మెహిదీపట్నం : తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు నడిరోడ్డుపై దర్శనమిచ్చింది. ఒక రోజు వయసున్న ఆడ శిశువును బుధవారం సాయంత్రం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ మార్గంలో వెళ్లేవారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఎస్.రవీందర్ తెలిపారు.
ఆడపిల్లని వద్దనుకున్నారేమో!
Published Wed, May 18 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement