాయలు' స్టాళ్లు ప్రారంభం
హైదరాబాద్: వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించటం కోసం ' మన ఊరు-మన కూరగాయలు' పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలోని మెహదీపట్నం రైతు బజార్ లో బుధవారం తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి వాటిని ప్రారంభింబారు. ఈ స్టాళ్ల ద్వారా నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకే పొందవచ్చని వారు తెలిపారు. అనంతరం గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ను మంత్రులు సందర్శించారు. -
చదువులకు చేయూత
జీఎన్‌ఐటీ విద్యార్థినుల సేవానిరతి సిటీబ్యూరో: మెహదీపట్నం ప్రాంతంలోని జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థినులు శనివారం షేక్‌పేట్ పరిధిలోని బీజేఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శారద, కో ఆర్డినేటర్ మనోజ్ఞ మాట్లాడుతూ కళాశాల ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థినులు ‘స్ట్రీట్ కాస్’ పేరుతో బృందంగా ఏర్పడి కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి నెల మురికివాడల్లోని చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆయా కాలనీల్లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ఆటలు ఆడించడం, పారిశుధ్యంపై అవగాహన కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పన, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శనివారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన 15 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. -
మోహదీపట్నంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
హైదరాబాద్ : మెహదీపట్నంలో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ గత రాత్రి గారీసన్ ప్రాంతంలో రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బాలుడు ముస్తాఫా కేసులో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. మనస్తాపంతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. కాగా గత నెల 8న మిలటరీ ఎక్యుప్మెంట్ ఏరియాలో ముస్తఫా కాలిన గాయాలకు గురై మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై ముస్తఫా మరణవాంగ్మూలం మేరకు గుర్తు తెలియని ఆర్మీ సిబ్బందిపై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముస్తఫాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులకు శనివారం ఒక నివేదిక అందింది. ముస్తఫా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా మార్చురీ వైద్యులను సైతం సిట్ బృందం విచారించింది. వారు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లు తెలిసింది. -
కొలిక్కిరాని ముస్తఫా హత్య కేసు
ఘటనా స్థలంలో లభించిన అగ్గిపెట్టె, చాక్లెట్లు వీటిని ఖరీదు చేసిన వ్యక్తి గురించి ఆరా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు కిరోసిన్ సాక్షి, సిటీబ్యూరో: మెహదీపట్నం మిలటరీ ఏరియాలో హత్యకు గురైన ముస్తఫా (11) కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కిరాలేదు. దర్యాప్తునకు కావాల్సిన వస్తువులు కొన్ని పోలీసులకు లభించాయి. వీటి ఆధారంగానే దర్యాప్తును సాగిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదిస్తామని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తుకు సైనికాధికారులు కూడా పూర్తి గా సహకరిస్తున్నారిని ఆయన తెలిపారు. ఈ నెల 8న ముస్తఫా కాలిన గాయాలకు గురై, మరుసటి రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఘటనా స్థలాన్ని మిలటరీ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులే కేసు పురోగతికి కీలకం కానున్నాయి. సిగ్నల్ ఇక్యూప్‌మెంట్ ఏరియాలోనే... మెహదీపట్నం మిలటరీ ఏరియాలో మిలటరీ సిగ్నల్ వ్యవస్థ పరికరాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఐదు గదులు దూరం దూరంగా కట్టి ఉన్నాయి. రెండెకరాల స్థలంలో ఉన్న ఈ గదుల చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో పహరీ గోడలు, ఆపై నాలుగడుగుల ఇనుప సీకులతో కంచె ఉంది. లోపల ఓ మూలన వేరుగా బాత్రూమ్, వీటి పక్కనే మరో ధోబీ రూమ్ ఉన్నాయి. ఆ గదులలో మిలటరీ సిబ్బందికి సంబంధించిన సామాగ్రి భద్రపరుస్తారు. పది అడుగులతో ప్రధాన గేటు, దానికి ఆనుకుని మూడడుగుల వెడల్పుతో మరో చిన్నగేటు ఉంది. గేటు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. గేటు కింది నుంచి ఎవరైనా లోపలికి దూరే అవకాశం ఉంది. బాత్రూమ్ వద్దే మంటలు.. బాత్రూమ్ గోడకు అనుకుని ఉన్న సమయంలోనే ముస్తఫా ఒంటిపై కిరోసిన్ పడింది. అక్కడ ఉన్న చిన్న నీటి గుంటలో కిరోసిన్ పడిన దాఖలాలు ఉన్నాయి. ముస్తఫా చెప్పులు కూడా అక్కడే పడి ఉన్నాయి. బాత్రూమ్కు ఐదడుగుల దూరంలో పుల్లల డబ్బి లభించింది. మూడడుగుల దూరంలో చాక్లెట్ కవర్ కూడా లభించింది. పదడుగుల దూరంలో విసిరేసినట్లుగా అర లీటర్ ఖాళీ మజా ప్లాస్టిక్ బాటిల్ ఉంది. ఇందులో ఐదు మిల్లిలీటర్ల కిరోసిన్‌ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. బాత్రూమ్ వద్దే ముస్తఫాకు నిప్పంటుకుంది. 50 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చి... కాలుతున్న మంటల్లోనే ముస్తఫా అక్కడి నుంచి 40 మీటర్ల దూరం వరకు ఉన్న ప్రధాన గేటు వరకు వచ్చాడు. చిన్నపెద్దగేటు రెండు కూడా తాళాలు ఉండడంతో గేటు కింది నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చి మరో 10 మీటర్ల దూరం వరకు (సిద్దిఖీనగర్ వైపు) వెళ్లి తారు రోడ్డుపై పహరీ గోడకు మూడు అడుగులో దూరంలో కుప్పకూలిపోయాడు. మరో 30 మీటర్ల దూరం వెళితే సిద్దిఖీనగర్ బస్తీకి వేసిన మిలటరీ కంచె దాటే అవకాశం ఉంది. ఇవే కీలక ఆధారాలు... ఘటనా స్థలంలో లభించిన పుల్లల డబ్బి (జోకర్ కంపెనీ), చాక్లెట్ కవర్ (కోజ్కో కంపెనీ)లు సిద్దిఖీనగర్‌లోని ఓ చిన్నపాటి కిరాణా షాప్‌లోంచి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే పథకం ప్రకారమే అదే రోజు ఈ రెండు వస్తువులు షాప్‌లో ఖరీదు చేశారని పోలీసుల విచారణలో తేలింది. అయితే వాటిని ఎవరు ఖరీదు చేశారు అనే కోణంపై ఆరా తీస్తున్నారు. ముస్తఫా మంటల్లో కాలుతున్న సమయంలో అతడి ఒంటిపై 450 మిల్లీలీటర్ల కిరోసిన్ పడిందని. ఘటనా స్థలంలోని మురికి నీళ్లు, గడ్డిలో 45 మిల్లీలీటర్ల వరకు కిరోసిన్ పడిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. కేవలం బాటిల్లో ఐదు మిల్లీలీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలిఉంది. దూరంగా విసిరేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిల్‌కు మూత పెట్టలేదు, మూత మరో దిక్కున పడి ఉంది. ఈ కిరోసిన్ షాంపిల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చింది. అనే విషయంపై ఆరా తీస్తున్నారు.కిరోసిన్ ఎక్కడిదనేది చెప్పగలిగితే కేసు మిస్టరీ వీడుతుందని అధికారులు అంటున్నారు. సమగ్ర విచారణ జరపాలి సాక్షి,సిటీబ్యూరో: మదర్సా విద్యార్థి ముస్తఫా మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మెనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ శనివారం కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్, ఆర్మీ ప్రతినిధి అనుపమ శర్మ, పీర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ముస్తఫాకు నివాళి.. గోల్కొండ: షేక్ ముస్తఫా హత్యపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ చైర్మన్ మహ్మద్ నజీబ్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం టోలీచౌకీలోని ఐహెచ్‌ఆర్‌ఓ కార్యాలయంలో షేక్ ముస్తఫా మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ ముస్తఫాది హత్యేనని ఆయన అన్నారు. మిలటరీ జవాన్లే కిరోసిన్ పోసి నిప్పంటించారని షేక్ ముస్తఫా వాగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని అన్నారు. సయ్యద్ సుల్తానా, సమీర్, నాగిరెడ్డి, ముస్తఫా పాల్గొన్నారు. -
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
హైదరాబాద్: మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లి దుండగులు నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ముస్తఫా (11) గురువారం ఉదయం డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో మిలిటరీ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, సిద్ధిఖీనగర్ బస్తీవాసులు మిలిటరీ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు సిద్దిఖీనగర్‌లో అతని ఇంటికి తీసుకెళ్తున్న సమయం లో స్థానికులు మిలిటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా 92 శాతం కాలిన గాయాలతో ముస్తఫా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ టకియుద్దీన్ మీడియాకు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముస్తఫా కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబం మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్లో ఉండటంతో మేయర్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాలుడి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. సుమోటోగా స్వీకరించిన మైనారిటీ కమిషన్ ముస్తఫా (11) మృతిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 18 లోగా అందించాలని నగర పోలీసు కమిషనర్, వెస్ట్‌జోన్ డీసీపీ, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల న ష్టపరిహారం, ఇంటివసతి కల్పించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
-
ఆ ఘటనతో మాకు సంబంధం లేదు
హైదరాబాద్ : బాలుడుపై కిరోసిన్ పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆర్మీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలో దోబీ కుటుంబం ఉందని, ఆ సమయంలో దోబీ కూడా నివాసంలో లేడని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై వస్తున్న వార్తలు వదంతులేనని అన్నారు. కాగా మెహిదీపట్నం మిలటరీ క్యాంపులో షేక్ ముస్తఫా అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆర్మీ జవాన్ల పనేనని స్థానికులు, బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిలటరీ గ్యారిసన్ వద్ద ఉద్రిక్తత నెలకొనటంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై రూమర్లు నమ్మవద్దని వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ సూచించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
హైదరాబాద్ : మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందటంతో మోహదీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్‌లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్‌నగర్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ ముస్తఫా ఈరోజు ఉదయం చనిపోయాడు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొటంతో మిలటరీ క్యాంప్ ఎదుట పోలీసులు మోహరించారు. మరోవైపు బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. (ఇంగ్లీష్ కథనం కోసం) -
గురు పూజోత్సవంలో పాల్గొన్న సింధు
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు తాను చదువుకునే కళాశాల వేడుకల్లో పాలుపంచుకుంది. క్రీడల్లో ఎంత బిజీగా ఉన్నా గురువారం మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలకు వచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇటీవలి విజయాలను పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ ఆంథోనమ్మ సింధూను అభినందించారు. కళాశాలలో నిర్వహించిన టీచర్స్ డేలో సింధు పాల్గొని తోటి విద్యార్థులతో ఆడి పాడింది. చాలా రోజుల తర్వాత తను కళాశాలకు రావడంతో తోటి విద్యార్థులు సింధుతో ముచ్చటించడానికి ఆసక్తి ప్రదర్శించారు. అంతేకాకుండా ఆమె చేసిన డాన్సులను విద్యార్థులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించిన అనంతరం కళాశాలకు ఇదే మొదటిసారి రావడంతో అధ్యాపకులు, విద్యార్థులు ఆమెను ప్రశంసించారు.